👉ప్రధాని మోదీ జీఎస్టీ ప్రకటనపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు.. జీఎస్టీ 2.0 పేరిట సంస్కరణలు తెస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన…గంటల వ్యవధిలోనే తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ఘనతను మోదీ సొంతం చేసుకుంటున్నారని విమర్శ.. ఈ మార్పులు ఏమాత్రం సరిపోవని, 8 ఏళ్లు ఆలస్యమయ్యాయని ఆరోపణ.. *పెట్రోల్, మద్యం, విద్యుత్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్.. *రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పొడిగించలేదని కేంద్రంపై మండిపాటు..
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)లో కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రకటించిన మార్పులు ఏమాత్రం సరిపోవని, రాజ్యాంగబద్ధమైన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ఘనతను ప్రధాని ఒక్కరే దక్కించు కోవాలని చూస్తున్నారని ఆరోపించింది. ఆదివారం సాయంత్రం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ చేసిన సవరణలకు తానే పూర్తి యజమాని అన్నట్లుగా ప్రధాని ఈ రోజు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు,” అని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ అంటే ‘వృద్ధిని అణిచివేసే పన్ను’ అని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని జైరాం రమేశ్ గుర్తుచేశారు. అధిక పన్ను శ్లాబులు, నిత్యావసరాలపై భారీ రేట్లు, పన్ను ఎగవేతలు, సంక్లిష్టమైన నిబంధనలు వంటి సమస్యలతో జీఎస్టీ వ్యవస్థ నిండిపోయిందని ఆయన విమర్శించారు. 2017 జులై నుంచే తాము ‘జీఎస్టీ 2.0’ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’లో కూడా స్పష్టంగా చెప్పామని తెలిపారు. ప్రస్తుత సంస్కరణల్లోనూ అనేక లోపాలున్నాయని జైరాం రమేశ్ ఎత్తిచూపారు. దేశ ఉపాధికి వెన్నెముక అయిన ఎంఎస్ఎంఈలు ఇప్పటికీ విధానపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్స్‌టైల్స్, పర్యాటకం, హస్తకళలు, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి కీలక రంగాల్లోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్, పెట్రోలియం, మద్యం, రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించడంలో కేంద్రం విఫలమైందని, ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని దుయ్యబట్టారు.
“8 ఏళ్లు ఆలస్యంగా తెచ్చిన ఈ మార్పులు నిజంగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి జీడీపీ వృద్ధికి దోహదం చేస్తాయో లేదో వేచి చూడాలి” అని జైరాం రమేశ్ అన్నారు. గత ఐదేళ్లలో చైనాతో వాణిజ్య లోటు రెట్టింపు అయి 100 బిలియన్ డాలర్లను దాటిపోయిందని ఆయన గుర్తుచేశారు. నవరాత్రుల సందర్భంగా ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ జరుపుకోవాలన్న ప్రధాని పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విమర్శలు చేయడం గమనార్హం.
👉వెలుగులోకి హైదరాబాద్‌లో రూ.15,000 కోట్ల భారీ భూకుంభకోణం .. హైదరాబాద్‌లో భూ మాఫియా ఏ స్థాయికి చేరిందో మరోసారి రుజువు చేస్తూ.. గాజులరామారం ప్రాంతంలో రూ.15,000 కోట్ల విలువైన భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో భూ మాఫియా ఏ స్థాయికి చేరిందో మరోసారి రుజువు చేస్తూ.. గాజులరామారం ప్రాంతంలో రూ.15,000 కోట్ల విలువైన భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) చేపట్టిన విస్తృత స్థాయి కూల్చివేత చర్యల ద్వారా ఈ కుంభకోణం బట్టబయలైంది. గాజులరామారం పరిధిలోని సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో 100 ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. * వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.. అధికారుల సమాచారం ప్రకారం.. కబ్జా చేయబడిన భూమిలో వేల సంఖ్యలో చిన్న చిన్న ఇళ్లను నిర్మించి, అక్రమంగా విక్రయించారు. ఒక్కో ఇల్లు 60-70 గజాల విస్తీర్ణంలో నిర్మించి, సుమారు రూ.10 లక్షలకు పైగా ధరలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.40-50 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తం కబ్జాకు గురైన 100 ఎకరాల భూమి విలువ సుమారు రూ.15,000 కోట్లకు పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. * పౌరుల నిరసన.. కూల్చివేత చర్యలు HYDRAA అధికారులు ఆదివారం ఉదయం నుంచే గాజులరామారం ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను ప్రారంభించారు. దీనిపై స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఏ మాత్రం తెలియకుండానే ఈ భూములను నమ్మకంతో కొనుగోలు చేశామని, తమను మోసం చేసిన రియల్ ఎస్టేట్ దళారులపై, భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులను శాంతపరిచి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
👉కడపలో తారస్థాయికి చేరిన టిడిపి అసమ్మతి సెగలు… కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా నిరసన..టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు, నాయకుల సమావేశం..దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు..ఎమ్మెల్యే మాధవి రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు..వెంకటేశ్వర స్వామి ఆలయంలో వినతిపత్రం అందజేత..ఆది నుండి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపాటు.ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతనిస్తూ సీనియర్లను తొక్కేస్తుందంటూ ఆవేదన తమను గుర్తించి ఆదుకోవాలని కోరనున్న నాయకులు..

👉ఆందోళన బాటపట్టిన ఏయూ విద్యార్థులు..
SFI ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కు సిద్దమైన స్టూడెంట్స్..తరగతులు బహిష్కరించి నిరసన ర్యాలీకి హాజరు..విద్యార్ధి సంఘ నాయకులను బెదిరిస్తున్న ఏయూ అధికారులు..ఏయూ SFI కార్యదర్శి వెంకట రమణకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..ఎన్ని ఆందోళనలు చేసినా ఏయూలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడంతో ఆందోళనను ఉధృతం చేసిన SFI
👉సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం..*
*పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి..!*దాడిలో రెండు పోలీసు వాహనాలు ద్వంసం..?*
ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లా లోని పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న సాయంత్రం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ఓ కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో కార్మికుని మృతికి యాజమన్య నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. తగిన న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో బిహార్ కార్మికులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు, పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్మికుల దాడిలో రెండు పోలీసు వాహనాలు ద్వంసం అయినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో పరిస్థితి రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.
👉ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్ల విలువైన భూములను రక్షించాం: హైడ్రా కమిషనర్
ఇప్పటి వరకు 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామన్న కమిషనర్.. హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయన్న కమిషనర్..డీఆర్ఎఫ్ బృందాలను పెంచుతామన్న రంగనాథ్..హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి విడిపించామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని అన్నారు. ఆరు చెరువులకు పూర్తిస్థాయిలో పునరుజ్జీవం కల్పించామని వెల్లడించారు..గాజులరామారంలో కొందరు రౌడీషీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆయన తెలిపారు. ఆదివారం అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించామని వెల్లడించారు. నకిలీ పట్టాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమిలోని 260 నిర్మాణాలను తొలగించామని ఆయన అన్నారు. ప్రస్తుతం 51 డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, త్వరలోనే వాటి సంఖ్యను 72కు పెంచుతామని అన్నారు.నగరంలో 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ఉన్నాయని తెలిపారు. నాలాల వద్ద ఆక్రమణలు గుర్తించి తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. వాటిలో పూడికతీత పనులను ముమ్మరం చేశామని అన్నారు. అధిక కాలుష్యం కారణంగా నగరాల్లోనే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తు అంతా యువతదే కాబట్టి, జెన్ జెడ్ తరం పార్కులు, చెరువుల గురించి ఆలోచించాలని సూచించారు
👉 దారుణం.. పండుగ పూట తల్లిదండ్రులను చంపిన కొడుకు..తెలంగాణ : మేడ్చల్ మాల్కాజిగిరిలో పండుగ పూట దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలోని సాయి నగర్‌కు చెందిన శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నెల క్రితం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తల్లిదండ్రులు అతడిని ఇంటికి తీసుకొచ్చారు. మెంటల్ ఆసుపత్రిలో చేర్చారనే కోపంతో ఆదివారం అర్థరాత్రి తల్లిదండ్రులను దారుణంగా హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
👉 నేటి నుంచి మూతపడనున్న డిగ్రీ కళాశాలలు
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం.ఫీజు రీయంబర్స్మెంట్ నిధుల జాప్యం చేయడంపై కళాశాలల యాజమాన్యాలు బంద్ కు ప్రకటించాయి. సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశామని డిగ్రీ కళాశాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. లేకపోతే సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలో మూతపడనున్నట్లు తెలిపారు.
👉 మందు తాగి బిల్లు కట్టాలని సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ – మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. బీటెక్ విద్యార్థి సాయితేజను దారుణంగా కొట్టి.. బార్‌కి వెళ్లి రూ.10 వేల రూపాయల మందు తాగి బిల్లు కట్టాలని వేధించిన సీనియర్లు.. ఈ వేధింపులు తట్టుకోలేక తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాయితేజ..మృతుడు సాయితేజ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిగా గుర్తింపు
👉వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి
తెలంగాణ : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందింది. కొడంగల్ తాలూకా రావులపల్లికి చెందిన అఖిల(23) పురిటి నొప్పులతో ఆదివారం అర్థరాత్రి ఆసుపత్రిలో చేరింది. అంతా బానే ఉందని చెప్పి ఉన్నట్టుండి వైద్యులు మాట మార్చి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. ఇంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మరణించారు.
👉 యువకుడిని మోసం చేసిన సైబర్ నెరగాళ్లు..
ఆదిలాబాద్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన ఓ యువకుడు ధని లోన్ యాప్‌లో రూ. 5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. లోన్ మంజూరు కావాలంటే ముందుగా నగదు చెల్లించాలని మెసేజ్ రావడంతో, బాధితుడు విడతల వారీగా రూ. 1,00,650 చెల్లించాడు. లోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
👉 యూరియా కోసం రైతుల పడిగాపులు.. అధికారులకు చలనం లేదు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్రోమర్ సెంటర్ వద్ద ఉదయం నుంచి క్యూలో నిలబడి కాళ్లు నొప్పులు పెడుతున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా, అధికారులు మాత్రం ఇంతవరకు జాడలేకుండా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
👉శ్రీ మార్ట్ షాపింగ్ మాల్ పై కేసు నమోదు చేయాలి
కాగజ్నగర్ పట్టణంలోని శ్రీ మార్ట్ షాపింగ్ మాల్ నిర్వాహకులు గడువు తీరిన సరుకులను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సీపీఎం సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజ ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. చిన్న పిల్లలు ఇష్టంగా తాగే మిల్కీ మిస్ట్ అనే పానీయం గడువు తేది ముగిసినా అమ్మడం తో పిల్లవాడు అనారోగ్యం పాలయ్యాడని, ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తున్న శ్రీ మార్ట్ నిర్వాహకులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆయన అన్నారు.
👉మహిళ వేషధారణలో దొంగతనానికి పాల్పడ్డ యువకుడు..లోన్ యాప్‌లో తీసుకున్న రుణాలు చెల్లించేందుకు స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం
హైదరాబాద్ – బంజారాహిల్స్ ఉదయ్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ కుటుంబంతో కలిసి నిజామాబాద్‌కు వెళ్లిన శివరాజ్ అనే వ్యక్తి
ఇదే విషయం లింగంపల్లిలో సీసీ కెమెరా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు హర్షిత్‌కు తెలిపిన శివరాజ్ కుమారుడు.. లోన్ యాప్‌లో తీసుకున్న రుణాలు పెరిగిపోవడంతో, ఆడవేషంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి 6.75 తులాల బంగారం, రూ.1.10 లక్షల నగదు కాజేసిన హర్షిత్ ఊరి నుండి వచ్చి చూసేసరికి నగదు బంగారం మాయమవడంతో, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హర్షిత్ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు
👉ఐఫోన్ కోనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విశాఖ యువకుడు*
విశాఖపట్నం జిల్లా సుజాతనగర్‌లో తండ్రి ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ కుమారుడు సాయి మారుతి కెవిన్ (26).. కొంతకాలం హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమలో పనిచేసి ఇటీవలే ఇంటికి వచ్చిన సాయి మారుతి కెవిన్.. ఈ క్రమంలో తనకు ఐ ఫోన్ కావాలని తండ్రి చంద్రశేఖర్‌ను అడిగిన సాయి..ఈ విషయంపై తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరగగా.. మనస్తాపంతో తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకున్న సాయి మారుతి కెవిన్
👉గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ స్పందన*గాజులరామారంలో నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారు.. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారు.. ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుంది.. కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారు-రంగనాథ్.. కబ్జా చేసిన వాటిలో 30శాతం మాత్రమే కూల్చివేశాం..కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవే-రంగనాథ్.. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దు-రంగనాథ్

