👉ఈ దేశ ప్రధాని బలహీనుడు :రాహుల్ గాంధీ .. 👉ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ…👉ఘనంగా అంగన్వాడీ రాష్ట్ర 11మహాసభలు ప్రారంభం..👉:యుటిఎఫ్ మహిళా ఉపాధ్యాయ చైతన్య సదస్సును జయప్రదం చేయండి..👉గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం మరియు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు*అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ విజిబుల్ పోలీసింగ్*..*ఉర్దూ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు*

👉రాహుల్ గాంధీ విపక్ష నాయకుడిగా మోడీని మారో మారు “బలహీన ప్రధాని” అని విమర్శిస్తూ, ట్రంప్ యొక్క $100,000 H1B వీసా రుసుము పెంపును భారత ఐటీ నిపుణుల కలలపై దెబ్బగా చూపారు..ఇది మోదీ డిప్లమసీ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది…మోడీ యొక్క “హగ్ డిప్లమసీ” ట్రంప్ 50% టారిఫ్‌లు, రద్దుతో విఫలమై, భారత ఆర్థిక ప్రయోజనాలను కాపాడలేకపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు…ఈ చేతకాని విదేశాంగ విధానం వల్ల ₹11,000 కోట్ల భారం ఐటీ కంపెనీలపై పడగా, GDPలో 3% రెమిటెన్స్‌లు ప్రమాదంలో ఉన్నాయని రాహుల్ గాంధీ హెచ్చరించారు…మోడీ యొక్క విధానాలు భారతీయులను కెనడా, UK, UAE వంటి దేశాలకు ప్రవాసంగా నెట్టివేస్తున్నాయని, దేశ ఆర్థిక శక్తిని దెబ్బతీస్తున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు….రాహుల్ గాంధీ ఈ విమర్శలతో మోదీ ప్రభుత్వాన్ని బలహీనంగా చిత్రీకరిస్తూ, భారత ప్రయోజనాల కోసం బలమైన డిప్లమసీ అవసరమని పునరుద్ఘాటించారు.

👉        పేదల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ( సి.ఎం.ఆర్.ఎఫ్ ) చెక్కులను అందించడమే దీనికి నిదర్శనం అన్నారు. కొండపి నియోజకవర్గంలోని అర్హులైన 72 మంది లబ్ధిదారులకు రూ.46,06,737 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య ఖర్చుల వలన పేదలెవరూ ఆర్థికంగా చితికి పోకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలో ఇప్పటివరకు 817 మందికి రూ.6,95,28,782 ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రతి కుటుంబానికి  లక్షల రూపాయల ఆరోగ్య భీమాను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘ సంజీవని ‘ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సమాచారాన్ని భద్రపరుస్తున్నట్లు తెలిపారు. దీనివలన అనవసరంగా ఆసుపత్రికి వెళ్లకుండా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికే తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి స్వామి స్పష్టం చేశారు.

👉ప్రకాశం జిల్లా…*మద్యం సేవించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారిలో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి… జిల్లా ప్రజలకు కూడా క్లిన్ అండ్ గ్రీన్ ఉండటమే లక్ష్య సాధన అనే నినాదంతో ముందుకు వెళ్ళుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు.మందుబాబులలో మార్పు తీసుకురావడం తోపాటు వారు సేవిస్తున్న పరిసరాలలో కూడా మార్పు తీసుకు వస్తున్నారు జిల్లా పోలీసులు.మద్యం సేవిస్తున్నవారితో… మత్తు దిగే వరకు పరిసరాలను శుభ్రం చేయించి… అక్కడ ఉన్న చెత్త, చేదారాన్ని ఊడ్పించి వారితో నిప్పు పెట్టిస్తున్నారు. వారిలో ఉన్న చెడు అలవాట్లు కూడా ఈ నిప్పులలోనే కాలిపోవాలంటూ.. పోలీసు సిబ్బంది మందుబాబులకు కౌన్సింగ్ ఇస్తున్నారు.చెడు వ్యసనాలకు బానిసలు అవడం ద్వారా… మీ కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు వారి బిడ్డల బంగారు భవిష్యత్ అంధకారం అవుతుందని పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.అంతేకాకుండా వారి బిడ్డలు భవిష్యత్ మీద ఎన్నోకలలు కంటారని.. వారి ప్రవర్తన వల్లన కన్నకలలు కలలుగానే మిగిలి పోవటం క్షమించరాని నేరమన్నారు.ఇప్పటికైన మద్యం సేవించే ముందు…మందుబాబులు ఒక్కక్షణం అలోచించాలని పోలీసు సిబ్బంది మందుబాబులకు సూచిస్తున్నారు.మద్యం సేవించే ఒక్కరిలో మార్పు వస్తే… మీ కుటుంబ అంతా బంగారుమయం అవుతుందన్నారు. మందు బాబులు మద్యం సేవించి హల్ చల్ చేస్తే… మొదటి తప్పు గా భావించి.. బహిరంగ ప్రదేశాల్లో శుభ్రం చేయిస్తున్నామన్నారు.ఇప్పుటికే జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలను గుర్తించి… డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వారిపై నిఘా పెట్టామన్నారు. మద్యం సేవించి.. ప్రజలను ఇబ్బందులు పెట్టిన, మహిళలను అల్లరి చేసిన అలాంటి వారి చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మద్యం సేవించిన… అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు.

👉విశాఖలో దర్జాగా కల్తీ నెయ్యి తయారీ. పూర్ణామార్కెట్ వద్ద లాడ్జీలో బళ్ళారికి చెందిన వ్యక్తులు బస చేసి తయారు చేసిన 108 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు చేసినట్లు గుర్తింపు.

👉 హైదరాబాద్ లోని తన నివాసం నందు అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను పరామర్శించిన గిద్దలూరు మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జి అన్నా రాంబాబు

👉గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం మరియు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు*

ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు..రైలులో సుమారు 1.5 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీస్ లు..గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, సిబ్బంది, మరియు మాదకద్రవ్యాలను గుర్తించే ప్రత్యేక శిక్షణ పొందిన స్లీపర్ డాగ్ రాక్సీ తో కలిసి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.హౌరా నుండి బెంగళూరు ఎక్స్ప్రెస్ లో ప్రకాశం జిల్లా పోలీస్ లు తనిఖీలు చేపట్టి అబ్దుల్ హుదుద్, 25 సంవత్సరాలు, ముస్లిం, హౌరా, పశ్చిమ బెంగాల్ అనే వ్యక్తి వద్ద నుండి 40 గ్రాముల గల చిన్న ప్యాకెట్లు 38 సుమారు మొత్తం 1.5 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం జి ఆర్ పి పోలీసులకు అప్పగించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, ఎస్సైలు శ్రీకాంత్, శివ రామయ్య, ఈగిల్ టీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.

👉 అనకాపల్లిలో దారుణ సంఘ‌ట‌న‌..సాయి శక్తి విద్యాలయంలో విద్యార్థులను చితకబాదిన టీచర్..ఐరన్ స్కేల్‌తో ఇద్దరు 9వ తరగతి విద్యార్థులను వాత‌లు తేలేలా కొట్టిన‌ టీచర్.స్కూల్ దగ్గర ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు…పరారీలో ఉన్న టీచర్, ప్రిన్సిపల్.. ఘ‌టనపై విచారణ జరుపున్న DEO అప్పారావు

👉*Sky Eye Prakasam Projectలో భాగంగా అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ విజిబుల్ పోలీసింగ్*ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు,  ఆదేశాల మేరకు Sky Eye Prakasam Project లో భాగంగా అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.  డ్రోన్ కెమెరాల ద్వారా పట్టణంలో మరియు గ్రామాల్లో ముఖ్య ప్రాంతాలను పర్యవేక్షించడం జరిగింది.చౌరస్తాలు, బస్ స్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల పై (real-time) విజువల్స్ ద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ చేశారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, బహిరంగ ప్రదేశాల్లో గుంపులు, ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాలపై వెంటనే స్పందించే అవకాశం లభించిందిఈ చర్యల ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే కాకుండా, నేర నిరోధక చర్యలు మరింత బలోపేతం అవుతున్నాయి.డ్రోన్ పర్యవేక్షణతో విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థ మరింత బలపడుతుంది. ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది” అని ఎస్పీవి. హర్షవర్ధన్ రాజు, తెలిపారు.

👉:యుటిఎఫ్ మహిళా ఉపాధ్యాయ చైతన్య సదస్సును జయప్రదం చేయండి.. పొదిలి పెన్షనర్స్ భవనం నందు జరిగిన సమావేశంలో యుటిఎఫ్ మహిళా ఉపాధ్యాయ చైతన్య సదస్సు సంఘం అధ్యక్షురాలు పూల విజయలక్ష్మి మాట్లాడుతూ యుటిఎఫ్ సంఘం తరఫున నిర్వహిస్తున్న ఈ సమావేశంలో అత్యధికమంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొని చైతన్య పొందుటకు అవకాశం ఉన్నది ఈ సమావేశానికి రాష్ట్ర యుటిఎఫ్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాస్ గారు విచ్చేయుచున్నారు ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీలక్ష్మి ఎస్టిఎఫ్ఐ జాతీయ కార్యదర్శి ఎన్ అరుణకుమారి మరియు 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రమాదేవి పాల్గొని మహిళా ఉపాధ్యాయుల సమస్యల గురించి మరియు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సరైన బోధన చేయుటకు అవకాశాలను గురించి మాట్లాడతారు ఈ సమావేశంలో అత్యధికమంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈనెల 21వ తేదీ జరిగే సమావేశంలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జ్యోతి కోశాధికారి జమీల బేగం జిల్లా కార్యదర్శి బాల వెంకటేశ్వర్లు జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బుజ్జిబాబు పొదిలి ప్రధాన కార్యదర్శి పాలడుగు వెంకటేశ్వర్లు ఆహ్వాన సంఘం సభ్యులు ఉమామహేశ్వరి గురవమ్మ

👉ఘనంగా అంగన్వాడీ రాష్ట్ర 11మహాసభలు ప్రారంభం..అంగన్వాడీ రాష్ట్ర 11,వ మహాసభలు శనివారం ఒంగోలు కాపు కళ్యాణమండపం లో ప్రారంభం అయ్యాయి. మహాసభల ప్రారంభ సూచకంగా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబి రాణి జెండా ఆవిష్కరించారు. అనంతరం బేబీ రాణి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు ఎఆర్ సంధ్య, మాజీ ఎంఎల్ సి కె ఎస్ లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బారావమ్మ, ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొటూరు ఉదయని, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, అధ్యక్షులు కాలం సుబ్బారావు, ఉపాధ్యక్షులు జీవీ కొండారెడ్డి, చీకటి శ్రీనివాస్ రావు, జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

👉పాఠశాలకు బీరువా బహుకరణ*

కంభం: మండలంలోని సిఆర్ రావిపాడు ప్రాధమిక పాఠశాలకు శనివారం గ్రామస్థులు బీరువాను బహుకరించారు. కీర్తిశేషులు పెరుమారెడ్డి.నాగిరెడ్డి జ్ఞాపకార్ధం వారి కుటుంబసభ్యులు గొంగటి. రామ్మోహన్ రెడ్డి కుటుంబం పాఠశాలకు జ్ఞాపికగా బీరువా అందించడం అభినందనీయమనీ, బోదనోపకరణాలను,విలువైన రికార్డులను భద్రపరచుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్.కొండలరావు, కె.నాగేశ్వరరావు, విజయనిర్మల, యాస్మిన్ భాను తదితరులు పాల్గొన్నారు.

*ఉర్దూ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు*

కంభం: స్థానిక గవర్నమెంట్ హైస్కూల్లో ఎంఈవో అబ్దుల్ సత్తార్ ఉర్దూ విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను బహుకరించారు. పంద్రాగస్ట్ వేడుకల సందర్భంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో ఉర్దూ భాష పాత్ర గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకడమి,మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన,వక్తృత్వ పోటీల్లో ఉర్దూ కవితలు, గజల్స్ ద్వారా ప్రజలలో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించి, ఊతమిచ్చిన ఉర్దూ భాష ప్రాముఖ్యతను రమ్యంగా రచించి,వివరించి ,విజేతలైన ఉర్దూ మాధ్యమ విద్యార్థినులకు శనివారం ప్రశంసాపత్రాలను అందించి ప్రశంసించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు మస్తాన్ వలి,పాండురంగబాబు పాల్గొన్నారు.ఈ రోజు మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ తురుమెళ్ళ గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రబి సీజన్లో శనగ పంట సాగుచేసే పొలాలను ఖరీఫ్లో ఖాళీగా ఉంచకుండా స్వల్పకాలిక పంటలు అయినటువంటి కుర్ర మినుము పెసర ఒంటి పంటలను సాగు చేసినట్లయితే రైతులకు అదనపదాయం పొందవచ్చని అలాగే పప్పు జాతి పంటల వలన వైజయం బ్యాక్టీరియా ద్వారా నేలలోకి అందజేసి భూసారం పెరుగుతుందని మరియు భూములు కూడా కోత గురి కాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు ఈ అంశంపై ఆత్మ ప్రకాశం వారి సౌజన్యంతోడెమో ఏర్పాటు చేసి పెసర మినుము సాగుచేసిన రైతులకు పురుగుమందులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ నాయకులు ప్రశాంత్ రైతులు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా