👉సాఫ్ట్ వేర్ తో వేలాది ఓట్లు అవుట్… ప్రొసీజర్ అదే ! ఒక్క దెబ్బతో వేలాది ఓట్లు తీసి పక్కన పెట్టేయవచ్చా. దాని కోసం సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి ఓట్లను అన్నింటినీ లేపేయవచ్చా. ఒక్క దెబ్బతో వేలాది ఓట్లు తీసి పక్కన పెట్టేయవచ్చా. దాని కోసం సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి ఓట్లను అన్నింటినీ లేపేయవచ్చా. ఇది సామాన్యుడు సగటు ఓటర్లలో కూడా కలిగే సందేహం. మా ఓట్లు లేవు అని పోలింగ్ వేళ బూత్ ల వద్ద మీడియాకు చెబుతూ ఆవేదన చెందే వారిని చూస్తాం, ఆ మీదట వారు మళ్ళీ కనిపించరు. ఆ విషయంలో పట్టుదల కూడా చూపించరు. అయితే తమ ఓట్లు పోయాయని ఎందుకో అలా జరిగిందని మనసులో మాత్రం పెట్టుకుంటారు. ఈ విషయంలో అధికారుల మీద అనుమానాలు వ్యక్తం చేసేవారూ ఉంటారు. అచ్చం అలాంటి డౌట్లనే జనంలోకి పంపిస్తూ అవి సందేహాలు కావు పచ్చి నిజాలు అంటున్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. దేశంలో పలు కీలక రాష్ట్రాలలో ఓట్ల గల్లంతు జరుగుతోందని తమకు గిట్టని వారి ఓట్లు తొలగిస్తున్నారు అని ఆయన ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు తప్పు : రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పు అని కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగానే ఖండిస్తోంది. ఓట్లను సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ లో తొలగించడం అన్నది అసాధ్యమని కూడా ఎబుతోంది. అసలు ఏ ఒక్కరూ కూడా మరొకరి ఓటుని తొలగించలేరు అని కూడా స్పష్టంగా చెబుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలు నిరాధారమైనవి అని కూడా ఈసీ చెబుతోంది.
*నిబంధనలు ఏమి చెబుతున్నాయి : ఒక వ్యక్తి తన ఓటు పోయింది అని చెబితే ఆ బాధితుడికి కూడా తన వాదన విడిపించుకునేందుకు అవకాశం ఈసీ కల్పిస్తోంది. ఆయన క్లెయిం చేసుకున్న దానిని బట్టి ఓటు తిరిగి పొందే చాన్స్ ఉంటుందని చెబుతోంది. అసలు ఓటు తొలగించాలని అనుకుంటే సదరు ఓటరుకు ముందుగా సమాచారం ఇస్తారు, ఆ వ్యక్తి నుంచి ప్రమేయం లేకుండా ఓటు తీసేయడం అన్నది జరిగే పని కాదు అని నిబంధనలు చెబుతున్నాయి. ప్రక్రియ ఇలాగే : ఇక ఒక వ్యక్తి పేరుని జాబితా నుంచి తొలగించాలని అన్నా లేక ఆ నియోజకవర్గంలో తన పేరుని తీసేయాలని కోరినా దానికి కూడా ఒక పెద్ద కసరత్తు ఉంటుంది. ఫారం 7 ప్రకారం ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అందులోనే తన పేరు నియోజకవర్గం, ఎపిక్ నంబర్ తో పాటు తొలగింపునకు కారణాలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తుల మీద క్షేత్ర స్థాయిలో పరిశీలన ఉంటుంది. ఒక వేళ ఆ ఓటరే తన ఓటు తొలగింపు కోరుకుంటే రిజిస్టర్ పోస్టులో ఓటర్ కి వ్యక్తిగతంగా అన్ని విషయాలు ఈ తొలగింపు మీద తెలియచేయడం కూడా జరుగుతుంది. సాధారణంగా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినపుడు మాత్రమే ఈ తొలగింపుని ఓటరు కోరుకుంటారు.
👉జీఎస్టీ.. పొగడ్తలు: వాత పెట్టిందెవరు? వెన్న పూసిందెవరు? ఓకే ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు జీఎస్టీ గురించి చర్చ ఎప్పుడు వచ్చింది? అసలు జీఎస్టీ వాతలు పెట్టింది ఎవరు? ఇప్పుడు వెన్న పూసింది ఎవరు? జీఎస్టీ తగ్గింపు విషయంపై దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. అదేవిధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ను బిజెపి నాయకుల నుంచి ఎన్డీఏ కూటమి పక్షాల వరకు కూడా పెద్ద ఎత్తున ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పొగడ్తల్లో ముంచేస్తున్నారు. ఇంకేముంది జిఎస్టి స్లాబులు తగ్గిపోయాయి.. కాబట్టి పేదలకు మేలు జరుగుతుంది. మధ్యతరగతి వర్గానికి మంచి జరుగుతుందని… ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుణ్యమే అని.. దీపావళి కానుకను ముందే అందించేసారని ఆయనకు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఓకే ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు జీఎస్టీ గురించి చర్చ ఎప్పుడు వచ్చింది? అసలు జీఎస్టీ వాతలు పెట్టింది ఎవరు? ఇప్పుడు వెన్న పూసింది ఎవరు? అనే విషయాలపై మాత్రం జాతీయ స్థాయి నుంచి లోకల్ వరకు మీడియా సంస్థల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి జీఎస్టిని తీసుకువచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. అయితే, ఆనాడు జిఎస్టిని 5, 12, 14% స్లాబుల వరకు మాత్రమే పరిమితం చేశారు. అంటే మూడు స్లాబులను మాత్రమే అప్పట్లో పేర్కొన్నారు. కానీ, 2014లో ప్రభుత్వం మారిన తరువాత… కేంద్రంలో నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేశారు. ఆ నీతి ఆయోగ్ చెప్పిన సూచనల మేరకు జిఎస్టి లో మార్పులు తీసుకువచ్చారు. జిఎస్టి స్లాబులు మార్చారు. తద్వారా ప్రజలపై భారీ ఎత్తున భారం పడింది. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ నే తాము అమలు చేస్తున్నామని అప్పట్లో వాదించిన మోడీ సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు జీఎస్టీ లో స్లాబుల మార్పు విషయంపై మాత్రం ఇంతవరకు ఎప్పుడు స్పందించలేదు. అంటే 5, 12, 14 శాతాలతో పాటు 18, 24 శాతాలను కూడా జిఎస్టి లో చేర్చింది అక్షరాల నరేంద్ర మోడీ ప్రభుత్వమే.
👉రోడ్డు ప్రమాదాల నివారణకు తాళ్లూరు పోలీసుల చర్యలు – చెట్ల పొదల తొలగింపు*ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టబడ్డాయి. ప్రమాదకర ప్రాంతాలలో రోడ్డు పక్కన అడ్డంగా పెరిగిన చెట్ల పొదలను JCB సహాయంతో తొలగించారు. ఈ చర్యల ద్వారా వాహనదారులకు స్పష్టమైన దృశ్యం లభించి, ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు.ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తాళ్లూరు పోలీసులు తెలిపారు.
🌟 *చూపు లేకున్నా చుక్కానిలా మారింది… అంధత్వాన్ని జయించి ఐఏఎస్ అయిన ఆయుషి!⭐
పుట్టుకతో అంధురాలైన ఢిల్లీ యువతి ఆయుషి సింగ్.. *పట్టుదలతో చదివి సివిల్స్‌లో విజయం.. ప్రస్తుతం ఢిల్లీలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు..
గతంలో పదేళ్లపాటు ప్రభుత్వ టీచర్‌గా అనుభవం
తల్లి ప్రోత్సాహంతోనే ఐఏఎస్ సాధించానన్న ఆయుషి
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలోనూ పాల్గొన్న వైనం..
పట్టుదల ఉంటే వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు ఢిల్లీకి చెందిన ఐఏఎస్ అధికారిణి ఆయుషి సింగ్. పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ, ఆత్మవిశ్వాసంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని వసంత్ విహార్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె విజయం వెనుక ఎన్నో సవాళ్లు, తల్లి ప్రోత్సాహం ఉన్నాయి.
🌟టీచర్‌గా మొదలైన ప్రస్థానం
ఐఏఎస్ అధికారి కాకముందు ఆయుషి పదేళ్లపాటు ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా, వారిలో స్ఫూర్తిని నింపి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించేవారు. అయితే, తన తల్లి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. “ఒక టీచర్‌గా పనిచేస్తే కొంతమంది విద్యార్థులకే చదువు చెప్పగలవు. అదే ఐఏఎస్ అధికారివైతే మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాగల విధానాలను రూపొందించవచ్చు” అని తన తల్లి చెప్పిన మాటలు తనలో కొత్త పట్టుదలను నింపాయని ఆయుషి గుర్తుచేసుకున్నారు. ఆ స్ఫూర్తితోనే సివిల్స్‌కు సిద్ధమై విజయం సాధించానని ఆమె తెలిపారు.
🌟పుట్టుకే ఒక సవాల్
తన ప్రయాణం గురించి ఆయుషి మాట్లాడుతూ… “నా పుట్టుకే ఒక సవాలుగా మారింది. నేను పూర్తి అంధత్వంతో జన్మించాను. కానీ, నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచి నా జీవితంలోని చీకటిని తొలగించారు” అని అన్నారు. వైకల్యాన్ని ఎప్పుడూ లోపంగా చూడకూడదని ఆమె నొక్కిచెప్పారు. ఇటీవలే ఆమె ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. జ్ఞానాన్ని పంచేందుకు అదొక గొప్ప వేదిక అని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయుషి 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.
👉దివ్యాంగుల విద్యలో సవాళ్లున్నాయి
ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయని ఆయుషి పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ప్రస్తావించారు. “దివ్యాంగులైన విద్యార్థులకు ఇప్పటికీ చాలా పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. చాలా స్టడీ మెటీరియల్ సాఫ్ట్ కాపీ రూపంలో లభించడం లేదు. దీనివల్ల దృష్టి లోపం ఉన్నవారు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో దివ్యాంగుల కోసం కేటాయించిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనిషి సామర్థ్యాన్ని వైకల్యం ఎప్పటికీ అడ్డుకోలేదని, పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని ఆమె తన జీవితం ద్వారా నిరూపిస్తున్నారు.
👉రోడ్డు ప్రమాదాల నివారణకు తాళ్లూరు పోలీసుల చర్యలు – చెట్ల పొదల తొలగింపు*
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టబడ్డాయి.ప్రమాదకర ప్రాంతాలలో రోడ్డు పక్కన అడ్డంగా పెరిగిన చెట్ల పొదలను JCB సహాయంతో తొలగించారు. ఈ చర్యల ద్వారా వాహనదారులకు స్పష్టమైన దృశ్యం లభించి, ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తాళ్లూరు పోలీసులు తెలిపారు.
👉రాజంపేటలో వెలుగు చూసిన ఘరానా మోసం..*
ప్రభుత్వ చౌక దుకాణంలోని బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలిస్తున్న ముఠా..
రాజంపేట-పుల్లంపేట అటవీ ప్రాంతంలోని సరిహద్దులో భారీ గోడౌన్..
బియ్యాన్ని వివిధ బ్రాండ్ల పేర్లతో బహిరంగ మార్కెట్ కు తరలిస్తున్న కేటుగాళ్లు..
గోడౌన్ నిండా వందలాది బియ్యం బస్తాలు..
రాజంపేట నుంచి బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడుకు తరలిస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణ..
కర్ణాటకకు చెందిన ఓ లారీ బియ్యం అక్రమ రవాణా చేస్తూ బురదలో ఇరుక్కోవడంతో వెలుగులోకి వచ్చిన స్కాం..
అటవీ ప్రాంతంలోని గోడౌన్ కు చేరుకుని తాళాలు పగలగొట్టి బియ్యం బస్తాలు లెక్కిస్తున్న రెవెన్యూ అధికారులు..
👉అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టండి: ఎస్పీ హర్షవర్ధన్ రాజు*
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసు సిబ్బందికి కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా కట్టుదిట్టంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. గంజాయి రవాణా, పేకాట, కోడి పందాలు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.
👉పిఠాపురంలో దారి మళ్లుతున్న యూరియా.. వీడియోలు వైరల్ కావడంతో స్పందించిన అధికారులు..గొల్లప్రోలు మండలం తాటిపర్తి,వన్నెపూడి లో విజిలెన్స్ అధికారుల దాడి.. రెండు లారీలు సీజ్, 606 యూరియా బస్తాలు స్వాధీనం.. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు.. యూరియా లారీలను గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కు అప్పగించిన విజిలెన్స్ అధికారులు
👉 ప్రకాశం జిల్లా కంభంలో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం*
కంభం ఎస్బిఐ బ్రాంచ్ లో నకిలీ 500 నోట్లు కలకలం రేపాయి. ఈనెల 2వ తేదీన తన బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేసుకునేందుకు వచ్చిన శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.20,500 నకిలీ నగదును బ్యాంక్ అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు శ్రీను అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం తెలిపారు. విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని సీఐ మల్లికార్జున వెల్లడించారు.
👉తాడేపల్లి *గంజాయి విక్రయించే వారి పట్ల పోలీసుల నిర్లక్ష్యం*
*ప్రాతూరు గ్రామం దగ్గర కృష్ణానది తీరాన గంజాయి అమ్ముతున్న మహిళతో పాటు గంజ సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు* *అయితే వీరిలో గంజాయి అమ్ముతున్న పుణ్యతి సత్యవతి అనే మహిళ తాడేపల్లి పోలీసుల నుంచి తప్పించుకోవటంతో గంజాయి అమ్మే వారి పట్ల తాడేపల్లి పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి*
👉 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పై ఉక్కుపాదం – కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా పోలీసులు* .. ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ తమ స్టేషన్ పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో పౌరుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, ప్రజలు నిశ్శబ్దంగా, భయరహిత వాతావరణంలో జీవించేలా పోలీసులు కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతూ, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎటువంటి సడలింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల సహకారాన్ని కోరుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
👉రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ 4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని , మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే విరమించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ )రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పిడిఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గురువారం నాడు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు…
👉మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి: సీఐటీయూ. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి బండి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోరుతూ గురువారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక పొదిలి మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ఈ ధర్నాలో కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 17 రోజులు సమ్మె జరిగిందని ఆ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామని, 62 సంవత్సరాల వయోపరిమితి పెంచుతామని, కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, దహన సంస్కారాలకు 20,000 వేలు ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం జీవోలు రూపంలో ఇచ్చి అమలు చేయాలన్నారు. 2025 జూలైలో జరిగిన ఏడు రోజులు సమ్మె కాలపు జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు వర్తింపచేయాలన్నారు. 12వ పిఆర్సి కమిటీ వేసి మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని, పొదిలి మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈనెల 23వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.ఈ ధర్నాలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి సుబ్బయ్య, కె.వి నరసింహం, జి నాగేశ్వరరావు, బి కోటేశ్వరమ్మ, పి నాగేంద్రం , ఎస్ జార్జి, సిహెచ్ నాగరత్నం, మేరీ ,చిన్నక్క, టీ బుజ్జి, హజరత్తమ్మ, బైరాగి అంజమ్మ, యోహాను, ఏడుకొండలు, చిన్నయ్య, పోలేరమ్మలు పాల్గొన్నారు.

