👉ఓటు చోరీ ‘హైడ్రోజన్ బాంబు’.. ఓటు చోరీపై ‘హైడ్రోజన్ బాంబు’పేలుస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని ఆరోపించారు. ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేశారని, ఫేక్ లాగిన్ ఐడీలతో ఓటర్ల పేర్లు డిలీట్ చేశారని మండిపడ్డారు. ఇందిరా భవన్ ఆడిటోరియం నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది.
👉మరోసారి ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ..కర్ణాటకలో ఆలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లు తొలగించబడ్డాయి… ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది..బూత్ స్థాయి అధికారి తన మామగారి ఓటు లేకపోవడం గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది –

👉 ప్రతిపక్ష హోదాకు కొన్ని లెక్కలుంటాయి.*
*ప్రతిపక్ష హోదా లేదన్న సాకుతో జగన్, కేసీఆర్ లు అసెంబ్లీకి వెళ్లడంలేదు.*అసెంబ్లీకి పోకపోతే ప్రజలను మోసం చేసినట్టే.* ప్రభుత్వపరంగా వచ్చే లబ్ధి పొందుతున్నారు : సీపీఐ నారాయణ*
👉మెడికల్ కాలేజీల పీపీపీ – ప్రజల లాభమా? నష్టమా?.. ప్రభుత్వం చెబుతున్నది.. ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి..కాలేజీలు త్వరగా పూర్తవుతాయి.. ఆరోగ్య సదుపాయాలు పెరుగుతాయి..
*కానీ వాస్తవం:* ఫీజులు ఆకాశమే హద్దు!.. పేద విద్యార్థికి మెడికల్ చదువు దూరం!.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స తగ్గిపోతుంది!..ఆరోగ్యం, విద్య వ్యాపార వస్తువులు అవుతాయి!
*రాజ్యాంగం చెబుతున్నది*.. ఆర్టికల్ 21A → విద్య ప్రాథమిక హక్కు.. ఆర్టికల్ 21 → ఆరోగ్య హక్కు జీవన భాగం..ఆర్టికల్ 47 → ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత..
👉 మరి ప్రభుత్వం ఈ హక్కులను ఎందుకు వదులుతోంది?
🙏 *మా డిమాండ్లు* ✅ మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రైవేటు రంగానికి ఇవ్వకూడదు..
✅ పేదలకు, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీట్లు పెంచాలి
✅ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత/తక్కువ ఖర్చుతో వైద్యం హామీగా ఉండాలి..
*ప్రజలే అడుగుతున్నారు:*
“ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం…ప్రజల కోసం నిలుస్తుందా? లేక ప్రైవేటు కార్పొరేట్ల కోసం?” *విద్య – వైద్యం వ్యాపారం కాదు, హక్కు!*
👉మార్కాపురం ఫార్మసీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు, మార్కాపురం పట్టణంలోని డాక్టర్ సామ్యూల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ డివిజనల్ ఆఫీసర్ డాక్టర్ యు. నాగరాజు , మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు , సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ ఎం. రాజా మోహన్ రావు పాల్గొన్నారు.
విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించి, ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలు వివరించారు.విద్యార్థులు విద్య ద్వారా సమాజానికి విజ్ఞానాన్ని అందించాలి, ర్యాగింగ్ వంటి తప్పుదారుల్లో నడవకుండా, సామరస్యంగా కలిసిమెలిసి ముందుకు సాగాలని సూచించారు.యువత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని అధికారులు పిలుపునిచ్చారు.ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థులలో చట్టం పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందిస్తాయి
👉 శ్రీ సత్య సాయి జిల్లా.. రాష్ట్ర డీజీపీని మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ..
శ్రీ సత్య సాయి జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ వికుమార్ .. బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేచేశారు..

👉ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై SFI ఆగ్రహం..ఆదోనిలో భిక్షాటన చేసిన SFI నాయకులు..
భిక్షాటన చేసిన డబ్బుతో కాలేజీలు నిర్మించాలని డిమాండ్..రాజధానికి పెట్టే డబ్బులు మెడికల్ కాలేజీలకు లేవా అని ప్రశ్న..చంద్రబాబు, పవన్, మంత్రులపై విద్యార్థి సంఘ నేతల ఆగ్రహం
👉 ఉల్లి, టమోటా గిట్టుబాటు ధర లేక పురుగుల మందు తాగి చనిపోతున్నారు అన్నదాతలు..OG కి మాత్రం టికెట్ రేట్ 1000 రూపాయలు.. రైతు కన్నా సినిమా గొప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు దృష్టి లో మనీ సర్వత్రా విమర్శలు బహిరంగంగా జరుగుతున్నాయి.
👉 గాజువాక :గంజాయి, మద్యం మత్తులో పెట్రేగిపోతున్న యువత.. జీవీఎంసీ 58వ వార్డు చిన్నములగాడ గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు ఆ గ్రామంలో అదే తంతు.. స్థానికుల్ని డబ్బుల కోసం వేధిస్తున్న ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.. బెంబేలెత్తిపోతున్న మగువలు.. మా గ్రామానికి రక్షణ కావాలి అంటూ మహిళలు సిటీ పోలీస్ కమిషనర్ శంకాబ్రత బగ్చి కి అర్ధనాదాలు.. ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ అవగాహన కార్యక్రమంలో గ్రామ మహిళలు వినతి పత్రాలు సమర్పణ..స్థానికంగా నాలుగు అనధికార మద్యం దుకాణాలు మరియు ఒక కిరాణా షాపు ప్రాంగణాలే ఆకతాయి యువతకు ఆవాసాలు- జీవీఎల్ పద్మ.. గ్రామం నగర శివారులో ఉండడం వల్ల చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న యువత ఇక్కడికి వచ్చి ఉద్రిక్తత వాతావరణం సృష్టిస్తున్నారు – జివిఎల్ పద్మ..పోలీసులు చర్యలు ఉన్నప్పటికీ ఆ సమయాలలో అప్రమత్తమవుతున్న మద్యం వ్యాపారులు మరియు ఆకతాయిలు… పై చర్యలు తీసుకోవాలి అంటూ ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ పేర్కొన్నారు..
👉ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య*
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామానికి చెందిన పోలిరెడ్డి ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపార నిమిత్తం హైదరాబాదులోని కెపిహెచ్బి కాలనీలో నివాసం ఏర్పరచుకొని పోలిరెడ్డి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో మనస్థాపం చెంది పోలిరెడ్డి తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉ఇటుక రాయితో దాడి చేసిన వ్యక్తికి 14 రోజులు రిమాండ్*
ఇటుకరాయితో దాడి చేసిన వ్యక్తికి సింగరాయకొండ కోర్టు బుధవారం 14 రోజులు రిమాండ్ విధించిందని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న రమేష్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో నివసించే మరో వ్యక్తిపై ఇటుక రాయితో దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో రమేష్ ఆ ప్రాంతంలో అందర్నీ బూతులు తిడుతున్న నేపథ్యంలో బాధితుడు రమేష్ ని ప్రశ్నించాడు. దీంతో కోపం పెంచుకున్న రమేష్, కార్తీక్ పై దాడికి దిగాడని ఈనెల 3వ తేదీన ఈ ఘటన జరిగిందని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.
👉 డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..
తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని, రేవంత్ రెడ్డిని కలిసి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..ఇటీవల లారీ లోడ్ యూరియాను బ్లాక్‌లో అమ్ముతూ పట్టుబడ్డ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ నాగు నాయక్
👉 విజయవాడలో బార్ల టెండర్ల విషయంలో వివాదం
టీడీపీ ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే బార్లకు టెండర్లు అంటూ బాధితుడి సెల్ఫీ వీడియో కలకలం.. టెండర్ దరఖాస్తు తీసుకోవడానికి ఎక్సైజ్ సీఐ రమేష్ నిరాకరిస్తున్నారన్న గణేష్.. తన టెండర్ పత్రాలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన గణేష్.
*ప్రకాశం జిల్లా కంభం SBI బ్యాంక్ లో కస్టమర్ డిపాజిట్ సమయంలో భారీ నకిలీ నోట్లు గుర్తింపు. అవాక్కయిన బ్యాంక్ ఉద్యోగులు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..
👉 నాలుగు రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు*
*రూ.670 కోట్లు చెల్లిస్తామన్న ఆరోగ్య శ్రీ సీఈవో*
*ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో కొనసాగుతున్న నిరసన*
*2 రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ఆస్పత్రులు*
👉ఎమ్మెల్యేలకు ఏమన్నా కొమ్ములు ఉన్నాయా ||* ◼️
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎమ్మెల్యేల పనితీరు:*
*▪️ఎమ్మెల్యేల పనితీరు పై ఘాటు వ్యాఖ్యలు, పేరుకే ఎమ్మెల్యేలు , ఎప్పుడూ ఇతర రాష్ట్రాల్లో.*
*▪️హైదరాబాద్ వీడని ఆంధ్రప్రదేశ్ వీకెండ్ ఎమ్మెల్యేలు.*
▪️వీకెండ్ లో నియోజకవర్గాల్లో ప్రత్యక్షం.
*▪️ఫోటోలకు, వీడియోలకు పోజులు ఇస్తూ, క్షణం తీరిక లేదు అన్నట్లు వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు.*
▪️’ పీఏ ‘ లతోనే నియోజకవర్గాల్లో పని చేస్తున్న పరిస్థితి.
*▪️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు భార్యలకు కూడా తెలియకుండా ‘ పీఏ ‘ లతోనే మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితిలో ఏపీ ఎమ్మెల్యేల పనితీరు…*
▪️ఎమ్మెల్యేల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్.
▪️ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకుంటే పనిష్మెంట్ ఇవ్వమా …?
*▪️వినకపోతే జీతం కట్ చేస్తంగా,అప్పటికీ మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తాం కదా…?*
▪️అలాగే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుంటే ఎందుకు జీతాలు ఇవ్వాలి …?ఎమ్మెల్యేలకు ఏమన్నా కొమ్ములు ఉన్నాయా …? స్పీకర్
👉విజయనగరం జిల్లా పెదకాద గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళన.. యూరియా వచ్చి 2 రోజులయినా.. ఎందుకు పంపిణీ చేయలేదంటూ ఆందోళన..ఈ నేపథ్యంలోనే.. అధికారులతో వాగ్వివాదానికి దిగిన రైతులు..యూరియా పంపిణీ చేసేంతవరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న రైతులు

