👉 జీఎస్టీ ద్వారా రూ.22 లక్షల కోట్ల ఆదాయం: నిర్మలా సీతారామన్*.. 8ఏళ్లలో జనాలను బాగానే పిండేసారు!.
విశాఖపట్నం : 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవని.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై విశాఖలోని మధురవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘2017కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో చెల్లింపుదారులు 1.51 కోట్లకు పెరిగారు. 2018 సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2025లో రూ.22.08 లక్షల కోట్లు వచ్చింది. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.
👉నెలలు నిండకుండానే పుట్టిన 600 గ్రాముల బరువున్న చిన్నారికి కాలి నరం ద్వారా గుండె చికిత్స*
హైదరాబాద్::గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో 7 నెలలకే పుట్టిన బాబుకు కాలి నరం ద్వారా గుండె సమస్యకు చికిత్స అందించారు.పీడీఏ సమస్య కారణంగా అతడిని 97 రోజులపాటు ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు.శస్త్రచికిత్స కాకుండా, 1.2 మిల్లీమీటర్ల పికోలో డివైస్ సాయంతో గుండె రంధ్రాన్ని మూసి ప్రాణాపాయం నుంచి రక్షించారు.ఈ పరికరంతో కోలుకున్న దేశంలోనే అతి తక్కువ బరువు గల శిశువుగా ఈ చిన్నారి రికార్డు సృష్టించాడు.
👉డిగ్రీ కళాశాల యాజమాన్యాల తో సమావేశమైన ఎమ్మెల్యే*
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మంగళవారం ఒంగోలు పట్టణంలోని డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఇటీవల విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులతో గురిచేస్తున్న విషయం దృష్టికి రావడంతో ఎమ్మెల్యే నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగించవద్దని ప్రభుత్వం దృష్టికి ఫీజు రియంబర్స్మెంట్ గురించి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పరీక్షలు ఫీజు మాత్రమే విద్యార్థుల వద్ద నుంచి సేకరించాలని ఎమ్మెల్యే యాజమాన్యాలకు చెప్పినట్లు తెలుస్తుంది.
👉హైడ్రా కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు..హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించిన హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది..విధులను బాయ్ కట్ చేసి ఆందోళనకు దిగిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు ..జీతాల తగ్గింపు పై హైడ్రా సిబ్బంది ఆగ్రహం ..న్యాయంజరగకపోతే విధులకు హాజరుకామని హెచ్చరిక..స్తంభించిపోయిన హైడ్రా అత్యవసర సేవలు
👉భార్యపై భర్త అమానుష దాడి.. ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్*
*ఇప్పటికే ఇద్దరి అరెస్ట్.. కుటుంబ సభ్యుల కోసం గాలింపు..*ఘటన తెలిసిన వెంటనే.. రంగంలోకి పోలీస్!*
*బాధిత మహిళను వైద్యశాలకు స్వయంగా తరలించిన పోలీస్..*తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం ఎస్టి కాలనీ చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, తర్లుపాడు పాడు ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి సదర్ మహిళను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
సుమారు 12 సంవత్సరాల క్రితం వివాహమైనట్లు, వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం అయినట్లు, గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామములోని బేకరీ నందు పనిచేస్తున్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మిని అనుమానిస్తున్నట్లు ఉన్నట్లు, తేది.13.09.2025న రాత్రి షుమారు 09:30 సమయంలో గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామము లోని బేకరీలో పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా, మార్గ మధ్యలో గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీ అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి చేతులు కట్టేసి బెల్ట్ తో వీపు పై కొట్టి, కాళ్ళతో, చేతులతో కొట్టినారు.
*మహిళలు/ పిల్లలపై దాడులు జరిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ అన్నారు.*
👉ప్రకాశం జిల్లా హెచ్ .ఎం.పాడు మండలం
ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం .. హెచ్.ఎం.పాడు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించిన కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ గారు హెచ్.ఎం.పాడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన స్టేషన్ యొక్క అన్ని విభాగాలను సమగ్రంగా పరిశీలించారు.
స్టేషన్ ప్రాంగణం పరిశీలన – శుభ్రత, సౌకర్యాలు మరియు భద్రతా ప్రమాణాలను చూసి సూచనలు అందించారు.రిజిస్టర్లు, కేసు డైరీస్, రికార్డులు – సక్రమంగా నిర్వహణ జరుగుతున్నదో లేదో విశ్లేషించారు.
CCTNS అప్‌డేట్స్ – పెండింగ్ కేసులు, వాటి అప్‌డేట్స్‌ను పూర్తిగా సమీక్షించారు.
కేసుల పరిష్కారం – వేగవంతమైన దర్యాప్తు, సరైన డాక్యుమెంటేషన్ అవసరాన్ని సిబ్బందికి వివరించారు.
ప్రజా సేవ – స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజల నమ్మకాన్ని పెంచాలని సూచించారు.క్రమశిక్షణ & శుభ్రత – స్టేషన్‌లో క్రమశిక్షణ పాటించడం, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.నేరాల పర్యవేక్షణ – ప్రాంతంలో నేరాలు, శాంతిభద్రతల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి మాట్లాడుతూ “ప్రతి కేసును వేగంగా దర్యాప్తు చేసి, న్యాయం జరిగేలా చూడాలి.” “ప్రజలకు మర్యాద పూర్వకంగా సేవ చేయడం ద్వారా పోలీస్ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.””స్టేషన్ శుభ్రత, రికార్డు నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణలో ఎలాంటి లోపం ఉండకూడదు.””ప్రజల భద్రత కోసం నిరంతరం విజిబుల్ పోలీసింగ్ చేయాలి.”అని సూచించారు.ప్రకాశం పోలీసులు – నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ, చట్టం అమలులో ఎల్లప్పుడూ ముందుంటారన్నారు
👉భర్త పై అనుమానంతో భార్య ఆత్మహత్య*
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లె గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. భర్త పై అనుమానం పెంచుకున్న భార్య ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్లో విద్యుత్శాఖ ఏడీఈ అరెస్టు, రూ.2 కోట్ల నగదు సీజ్… ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ను ACB అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంబేడ్కర్ బంధువు ఇంట్లో రూ.2కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఇబ్రహీంబాగ్ లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయనకు శేరిలింగపంల్లిలో ఇల్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరాబాద్లోలో మరో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి~
👉రేషన్ దుకాణదారుడిపై కేసు నమోదు*
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో మంగళవారం చౌక దుకాణం నిర్వాహకుడి పై ఫుడ్ ఇన్స్పెక్టర్ సల్మాన్ 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దుకాణాన్ని తనిఖీ చేసిన సమయంలో 20040 కిలోల బియ్యం 94 ప్యాకెట్ల పంచదార నిల్వలు ఉండాల్సి ఉండగా నిలువలు లేవని గుర్తించినట్లు సల్మాన్ తెలిపారు. దుకాణానికి తాళం వేసి బాధ్యతలు విఆర్ఓ కు అప్పగించామని తహసిల్దార్ తెలిపారు.
👉బహిరంగంగా మద్యం సేవించిన వారికి కౌన్సిలింగ్*
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం రాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించారు. పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.
👉రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిఎస్పి శ్రీనివాసరావు*
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రౌడీ షీటర్లకు మంగళవారం డిఎస్పి శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న రౌడీ షీటర్ల నివాసలకు స్వయంగా డి.ఎస్.పి శ్రీనివాసరావు వెళ్లారు. రౌడీ షీటర్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని వినకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని నిరంతరం రౌడీ షీటర్ల పై నిఘా ఉంటుందని డిఎస్పి రౌడీషీటర్లను హెచ్చరించారు.
👉మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మండలం మొట్ల తండా శివారు చిన్న వాగు సమీపంలో యూరియా కోసం తెల్లవారుజమున వెళుతున్న ఆటో బోల్తా..ఆటోలో ప్రయాణిస్తున్న 6 గురికి గాయాలు, ఏరియా ఆసుపత్రికి తరలింపు..ఆటోలో ప్రయాణిస్తున్న రైతులు బయ్యారం మండలం గురిమిల్లకు చెందిన రైతులు..గాయపడిన వారికి మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స….

