👉స్పా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
రాజమహేంద్రవరం: సెప్టెంబర్:15.
రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఫెదర్ టచ్ స్పా పై పోలీసుల ఆకస్మిక దాడి.. 11 మంది అరెస్టు వీరిలో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాజమండ్రి ప్రకాష్ నగర్ సిఐ గతంలో ఇదే స్పా సెంటర్ పై దాడి చేసి కేసు నమోదు చేసిన పోలీసులు మళ్లీ ఇదే సెంటర్ లో స్పా మసాజ్ పేరుతో వ్యభిచారం జిల్లా SP నరసింహ కిషోర్ ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ DSP వై. శ్రీకాంత్ ఆదేశాలు మేరకు ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ ఆర్.ఎస్.కే. బాజిలాల్ నేతృత్వంలో ప్రకాష్ నగర్ లో ప్రియాంక గార్డెన్స్ ఎదురగా గల యందు అసాంఘిక కార్యక్రమాలు జరుగుచ్చునవి అని పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేయగా సదురు స్పా ముసుగులో వ్యభిచారం జరుగుచ్చునట్లు పోలీసు వారు గుర్తించి ముగ్గురు నిర్వాహకులను, నలుగురు విటులను మరియు అయిదుగురు బాధిత మహిళలను గుర్తించి సదరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని, కేస్ నమోదు చేసి నిర్వాహకులపై కటిన చర్యలు తీసుకున్నట్లు తెలియపరుస్తున్నారు.సందర్భంగా ఇటువంటి స్పా ముసుగులో వ్యభిచారం చేసే వారి పై మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వారిపై కట్టినమైన చర్యలు తీసుకొన బడతాయి అని, మరియు వారి పై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయబడతాయి అని పోలీసు వారు తీవ్ర మైన హెచ్చరిక జారీ చేసినారు
👉ఏపీ ఎక్సైజ్ కమీషనర్ గా రాహుల్ దేవ్ శర్మ కు అదనపు బాధ్యతలు*
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు ఎక్సైజ్ కమీషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఫలితంగా రాహుల్ దేవ్ శర్మ ఇకపై డైరెక్టర్, ఎక్సైజ్ & ప్రొహిబిషన్; మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్; కమిషనర్, డిస్టిలరీస్ & బ్రూవరీస్ హోదాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ తాత్కాలిక ఏర్పాట్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
👉అనంతపురం కలెక్టరేట్ వద్ద హైటెన్షన్..కలెక్టరేట్ లోకి దూసుకెళ్లిన ఆందోళన కారులు..బారికెడ్లు తోసేసి కలెక్టరేట్ లోకి దూసుకెళ్లిన నిరసన కారులు.. సేవ్ RTD నినాదాలు..జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు ఉన్న రెవెన్యూ భవన్ కు తాళాలు.. అధికారులతో దళిత సంఘం నేతల వాగ్వాదం.. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) కి విదేశీ నిధులు ఆపొద్దని డిమాండ్..
👉పట్టణ ప్రాంతాల్లో 1343 ఎకరాలు అమ్మకం…*78 చోట భూములు గుర్తించిన ప్రభుత్వం*..*ఆ దిశలో చర్యలు తీసుకోవాలని సిఎం సూచన*..*సదుపాయాల కల్పనకు పదేళ్లలో లక్ష కోట్లు అవసరమని అంచనా*
* అమరావతి బ్యూరో :*
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పన పేరుతో భూముల అమ్మకానికి ప్రభుత్వం తెరలేపింది.
దీనిలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 78 చోట్ల 1,343 ఎకరాలు అమ్మకానికి పెట్టింది. రానున్న పదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పట్టణ సంస్కరణలు అమలు చేయడం ద్వారా కేంద్రం నుండి కొంత నిధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సిఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. వీటిలో గ్రోత్ హబ్స్, నగరాల పునరాభివృద్ధి, శానిటేషన్ ప్రాజెక్టులతో పాటు, పట్టణ ప్రాంతాల్లో నిధుల సమీకరణకు పిపిపి పద్ధతిని అమలు చేయడంతో ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం 18 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 78 చోట్ల భూములను గుర్తించింది. ఇలా అమ్మడానికి పెట్టిన స్థలాల్లో ఎసైన్డ్, డికెటి, డిపట్టా భూములు 28 ఉన్నాయి. 45 చోట్ల ప్రభుత్వ, పట్టణాభివృద్ధి సంస్థలకు చెందిన భూములున్నాయి. వాటిని అమ్మడం లేదా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇలా అప్పగించిన భూముల్లో పట్టణాభివృద్దిశాఖల ప్రమేయం ఏ మాత్రమూ ఉండకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. పిపిపి పద్ధతిలో అప్పగించే భూముల్లో ప్లాట్ల అభివృద్ధి, గేటెడ్ కమ్యూనిటీ, వేర్‌హౌసింగ్, ఫ్యూయల్ స్టేషన్లు, హాస్పిటళ్లు, వాణిజ్యభవనాలు, సోలార్ పార్కులు, హోటళ్లు, రిసార్టులు, హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఆయా సంస్థల పరిధిలో వేర్వేరు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూమిని కూడా యుడిఏకు అప్పగించడం వంటి పనులు పూర్తయ్యాయి. వాటికి ఎసెస్‌మెంట్ కూడా ఇచ్చేశారు. అలాగే 78 చోట్ల గుర్తించిన వాటిల్లో 73 సైట్లకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వాటిల్లోనూ 33 చోట్ల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని, 27 చోట్ల పరిశీలన చేయాల్సి ఉందనీ ఈ మొత్తంలో 1275 ఎకరాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉందనీ నివేదిక రూపొందించింది. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ణణాభివృద్ధిశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*ఎక్కడ …ఎన్ని ఎకరాలు*
వీటిల్లో శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 8 చోట్ల 159.38 ఎకరాలు, బొబ్బిలి యుడిఏలో 10 చోట్ల 44.38 ఎకరాలు, అమలాపురం యుడిఏలో 2 చోట్ల 5జ10 ఎకరాలు, రాజమహేంద్రవరం పరిధిలో 3 చోట్ల 66.49 ఎకరాలు, కాకినాడలో 4 చోట్ల 31.51 ఎకరాలు పిపిపి పద్ధతిలో మానిటైజేషన్ ప్రక్రియకు కేటాయించారు. వీటితోపాటు ఏలూరులో నాలుగు చోట్ల 164.03 ఎకరాలు, మచిలీపట్నం పరిధిలో మూడు చోట్ల 35.76 ఎకరాలు, బాపట్ల యుడిఏ పరిధిలో రెండుచోట్ల 5.25 ఎకరాలు, పల్నాడు పరిధిలో ఒకచోట 40 ఎకరాలు, ఒంగోలులో మూడుచోట్ల 25.94 ఎకరాలు, నెల్లూరులో ఒకచోట 34 ఎకరాలు, తిరుపతిలో ఐదుచోట్ల 167.12 ఎకరాలు, చిత్తూరులో 8.54 ఎకరాలు, పలమనేరు, కుప్పం, మదనపల్లె యుడిఏ పరిధిలో నాలుగు చోట్ల 76.46 ఎకరాలు పిపిపికి ఇవ్వనున్నారు. పుట్టపర్తి పరిధిలో ఆరుచోట్ల 40.64 ఎకరాలు, అనంతపురం, హిందూపురం యుడిఏలో 11 చోట్ల 229.39 ఎకరాలు, అన్నమయ్య, కడప యుడిఏలో ఆరచోట్ల 114.39 ఎకరాలు, కర్నూలులో నాలుగు చోట్ల 95 భూములను అమ్మడంగానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంగానీ చేయాలని నిర్ణయించారు.
👉జగన్ ని చంద్రబాబు కేసీఆర్ ని రేవంత్ని అరెస్ట్ చేయరు…ఎందుకంటే ? 
రాజకీయాల్లో చాలా లెక్కలు ఉంటాయి. ఎక్కడ ఏ లెక్క కలిపితే ఏది ప్లస్ అవుతుంది లేదా ఏది మైనస్ అవుతుంది అన్నది పొలిటికల్ మేథమెటిక్స్ లో అవగాహన ఉన్న వారికే అర్థం అవుతుంది.అందుకే ఒకటి ని ఒంటరి అంకెగానే ఉంచాలని చాలా మంది చూస్తారు. పొరపాటున మరొకటి చేరితే అది రెండు కావచ్చు ఇరవై రెండు కూడా కావచ్చు. అలాగే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని ఏ మాత్రం టచ్ చేసినా రివర్స్ లోనే కొడతాయి. అందుకే అన్ని విషయాలను బాగా పరిశీలించిన మీదటనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఇపుడు చూస్తే సరికొత్త రకం స్ట్రాటజీ కూడా అమలులో పెడుతున్నారు. అది బాగా వర్కౌట్ అవుతోంది కూడా
*ఆ ఇద్దరికీ నో అరెస్ట్ : *అవును తెలుగు నాట రాజకీయాలు చూస్తే ఆ ఇద్దరి అరెస్ట్ అన్నది అసలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. అదెలా అంటే దానికే పొలిటికల్ మేథమెటిక్స్ అడ్డం పడుతోంది అని అంటున్నారు. అందుకే జగన్ ని చంద్రబాబు కానీ కేసీఆర్ ని రేవంత్ రెడ్డి కానీ అరెస్ట్ చేసే చాన్స్ అసలు లేనే లేదని అంటున్నారు. ఇక రాజకీయ లెక్కలు చూస్తే గతంలో రేవంత్ రెడ్డి ని కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసింది. దాంతో ఆయనకు అమాంతం సింపతీ పెరిగింది. ఏకంగా సీఎం అయిపోయారు. అలాగే చంద్రబాబుని ఎన్నికలు ఆరు నెలల వ్యవధిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కూటమి మునుపెన్నడూ లేని విధంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. బాబు నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిపోయారు.
*సెంటిమెంట్ మహిమ :* ఇదంతా సెంటిమెంట్ మహిమ అని అంటున్నారు. భారత దేశంలో సెంటిమెంట్ పొలిటికల్ గా సూపర్ హిట్ అవుతుంది. జైలుకు ఎవరైనా వెళ్తే చాలు ఎక్కడ లేని సానుభూతి వస్తుంది. అయ్యో పాపం అని కూడా జనాలు అనుకుంటారు. దాంతో జైలుకు వెళ్ళి వస్తే కనుక ఏకంగా సీఎం పీఠానికే గురి పెడతారు. అందుకే ఎప్పటికీ ఈ తప్పు రాజకీయ గణితం బాగా చదువుకున్న వారు ఎవరూ చేయరనే అంటారు.
*వారంతా గెలిచారు : * జైలుకు వెళ్ళి వచ్చి సీఎంలు అయిన వారు భారత దేశ రాజకీయ చరిత్రలో చాలా మంది ఉన్నారు. తమిళనాడులో జయలలితను జైలులో చాలా కాలం పెట్టారు. అంతే ఆమె జైలు నుంచి బయటకు వచ్చి ఒక్కసారి కాదు రెండు సార్లు వరసగా గెలిచి డీఎంకే భారీ షాక్ ఇచ్చారు. దాని కంటే ముందు కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఆయన కూడా అప్పటి అన్నా డీఎంకే ప్రభుత్వాన్ని పేక మేడ మాదిరిగా కూల్చేసి మొత్తం అసెంబ్లీ సీట్లను ఊడ్చేశారు. బీహార్ లో చూస్తే ఆర్జేడీ లీడర్ గా ఉన్న లాలూ యాదవ్ ని జైలుకు పంపించిన తర్వాత ఆయన పార్టీ మరింతగా పుంజుకుని గ్రాస్ రూట్ లెవెల్ లోకి వెళ్ళి పాతుకుపోయింది. ఆయన సతీమణి అనేక ఏళ్ళ పాటు సీఎం గా పనిచేయడానికి లాలూ జైలు జీవితం ఇంధనంగా మారింది.
*జార్ఖండ్ లో సీన్ అదే :*
ఇక ఆ మధ్య జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి సీఎం హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆయన పార్టీ కూడా ఎన్నికల్లో గెలిచి మరోసారి హేమంత్ సీఎం అయిపోయారు. దాంతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ ఆశలు అన్నీ అడియాశలు గా మారాయి. ఇలా తరచి చూస్తే దేశంలో ఎన్నో అరెస్టుల వెనక ఎన్నో సెంటిమెంట్లు ఉన్నాయని చెప్పాల్సి ఉంది.
*జగన్ ని స్ట్రాంగ్ గా చేసింది :*
ఇక ఉమ్మడి ఏపీలో చూస్తే అప్పటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ని జైలు పాలు చేసింది. పదహారు నెలల పాటు జగన్ జైలు జీవితాన్ని అనుభవించారు ఆయన జైలులో ఉండడం ఆయన పార్టీకి బాగా కలసి వచ్చింది. వైసీపీ ఒక బలమైన ఫోర్స్ గా ఏపీలో స్థిరపడడానికి జగన్ అరెస్ట్ అన్నది ఎంతగానో ఉపకరించింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఇవన్నీ చూసిన వారు ఎవరూ జగన్ ని కేసీఆర్ ని ఏరి కోరి మరీ అరెస్ట్ చేయాలని అనుకోరని అంటారు.
*ప్రజా కోర్టులోనే :*ఇపుడు కొత్త రకం స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. అదేంటి అంటే జైలు దాకా పంపించి ప్రత్యర్థికి సానుభూతిని కోరి మరీ అందించకుండా ప్రజా కోర్టులోనే వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి చేశారని రాష్ట్ర ఖజానా దోచబెట్టారని ప్రజా ధనం లూటీ చేశారని ఇలా ఆయా సందర్భాలలో జనాల ముందు అదే పనిగా ఏకరువు పెట్టడంతో జనంలో బలమైన ముద్ర వేయ్డానికి చూస్తున్నారు. దాని వల్ల ఆ పార్టీ వస్తే అవినీతి చేస్తారు అని ఆ నాయకుడికి అధికారం ఇస్తే అరాచక పాలన తెస్తారని జనాలలో కనుక ఒక బలమైన అభిప్రాయం పడితే వారి ఇమేజ్ వారి పాలిటిక్స్ రెండూ మసకబారిపోతాయి. అందుకే అరెస్టులూ జైళ్ళూ అని హడావుడి చేయకుండా ఈ సరికొత్త స్ట్రాటజీనే పొలిటికల్ మాస్టర్లు ఎంచుకుంటున్నారు అని అంటున్నారు.
👉కేరళను వణికిస్తున్న ‘మెదడును తినే అమీబా’.. ఈ ఏడాది 18 మంది మృతి!*
కలవరపెడుతున్న అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్..ఈ ఏడాది 67 కేసుల నమోదు, 18 మంది మృతి.. తాజాగా తిరువనంతపురంలో 17 ఏళ్ల కుర్రాడికి వ్యాధి నిర్ధారణ..అనుమానంతో స్విమ్మింగ్ పూల్ మూసివేసిన అధికారులు..’అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’ అనే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేరళలో కలకలం రేపుతోంది..’మెదడును తినే అమీబా’గా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది..తాజాగా తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్‌కు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 18కి చేరింది.
తాజా కేసు విషయానికి వస్తే, బాధిత కుర్రాడు తన స్నేహితులతో కలిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశాడు. ఆ మరుసటి రోజే అతడికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసివేసి, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు..ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 14న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది కేరళలో మొత్తం 67 కేసులు నమోదు కాగా, వారిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే మలప్పురం జిల్లాకు చెందిన శోభన (56), సుల్తాన్ బతేరికి చెందిన రతీష్ (45) అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇదే వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించారు. వరుస మరణాల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక
ఈ అంశంపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. “నిల్వ ఉన్న నీటిలో, మురికి నీటిలో, పశువులు స్నానం చేసే జలాశయాల్లో ముఖం కడుక్కోవడం గానీ, స్నానం చేయడం గానీ చేయవద్దు. బావుల్లో శాస్త్రీయంగా క్లోరినేషన్ చేయాలి. వాటర్ థీమ్ పార్కులలోని స్విమ్మింగ్ పూల్స్‌లో సరైన మోతాదులో క్లోరిన్ కలపాలి” అని సూచించారు. ఈ అమీబా ముక్కు ద్వారానే మెదడులోకి ప్రవేశిస్తుందని, కాబట్టి స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని మంత్రి హెచ్చరించారు.
👉ఇసుక దందాను అరికట్టాలి. అంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా….మార్కాపురం డివిజన్ కేంద్రంలో కూటమి నేతలు ఇసుక దందా చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాత బస్టాండ్‌లో భవన నిర్మాణ కార్మికులతో ధర్నా నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఉచిత ఇసుక హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు లారీ యజమానులను బెదిరించి టన్ను 800 రూపాయలకు కొనుగోలు చేసి, 1400కి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఇసుక కొరత, అక్రమ దందా తక్షణం ఆపి ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు, కార్మికులు పాల్గొన్నారు.
👉ఆటో కార్మికులకు శాశ్విత సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటూ భారీ ర్యాలీ..*
ఆటో, క్యాబ్, టాటా ఏసీ, కార్మికులకు సంక్షేమ బోర్డు నిధిని ఏర్పాటు చేసి సంవత్సరానికి 30 వేల రూపాయలు ఇవ్వాలంటూ సిఐటియు నాయకులు రఫీ, రూబెన్, ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఎస్వికెపి కళాశాల నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆటో కార్మికులు భారీ ర్యాలీని చేపట్టారు.
👉మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల*
*ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా కొమరోలు మండల సర్వసభ్య సమావేశంలో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని “జాతీయ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్న సందర్భంగా నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు తెచ్చిన ఎన్నో నిర్మాణాలకు తమ ప్రతిభను అందించిన ఇంజనీరింగ్ నిపుణుల ఋణం తీర్చలేనిదని, అమరావతి నిర్మాణంలో కష్టపడుతున్న ఇంజనీర్లకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, రాజధాని నిర్మాణం రాష్ట్ర గౌరవం, అభివృద్ధికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీడీఓ చెన్నారావు, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు..*

