👉 అమరావతిలో జిల్లాల ఎస్పీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తో కలిసి పాల్గొనడం జరిగింది. శాంతిభద్రతలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్స్ వచ్చేలా పని చేయాలని ఆదేశించారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ అసాంఘీక శక్తులు భయపడేలా పనిచేయాలని, సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించడం జరిగింది.
👉బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు*
- *ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తిరుపతి నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ కాగా, ఆదివారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ASP నాగేశ్వరరావు, పలువురు అధికారులు పుష్పగుచ్ఛం అందించి ఎస్పీకి ఘన స్వాగతం పలికారు…*

👉బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ కు ఘనంగా ఆత్మీయవీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ.. ప్రజలు,పోలీసుయంత్రాంగంఅందించినసహకారంమరవలేను: జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లాలో 14 నెలలు పాటు ప్రజలకు ఉత్తమపోలీసింగ్ సేవలందించడంలో, సిబ్బంది సంక్షేమంకుకృషి చెయ్యడంలో తనదైన ముద్ర వేసుకొని సాధారణబదిలీలలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా
వెళుతున్న ఎస్పీ ఏ.ఆర్ దామోదర్, కి పోలీసు అధికారులు మరియు సిబ్బందిఘనంగా ఆత్మీయ వీడ్కోల పెరేడ్ నిర్వహించి ఎస్పీగారను పూలమాలలు/గజామాలమరియుశాలువాలతో ఘనంగా సత్కరించారు. ముందుగాపెరేడ్ కమాండర్ నుండి గౌరవవందనం స్వీకరించి,పెరేడ్ పరిశీలన అనంతరం ప్లటూన్ ల వారీగా
సిబ్బంది నుండి గౌరవవందనం స్వీకరించి వారి నుండిఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు. అనంతరం పోలీసుకవాతు వాహనం లో పెరేడ్ గ్రౌండ్ నుండి ఛాంబర్ వరకు ఎస్పీ గారిని ఓపెన్ టాప్ జీపు పై ఊరేగించి పూలవర్షంకురిపించారు.పోలీసులువాహనాన్నిజిల్లా అధికారులు అందరూ తాళ్లతో లాగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 
- ప్రకాశం జిల్లాలో కలెక్టరుగా పనిచేసి గుంటూరు జిల్లా కలెక్టరుగా బదిలీపై వెళుతున్న ఏ.తమీమ్ అన్సారియాకు జిల్లా అధికార యంత్రాంగం ఘన వీడ్కోలు పలికింది. ఆదివారం ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను, తమకు దిశానిర్దేశం చేసిన సంగతులను ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వెల్లడించారు. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశానని అన్నారు. గత ఏడాది జూన్ 27న ప్రకాశం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తాను, విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా జిల్లాలోని పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలతోపాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేయటం ద్వారా బాల్యవివాహాలు, వెట్టి చాకిరీని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీటి సంరక్షణ చర్యలలో భాగంగా డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి చేపట్టిన అధికారిక, అనధికారిక పర్యటనలు విజయవంతం కావడంలోనూ, విజయవాడ వరదల సమయంలో జిల్లా నుంచి అవసరమైన ఆహార పదార్థాలను పంపించడంలోనూ ప్రభుత్వ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల పాత్రను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. అనంతరం వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్సారియాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్.ఆర్. గోపాలకృష్ణ, డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రసంగించారు.
- 👉 జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీ పడుతున్న దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్*
ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, అధిష్టానం ఆదేశిస్తే జూబ్లీహిల్స్ నుండి పోటీ చేస్తానని తెలిపిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
మరోవైపు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నానని, జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి గెలిచాక తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన అంజన్ కుమార్ యాదవ్..
తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై పోలీసుల దాడులు. .*ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, L&O పోలీసుల సంయుక్త దాడులు..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నలుగురు డ్రగ్ పెడ్లర్ల అరెస్టు..91 కిలోల గంజాయి స్వాధీనం..రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్..5 కిలోల గంజాయి స్వాధీనం..వరంగల్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 32 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.
👉కన్న కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి..తాగుడుకు బానిసై తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వల్లే హత్య చేసినట్లు చెప్పిన తండ్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో దారుణ ఘటన
కన్న కొడుకు శ్రీధర్ (30)ను చంపిన తండ్రి నాగయ్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
👉చంద్రబాబూ… రైతులతో చర్చకు సిద్దమా*?
– *ఇండోసోల్ కంపెనీని దోపిడీ దొంగ అన్న టిడిపి నేతలే ఇప్పుడు వేల ఎకరాలు కట్టబెట్టడం సిగ్గుచేటు*
*కరేడు గ్రామ సభలో బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ భావోద్వేగ ప్రసంగం*
*కరేడులో రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తే గ్రామ నడిబొడ్డున రైతులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ప్రకటించారు. ఆదివారం కరేడులో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. అన్యాయానికి గురవుతున్న రైతుల పక్షాన పోరాటం చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే… కోర్టులు నుంచి అనుమతి తీసుకొని రావాల్సి వచ్చిందన్నారు. బాధితులకు అండగా నిలిచే హక్కును ప్రజాస్వామ్యం కల్పించినా అందుకు అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులను ప్రజల భద్రతకు, స్వేచ్చా వాయువులు పీల్చేందుకు ఉపయోగించాల్సింది పోయి దోపిడీ దారులు, అరాచక శక్తులకు అండగా నిలిచేందుకు ఈ ప్రభుత్వం వినియోగించడం దారుణమన్నారు. పోలీసులు ప్రజలకు శాంతియుత జీవనం అందించేందుకే ఉద్యోగంలో చేరారని, అలా కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు వినియోగిస్తే వారు కూడా తిరగబడాలని పిలుపునిచ్చారు*.
*సెంటు భూమిని కూడా తీసుకోలేరు*
*కరేడు రైతుల నుంచి బలవంతంగా సెంటు భూమిని కూడా తీసుకోలేరని రామచంద్రయాదవ్ హెచ్చరించారు. కరేడు గ్రామం చుట్టూ ఎంతో మంది దేవుళ్లు ఉన్నారన్నారు. శ్రీ జ్ణాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి వారితో పాటు 15 మంది వరకు గ్రామ దేవతలు, దేవుళ్లు వేంచేసి ఉన్నారన్నారు. అలాంటిది ఎవరో ఓ అనామకుడు వచ్చి గ్రామాన్ని ఖాళీ చేయిస్తారంటే ఎలా నమ్ముతారని గ్రామస్తులను ప్రశ్నించారు. గ్రామానికి దేవుళ్ల అండ మెండుగా ఉందని.. ఎవరూ ఏమీ చేయలేరని ధైర్యాన్నిచ్చారు*.
*భూసేకరణ చేసిన లక్షల ఎకరాల్లో ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?*
*రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా సెజ్ లను, పరిశ్రమల స్ధాపన కోసం భూములను బలవంతంగా లాక్కోవడం పరిపాటిగా మారిందని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న లక్షలాది ఎకరాల భూముల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయో లెక్క చెప్పాలన్నారు. అలాగే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భూములను పరిశ్రమల పేరుతో తీసుకొని దోపిడీకి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. కావలి సెజ్ కోసం తీసుకున్న భూముల్లో ఎన్ని ఎకరాల భూముల్లో పరిశ్రమలు పెట్టారో సమాధానం చెప్పగలరా? అని ప్రభుత్వాలను ప్రశ్నించారు*.
*కరేడు రైతులకు రాష్ట్రంలోని ప్రతి రైతు మద్దతివ్వాలి*
*బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఒక్కటై ఉద్యమించిన కరేడు రైతుల ఐకమత్యం ఎంతో మందికి స్పూర్తి దాయకమని రామచంద్రయాదవ్ కొనియాడారు. పోలీసులను పంపించి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాటం చేయడం నిజంగా అభినందనీయమన్నారు. కరేడు రైతులకు రాష్ట్రంలోని ప్రతి రైతూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నేడు కరేడు కదా అని సైలెంట్ గా ఉంటే రేపు మీదాక రారని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. ఇది కరేడు సమస్య కాదని, రైతుల సమస్య అని రామచంద్రయాదవ్ తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రైతులంతా ఏకమై కరేడు రైతులకు మద్దు ఇవ్వాలని పిలుపునిచ్చారు*…… *నాడు గజదొంగ అన్నారు… నేడు భూములు కట్టబెట్టారు*
*ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసోల్ కంపెనీని చంద్రబాబు సహా కొందరు టిడిపి నేతలు గజదొంగలుగా అభివర్ణించారని, కానీ అధికారంలోకి రాగానే వారిపై ప్రేమ పుట్టుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసిపి హయాంలో ఇండోసోల్ కంపెనీ యజమాని అయిన విశ్వేశ్వరరెడ్డికి వందల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని టిడిపి నేతలు ప్రచారం చేశారన్నారు. అలాంటిది అధికారంలోకి రాకముందే చంద్రబాబు కరేడు నుంచి అవినీతికి బీజం వేశారన్నారు. 2024 జనవరిలో 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రోరల్ బాండ్లు రూపంలో ఇండోసోల్ కంపెనీ నుంచి తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల కేంద్రమంత్రిని కలిసిన సందర్భంలో భూసేకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారని గుర్తు చేశారు*.
*స్టీల్ ప్లాంట్ రైతుల దుస్థితే నిదర్శనం*
*విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంతో మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారన్నారు. దాదాపు 15వేల మంది రైతులు తమ భూములను ఇచ్చారని రామచంద్రయాదవ్ తెలిపారు. అప్పట్లో ఎకరా పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు పరిహారం ఇచ్చి తీసుకున్నారన్నారు. కానీ నేడు ఆ భూముల విలువ కోట్లలో పలుకుతోందన్నారు. కానీ ఇప్పుడు ఆ భూములతో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కూడా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కరేడు రైతుల పరిస్థితి కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉందన్నారు. ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నా… మూడు పంటలు పండే కరేడు భూములను లాక్కునేందుకు జరుగుతున్న ప్రయత్నం ఓ మహాకుట్రగా ఆయన అభివర్ణించారు*.
*ఆ ఒక్క పనిచేస్తే చంద్రబాబుకు విగ్రహం పెట్టిస్తాం*
*కరేడు రైతుల ఆవేదనను పెద్ద మనసుతో అర్ధం చేసుకొని భూ సేకరణ ఆపితే చంద్రబాబుకు కరేడు సెంటర్ లోనే విగ్రహం పెట్టి పూజిస్తామని బోడె రామచంద్రయాదవ్ ప్రకటించారు. చంద్రబాబు సహ్రుదయంతో రైతులతో చర్చలు జరపాలన్నారు. రైతుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని కోరారు. ఒకవేళ అలా కాకుండా భూసేకరణకే మొగ్గు చూపితే కరేడు సెంటర్ లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని రామచంద్రయాదవ్ ప్రకటించారు. విగ్రహం కావాలో… రైతుల ఆగ్రహం కావాలో చంద్రబాబే తేల్చుకోవాలన్నారు*.
*ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి*
*కోర్టు అనుమతితో తాను కరేడులో గ్రామ సభ నిర్వహిస్తే… ఆ సభకు వస్తున్న మహిళలు, రైతుల పట్ల కొందరు పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల వెంట పరుగులు పెట్టించి దమనకాండకు పాల్పడ్డారన్నారు. వారి పట్ల జులుం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే రైతులు, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారో ఆ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. *
👉*రోడ్లపై చెత్త వేస్తే 8 రోజులు జైలు శిక్ష!*
హైదరాబాద్‌లో రోడ్డుపై చెత్త వేయడం సర్వసాధార ణమే కదా! అని తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై అలా చేస్తే జరిమానాతో సరిపోదు, ఏకంగా 8 రోజుల పాటు.. జైలు శిక్ష అనుభవించవలసిందే నగరంలో రోడ్లపై చెత్త వేసే వారిపై హైదరాబాద్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు.ఈ నిర్లక్ష్యం కేవలం అపరిశుభ్రతకే కాకుండా, కొన్నిచోట్ల సామాజిక ఉద్రిక్తతలకు కూడా దారితీస్తుండటంతో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నగరవాసులు రోడ్ల పక్కన పడేస్తున్న చెత్త, ముఖ్యంగా మాంసాహార వ్యర్థాలను వీధికుక్కలు, పిల్లులు వంటి జంతువులు లాక్కెళ్లి సమీపంలోని దేవాలయా లు, మసీదులు, చర్చిలు, ఇళ్ల ముందు పడేస్తున్నాయి. ఈ కారణంగా సున్నితమైన ప్రాంతాల్లో వివాదాలు తలెత్తి, స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో, ఈ సమ స్యకు మూలకారణమైన రోడ్లపై చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవా లని పోలీసులు నిర్ణయించారు.
👉*నగరంలో జింక మాంసం కలకలం..*ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..*హైదరాబాద్: నగరంలో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్‌మెంట్ వద్ద అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. సోదాల్లో 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు బొలెరో వాహనం(AP09BT4716) సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
జింక మాంసం రవాణా చేస్తున్న మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసం, బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులకి అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితులపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితులకు జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వన్యప్రాణి రక్షణకు సహకరించాలని సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు..
👉హనీ ట్రాప్‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..*
హైదరాబాద్, సెప్టెంబర్ 14: యోగా గురువును ఒక గ్యాంగ్ పథకం ప్రకారం హనీ ట్రాప్ చేసింది. అనంతరం యోగా గురువును సదరు గ్యాంగ్ భారీగా నగదు డిమాండ్ చేసింది. దీంతో అతడు కొంత సొమ్మును ఆ గ్యాంగ్‌కు ముట్ట చెప్పాడు. అయినా సంతృప్తి చెందని ఆ గ్యాంగ్.. యోగా గురువును రూ.2కోట్లు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ యోగా గురువు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అందులో భాగంగా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఆ బాధితుడు యోగా గురువుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఇద్దరు మహిళలు యోగా గురువును ఆశ్రయించారు. అలా ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. అనంతరం యోగా గురువుతో సదరు మహిళలు అత్యంత సన్నిహితంగా మెలిగారు.ఆ తర్వాత అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సదరు యోగా గురువును లక్ష్యంగా చేసుకుని ఒక గ్యాంగ్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఆ క్రమంలో ఆ గ్యాంగ్‌కు తొలుత రూ.50 లక్షల చెక్కును అందజేశారు యోగా గురువు. అయితే తమకు మరో రూ.2కోట్లు ఇవ్వాలంటూ బాధితుడిని ఆ గ్యాంగ్ డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో యోగా గురువుకు వారి బెదిరింపులు అధికమయ్యాయి. చేసేదేమీ లేక.. గోల్కొండ పోలీసులను ఆయన ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆయన ఫోన్ కు వచ్చిన కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆ క్రమంలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు..
👉రాష్ట్రంలో అలజడి సృష్టించాలని YCP కుట్ర చేస్తోంది
కులాల మధ్య వైసీపీ చిచ్చుపెడుతోంది-మంత్రి నాదెండ్ల
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం
రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్రం కోసం పవన్ నాలుగు మెట్లు కిందకి దిగారు
ప్రభుత్వంపై దుష్ప్రచారం సరికాదు-నాదెండ్ల మనోహర్
👉నో వర్క్ నో పే…. ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తింప చేయకూడదు ?
స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి చట్ట సభలలో జరుగుతున్న తీరు తెన్నులు మీద గట్టిగా మాట్లాడారు. తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సభకు రావడం విధానం అన్నారు. సభకు రావాలనే ప్రజలు ఓటు వేసి పంపించారు. ప్రజా తీర్పు అది అని అన్నారు ప్రజా తీర్పుని గౌరవించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సభకు రాకుండా ఉంటే ఎలా కుదురుతుందని కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.
*సభ జరిగేదే తక్కువ :
ఇదిలా ఉంటే అసెంబ్లీ జరిగేదే ఏడాదికి కేవలం 45 రోజులు మాత్రమే అని ఆయన అన్నారు. ఆ సమయంలో కూడా సభకు అటెండ్ కాకపోతే ఇంక ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యల గురించి అత్యున్నత సభలో ప్రస్తావించాలని తమను ఎన్నుకుంటారు అన్న విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు విస్మరించడం బాధాకరం అని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన బాధ్యత ఉందని ఆయన న్నారు.
జీతాలు మాత్రం తీసుకుంటున్నారు :
సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు మాత్రం తీసుకుంటున్నారు అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు అని ఆయన నిలదీశారు. అసెంబ్లీకు డుమ్మా కొట్టి మరీ నెల నెలా జీతాలు తీసుకోవడం సబబేనా అని ఆయన అంటున్నారు. ఈ విషయం అంతా ఆలోచించాలని ఆయన కోరారు.
*నో వర్క్ నో పే ఉండాలి :
ఒక చిన్న పాటి ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే తనకు జీతాలు ఇవ్వడం లేదని నో వర్క్ నో పేని అమలు చేస్తున్నారు అని అయ్యన్న గుర్తు చేశారు. అదే అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని ఆయన లాజిక్ పాయింట్ ని లేవదీశారు. ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాలలో కోత పెడుతున్నారని మరి ఎమ్మెల్యేల విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
లోక్ సభ స్పీకర్ డైరెక్షన్లో :
ఈ విషయంలో దేశంలో అత్యున్నత చట్ట సభగా ఉన్న పార్లమెంట్ తగిన డైరెక్షన్ ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. ఏ కారణం లేకుండా గైర్ హాజరు అయ్యే ఎమ్మెల్యే విషయంలో ఏమి చేయాలి అన్న దాని మీద గైడ్ లైన్స్ ని లోక్ సభ స్పీకర్ ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ మీదట దానికి తగినట్లుగా తాము నడచుకుంటామని అయ్యన్న అన్నారు
వైసీపీ మీదనేనా :
ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వరసబెట్టి డుమ్మా కొడుతున్నారు. సభ జరిగే ముందు ఎన్ని సార్లు పిలిచినా రావడం లేదు. దాంతో అయ్యన్న ఈ విధంగా వ్యాఖ్యానించారు అని అంటున్నారు. సభకు రాని ప్రజా ప్రతినిధుల మీద ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చో లోక్ సభ ఒక రూలింగ్ కానీ డైరెక్షన్ కానీ ఇస్తే దానిని దేశవ్యాప్తంగా ఒక సంప్రదాయంగా అమలు చేయవచ్చు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే కనుక వైసీపీ ఎమ్మెల్యేల గైర్ హాజరుని జనంలోనే పెట్టాలని వీలైనన్ని చోట్ల ఆ అంశాన్ని హైలెట్ చేస్తూ జనంలో చర్చకు పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది అని అంటున్నారు. చూడాలి దీని మీద వైసీపీ ఏ విధమైన రియాక్షన్ ఇస్తుందో. తాము సభకు హాజరు కావడం లేదు కాబట్టి జీతాలు తీసుకోమని వైసీపీ ఎమ్మెల్యేలు చెబితే కూడా బాగానే ఉంటుంది అంటున్నారు. మరి అలా వైసీపీ ఎమ్మెల్యేలు చేయగలరా అన్నదే ప్రశ్న.
👉సొంతింటి కల.. సుప్రీం తీసుకున్న మరో సంచలన నిర్ణయం సొంతింటి కల… ప్రతి మధ్యతరగతి కుటుంబం గుండెల్లో నిండిపోయే మధుర స్వప్నం. సొంతింటి కల… ప్రతి మధ్యతరగతి కుటుంబం గుండెల్లో నిండిపోయే మధుర స్వప్నం. కానీ ఈ స్వప్నమే ఇప్పుడు అనేక కుటుంబాలకు దహనకుండమవుతోంది. వాగ్దానాలు చేసి మోసం చేసిన డెవలపర్లు, మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు, నిరాశ్రయులైన కొనుగోలుదారులు.ఇదే దేశ రియల్ ఎస్టేట్ రంగం భయానక వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు జోక్యం నిస్సందేహంగా కాలానుగుణం, ప్రజానుకూలం. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఒకే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇక మౌనప్రేక్షకుడిగా ఉండకూడదు. మధ్యతరగతి ప్రజలు కష్టపడి చెల్లించే పన్నులే ఈ దేశానికి వెన్నెముక. వారి రక్తం చెమటతో కూడిన డబ్బును కొందరు డెవలపర్లు దోచుకుపోయి, కలల ఇళ్లను అసంపూర్తిగా వదిలేయడం కేవలం వ్యక్తిగత మోసం కాదు—దేశ ఆర్థిక క్రమశిక్షణపై నేరుగా దెబ్బ. సుప్రీం సూచనలోని రెండు అంశాలు అత్యంత కీలకం: ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. నిలిచిపోయిన ప్రాజెక్టులను ఆర్థికంగా తిరిగి లేపడానికి ఒక “సేఫ్టీ నెట్” అవసరమని కోర్టు గుర్తు చేసింది. ప్రాజెక్టుల స్వాధీనం చేసుకోవాలి. డెవలపర్లు చేతులెత్తేస్తే, ప్రభుత్వం లేదా నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (NARCL) వంటి సంస్థలు జోక్యం చేసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలి. రెరా (RERA) గురించి కోర్టు చేసిన వ్యాఖ్యలు పచ్చి నిజం. చట్టం ఉన్నా, దాన్ని కరెక్ట్‌గా అమలు చేసే దంతాలు లేకుంటే, అది “కోరలు తీసిన పులి”గానే మిగిలిపోతుంది. ట్రైబ్యునళ్లు, సమర్థవంతమైన యంత్రాంగం లేకుంటే, గృహ కొనుగోలుదారుల పోరాటం అంతులేని న్యాయప్రస్థానంగా మారిపోతుంది. మధ్యతరగతి సొంతింటి కల కాపాడటం అంటే కేవలం వ్యక్తిగత ప్రయోజనం కాపాడటమే కాదు; అది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, పట్టణ అభివృద్ధి దిశను కాపాడటమే. ఈ దశలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల గృహ విధానాన్ని నిర్వచిస్తాయి. సుప్రీం ధర్మాసనం బంతిని ప్రభుత్వ కోర్టులో వేసింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ప్రభుత్వం వినియోగదారుల పక్షాన నిలబడుతుందా, లేక మళ్లీ మౌనప్రేక్షకుడిగానే మిగిలిపోతుందా? అన్నది వేచిచూడాలి.



