👉రష్యాలో వరుసగా భూకంపాలు.. ప్రపంచానికి హెచ్చరికలు! …👉 గణేష్ నిమజ్జనంలో మృత్యుశకటమైన లారీ..9 మంది మృతి..👉14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం…👉పొదిలి ఆర్టిసి డిపొ వద్ద ఉద్యోగుల నిరసన…👉ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు కరెంట్ షాక్ ..👉శంకర్పల్లి రూ.40 లక్షల దారి దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారి వ్యాపారి కారు డ్రైవరే!…👉120 మంది పిల్లలు.. ఒక్క టీచర్ కూడా లేరు: (అల్లూరి జిల్లా).. *ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పి రాజాబాబు …*గుంటూరు జిల్లా కలెక్టర్ గా తమీం అన్సారియా..👉హెల్మెట్ ధరించటం ప్రతీ ఒక్కరి బాధ్యత* *అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణి*👉పొదిలి ఆర్టిసి డిపొ వద్ద ఉద్యోగుల నిరసన…👉వాగులో పడి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి!..

👉 గణేష్ నిమజ్జనంలో మృత్యుశకటమైన లారీ.. భక్తులపైకి.. మరణమృదంగం ఈ భయానక ప్రమాదంలో తొలుత 8 మంది మృతిచెందినట్లు సమాచారం అందగా.. అనంతరం సంఖ్య 9కి పెరిగింది. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఘోర ప్రమాదం సంభవించింది. మోసలే హోసహళ్ళి ప్రాంతంలో గ్రామస్తులు ఆనందోత్సాహాలతో వినాయక విసర్జన శోభాయాత్రలో పాల్గొంటున్న సమయంలో ఒక లారీ అదుపుతప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లింది. ఈ భయానక ప్రమాదంలో తొలుత 8 మంది మృతిచెందినట్లు సమాచారం అందగా.. అనంతరం సంఖ్య 9కి పెరిగింది. మృతుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆరుగురు గ్రామస్తులు ఉన్నారని అధికారులు ధృవీకరించారు. *ప్రమాదం ఇలా జరిగింది శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జాతీయ రహదారి (NH-373)పై ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ఒక బైక్‌ను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఎక్కి తప్పు దిశలో దూసుకెళ్లింది. భారీ వేగంతో దూసుకొచ్చిన లారీ క్షణాల్లోనే ఊరేగింపులోకి దూసుకెళ్లి దారుణానికి కారణమైంది. ప్రమాద తీవ్రత అంతలా ఉండటంతో భక్తులు గాల్లో ఎగిరిపడిపోగా, అక్కడి వాతావరణం ఒక్కసారిగా కల్లోలమైంది. *గాయపడిన వారి పరిస్థితి.. ఈ ఘటనలో దాదాపు 25–30 మంది వరకు గాయపడ్డారు. వారిని సమీపంలోని కిమ్స్ ఆసుపత్రి సహా వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. *అధికారుల స్పందన హసన్ జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత్ ఎంఎస్ మాట్లాడుతూ… “ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ గాయపడినప్పటికీ అతడిని అదుపులోకి తీసుకున్నాం. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని తెలిపారు. హసన్ డిప్యూటీ కమిషనర్ కెఎస్ లతా కుమారి మాట్లాడుతూ… “22 మంది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఏడుగురు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. మృతులలో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారని సమాచారం” అని చెప్పారు.

👉రష్యాలో వరుసగా భూకంపాలు.. ప్రపంచానికి హెచ్చరికలు రష్యాలోని తూర్పు తీరప్రాంతం మరోసారి ప్రకృతి ఆగ్రహం ఎదుర్కొంది. కామ్చాట్కా ద్వీపకల్పంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూమి వణికింది. రష్యాలోని తూర్పు తీరప్రాంతం మరోసారి ప్రకృతి ఆగ్రహం ఎదుర్కొంది. కామ్చాట్కా ద్వీపకల్పంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూమి వణికింది. భవనాలు కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. సామాజిక మాధ్యమాల్లో భవనాల ఊగిసలాట దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కానీ ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. * వరుస ప్రకంపనలు.. ఆందోళనకర సంకేతం.. గత జులైలోనే ఇదే ప్రాంతం 8.8 తీవ్రతతో వణికింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలో మళ్లీ ఇంతటి పెద్ద భూకంపం సంభవించడం, ఈ ప్రాంత భూగర్భ చలనం ఎంత భీకరంగా ఉందో తెలియజేస్తోంది. కామ్చాట్కా ద్వీపకల్పం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు సహజమే. అయినప్పటికీ, తరచూ పెరుగుతున్న ప్రకంపనలు భవిష్యత్తులో మరింత పెద్ద విపత్తులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సహజ విపత్తు.. శాస్త్రీయ సన్నద్ధతే మార్గం భూకంపం వచ్చిన వెంటనే ప్రాణాలు రక్షించుకున్నారా అనే ప్రశ్నకే మనం పరిమితం అవుతున్నాం. కానీ అసలు దృష్టి ఉండాల్సింది. తర్వాతి విపత్తులో ఎలా రక్షించుకోవాలి? అనే అంశంపైనే.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బలంగా ఉండాలి. భవనాల నిర్మాణంలో భూకంప నిరోధక ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి. ప్రజల్లో విపత్తు అవగాహన, శిక్షణ అవసరం. విపత్తు నిర్వహణ వ్యవస్థలు అత్యాధునికంగా ఉండాలి.
👉ప్రకాశం జిల్లా కలెక్టర్ గా నియమితులైన పి. రాజాబాబు శనివారం కలెక్టరెట్ లో బాధ్యతలు స్వీకరించారు…
గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్‌ అన్సారియా…
👉ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు కరెంట్ షాక్ ..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్దారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు చెట్ల కొమ్మలు కొట్టమని చెప్పిన వార్డెన్..చెట్టు కొమ్మలు కొడుతుండగా కరెంట్ షాక్‌కు గురైన ఇద్దరు విద్యార్థులు..తీవ్ర గాయాలపాలైన తొమ్మిదవ తరగతి విద్యార్ధిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
👉14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం.*

*7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు.*

*మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ.*

*12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగింపు.*

బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్‌ మీనా.

బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్‌.

నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల.

తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు.

అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్‌ కునుగిలి.

కడప జిల్లా ఎస్పీగా నచికేత్‌.

నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్‌ షెరాన్‌.

విజయనగరం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్‌.దామోదర్‌.

కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌ నాయుడు.

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌.

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు.

ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు.
చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్‌ డూడి.
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్‌కుమార్‌.

👉120 మంది పిల్లలు.. ఒక్క టీచర్ కూడా లేరు

👉అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మం. నేలజర్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక్క టీచర్ కూడా లేరని గ్రామస్థులు వాపోయారు.126 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో గత 3 నెలలుగా టీచర్ లేరని, వాలంటీర్తో నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చిన్నారులంతా చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు.పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు.జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు
👉విషాదం.. వాగులో పడి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి!.. ఆసిఫాబాద్లో(D) వాంకిడి (M) డాబా గ్రామంలో తల్లి, ముగ్గురు చిన్నారులు వాగులో పడి మరణించారు. పిల్లలతో కలిసి తల్లి భుజిబాయి (35) యూరియా బస్తాలు కడిగేందుకు వాగుకు వెళ్లింది.ప్రమాదవశాత్తు చిన్న కూతురు నీటిలో కొట్టుకుపోగా బిడ్డను కాపాడేక్రమంలో తల్లితో పాటు మరో ఇద్దరు చిన్నారులు కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
👉శంకర్పల్లి రూ.40 లక్షల దారి దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారి వ్యాపారి కారు డ్రైవరే: హైదరాబాద్ పోలీసులు*.. హైదరాబాద్ శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.40 లక్షలు దారి దోపిడీ ఘటనలో గంటల వ్యవధిలోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ డ్రైవర్ మధు అని తెలిపారు. స్టీల్ వ్యాపారి వికారాబాద్లో ఓ వ్యక్తి నుంచి రూ.40 లక్షలు తీసుకురావాలని డ్రైవర్ మధు, సహాయకుడు సాయిబాబాకు చెప్పాడు. డబ్బు తీసుకున్నాక మధు తన స్నేహితులతో దోపిడీ చేయించాడు.

👉గ్రామాల సుందరికరణ, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం*.. ప్రకాశం జిల్లా గిద్దలూరు..

*గౌతవరం గ్రామంలో రూ. 23.75 లక్షల మ్యాజిక్ డ్రైన్స్ ను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల* *ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన మ్యాజిక్ డ్రైన్స్ ప్రకాశం జిల్లాలో మొదటగా ఆరు గ్రామ పంచాయతీలకు మంజూరు కాగా గిద్దలూరు నియోజకవర్గంలో రాచర్ల మండలం, గౌతవరం గ్రామంలో గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం ఉదయం గ్రామ ప్రజల కోలాహలం మధ్య ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామ ప్రజలు, నాయకులు, అధికార యంత్రాంగం పూలమాల శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గోని కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను, కంకర వేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్లు గ్రామాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టస్తున్నారన్నారు.. అందులో భాగంగానే నేడు గౌతవరం గ్రామంలో 2.8 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, అది ఓర్వలేని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.. రాష్ట్రంలో పొగాకు రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వమేనని, రైతుల వద్ద పొగాకు కొనుగోలు చేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎవరు ఆందోళన చెండదాల్సిన పని లేదన్నారు. గత వైసీపీ పాలనలో రైతుల వెన్ను విరిచిన జగన్ రెడ్డి ఈరోజు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చటం సిగ్గు చేటు అన్నారు. వైసీపీ పాలకుల అబద్దపు మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని, కూటమి ప్రభుత్వం చేసే మంచిని ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు.కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కటికే యోగానంద్, జిల్లా ఏపీడి ఎస్ భాస్కర్ రావు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి, గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, మాజీ సర్పంచ్ రామకోటయ్య, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు పాపిశెట్టి శ్రీనివాసులు, మరియు మండల, జనసేన, టీడీపీ నాయకులు, అధికార యంత్రాంగం పాల్గోన్నారు..

👉హెల్మెట్ ధరించటం ప్రతీ ఒక్కరి బాధ్యత* *అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణి* *ముఖ్య అతిధిగా పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల** *హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  పేర్కొన్నారు. గిద్దలూరు పట్టణంలోని  విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో “అమ్మ ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. బోనేని వెంకటేశ్వర్లు  గిద్దలూరు సర్కిల్ పరిధిలోని రాచర్ల, గిద్దలూరు, కొమరోలు పోలీసులకు హెల్మెట్లు, వాటర్ బాటిల్లు, క్యాప్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు,  శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రమాదం జరిగితే కుటుంబం అనాధ అవుతుందని, కావున యువత బైక్ లపై అతివేగంగా వెళ్ళటం చాలా ప్రమాదమని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.. అనంతరం గిద్దలూరు రూరల్, అర్బన్, సీఐ లు సురేష్, రామ కోటయ్య మరియు కంభం సీఐ మల్లిఖార్జున గార్లు మాట్లాడుతూ ఇటీవల ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయం కావడంతో మంచానికే పరిమితమయ్యాడని ఈ విషయం తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు స్పందించి రాచర్ల, కొమరోలు, గిద్దలూరు ప్రాంతాలలో మండలాలలోని పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి హెల్మెట్లు, వాటర్ బాటిల్లు, టోపీలు పంపిణీ చేశారన్నారని పోలీసు సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని సిఐలు ఎస్సైలు సూచించారు. ప్రజలకు కూడా హెల్మెట్ ధరించి తలకు రక్షణ కల్పించుకోవాలన్నారు. అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో అమ్మ సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్బంగా హెల్మెట్లు పంపిణి చేసిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయమని పోలీస్ శాఖ మరియు ఎమ్మెల్యే వారిని అభినందించారు. కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషా వలి, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, బిజ్జం రవీంద్రా రెడ్డి, రాష్ట్ర ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గోనా చెన్నకేశవులు, రాచర్ల మండల టీడీపీ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, టీడీపీ కౌన్సిలర్లు నాయకులు పాల్గోన్నారు..

👉పొదిలి ఆర్టిసి డిపొ వద్ద ఉద్యోగుల నిరసన…*ఇహెచ్ ఎస్ ను పూర్తిస్దాయిలో అమలు చేయాలని డిమాండ్…*నల్లరిబ్బన్లు పెట్టుకొని విధులకు హజరు…*ప్రకాశంజిల్లా పొదిలి ఆర్టిసి డిపొ వద్ద ఎన్ ఎమ్ యు ఆధ్వర్యంలో ఉద్యొగులు నిరసన వ్యక్తం చేశారు.పొదిలి డిపొలో పనిచేస్తున్న మహిళ కండక్టర్ జి.వి లక్ష్మి భర్త అనారొగ్య కారణాలతో వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా అక్కడ ఇహెచ్ ఎస్ అమలు కాకపొవడంతో ఆర్ధిక పరిస్థితి సహకరించక ఒంగొలు రిమ్స్ లో వైద్యసేవలు పొందుతు మరణించాడని ఎన్ ఎమ్ యు నాయకులు తెలిపారు.ఇటువంటి పరిస్దితి మరొ ఉద్యొగికి కలగకుడదని ప్రభుత్వం దాని పై దృష్టి పెట్టాలని తెలిపారు. ఆర్టిసి ఉద్యొగులకు కొంతమందికి ఇహెచ్ఎస్ అమలుఆవుతు మరికొంత మందికి అమలుకావడం లేదని గతంలో ఉన్న పాత పద్దతే మాకు అనుకులంగా ఉందని దానినే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇహెచ్ఎస్ అమలు అయిఉంటే కండక్టర్ భర్త మరణించేవాడు కాదని ఇహెచ్ ఎస్ ఆర్టిసి ఉద్యొగులకు పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తు నల్లరిబ్బన్లు పెట్టుకొని నిరసన తెలిపారు.__ఈ కార్యక్రమంలో ఎన్ ఎం యు నాయకులు జి.వి నారాయణ, అద్యక్షులు,ఎస్.కె ఆలి సెక్రటరి, క్రిష్ణా గ్యారెజి కండక్టర్లు,డ్రైవర్లు పాల్గొన్నారు._

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా