👉 ఆదిమూలపు …ఎక్కడ సార్ ?… 👉 కృష్ణ నగర్ వాసుల నీటి సమస్యపై స్పందించిన శాసనసభ్యులు ముత్తుముల.. 👉 ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల కోసం విద్యార్థుల ఆందోళన* ప్రకాశం జిల్లా…👉గిద్దలూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కంభం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్*..👉తహసిల్దారుకు మెమొరండం సమర్పించిన ఏపీటీఎఫ్ నాయకులు*.. 👉పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి: కంభం ఎంఈవో*..

👉 ఆదిమూలపు …ఎక్కడ సార్ ? వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు మంత్రిగా కొనసాగిన ఘనత కొద్ది మందికి మాత్రమే దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు మంత్రిగా కొనసాగిన ఘనత కొద్ది మందికి మాత్రమే దక్కింది. అందులో ఆదిమూలపు సురేష్ ఒకరు. జగన్ ఆయన కోసం తన దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ ని సైతం పక్కన పెట్టారు. తొలి మూడేళ్ళకే బాలినేనికి మంత్రి పదవి పోతే సురేష్ మాత్రం అయిదేళ్ళూ మినిస్టర్ గా హవా చాటారు. అంతే కాదు విద్యా శాఖ మున్సిపల్ వ్యవహారాల శాక వంటి కీలక మంత్రిత్వ శాఖలను చూశారు. జగన్ ఆయనకు ఎంతో చేసినా పార్టీ కష్ట కాలంలో మాత్రం ఆయన ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. * కాంగ్రెస్ టూ వైసీపీ : ఇక ఆదిమూలపు సురేష్ మాజీ ఉన్నతాధిగా ఉంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 నాటికి వైసీపీలో చేరి సంతనూతలపాడు నుంచి పోటీ చేసి రెండవ మారు గెలిచారు. 2019లో తిరిగి ఎర్రగొండపాలెం ముంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. 2024లో మాత్రం ఆయనను కొండెపి నియోజకవర్గానికి జగన్ మార్చారు. దాంతో ఆయన ఓటమి చెందారు. అదే సమయంలో ఎర్రగొండపాలెం లో తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. దాంతో ఆదిమూలపు సురేష్ తాను రెండు సార్లు గెలిచిన ఎర్రగొండపాలెం వైపు ఫోకస్ పెట్టారు అని అంటున్నారు.

*పార్టీ యాక్టివిటీస్ సైతం : అయితే తన నియోజకవర్గంలో సురేష్ అనుచరుల జోక్యం ఎక్కువ కావడంతో దీని మీద చంద్రశేఖర్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారని భోగట్టా. కొండెపిలోనే పనిచేసుకోమని హై కమాండ్ సురేష్ కి సూచించింది అని అంటున్నారు. దాంతో తనకు కలసి వచ్చిన ఎర్రగొండపాలెం మీద మక్కువ చంపుకోలేక కొండెపి వెళ్ళలేక సురేష్ పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారని అంటున్నారు. పనిచేస్తేనే టికెట్లు : అయితే ప్రతిపక్షంలో ఉంటూ పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది. తమకు అప్పగించిన సీటులో పార్టీని బలోపేతం చేయాలని కూడా సూచిస్తోంది. అలా కాకుండా సైలెంట్ గా ఉంటే కొత్త నాయకత్వాన్ని అక్కడ అభివృద్ధి చేయడం మినహా వేరే మార్గం లేదని స్పష్టంగా చెబుతోంది. మరి సురేష్ విషయం తీసుకుంటే కొండెపి ఆయన వద్దు అనుకుంటే అక్కడ జూపూడి ప్రభాకర్ కి ఇస్తారని ప్రచారంలో ఉంది. అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ కే 2029లోనూ ఎర్రగొండపాలెం టికెట్ ఇస్తారని అంటున్నారు. దాంతో సురేష్ ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది.

👉పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి: ఎంఈవో*..కంభం: మండలంలోని నర్సిరెడ్డిపల్లి, (ఎన్ఆర్)తురిమెళ్ళ ప్రాథమిక, యూపీ తురిమెళ్ల,చిన్నకంభం ప్రాధమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, మొయినుద్దీన్, శ్రీనివాసులు, ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ ఈ సందర్భంగా పాఠశాలల వసతులు,సౌకర్యాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను,మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.ఆయా పాఠశాలల్లో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొని పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చించారు. పాఠశాల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరంటూ బాధ్యతలను గుర్తుచేశారు. పాఠశాలల నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం.సుభద్ర ,మాజీ సర్పంచ్ వీరమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్స్,సిఆర్పి అనురాధ, ప్రధానోపాధ్యాయులు సిహెచ్. భాస్కర్ నాయుడు , లంకా.నరసింహారావు,ఎస్కె. మౌలాలి, రహమత్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
👉తహసిల్దారుకు మెమొరండం సమర్పించిన ఏపీటీఎఫ్ నాయకులు*..  కంభం:ఉద్యోగులు,ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందంటూ శుక్రవారం తహసిల్దార్ వి కిరణ్ కు ఏపీటీఎఫ్ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఆర్థిక బకాయిల విడుదలలో జాప్యం,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు,వేతన సవరణలు,కరువు భత్యం మంజూరు తదితర ప్రయోజనాలు జరగడం లేదనీ, ప్రభుత్వం ఏర్పాటై ఏడాది మూడు నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం దొరకలేదని,ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో చొరవ చూపాలంటూ వారి డిమాండ్ల పట్టికను సమర్పించారు. ఏపీటీఎఫ్ డిమాండ్లలోని ప్రధాన అంశాలు… పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలనీ, సిపియస్ రద్దు చేసి మెమో నెం.57ను తక్షణం అమలు చేయాలని,12వ పీఆర్సీ కమీషన్ ను నియమించి. ఐ.ఆర్ ప్రకటించాలనీ,అన్ని రకాల బకాయిలను చెల్లించాలనీ,ఈహెచ్ యస్ పరిమితిని 25 లక్షలకు పెంచాలనీ,యాప్లను, అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దుచేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలంటూ వారి డిమాండ్లను నినదించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కన్వీనర్ సిహెచ్ భాస్కర్ నాయుడు,అద్యక్షుడు బి. సిహెచ్.రంగస్వామి, ప్రధాన కార్యదర్శి జి.అంకిరెడ్డి
మండల కార్యదర్శి లంకా.నరసింహారావు, వై.శేఖర్,రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
👉గిద్దలూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కంభం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్*
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని కంభం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట మహాలక్ష్మి మరియు కంభం టీడీపీ నాయకులు శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి జ్ఞాపికను అందచేశారు.*


👉 కృష్ణ నగర్ వాసుల నీటి సమస్యపై స్పందించిన శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి.

అర్థవీడు మండలం, మాగుటూరు పంచాయతీలోని కృష్ణ నగర్ వాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఈ రోజు గిద్దలూరులోని వారి కార్యాలయంలో కృష్ణ నగర్ వాసులు శాసనసభ్యుల వారిని కలిసి తమ నీటి సమస్యను వివరించారు.
సమస్యను విన్న వెంటనే, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అర్థవీడు ఎంపీడీవో మరియు ఆర్డబ్ల్యూఎస్ డీఈ లతో దూరవాణిలో మాట్లాడారు. అందుబాటులో ఉన్న నిధులతో తక్షణమే బోర్ వేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయరాం నాయక్, నాయకులు బోయపాటి వెంకటేశ్వర్లు, చేకూరి రమణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యుల తక్షణ స్పందన పట్ల కృష్ణ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
👉 ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల కోసం విద్యార్థుల ఆందోళన* ప్రకాశం జిల్లా…
మార్కాపురం లోని డిగ్రీ కళాశాలాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థుల నిరసన…


ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు… ఫైనల్ ఇయర్ పూర్తి చసిన ఇంటర్మీడియట్ డిగ్రీ
బీటెక్ బి ఫార్మసీ విద్యార్థులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసేందుకు వెళ్లాలంటే ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు పూర్తి ఫీజు డబ్బులు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కార్యాలయంలోని ఏవోను కలిసి తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేసిన విద్యార్థులు….

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా