👉నేపాల్ ‘సోషల్’ యుద్ధం.. భారత్ కు ఓ గుణపాఠం నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియా నిషేధంపై చెలరేగిన ఆందోళనలు, వాటి ఫలితంగా జరిగిన హింసాకాండ కేవలం ఒక దేశీయ సమస్య కాదు. నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియా నిషేధంపై చెలరేగిన ఆందోళనలు, వాటి ఫలితంగా జరిగిన హింసాకాండ కేవలం ఒక దేశీయ సమస్య కాదు. ఇది భారతదేశానికి కూడా ఒక హెచ్చరిక.. ఒక గుణపాఠం. సోషల్ మీడియాపై ఆంక్షలు యువతలో ఎంతటి తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చగలవో ఈ ఘటనలు స్పష్టం చేశాయి. * సోషల్ మీడియా నిషేధం – తిరుగుబాటుకు బీజం నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించడంతో యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిషేధాన్ని ధిక్కరిస్తూ వారు VPNలు, టిక్‌టాక్ వంటి మార్గాలను ఉపయోగించారు. ఈ ఆందోళన కేవలం “యాప్స్ నిషేధం”పై మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ఉన్న అసహనం, అవినీతి, వర్గపరమైన అన్యాయం, ఆర్థిక నిర్లక్ష్యం వంటి అనేక అంతర్లీన సమస్యల ఫలితంగా మరింత తీవ్రమైంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో 28 ఏళ్లలోపు యువకులే ఎక్కువ సంఖ్యలో మరణించడం ఆందోళనకరం. ఈ మరణాలు సోషల్ మీడియా ఎంతగా యువత జీవితాల్లో భాగమైందో చూపిస్తున్నాయి.
* భారతానికి పాఠం నేపాల్‌లోని ఈ సంఘటనల నుండి భారతదేశం ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి. భారతదేశంలో కూడా యువత రైతుల సమస్యలు లేదా మౌలిక వసతుల లోపాలపై పెద్దగా స్పందించకపోయినా, సోషల్ మీడియా వంటి అంశాలపై మాత్రం చాలా సున్నితంగా స్పందిస్తున్నారు. దీనికి కారణం సోషల్ మీడియా అనేది వారికి కేవలం వినోదం మాత్రమే కాదు, వేలాది మందికి ఇది వృత్తి, జీవనోపాధి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికలపై ఆధారపడి ఉన్న వారికి ఇవి ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి. అందువల్ల, ప్రభుత్వం “వార్తల నియంత్రణ” పేరిట సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలనుకుంటే, అది దేశవ్యాప్తంగా భారీ తిరుగుబాటుకు దారితీసే ప్రమాదం ఉంది. మానసిక ప్రభావం – డిజిటల్ స్వయం సమృద్ధి సోషల్ మీడియా యువత గుర్తింపు, భావోద్వేగాలతో ఎంతగా ముడిపడి ఉందో ఇప్పటికే నిరూపించబడింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ “లైక్స్” కోసం ఆత్మహత్యలకు పాల్పడిన ఉదాహరణలు ఉన్నాయి. ఇది జనరేషన్-జడ్ కు సోషల్ మీడియా ఎంత లోతుగా మానసికంగా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. ఈ సమస్యకు మరో కోణం డిజిటల్ స్వయం సమృద్ధి. చైనా తన స్వంత డిజిటల్ వ్యవస్థను నిర్మించుకుని, పాశ్చాత్య ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడకుండా ఉంది. కానీ భారతదేశం మాత్రం అమెరికా కంటే పదింతలు ఎక్కువగా (దాదాపు 70 కోట్ల మంది) వాట్సాప్ వంటి విదేశీ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి ఉంది. ఈ ఆధారపడటం ఒక పెద్ద ప్రమాదం.
👉మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్న ఆదేశాల మేరకు పట్టణంలోనీ భగత్ సింగ్ కాలనీ ప్రజల ఇండ్లకు ప్లాట్స్ నంబరింగ్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మార్కాపురం టౌన్ సర్వేర్ సంజీవయ్య మరియు ఆయన సిబ్బంది 16 వార్డు కౌన్సిలర్ హర్షిత బాబి వార్డు ఇంచార్జీ చల్లగాలి విద్యాసాగర్, కాయ కాకుల తిరుపతయ్య 16 వార్డు యూత్ అధ్యకులు తిరుమల శెట్టి శివ కుమార్, సిపిఎం జవాజి రాజు వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గడం జరిగింది.
👉నివాళులు అర్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు..*బెస్తవారిపేట మండలం, గొట్టంమిల్లు గ్రామానికి చెందిన గొట్టం నాగరాజు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో మరణించగా, వారి మృతి పట్ల గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు, టీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.. వారితో పాటు రాష్ట్ర ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ డైరెక్టర్ గోనా చెన్నకేశవులు స్థానిక నాయకులు గొట్టం ప్రసాద్, షేక్ సుల్తాన్ తదితరులు నివాళులు అర్పించారు..*
*నాగులవరం గ్రామంలో పలువురికి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు కృష్ణ కిషోర్*
*అర్ధవీడు మండలం, నాగులవరం గ్రామంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు టిడిపి నాయకులు శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి పలువురికి నివాళులు అర్పించారు.. గ్రామంలో దుగ్గెపోగు రాజు (33) గుండెపోటుతో మరణించారు. అదే గ్రామంలో అనారోగ్యంతో యెషమాల గుండయ్య ఆనారోగ్యంతో మరణించగా వారి ఇరువురి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి భౌతికకాయాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇరువురి కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారితో పాటు అర్ధవీడు సొసైటీ బ్యాంక్ చైర్మన్ కొణతం రంగారెడ్డి, దండుగ ఇంద్రసేనారెడ్డి, కొణతం వీరారెడ్డి, మారెడ్డి రంగారెడ్డి, ఓబుల్ రెడ్డి, రమణారెడ్డి, రంగనాయకులు తదితరులు నివాళులు అర్పించారు..*
*రూ. 50,000 ఆర్ధిక సహాయం చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి …* గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మండ్ల బుజ్జి వాల్మీకి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించారు. ఇంటి పెద్దను కోల్పోవటంతో వారి కుటుంబం ఇబ్బందులను పడుతున్న విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మండ్ల బుజ్జి భార్య మండ్ల తిరుమలమ్మ కి తన వంతు సహకారంగా రూ. 50,000 రూపాయలు అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో స్థానిక నాయకులు కడియం శేషగిరి(ముండ్లపాడు ఉప సర్పంచ్), వినుకొండ చిన్న(మార్కెట్ యార్డ్ డైరెక్టర్), పాలుగుళ్ళ చిన్న శ్రీనివాస్ రెడ్డి(3వ వార్డ్ కౌన్సెలర్ గిద్దలూరు మున్సిపాలిటీ), మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాలుగుళ్ళ పెద్ద శ్రీనివాస్ రెడ్డి, మరడ దిలీప్ కుమార్, యల్లా అశోక్ కుమార్ పాల్గోన్నారు…
*టిడిపి కార్యకర్త కుటుంబానికి భరోసాగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..*బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన టిడిపి కార్యకర్త మండ్ల బుజ్జి కుటుంబానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి భరోసానిచ్చారు. కుటుంబ పెద్దను కోల్పోవటంతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే తన వ్యక్తిగత సహాయంగా రూ. 50.000-00 లు (అక్షరాల యాభై వేల రూపాయలు) ఆర్ధిక సహాయం వారి సతీమణి మండ్ల తిరుమలమ్మ కు టీడీపీ నాయకుల ద్వారా అందచేశారు.. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు..కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కడియం శేషగిరి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వినుకొండ చిన్న, గిద్దలూరు పట్టణ 3వ వార్డు కౌన్సిలర్ పాలుగుళ్ళ చిన్న శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు పాలుగుళ్ళ పెద్ద శ్రీనివాసరెడ్డి, మరడ దిలీప్, యల్లా అశోక్, మండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు..*
*క్రిష్ణ కిశోర్ రెడ్డి ని సన్మానించిన 13 వ వార్డు ఇంచార్జి మరియు ప్రజలు*
గిద్దలూరు పట్టణం 13 వ వార్డు నందు నివాసం ఉంటున్న ప్రజానీకం శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయం సమీపంలో రోడ్డు లేక గత 25 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని 13 వ వార్డ్ ఇంచార్జి వేములపాటి చంటి , శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు వెంటనే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సంబంధింత అధికారులకు తెలియపరిచి రోడ్డు మంజూరు చేసిన సందర్భంగా వార్డ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు , అనంతరం ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి కి 13 వ వార్డు ఇంచార్జి వేములపాటి చంటి ఆధ్వర్యంలో, చెన్నయ్య మరియు వార్డు ప్రజలు శాలువా , పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.*
👉బాబాయ్ పై దాడి చేసిన వ్యక్తి, కేసు నమోదు*
ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో ద్విచక్ర వాహనం కొనివ్వలేదని సొంత బాబాయి పై కుమారుడు దాడి చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరసింహారావు తెలిపారు. గ్రామానికి చెందిన అభిషేక్ రెడ్డి తన బాబాయి శ్రీనివాసరెడ్డిని ద్విచక్ర వాహనం కొనివ్వాలని అడగగా అందుకు ఆయన నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైనా అభిషేక్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి పై దాడికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
👉మార్కాపురం డివిజన్ లో 30 యాక్ట్ అమలులో ఉంది: కంభం సీఐ*
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలులో ఉందని కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున తెలిపారు. మంగళవారం మార్కాపురం డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సిపి చేపట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని సీఐ అన్నారు. 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల పరిధిలో నిరసనలు, బహిరంగ సభలు, ర్యాలీ కార్యక్రమాలు చేపట్టరాదని ఆ మండలాల పరిసర ప్రాంత ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయా మండలాల ఎస్సై లు నరసింహారావు, రవీంద్రారెడ్డి, సుదర్శన్ యాదవ్ లు తీవ్రంగా హెచ్చరించారు.
*వరి అరటి సాగుపై రైతులకు అవగాహన
ప్రకాశం జిల్లా కంభంలో వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యం లో అరటి వరి సాగు చేసే రైతులకు, యూరియా వాడకం మరియు లభ్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం లో ఉద్యాన శాఖ అధికారి శ్వేత మాట్లాడుతూ అరటి పంటలో ఒక్క మొక్కకు 400 గ్రా యూరియా మాత్రమే వేయాలి అని, అంటే ఒక్క ఎకరానికి అందాజుగా 10 బస్తాలు ఐదు దఫాలుగా వేయాలని తెలిపారు. కానీ రైతులు బస్తాలు వేస్తున్నారని విచక్షణా రహితంగా నత్రజని వాడడం వల్ల పూత రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, చెట్టు పొడవుగా పెరిగి కాండం బలహీలంగా మారి గాలికి సులువుగా పడిపోయే అవకాశం ఉంది, చీడ పీడలు ఎక్కువగా ఆశిస్తయి కాబట్టి తగిన మోతాదులో యూరియా వాడుకోవాలని రైతులకి తెలియచేయడం జరిగింది. పండ్ల పరిమాణం మరియు నాణ్యత పెంచుటకు గెలల లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5 వ రోజు మరియు 15 వ రోజున సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రా ఒక లీటర్ నీటిలో కలిపి గెలల పైన పీచీకరిచేయాలని తెలిపారు. దీనితో పాటు బంచ్ కవర్ లు వాడడం వల్ల గెలలను తామర పురుగు ఆశించకుండా కాపాడుకోవచ్చన్నారు. ఈ బంచ్ కవర్లకు 25000 హెక్టారుకు రాయితీ ఉందన్నారు.వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ మాట్లాడుతూ వరి నాటే సమయం లో 30కేజీలు యూరియా, నాటిన నెల రోజులకు 35 కేజీలు, తరవాత అంకురం దశలో 35 కేజీలు వేయాలన్నారు. తర్వాత నానో యూరియా కి సమందించి సమాచారం ఇచ్చారు. యూరియాకి ప్రత్యామ్నాయం గా నానో యూరియా వాడాలి అన్నారు . కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ భాషా మరియు రైతులు పాల్గొన్నారు

