👉రివర్సు సుంకం వేసి.. ట్రంప్ కు మోడీ దమ్ము చూపాలన్న కేజ్రీ వాల్.. 👉ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు*…👉నా కొడుకు రాజకీయ ఎంట్రీ పక్కా: *వైఎస్ షర్మిల *..👉నకిలీ యూట్యూబ్ కేటుగాళ్ల దంద..!!!.. విజయవాడ.. 👉 మార్కాపురంలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి స్వామి..👉* అన్నదాత పోరు కార్యక్రమానికి బ్రేక్..మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అనుమతులు లేకుండా ఎలాంటి సభలు సమావేశాలు, ర్యాలీలు చేయరాదు.. కంభం ఎస్ఐ నరసింహారావు..👉*స్పందించిన కంభం వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు*ప్రకాశం జిల్లా కంభం ..

👉రివర్సు సుంకం వేసి.. ట్రంప్ కు మోడీ దమ్ము చూపాలన్న మాజీ సీఎం కేజ్రీ వాల్.. అగ్ర రాజ్యం అమెరికా మన ఎగుమతుల మీద యాభై శాతం సుంకం విధిస్తోందన్న ఆయన.. ‘‘మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. నిన్న మొన్నటి వరకు భారత విదేశాంగ విధానం ఏ మాత్రం బాగోలేదంటూ.. అందరిని శత్రువుల్ని చేసుకుంటున్నట్లుగా విమర్శలు చేసిన వారి నోరు మూయించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఆయన ప్రత్యర్థ్యులు సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు దమ్ము చూపాలని కోరుతున్నారు.

మన మీద సుంకాలు వేసిన అమెరికాకు రివర్సులో మరిన్ని సుంకాలు వేయాలని.. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోడీ తన దమ్ము చూపాలని కోరారు. యావత్ దేశం మీ వెంటే ఉందంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అగ్రరాజ్యం అమెరికా మన ఎగుమతుల మీద యాభై శాతం సుంకం విధిస్తోందన్న ఆయన.. ‘‘మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తల వంచుతాడో లేదో చూడండి’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని తప్పు పట్టారు. అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్లో రూ.900 కంటే తక్కువ ధర వస్తుందన్న ఆయన.. ‘అమెరికా రైతులు ధనవంతులు అవుతారు. గుజరాత్ రైతులు బీదవారు అవుతారు. పత్తి పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్ లేకపోవటంతో రైతులు అప్పుల బారిన పడతారు. చివరకు ఆత్మహత్యలు చేసే పరిస్థితి వస్తుంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు విత్తనాలు.. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు తీసుకున్నారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు అప్పు ఎలా తీర్చాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వానికి దాసోహమైందంటూ ఆరోపించిన కేజ్రీవాల్.. ట్రంప్ యాభై శాతం సుంకం విధించారని.. మోడీ వంద శాతం సుంకం విధించాలని కోరారు. మరి.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోడీ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ప్రశ్నగా మారింది.

👉నకిలీ యూట్యూబ్ కేటుగాళ్ల దంద..!!!.. విజయవాడ.

లోడు తో వాహనం కనబడితే అదేంటో తెలియదు కానీ వీళ్ళు ఆపేస్తారు…!!!
సూరంపల్లి ప్రాంతంలో అక్రమంగా రేషన్ వ్యాపారం చేస్తున్నావంటూ గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు యూట్యూబ్ ఛానల్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డ ఘటన..గుంటూరు కు చెందిన AP రిపోర్టు న్యూస్ , స్టూడియో 4, స్టూడియో 28, యూట్యూబ్ ఛానల్ వారు ఇరువురు 50వేల రూపాయలు అడగమన్నారంటూ చెబుతున్న N న్యూస్ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి.. స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో యూట్యూబ్ చానళ్ళ బ్లాక్ మెలింగ్ దందా వారి మాటల్లోనే వీడియో చూస్తే అర్థమవుతుంది..రాత్రి 11 దాటిన తర్వాత యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు రోడ్ల మీదకు వచ్చి లోడుతో వెళుతున్న వాహనాలను తనిఖీలు చేయటం.. అది రేషన్ గనక అయితే వారిని బెదిరించి లక్షల్లో డిమాండ్ చేయడం ఇదంతా కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కువగా జరుగుతున్న దందా..గతంలో ఇలాంటి ఘటనలు విజయవాడ సిటీ లో ఉన్న భవానిపురం పోలీస్ స్టేషన్ లో జరిగాయి, భవానిపురం పోలీసులు నకిలీ కేటుగాళ్ల పై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
👉నా కొడుకు రాజకీయ ఎంట్రీ పక్కా:**వైఎస్ షర్మిల :*

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై స్పందించారు.తన కుమారుడు అవసరమైనప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు.దీంతో రాజారెడ్డి రాజకీయ ప్రవేశం ఖాయమైంది. అయితే రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..లేదా షర్మిలతో కలిసి కొత్త పార్టీ స్థాపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.


👉ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు*… ▪️టీటీడీ ఈవోగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.
▪️ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.
▪️మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా సౌరభ్‌ గౌర్.
▪️సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు.
▪️ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్‌ కుమార్‌ మీనా.
▪️అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే.
▪️గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌.
▪️మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్.
▪️ ఎండోమెంట్స్ కార్యదర్శిగా హరిజవహర్ లాల్ (రిటైర్డ్)
▪️లేబర్, ఇన్సూరెన్స్ మెడికల్ కార్యదర్శిగా ఏం.వి.శేషగిరిబాబు.
▪️ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (ఢిల్లీ)గా ప్రవీణ్‌కుమార్‌ బదిలీ

👉 మార్కాపురంలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి స్వామి..

వైసిపి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఆర్బాటంగా ప్రకటించి నిర్మాణాలను గాలికొదిలేసింది… అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లో నిర్మిస్తాం..
మెడిసిన్ విద్యను ప్రభుత్వం ప్రవేటు పరం చేస్తుందంటూ వైసీపీ ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చేస్తోంది
మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పనులు 18.8 శాతం మాత్రమే పూర్తయ్యాయి,గత వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క భవనం కూడా పూర్తి చేయలేదు.
మార్కాపురం మెడికల్ కాలేజ్ పూర్తిచేసి 2026 – 2027 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభిస్తాం
మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, అరకు మెడికల్ కాలేజీలను మొదట విడతగా పూర్తి చేస్తాం
రాష్ట్రంలో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించి పేద విద్యార్థులకు మెడిసిన్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వమే అని తెలిపారు

• ప్రభుత్వ వైద్యశాలలోని ఆర్.ఓ. ప్లాంట్ కు మరమ్మత్తులు..•👉*స్పందించిన కంభం వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు*ప్రకాశం జిల్లా కంభం ..

వినియోగంలోకి తెచ్చిన కంభం వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు..• కృతజ్ఞతలు తెలిపిన హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు వైద్యులు..
కంభం ప్రభుత్వ వైద్యశాలలో రోగుల దాహర్తిని తీర్చే ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురై రోగులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న కంభం వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు వెంటనే స్పందించి నంద్యాల నుండి మెకానిక్ ని పిలిపించి ఆర్.ఓ. ప్లాంట్ కు మరమ్మత్తులు నిర్వహించి రోగుల దాహర్తిని తీర్చారు. దీంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష, డాక్టర్ శివనాయక్ మరియు డాక్టర్ ఫణి కంభం వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, బాబ్జి, వెంకట్, కట్టా రమేష్, శివ, మధు, మరియు సయూమ్ తదితరులు పాల్గొన్నారు.
👉ఏపీఎడ్యూకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రా  స్ట్రక్చర్  కార్పోరేషన్ చైర్మన్ డా. రాజశేఖర్ కు తాడేపల్లి కార్యాలయంలో పూలమాల వేసి శాలువతో సత్కరించిన ఏపీ_ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోన చెన్నకేశవులు .అదేవిధంగా పలు సూచనలు ఇస్తూ నన్ను శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి డి.సుందరయ్య, సుశీల్ రావు ,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కె. అఖిల్ , రమణ
పాల్గొన్నారు.👉 అన్నదాత పోరు కార్యక్రమానికి బ్రేక్.. మార్కాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆర్డర్ మేరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నది కావున సబ్ డివిజన్ పరిధిలో మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అనుమతులు లేకుండా ఎలాంటి సభలు గానీ ,సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ చేయరాదని కంభం ఎస్ఐ బి నరసింహారావు తెలిపారు.. మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అట్లు ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు కానీ, సమావేశాలు సభలు గానీ కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఎడల సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిగా భావించి వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు .చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడకుండా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా