👉బీజేపీ ఒక భస్మాసుర హస్తం.. ఆ పార్టీతో జతకట్టిన పార్టీలు అంతమవుతాయి: నారాయణ👉తురకపాలెం మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష*..👉జగన్ పై అనర్హత వేటు తప్పదా..?👉ఆస్తి కోసం తనకు జన్మ నిచ్చిన తండ్రినే కొట్టి చంపి వాగులో పడేసిన కసాయి కొడుకు😲…👉రైతుల రాస్తారోకో (గుంటూరు జిల్లా)… 👉 జర్నలిస్టుపై కాంగ్రెస్ వర్గీయుల టి దాడి.. *దాడిని ఖండించిన నందిగామ టిడబ్ల్యూజేఎఫ్…👉ఏపీ లో దూసుకుపోతున్న ‘ఆపరేషన్‌ ట్రేస్‌’- నెల రోజుల్లో 670 కేసుల్లో సత్ఫలితాలు*…*మానవత్వం చాటుకున్న బేస్తవారిపేట ఎస్సై…👉హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు..r

👉బీజేపీ ఒక భస్మాసుర హస్తం.. ఆ పార్టీతో జతకట్టిన పార్టీలు అంతమవుతాయి: నారాయణ

బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ మాదిరిగానే చీలిపోతారూ.. టీడీపీ, జనసేనకు కూడా బీఆర్ఎస్ గతే పడుతుందని జోస్యం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉద్దేశపూర్వకంగానే చంపేస్తున్నారని విమర్శ…బీజేపీ ఒక భస్మాసుర హస్తం లాంటిదని, ఆ పార్టీతో కలిసిన ఏ రాజకీయ పక్షమైనా అంతరించిపోవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ రెండుగా చీలిపోవడాన్ని ఉదాహరణగా చూపుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన పార్టీలకు కూడా భవిష్యత్తులో ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.

ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రధాని మోదీకి దాసోహం అయ్యాయని నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కేంద్రానికి సాగిలపడుతున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యంగా, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొందరు కావాలనే ప్లాంట్ ను దెబ్బతీసి, నష్టాల్లోకి నెట్టి.. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర అని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జీఎస్టీ పేరుతో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను నిలువునా లూటీ చేసిందని ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాటు కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టి, ఇప్పుడు ఎన్నికల ముందు జీఎస్టీలో మార్పులు చేయడం ప్రజలను మోసగించడమేనని మండిపడ్డారు. జీఎస్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడతారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు… కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపైనా నారాయణ మండిపడ్డారు. నక్సల్స్‌ను చంపుతామని అమిత్ షా అంటున్నారని, కానీ వారిని చంపడం ద్వారా వారి సిద్ధాంతాన్ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. గిరిజనుల ఆస్తులను కాజేయడానికే నక్సల్స్ ఏరివేత పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, వ్యతిరేక గళం వినిపించిన వారిని ‘ఆపరేషన్ ఖగార్’ పేరుతో అడ్డు తొలగించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

👉జగన్ పై అనర్హత వేటు తప్పదా..?😱😱😱

60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్గా వేటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రావొచ్చని జోస్యం చెప్పారు. మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు రావొచ్చంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఏపీలో వైసీపీకి ప్రతిపక్ష హోదాపై రచ్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నారు.

👉ఏపీ లో దూసుకుపోతున్న ‘ఆపరేషన్‌ ట్రేస్‌’- నెల రోజుల్లో 670 కేసుల్లో సత్ఫలితాలు*

బాలికల అదృశ్యం కేసులు ఛేదించిన పోలీసులు – ఆచూకీ కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగింత..బాలికల అదృశ్యం కేసులను ఛేదించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ చేపట్టిన ‘ఆపరేషన్‌ ట్రేస్‌’ సత్ఫలితాలిచ్చింది.ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో 670 కేసులు ఛేదించగలిగారు..తప్పిపోయిన, అపహరణకు గురైన బాలికల ఆచూకీ కనిపెట్టి వారి కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు..జులై 31 నాటికి ఈ తరహా 1,065 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఆగస్టు నెలంతా ‘ఆపరేషన్‌ ట్రేస్‌’ పేరిట స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టారు

జిల్లా, సబ్‌ డివిజన్ల స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న బాలికల అదృశ్యం కేసుల వివరాలు సేకరించారు. కాల్‌ డీటైల్‌ రికార్డుల విశ్లేషణ, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను లోతుగా విచారించి వివరాలు సేకరించడం, సీసీటీవీ దృశ్యాల విశ్లేషణ, షెల్టర్‌ హోమ్స్‌లో తనిఖీలు, సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ ద్వారా కొందరి ఆచూకీ కనిపెట్టారు. వారిని పట్టుకుని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. ఆచూకీ లభ్యమైన బాలికల్లో 80శాతం మంది 14 నుంచి 18 ఏళ్ల మధ్యవారే ఉన్నారు. అసాంఘిక శక్తుల బారిన పడకుండా వీరిని పోలీసులు కాపాడగలిగారు.ఎంతమంది ఆచూకీ ఎలా దొరికిందంటే

అదృశ్యమైన బాలికల కాల్‌ డీటైల్‌ రికార్డుల (సీడీఆర్‌) విశ్లేషణ : 423 మందికుటుంబసభ్యులు/ స్నేహితులు ఇచ్చిన వివరాలతో : 130 మందిశక్తిబృందాలు నిఘాపెట్టి గుర్తించినవి : 73 మంది సీసీటీవీ దృశ్యాల విశ్లేషణ : 20 మంది..షెల్టర్‌ హోమ్స్‌లో తనిఖీలు : 21 మంది..సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ : ముగ్గురు బాలికల అదృశ్యం పెండింగ్‌ కేసుల్లో 63శాతం ఒక్క నెలలోనే పరిష్కారమయ్యాయని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. మిగతా కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అదృశ్యం కేసుల్ని ఎప్పటికప్పుడు ఛేదించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు.
👉మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితె మీ జిల్లాలోని ఏసీబీ కి కంప్లైంట్ చేయవచ్చు . *

1. Toll Free Number “1064”
2. WhatsApp No.8333995858
3. Email dg_acb@ap.gov.in

👉ఆస్తి కోసం తనకు జన్మ నిచ్చిన తండ్రినే కొట్టి చంపి వాగులో పడేసిన కసాయి కొడుకు😲😲😲….ఇలాంటి కొడుకులును కన్న కొందరు తల్లిదండ్రులు కు తప్పదు ఇలాంటి ఘటన!*నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఘటనఆస్తి కోసం గొడవ పడి తండ్రి బాలయ్యపై కర్రతో విచక్షణారిహతంగా దాడి చేసిన కొడుకు బీరయ్య కర్రతో కొట్టి చంపి వాగులో పడేసిన వైనం..ఘటన సమీపంలోని సీసీ కెమెరా పరిశీలనతో విషయం వెలుగులోకి..ఆస్తి కోసం రక్త సంబంధాలను మరిచి మృగంగా మారిన ఓ కుమారుడు కన్న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వెలుగుచూసింది.

కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్‌కు చెందిన బాలయ్య (70)ను అతని కుమారుడు బీరయ్య కర్రతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం..బాలయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటుండగా, బీరయ్య అక్కడికి వెళ్లి తండ్రితో ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. వారి మధ్య వాగ్వివాదం ముదరడంతో బీరయ్య కర్రతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.తర్వాత, బాలయ్య మృతదేహాన్ని బీరయ్య కారు డిక్కీలో వేసుకొని చింతపల్లి బ్రిడ్జ్ వద్దకు తీసుకువెళ్లి వాగులో పడేశాడు. అయితే, బాలయ్య రాత్రివరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతని కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు..పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా, బీరయ్యే తండ్రిని హత్య చేసినట్లుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. బీరయ్య తెలిపిన సమాచారంతో గజ ఈతగాళ్ల సహాయంతో బాలయ్య మృతదేహాన్ని డిండిచింతపల్లి బ్రిడ్జ్ వద్ద వాగు నుంచి వెలికితీయించారు. ఘటనపై పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉 జర్నలిస్టుపై కాంగ్రెస్ వర్గీయుల ముకుమ్మడి దాడి*–పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు సందీప్*– *దాడిని ఖండించిన నందిగామ టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు*

నందిగామ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో కొందరు ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ చేన్నగళ్ళ సందీప్ పై దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తనపై దాడి దాడి చేసినట్లు రిపోర్టర్ సందీప్ పేర్కొన్నారు. సుమారు 11 గంటల సమయంలో ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం సమీపంలో కొందరు యువకులు తప్ప తాగిన మైకంలో పరుష పదజాలంతో దూషిస్తూ తనపై దాడి చేసినట్లు చెప్పారు. జర్నలిస్టుపై దాడి సిగ్గు చేటని, ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టిడబ్ల్యూజెఎఫ్ నందిగామ మండల జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
👉కొనుగోలుదారులపై కన్నెర్ర చేసిన రైతన్నలు* *రెండు రోజులుగా పొగాకు కేంద్రం వద్ద పడికాపులు కాస్తున్న రైతులు* *రైతు పంటను పొంతనలేని సమాధానంతో నిరాకరిస్తున్న బయర్లు*

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఐదోమైలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు మాట్లాడుతూ రెండు రోజుల నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద తమ యొక్క సరుకుతో వేచి ఉన్నప్పటికీ పొంతనలేని కారణాలతో రైతుల తెచ్చుకున్నటువంటి మైతం పొగాకును నిరాకరించడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే చర్చలు లేకుండా పొగాకు కొనుగోలు చేసి బెయర్ను మార్చాలని డిమాండ్ చేశారు.
👉హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించండి – తురకపాలెం మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష*

తురకపాలెం గ్రామస్థులకు ‘మెలియోయిడోసిస్’ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం – తీవ్రత ఎక్కువుగా ఉన్నవారికి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశం..

గుంటూరు జిల్లా తురకపాలెంలో జులై, ఆగస్ట్ నెలల్లో 20 మంది చనిపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టి ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్నికోణాల్లోనూ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇందుకోసం శని, ఆది వారాలు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించాలని, గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి అనారోగ్య తీవ్రత ఎక్కువుగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు.

గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో దీనిపై చర్చించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, భూమి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తురకపాలెంలో అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతీ రోగిని వైద్య పర్యవేక్షణలో ఉంచి, హెల్త్ ప్రొఫైల్ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొత్త కేసులు ఏమాత్రం నమోదు కాకూడదని తెలిపారు. పరిస్థితులు నియంత్రణలోకి రావాలని, స్థానికుల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. జ్వరంతో బాధపడుతున్నవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు.

మెలియోయిడోసిస్ ప్రధానంగా భూమిలోనూ, నిల్వ నీరులో, తడి నేలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదల సమయంలో వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు తెలిపారు. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు ,వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. మట్టిలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియా గాయాలు లేదా చర్మ పగుళ్లు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. కాలుష్యమైన నీరు తాగినా, ఒక్కోసారి శ్వాస ద్వారా కూడా సంక్రమించవచ్చని చెప్పారు.
👉చంద్రబాబు ఇన్నేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు కానీ వైయస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటుకి కట్టబెడుతున్నారు. ఇలాంటి చేతగాని సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల కోసమా? మీ సొంత ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.

-కొర్ల శిరీష, వైయస్ఆర్ సీపీ స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ.
👉రైతులను కుచ్చు టోపి పెట్టి 2 కోట్లు స్వాహా… ఎన్టీఆర్ జిల్లా*నందిగామ మండలం పెద్దవరం సహకార సోసైటి లో భారీ కుభంకోణం ….రైతులు కట్టిన లోన్ లకు దొంగ‌ బిల్లులు ఇచ్చి 2 కోట్లు కాజేసిన సెక్రటరీ గుణ్ణం ఎల్లారెడ్డి …సహకార సంఘం ద్వారా అన్ని రకాల రుణాలు కలిపి 8 కోట్ల వరకు ఇచ్చారు…

దీర్ఘకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు రైతు నేస్తం ,కర్షక మిత్ర ,రుణాలు వీటిని నిబంధనలను బట్టి ఏటా రైతులు రుణ వాయిదాలు చెల్లిస్తుంటారు…కర్షకులు వాయిదాకు లక్ష రూపాయలు చెల్లిస్తే ఆ మేరకు రైతులకు రసీదు ఇచ్చి సొసైటీ రికార్డుల్లో మాత్రం పదివేలు మాత్రమే చెల్లించినట్లు జమ చేసిన సెక్రటరీ…

ఎల్లారెడ్డి 30 ఎళ్ళు గమస్తా గా చేసి 2014లో సెక్రటరీ గా ప్రమోషన్ ….ఎప్పటినుంచో దొంగ బిల్లులతో రైతులను మోసం చేస్తున్న ఎల్లారెడ్డి ….విచారణ చేపట్టిన అసిస్టెంట్ రిజిస్టర్ అజయ్ కుమార్ ఎంక్వైరీ చేసి పూర్తీ వివరాలు సేకరించిన అధికారులు ….
సెక్రటరీ గుణ్ణం ఎల్లారెడ్ఢిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేడీసీసీ బ్యాంక్ సీఈవో శ్యామ్ మనోహర్…
👉 *మానవత్వం చాటుకున్న బేస్తవారిపేట ఎస్సై…*
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఓ స్కూటీ మరొక ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై రవీంద్రారెడ్డి వెంటనే స్పందించి పోలీస్ వాహనంలో ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు. తీవ్ర గాయాలు అయిన వ్యక్తిని సకాలంలో హాస్పటల్ కి తరలించిన ఎస్సై రవీంద్రారెడ్డిని పలువురు అభినందించారు…_
👉ఉమ్మలాడ శారద బ్రిడ్జి పై నుంచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి…
యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పట్టణ పోలీసులు..అనకాపల్లి జిల్లా… …
నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మృతదేహం వెలికితీత కష్టసాధ్యంగా మారింది.
మృతురాలు అనకాపల్లి గవరపాలెం కి చెందిన బుద్ధ భూలోక నాయుడు రెండవ కుమార్తె కీర్తిగా గుర్తింపు.
కుటుంబ తగాదాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం.
మృతి చెందిన కీర్తి కరూర్ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగిగా పని చేస్తుంది..
👉👉హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్
రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ లభ్యం
32 వేల లీటర్ల రా మెటీరియల్‌ స్వాధీనం
13 మందిని అరెస్ట్‌ చేసిన మహారాష్ట్ర పోలీసులు
తయారీదారులు, సరఫరాదారుల నెట్‌వర్క్‌ గుట్టురట్టు
ఫ్యాక్టరీలో పెద్దఎత్తున ఎండీ డ్రగ్స్‌ తయారీ
దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తింపు
కెమికల్‌ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్‌ తయారీ
బంగ్లాదేశీ మహిళ అరెస్ట్‌తో బయటపడ్డ డ్రగ్స్ గుట్టు….

👉హైదరాబాద్: ధూల్‌పేట్‌ లఖాన్ సింగ్‌పై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసిన పోలీసులు..గంజాయి హోల్‌సేల్‌ వ్యాపారిగా ఎదిగిన లఖాన్ సింగ్‌, ఒడిశాలో గంజాయి సాగు, విక్రయాల్లో బడా వ్యాపారులతో సంబంధాలు.. కేవలం 8 నెలల వ్యవధిలో మూడుసార్లు గంజాయితో పట్టుబడ్డ లఖాన్ సింగ్..లఖాన్ సింగ్‌పై ఇప్పటి వరకు 30కి పైగా కేసులు నమోదు..

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా