👉న్యూసెన్స్ చేస్తే జైలులో వేస్తాం.. డ్రామాలాడితే తడాఖా చూపిస్తాం.. సీఎం చంద్రబాబు వార్నింగ్*
ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర్ర చేశారు.జగన్ టార్గెట్‌గా పలు ఇంట్రిస్టింగ్ కామెంట్స్, వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రధానంగా..వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారో.. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్‌కు సూచించారు. వైసీపీ అసత్య ప్రచారాలపైనా సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
*ఇక.. రెండు రోజల క్రితం పులివెందుల పర్యటనలో ఉల్లి, చీనీ పంటల రైతుల సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. డ్రామాలాడితే తడాఖా అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
👉జూపూడి లో భారీ పేలుడు*
*పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన ఇల్లు.. *బ్లాస్టింగ్ సమయం లో ఇంట్లో వెల్డింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం..*పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల కూడా పాక్షికంగా వంశమయ్యాయి… *ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు.. వారిలో ఒకరి పరిస్థితి విషమం.. *క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం తరలింపు.. *భారీ పేలుడుతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు*
👉యూరియా బస్తాలు మాయం…!*
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలంలోని పిఎసిఎస్ పొగుల్లపల్లీ లో నిన్న రాత్రి దిగిన యూరియా బస్తాల లోడ్ నుండి 97బస్తాలు యూరియా మాయమైనట్లు రైతులు ఆరోపణ.సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్న అధికారులు.. e PoS మరియు గోదాం భౌతిక నిల్వలు లో 90 బస్తాలు తేడా గమనించడం జరిగింది.. ప్రాథమిక దర్యాప్తులో 32 మంది హమాలీలు ఉండగా వారు అందరూ రెండు నుంచి మూడు బస్తాలు తీసుకున్నట్టుగా ఒప్పుకున్నట్లు సమాచారం…వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు కూడా సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు….
👉ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సీఐ, ఎస్ఐ*
ప్రకాశం జిల్లా.. కంభం..ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ వారి సూచన మేరకు కంభం సీఐ మల్లికార్జున, బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి బేస్తవారిపేట, అర్ధవీడు, కంభం మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు, మూడు మండలాలలోని పర్టిలైజర్స్ షాపులను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మూడు మండలాలలో యూరియా కొరత లేదని, రైతులకి కావలసిన మోతదులో యూరియా సమృద్ధిగా ఉంది అన్నారు. కావున ఎవరు యూరియా కొరత ఉంది అనే వదంతులు నమ్మవద్దని, రైతులు కూడా కంగారు పడి అవసరానికి మించి కొనుగోలు చేసి స్టాక్ చేయవద్దని తెలియజేశారు. అలాంటి వదంతులను ఎవరు నమ్మవద్దని తెలిపారు. రైతులకి కావాసినంత యూరియా అందుబాటులో ఉందన్నారు…..
👉 కరీంనగర్లో వినూత్న రీతిలో నిరసన😲
రోడ్డు పైన నేను ఏది ధరించక పోయినా, అన్నింటికీ ఫైన్ కడుతున్నాను.. అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అంటూ ప్లకార్డుతో నిరసన..
కరీంనగర్ – రేకుర్తి చౌరస్థలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అద్వానంగా ఉందని.. కరీంనగర్ – నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కోట శ్యామ్ కుమార్ అనే వ్యక్తి నిరసన.. రోడ్డు పైన నేను ఏది ధరించక పోయినా అన్నింటికీ ఫైన్, GSTలు, రోడ్డు టాక్స్ కడుతున్నాను, కానీ అసలు రోడ్లే సరిగా లేవు.. మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన
👉విద్యార్థులతో టీచర్లూ భోజనం! .. *ఫుడ్ పాయిజన్ సమస్యకు ఇదే పరిష్కారమన్న హైకోర్టు.. *వారు నాణ్యతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారని వ్యాఖ్య..*విద్యార్థులు స్కూల్ పనుల్లో భాగస్వాములైతే తప్పేంటి? అని ప్రశ్న..తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో పనులు చేశానన్న సీజే_*
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు అక్కడే భోజనం చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఫుడ్ పాయిజన్ (కలుషితాహారం) ఘటనల సమస్యను ఇది పరిష్కరిస్తుందని అభిప్రాయపడింది. నాణ్యతపై వారు ఎప్పటికప్పడు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రతీ స్కూల్ విద్యార్థికి ఎంత మొత్తంలో ఆహారం ఇస్తారు? ఏమేమి ఇస్తారు? ఎలా అందిస్తారు? న్యూట్రిషన్ ఎలా లెక్కిస్తారు?.. ఇలా పూర్తి వివరాలతో స్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించింది… శ్రమను గౌరవించే గుణం అలవడాలంటే ముందు కష్టం తెలియాలని.. విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వామ్యమైతే తప్పేంటని ప్రశ్నించింది. చిన్నతనం నుంచే వారికి తమ పనులు తాము చేసుకోవడం అలవాటు చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించిన వివరాలు సమర్పించేలా సర్కార్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్ ధర్మాసనం తాజాగా బుధవారం విచారణ చేపట్టింది.
👉ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటఏర్పాటు. *అమరావతి : రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది.పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులుగా ముగ్గురు రిటైర్డు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.అథారిటీ సభ్యులుగా రిటైర్డు ఐఎఎస్ ఉదయలక్ష్మి, రిటైర్డు ఐపిఎస్ అధికారులు కెవిబి గోపాలరావు,బత్తిన శ్రీనివాసులును ప్రభుత్వం నియమించింది..వీరు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుని విచారణ చేస్తారు..ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నం,కృష్ణా, పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి జిల్లాలకు రాజమండ్రి,గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు గుంటూరు,రాయలసీమ జిల్లాలకు కర్నూలు కేంద్రంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డు డిఎస్‌పి,అడిషనల్ ఎస్‌పి స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
👉Right to Information( సమాచార హక్కు చట్టం 2005) భారతదేశంలో పుట్టిన ఏ పౌరుడికైనా సమాచారం అడిగి హక్కు ఉంది section 6 (1) ప్రకారం సమాచారం అడిగే హక్కు ఉంది కానీ ( సమాచార హక్కు చట్టాన్ని దుర్యోనోగ పరుస్తున్న అధికారులు) అపహాస్యం అవుతున్న సమాచారహక్కు చట్టం పట్టింపు లేని అధికారులు చట్టం వారికీ చుట్టం అయిన విధంగా వారికీ నచ్చినప్పుడు సమాచారం ఇవ్వడం లేదా దస్త్రలు (రికార్డు )లు చినిగి పోయినాయి అని చెప్పడం సరి అయిన స్టాఫ్ లేరు అధికార పనుల లొ బిజీ గా వున్నాం అనడం వారి ఆఫీస్ నుండి వచ్చిన ఫైల్ కూడా వారి ఆఫీస్ లొ దొరక పోవడం పాల్వంచ లొ మాత్రమే న అన్ని చోట జరుగుతోందో అర్ధం కావడం లేదు.. కావున సమాచారహక్కు చట్టం అధికారులకు చుట్టం కాకుండా వుండేలా చూడాలి అని కోరుకుంటూ వున్నా …
సమాచారం అడిగిన వారి వివరాలు బహిర్గతం చేస్తూ బెదిరింపులు కి దిగుతున్న వైనం.
👉పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా … *వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా …*టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా …*ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా …*పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా …*పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన …*పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన…*పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు …*ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.* *ఇండియన్ ఆయిల్-1800233355* *భారత్ పెట్ట్రో లియం-1800224344* *హెచ్పిసిఎల్-18002333555**రిలయన్స్-18008919023.**మండల సమాచార కేంద్రం ఎంసీఐసీ ఇన్చార్జ్. &CRPFI జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ సెక్రెటరీ D. సురేష్ 9133366449…*ఈ రాష్ట్ర ప్రజలు కల్తీ కి దూరంగా అవినీతి అంతం వైపు అడుగులు వేయండి
👉ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం, బేస్మెంట్ ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి..
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి బిల్లు రూ.1,00,000 కోసం బేస్మెంట్ ఫోటోలు తీసి, యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామి..బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంకట స్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

