👉 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు షాక్.. 👉సుగాలి ప్రీతి కేసును సి బి ఐ చేదించలేదు ..రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..👉విద్యారంగ సమస్యలు పరిష్కరించమని అడిగితే అరెస్టు చేయడము సిగ్గుచేటు.*అక్రమ అరెస్టులకు భయపడం: పి.డి.ఎస్.యు…👉జమ్మికుంటలో యువతి అదృశ్యం.. పోలీసుల దర్యాప్తు..👉లేడి డాన్ అరుణ అరాచకాలు.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు!*….👉 మణికొండలో నాలాను పూడ్చేసి నిర్మాణాలు చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల.. 👉నర్సంపేట లో యూరియా గోసా*..👉లంచాల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు**కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి..చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ..👉తార్నాక: ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటున్న వ్యక్తి అరెస్టు..

👉”జన్  నాయక్ రాహుల్ గాంధీ”

నా పోరాటం ఒక వ్యక్తితో కాదు. నా పోరాటం ద్వేషం, విభజన, నియంతృత్వం అనే వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం మరియు ఓటర్ల హక్కులను కాపాడటానికి ప్రస్తుతం నేను బీహార్ అంతటా ఓటు అధికార యాత్ర కి నాయకత్వం వహిస్తున్నాను.

👉 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు షాక్

ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. వీరి పాత్ర తీవ్రమైందని, రెచ్చగొట్టే ప్రసంగాలు, నిరసనల పిలుపులు దేశ సమగ్రతకు ముప్పు అని పేర్కొంది. మరో ఏడుగురికి కూడా బెయిల్ తిరస్కరించబడింది. కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

👉ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన యువతి.. ఆపి లగేజ్‌ చెక్‌ చేయగా…. బయట పడ్డ గంజాయి….!*

బ్యాంకాక్ నుండి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మహిళను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. అమె నుంచి సుమారు 3.1 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.3 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ గంజాయి విలువు సుమారు రూ.3 కోట్ల వరకు ఉండోచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తదుపరి విచారణ కోసం మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు.

👉సుగాలి ప్రీతి కేసును సి బి ఐ చేదించలేదు..మేడా శ్రీనివాస్ ..రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

ఆయాషా మీరా కేసులో చేతులు దులుపుకున్న సి బి ఐ సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయగలుగుతుందా !… భారత్ లో సి బి ఐ,కి కేసు బదలాయింప బడింది అంటేనే ముద్దాయిలకు, అనుమానితులకు , నేరగాళ్ళ కు ఊరట కల్పించి నట్టే కదా !.. ఇప్పటి వరకు జరిగిన మహిళా హత్యా చార కేసుల్లో సంపన్న ముద్దాయిలను శిక్షించ గలిగారా ! నిరుపేద, సామాన్య ముద్దాయిలను శిక్షించ గలిగారా !..భారత్ లోను , ముఖ్యంగా ఆంధ్ర – తెలంగాణా ల్లోను నేర పరిశోధన వ్యవస్థ బూజు పట్టుకు పోయింది . ఎవరు నేరస్తుడో, ఎవరు నిర్దోషో తేల్చి చెప్పటం అంత సాధ్యం కాదు..

👉హత్య చేసిన కసాయి తల్లి..*కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి..చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన..భర్త పక్షవాతంతో బాధపడుతుండగా,

అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ…ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి..వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ను కూడా కడతేర్చిన కసాయి తల్లి ..కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించిన కవిత..పోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు..2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకున్న కిల్లర్ లేడీ.. మరో హత్య కోసం కూడా ప్లాన్ ..  ప్రియుడిని, కవితను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

👉విద్యారంగ సమస్యలు పరిష్కరించమని అడిగితే అరెస్టు చేయడము సిగ్గుచేటు.. *అక్రమ అరెస్టులకు భయపడం ఖబర్దార్ రేవంత్ రెడ్డి.* పి.డి.ఎస్.యు.*

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి.*ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఖమ్మంలో విద్యార్థి సంఘాల నాయకులు అరెస్ట్ చేయడాన్ని PDSU ఖండిస్తుందని పి.డి.ఎస్.యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించమని అడిగితే అరెస్టుచేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పి.డి.ఎస్.యూ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని,పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు రియల్ మెంట్స్ విడుదల చేయాలని అద్దె భవనాలు తో నడుపుతున్న హాస్టల్స్ మరి గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని అన్నారు. సంక్షేమ హాస్టల్స్ డైట్ బిల్లులు విడుదల చేయాలన్నారు. అధిక పేజీలు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలి. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.. రేవంత్ రెడ్డి  తక్షణమే ఇవ్వాలి సంక్షేమ హాస్టల్స్లో మరియు గురుకులంలో ఫుడ్ పాయిజన్ అరికట్టాలి మెడికల్ కాలేజ్ పనులను తక్షణమే పూర్తి చేయాలి.జేఎన్టీయూ కాలేజీను ఖమ్మం కి షిఫ్ట్ చేయాలి. ఈ సమస్యల మీద అడుగుతే ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సంఘం నాయకులను ఎక్కడికక్కడికి అరెస్టు చేయడం సరికాదని వారన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని వారు కోరారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడా కార్పొరేట్ విద్యాసంస్థల కుమ్ముకాస్తూ విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నది పేరుకే తప్ప విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. సమస్యలను పరిష్కరించుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని అన్నారు. నేడు వస్తున్న ముఖ్యమంత్రి ఈ సమస్యలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అజయ్ అభి రాఖి శ్రీకాంత్ పాల్గొన్నారు.

👉నర్సంపేట లో యూరియా గోసా*

*వరంగల్ ::: నర్సంపేట ::::యూరియా కోసం నర్సంపేట అంగడి సెంటర్ లో బుధవారం రోజున అన్నదాతలు ఆందోళనకు దిగారు. యూరియా బస్తాల కోసం సహకార సొసైటీ దగ్గర వారం రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ యూరియా రాకపోవడంతో ఈరోజు నర్సంపేట అంగడి సెంటర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు.*

👉లంచాల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు* *అర్ధరాత్రి ఆడపడుచులు రోడ్లపై బైఠాయింపు*

*ఊరికి పది బెల్ట్ షాపులు పెట్టి కుటుంబాలను రోడ్డున పడేస్తున్న ఎక్సైజ్ శాఖ* *బిడ్డలకి కడుపునిండా అన్నం పెట్టడం లేదు కానీ ఆ తండ్రి మాత్రం మందులో తూగుతున్నాడు*జగ్గయ్యపేట నియోజకవర్గంలోవైన్ షాప్ లు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడానికి గుడులు బడులు వీరికి నిబంధనలు వర్తిన్సవా?*షేర్ మహమ్మద్ పేట గ్రామ సచివాలయం ఎదురుగా గల బెల్ట్ షాపును తీసివేయాలని కోరుతూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలియపరుస్తున్న మహిళలు…

👉తార్నాక: ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటున్న వ్యక్తి అరెస్టు..

ఉస్మానియా యూనివర్సిటీలో ఆగస్టు 31న జరిగిన ఘటనలో, ఐఏఎస్ అధికారిగా చెప్పుకుంటున్న వ్యక్తితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీనికి ప్రతిగా, ఆ వ్యక్తి తనను ప్రశ్నించినందుకు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు.

👉👉 మణికొండలో నాలాను పూడ్చేసి నిర్మాణాలు చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో చూసి చూడనట్లు వదిలేస్తున్న హైడ్రా.. మణికొండ జాగీరులో సర్వే నెంబర్ 187లో స్థలాన్ని కొన్న ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్ రావు.. ఆ తర్వాత భూమిని తన సోదరుడు శ్రీమన్నారాయణకు బదలాయింపు… సర్వే నెంబర్ 187లో బుల్కాపూర్ నాలా ఉండగా దానిని పూడ్చేసి కబ్జా…ఇప్పుడు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వీరి సంస్థ టీం 4 లైఫ్ స్పేసేస్ ఆర్కా ప్రాజెక్టు …రేవంత్ రెడ్డి, దామరచర్ల జనార్ధన్ రెడ్డి టీడీపీ మిత్రులు కావడంతో హైడ్రా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న స్థానికులు.

👉 అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబ‌ర్ 1070

తెలంగాణ : హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ఫ్రీ నంబ‌ర్ 1070 అందుబాటులోకి వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే టోల్‌ఫ్రీ ద్వారా స‌మాచారాన్ని అందించ‌వ‌చ్చన్నారు. చెట్లు ప‌డిపోయినా, వ‌ర‌ద ముంచెత్తినా, అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగినా టోల్ ఫ్రీ నంబ‌ర్ కు కాల్ చేయాలన్నారు. అందుబాటులో సెల్ నంబ‌ర్లు కూడా ఉన్నాయన్నారు.

👉జమ్మికుంటలో యువతి అదృశ్యం.. పోలీసుల దర్యాప్తు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఓర్సు స్రవంతి అనే 18 ఏళ్ల యువతి అదృశ్యమైంది. సోమవారం రాత్రి 8:30 గంటలకు కిరాణా షాపుకు వెళ్తానని చెప్పి వెళ్లిన స్రవంతి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు, కానీ ఆచూకీ లభించలేదు. మంగళవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

👉లేడి డాన్….అరుణ అరచకాలు మామూలుగా లేవుగా.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు!* నెల్లూరు లేడీ డాన్‌ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు మరింత బిగుస్తోంది.. ఆమెపై వరస కేసులు నమోదవుతున్నాయి..తాజాగా మరో కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన అరుణపై మరో కేసు నమోదైంది.. అన్నదమ్ముల ఆస్తివివాదంలో తలదూర్చి గన్‌తో తనను బెదిరించారని బాధితుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు.. నవాబుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు.

అరుణ అనుచరులు అరుగురిని విచారించిన కోవూరు పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించారు.అరుణ దందాలపై ఆమె అనుచరులు పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అప్సర్, షేక్ మునీర్, మచ్చకర్ల గణేష్, ఎలిషాలను కోవూరు CI సుధాకర్ రెడ్డి విచారించారు. అరుణతో కలిసి చేసిన నేరాలు, బెదిరింపులు, దందాల గురించి ఆరాతీశారు. కాగా.. ఇప్పటికే సాయి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను ఆక్రమించిన కేసులో అరుణతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కి పంపించారు. కోర్టు14 రోజుల రిమాండ్ విధించగా.. రేపటితో ముగియనుంది.. దీంతో పోలీసులు మళ్లీ ఆమెను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది..  నెల్లూరు జిల్లా కోవూరు పరిధిలోని పడుగుపాడుకు చెందిన బిల్డర్‌ను బెదిరించిన కేసులో ఈ నెల 19న ఆమె అరెస్ట్‌ అయింది. రౌడీషీటర్‌ శ్రీకాంత్ గ్యాంగ్‌తో ఉన్న సంబంధాలు.. వారిని అడ్డం పెట్టుకుని చేసిన దందాలు గురించి పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించారు. ప్రధానంగా.. గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్‌లో దందాలు, దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండడంతో వాటి ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోవూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు

👉పొలం పిలుస్తుంది .. ప్రకాశం జిల్లా..

కంభం మండలంలోని రావి పాడు, హజరత్ గూడెంగ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం పొగాకు పంట సాగు చేయకుండా రైతు సోదరులు అందరూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ముఖ్యంగా నల్ల బర్లి తెల్ల బార్లీ పొగాకు రకాలను పూర్తిగా మానుకోవాలని తెలిపారు. అలాగే మొక్కజొన్న విత్తన ఉత్పత్తి కొరకు సాగు చేసే రైతులు సంబంధిత కంపెనీలు ఆర్గనైజర్ల నుండి అగ్రిమెంట్లు తీసుకొని సాగు చేయాలని సూచించారు. ఉద్యాన శాఖ విస్తరణ అధికారి శేషగిరి మాట్లాడుతూ పండ్ల తోటలకు సంబంధించి వివిధ పథకాలు రాయితీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మల్లికార్జున ప్రతాప్ రైతులు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా