👉ఆటంబాంబ్ అయిపోయింది హైడ్రోజన్ బాంబ్ రాహుల్?..👉 యూరియా కొరతకు నిరసనగా తెలంగాణలో కొనసాగుతున్న నిరసనలు..👉మార్కాపురంలో రాహుల్ గాంధీ ఫోటోలను పెట్రోల్ పోసి తగల పెట్టిన బీజేపీ నేతలు..👉ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదు.. మాజీ సీఎం జగన్..👉కడప రిమ్స్ లో పేషంట్లను పట్టించుకోని డాక్టర్లు,,,👉 ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులను పీక్కు తింటున్న వార్డు బాయిలు.ఎన్టీఆర్ జిల్లా..విజయవాడ… 👉 జమ్మలమడుగు లో *ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు..జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు హెచ్చరిక..!!!..👉 కంభంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీ..👉 వైఎస్సార్ కీర్తి,ప్రతిష్టలు చిరస్మరణీయం..మాజీ ఎమ్మెల్యే “అన్నా..👉మా ఆకలి కేకలు మీకు కనపడవా ~ ఆటో కార్మికులు నిరసన*

👉ఆటంబాంబ్ అయిపోయింది హైడ్రోజన్ బాంబ్ రాహుల్?.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలు ఎంత ఆచితూచి అన్నట్లు ఉండాలి? అందునా సంచలనం ఖాయమని చెప్పే సందర్భంలో.. మాటల తీవ్రతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చేతలు ఉండాలి. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలు ఎంత ఆచితూచి అన్నట్లు ఉండాలి? అందునా సంచలనం ఖాయమని చెప్పే సందర్భంలో.. మాటల తీవ్రతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చేతలు ఉండాలి. కానీ.. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. దేశంలో ఓట్ల చోరీ జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేయటం.. దీనికి సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు పెద్దగా ప్రభావాన్ని చూపింది లేదు. కొద్దిరోజుల క్రితం ఓట్ల చోరీ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. త్వరలో తాను ఆటంబాంబ్ ను పేలుస్తానని చెప్పటం.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే.. ఓట్ల చోరీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తుస్సుమనటం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసారి తాను హైడ్రోజన్ బాంబ్ పేల్చనున్నట్లుగా చెప్పారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని.. ఆయన తలెత్తుకోలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజ్ కు ముందు విడుదలయ్యే టీజర్ ఆసక్తికరంగా ఉంటే.. సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే విడుదలైన పార్ట్ 1 ఆటంబాంబ్ డిజాస్టర్ గా మారిన వేళ.. పార్ట్ 2గా విడుదలయ్యే హైడ్రోజన్ బాంబ్ అంటూ తన మాటలతో హైప్ తెచ్చే ప్రయత్నం చేసినా.. ఎలాంటి ఫలితం లేని పరిస్థితి నెలకొందన్న వాదన వినిపిస్తోంది. ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెబుతున్న రాహుల్ గాంధీ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ ఇష్యూను టేకప్ చేయటం తెలిసిందే. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమాన్ని ముగిస్తూ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రాహుల్.. త్వరలో తాను బయటపెట్టే నిజాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి నెలకొని ఉంటుందని పేర్కొన్నారు. ఓటుహక్కును రక్షించేందుకు తాను యాత్ర మొదలు పెట్టినట్లు చెబుతున్న రాహుల్.. తాను చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చేసుకోవటం గమనార్హం. తిరుగులేని అధికారంతో దూసుకెళుతున్న మోడీ లాంటి నేతను ఎదుర్కొనే వేళలో.. మరింత జాగ్రత్తగా కసరత్తు చేసుకోవటం.. తాము అనుకున్న కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని రాహుల్ మరెంత కాలానికి గుర్తిస్తారో చూడాలి.

👉 యూరియా కొరతకు నిరసనగా రోడ్డుపై రైతుల వంటా వార్పు..
గణపతి బప్పా మోరియా కావాలయ్య యూరియా అంటూ నినాదాలు..వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నడి రోడ్డుపై రైతుల ఆందోళన.. పెద్ద ఎత్తున నిలిచిపోయిన వాహనాలు
365 జాతీయ రహదారిపై వంటా వార్పు చేస్తూ ఆందోళన చేసిన మహిళా రైతులను అడ్డుకుంటున్న పోలీసులు
👉 వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలోని మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా… రంగంలోకి దిగిన పోలీసులు..
👉సద్ది కట్టుకుని యూరియా కోసం పడిగాపులు*
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లి వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సొసైటీ వద్దకు సద్దన్నం తెచ్చుకొని, అక్కడే పడిగాపులు కాస్తూ, అక్కడే భోజనం చేస్తూ యూరియా బస్తాల కోసం అన్నదాతలు ఎదురు చూస్తు న్నారు. ఇది రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను స్పష్టంగా తెలియజేస్తుంది..* కోఆర్డినేటర్ షేక్ ఫర్జానా
👉 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద.. వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఘనంగా నివాళులు అర్పించారు.

👉మార్కాపురం లోని గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోటోలను పెట్రోల్ పోసి తగల పెట్టిన బీజేపీ నేతలు..
బీహార్ లోని కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలను మందలించకుండా రాహుల్ గాంధీ వ్యంగంగా నవ్వడాన్ని ఆగ్రహిస్తూ బీజేపీ నిరసన ….
రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు….
👉ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదు..
ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదు..
పోలీసులను అడ్డంపెట్టుకుని దౌర్జన్యం చేశారు..
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు:
బాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు – వైఎస్ జగన్
👉కడప రిమ్స్ లో పేషంట్లను పట్టించుకోని డాక్టర్లు,,, క్లీనింగ్ పేరుతో నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్న క్లీనింగ్ సిబ్బంది,,
ఓ గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో కడప జిల్లాలోని రిమ్స్ లో అడ్మిట్ అయింది డాక్టర్లు ఎవరు పట్టించుకోకపోవడంతో పురిటినొప్పులు తో బాధపడుతున్న గర్భిణి స్త్రీ వద్దకు తన తల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న క్లీనింగ్ సిబ్బంది, క్లీనింగ్ పేరుతో ఆటలాడుకుంటూ రెండు గంటల పాటు గర్భిణీ స్త్రీ వద్దకు ఆమె తల్లినీ వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ,, ఆడుకుంటున్న క్లీనింగ్ సిబ్బంది,
ఎందుకు మా అమ్మయి దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు అంటూ అడిగినందుకు ప్రజలపైకి వాగ్వాదానికి దిగిన రిమ్స్ క్లినిక్ సిబ్బంది ఇది గమనించిన గర్భిణీ స్త్రీ తమ్ముడు తన కెమెరాలో వీడియో తీస్తుండగా అది గమనించిన నర్సులు కూడా వాగ్వాదానికి దిగారు ,,ఇలా పేషెంట్లను పట్టించుకోని డాక్టర్లు, మరియు నర్సులు, క్లీనింగ్ పేరు తో ఆటలాడుకుంటున్న సిబ్బందినీ ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుకుంటున్నాను గతంలో ఒక నెల క్రిందట కడప రిమ్స్ చెవి పేషంట్ల విభాగము లో వాష్ రూమ్ లో లిటిల్ బాత్రూంలో క్లీనింగ్ సరిగా లేక వాటర్ సప్లై లేక అని కూడా టీవీ 999 వారు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన రిమ్స్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు వెంటనే కడప రిమ్స్ యాజమాన్యం కలుగజేసుకొని ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని వెంటనే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సస్పెండ్ చేయవలసినదిగా టీవీ 999 ద్వారా హెచ్చరించడం జరుగుతుంది
👉 ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులను పిక్కు తింటున్న వార్డు బాయిలు.ఎన్టీఆర్ జిల్లా..విజయవాడ.
విజయవాడ కొత్తగవర్నమెంట్ హాస్పిటల్ లో జరుగుతున్న తంతు.
రోగిని వార్డుకి షిఫ్ట్ చేయాలంటే పేషెంట్ బంధువు యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు గాని ఏదో ఒక ఐడి ప్రూఫ్ సెక్యూరిటీకి సూరి టీ పెడితే వీలు చైర్ ఇస్తారట వీల్చరుపై పేషెంట్ ని తీసుకెళ్లి వార్డులో జాయిన్ చేసిన తర్వాత అప్పుడు వార్డు బై బాబు ఫార్మాలిటీ ఇవ్వు అంటూ డిమాండ్ చేస్తూ వంద నుంచి 500 వరకు పేషెంట్లు దగ్గర డిమాండ్ చేసి పీక్కుంటున్న వార్డ్ బాయ్ ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు ఇస్తున్న వార్డ్ భాయ్..
ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అక్కడకు వస్తున్న రోగులు వైద్యులను వేడుకుంటున్నారు.
ఇదండీ మా ప్రభుత్వంలో జరుగుతున్న తంతు.
👉మా ఆకలి కేకలు మీకు కనపడవా ~ ఆటో కార్మికులు నిరసన*
అమలాపురం:కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీ శక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏటా 15000 ఇస్తుందని మాటలలో చెప్పడమే తప్ప చేతల్లో లేదని మా కార్మికుల కుటుంబాలు పడుతున్న బాధను తీర్చాలంటే మాకు 25000 కచ్చితంగా ఇవ్వాలని గత సంవత్సరం బకాయికి ఈ సంవత్సర బకాయిని కూడా కలిపి 50000 చెల్లించాలని మరియు 50 సంవత్సరాలు నిండిన మా ఆటో డ్రైవర్లకు పెన్షన్ వసతి కలుగచేయాలని కోరారు. రేపటి నుంచి నల్ల బ్యాడ్జిలతో ఆటో కి నల్ల జండాతో మా నిరసన ప్రభుత్వానికి తెలియచేస్తామని తదుపరి కార్యాచరణ రేపు జరగబోవు రామచంద్రాపురం డివిజన్ ఆటో కార్మికులతో కూడా చర్చించి త్వరలో 48 గంటలు నిరహార దీక్ష చేపడతామని ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ప్రభుత్వం తగు భద్రత కల్పించేవరకు దఫా దఫాలుగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని .కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీ ఊటాల వెంకటేష్ తెలియచేశారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి సత్తిరాజు మరియు మండల డివిజన్ జిల్లా ఆటో కార్మిక సంఘాల నాయకులు,సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
👉 కడప జీల్లాజమ్మలమడుగు లో
*ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు..జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు హెచ్చరిక..!!!
రైతులకు అందాల్సిన ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే చర్యలు తప్పవని జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జమ్మలమడుగు పట్టణంలోని ఎరువుల దుకాణాలలో జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.రైతుల పాస్ బుక్కులు చూసి ఎన్ని ఎకరాలకు ఎంత మేర అవసరం ఉంటుందో ఆ మేరకు మాత్రమే విక్రయించాలని డి.ఎస్పీ డీలర్లకు సూచించారు.విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించాలని డి.ఎస్పీ తెలిపారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. లైసెన్స్, విక్రయ రికార్డులను తనిఖీ చేశారు. యూరియా, ఫాస్ఫెట్, నత్రజని తదితర ఎరువులను అధికధరలకు విక్రయిస్తే షాపులు సీజ్ చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జమ్మలమడుగు డి.ఎస్.పి హెచ్చరించారు.జమ్మలమడుగు అర్బన్ సి.ఐ పి.నరేష్ బాబు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
👉విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీ..
మన గ్రోమోర్ సెంటర్, కళ్యాణి ట్రేడర్, ఈశ్వర ఏజెన్సీస్ లలో మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు.
మనగ్రోమోర్ సెంటర్ లో రికార్డులు అప్డేట్ చేయని కారణంగా 4.5 టన్నుల డిఏపి ఎరువులను అమ్మకాలను నిలుపుదల చేశారు
కార్యక్రమంలో సీఐ అపర్ణ, తాసిల్దారు బి ఎస్ పాల్, విజిలెన్స్ , ఏ డి ఏ బాలాజీ నాయక్, స్థానిక ఏవో ఎస్ కే మహమ్మద్, విజిలెన్స్ao శివ నాగ ప్రసాద్, కానిస్టేబుల్ కృష్ణ, అనిత, తదితరులు పాల్గొన్నారు
👉 డాక్టర్ వైఎస్సార్ కీర్తి,ప్రతిష్టలు చిరస్మరణీయం. *మాజీ ఎమ్మెల్యే “అన్నా”*
*మార్కాపురం టౌన్ గడియార స్తంబం సెంటర్ మరియు జువ్వి చెట్టు సెంటర్ నందు YSR వర్ధంతి*
*”ప్రజల కోసం జీవించి,ప్రజల కోసం పోరాడి…ప్రజల హృదయలలో శాస్వితంగా నిలిచిన వైయస్సార్ “**ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డికి ప్రజల హృదయాల్లో ఆయన సముపార్జించిన కీర్తి,ప్రతిష్టలు ఎప్పటికీ చిరస్మరణీయంగా వుంటాయని మాజీ ఎమ్మెల్యే,YSRCP మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి అన్నా రాంబాబు గారు అన్నారు.*
*డా.YSR జయంతి సందర్భంగా మార్కాపురం టౌన్ లోని గడియార స్తంబం సెంటర్ మరియు జువ్వి చెట్టు దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహల వద్ద జరిగిన కార్యక్రమంలో అన్నా రాంబాబు పాల్గొన్నారు.*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సుపరిపాలన,సేవలను ఆయన వివరించారు.*ఆయన ఆశయాల సాధనే మన కర్తవ్యంగా YSRCP ప్రతి కార్యకర్తల పని చేయాలన్నారు.*
*సామాన్యుల కోసం పోరాడడమే రాజన్నకు మనం*
*సమర్పించే ఘాననివాళి అన్నారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు,* *కార్యకర్తలు పేద్ద ఎత్తున పాల్గొన్నారు.*
👉డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ప్రకాశం జిల్లా.
కంభం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు.పేదలకు దుప్పట్లు పంపిణి చేశారు.తల్లి తండ్రి లేని పిల్లలకు బట్టలను పంపిణి చేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నారాయణ,జిల్లా కమిటీ పోగ్రామ్ కమిటీ సభ్యులు ఉదయగిరి మల్లికార్జున,సొసైటీ బ్యాంకు డైరెక్టర్ సందు వరలక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శి లోకేష్,చెన్నకేశవుల సుబ్బారాయుడు,గ్రంధి శ్రీను,కోళ్ల రమణ, బీరల శంకర్, బాలరాజు,పాణ్యం వెంకట్,అజ్జు, బత్తిన విష్ణు,బీజేపీ,టీడీపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా