👉పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్‌ ఎటాక్‌..*👉ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిగ్మా ఆసుపత్రిపై తక్షణ చర్యలు జిల్లా వైద్యాధికారికి విన్నవించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్*…👉జనగామ హాస్పిటల్ లో దారుణం పేషంట్ అటెండర్ ల పై దాడికి దిగుతున్న డాక్టర్లు*..👉ప్రసాదం ఇవ్వలేదని పూజారిని కొట్టి చంపారు..👉పదవీ విరమణ అధికారులకు ఘన సన్మానం (ఎన్టీఆర్ జిల్లా పలు కార్యక్రమాలలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి .

👉పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్‌ ఎటాక్‌..*

**ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌..* **తాను, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని అన్నారు..*     ఆంధ్రప్రదేశ్‌లో సుగాలి ప్రీతి కేసు మరోసారి చర్చగా మారి రచ్చకు దారితీస్తోంది.. సుగాలి ప్రీతి తల్లి పార్వతి కామెంట్లపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించడం..*  ఆ తర్వాత జనసేన కౌంటర్‌ ఇవ్వడంతో రచ్చగా మారింది.. ఇక, మరోసారి స్పందించిన సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కౌంటర్‌కు దిగారు.. పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా సంతోషించాం.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి, 5 స్థలం, ఉద్యోగం ఇచ్చారు.. అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.. నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. అయినా, నేను డబ్బుకోసం పోరాటం చేయడం లేదు.. నా కూతురు చనిపోయిన రోజే డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్‌ ఎలా అబద్ధాలు చెబుతున్నారు? అంటూ నిలదీశారు..     పవన్ కల్యాణ్‌ మాట తప్పారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడా ఈ కేసు తీసుకెళ్లారు.. ఇప్పడు పవన్ కల్యాణ్ పై ఒత్తిళ్లు వస్తున్నాయా, ప్రలోభాలకు లొంగిపోయారా? అంటూ మండిపడ్డారు పార్వతి.. 14 నెలలుగా ప్రీతిబాయి కేసు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించడం తప్పా..? అని నిలదీశారు.. నటి జత్వాని కేసులో ఎలా జైలుకు పంపారో… ప్రీతిబాయి కేసులో విచారణాధికారులకు నార్కో అనాల్సిస్ టెస్ట్ చేయండి అంటూ సలహా ఇచ్చారు సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి..     కాగా, సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. తాను, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని గుర్తుచేసుకున్నారు.. ఆ పాపకి న్యాయం జరగాలి ఏమీ ఏమీ జరిగింది అని అడిగా? సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫారసు చేశాను.. సీఐడీ చీఫ్‌, డీఐజీ, హోం మంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని నేను స్పష్టంగా చెప్పానన్నారు. అయితే, అప్పట్లో ఎవరైతే కుట్ర వెనుక ఉండి చెపుతున్నారో DNA తారుమారు చేశారు.. ఒత్తిడి చేసి భూములు అన్ని ఇచ్చేసి సాక్ష్యాలు తారుమారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. DNA సాక్ష్యాలు మ్యాచ్ కావడం లేదు అని పోలీసులు చెపుతున్నారు ఇది వాస్తవం.. వివేకానందరెడ్డి ని చంపేశారని అందరకి తెలుసు.. ఎవరయితే నిందితులు ఉన్నారో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు.. మరి గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళానికే పూనుకున్నాం.. ఒక్కొక్క కేసును పరిష్కరిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

👉ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిగ్మా ఆసుపత్రిపై తక్షణ చర్యలు జిల్లా వైద్యాధికారికి విన్నవించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్*…జిల్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారి డా ప్రమోద్ ని కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్*.,వైద్యారోగ్య శాఖ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం : ప్రజా సంఘాలు*ఆరోగ్యశ్రీ పేషెంట్లనుండి డబ్బులు గుంజుతున్న దుస్థితి ఆరోపిస్తున్న ప్రజలు*…జగిత్యాల జిల్లా ..ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వైద్యం పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని, ఇందులో భాగంగా కొన్ని ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇందులో భాగంగా జగిత్యాల్లోని సిగ్మా ఆసుపత్రి అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రజలు,ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.

ఈ మధ్యనే సిగ్మా హాస్పిటల్ లో రాయికల్ కు చెందిన బైరి లక్ష్మన్ హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి బైరి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో (ఎన్ హెచ్ ఆర్ సి) సభ్యులకు కలిశారని తెలిపారు….అందుకుగాను ఎన్ హెచ్ ఆర్ సి ఎన్జీవో సభ్యులు జగిత్యాల జిల్లా వైద్యాధికారి, జిల్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారి డా ప్రమోద్ ను కలిసి ఈ సంఘటనపై తగిన దర్యాప్తు జరిపించి, సిగ్మా ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని,వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని విన్నవించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్వాపరాలను తెలిపారు.2025 ఆగస్టు 18న జగిత్యాల లోని సిగ్మా హాస్పిటల్ లో రాయికల్ కు చెందిన బైరి లక్ష్మన్ అడ్మిట్ చేయడం జరిగిందని తెలిపారు.అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ వైద్యులు పేషెంట్ సీరియస్ గా ఉన్నారని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారని, పేషెంట్ కి ఆరోగ్య శ్రీ అప్రూవల్ కొరకు రెండు రోజులు ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చేవరకు అలాగే ఉంచారు, ఆ తరువాత రెండు రోజులు ట్రీట్మెంట్ కు సంబంధించిన మిషన్ పనిచేయడం లేదని మరలా రెండు రోజులు అలాగే ఉంచారని తెలిపారు. శనివారం రోజున అనగా 2025 ఆగస్టు 23 తేదీన పేషంటు చనిపోయాడని పేషెంట్ కుటుంబ సభ్యులకు తెలియజేశారని తెలిపారు. అంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుకున్నారని బైరి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో (ఎన్ హెచ్ ఆర్ సి) సభ్యులకు తెలియజేశారని తెలిపారు.అసలు హాస్పిటల్లో ఏం జరిగింది, అసలు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు, పేషంటు ఎందుకు చనిపోయారు ఈ సంఘటనపై తగు విధమైన దర్యాప్తు చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేశారు.అందుకుగాను ఎన్ హెచ్ ఆర్ సి ఎన్జీవో సభ్యులు జగిత్యాల జిల్లా వైద్యాధికారి, జిల్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారి డా ప్రమోద్ ను కలిసి ఈ సంఘటనపై తగిన దర్యాప్తు జరిపించి, సిగ్మా ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని,వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని విన్నవించినట్టు తెలిపారు.వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం జరిపిస్తామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో సంస్థ ఆ కుటుంబం సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో చైర్మన్ ఐలనేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారం, నేషనల్ కన్వీనర్ జగదీష్, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ప్రభాకర్, జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పం చిన్నారెడ్డి, జగిత్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రకాష్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్, జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ సంగేపు ముత్తు, జగిత్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ తునికి రాజేష్, కోరుట్ల పట్టణ ఉపాధ్యక్షులు అల్లరి నరేష్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

👉జనగామ హాస్పిటల్ లో దారుణం పేషంట్ అటెండర్ ల (సహాయకులు) పైన దాడికి దిగుతున్న డాక్టర్లు*
*జనగామ జిల్లా ఏరియాహాస్పిటల్ లో సిరిపురం గ్రామం నుండి దుర్గి పూలమ్మ అనే దళిత మహిళా పేదరికంతో ఉండి ప్రవేటు ఆసుపత్రికి పోయి చికిత్స చేయించుకోలేని స్తోమతలో ఉన్నందున” సిపిఎం లింగాల గణపురం మండల కార్యదర్శి బొడ్డు కరుణాకర్ మరియు ఇతర మిత్రుల తో పూలమ్మను తన కారులో తీసుకొని ఆసుపత్రికి రాగా స్ట్రక్చర్ పై తీసుకపోయే ట్రాలీ బాయ్ కూడా అందుబాటులో లేకపోతే తన వెంట వచ్చిన మిత్రులే స్ట్రక్చర్ పై పూలమ్మను పడుకోబెట్టుకుని ఎమర్జెన్సీ విభాగానికి తీసుకపోవడం జరిగింది. అప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ స్నేహిత్ ను హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకోమని అడిగినందుకు ఆగుతలేదా లంజాకొడకా అనుకుంటూ తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ మెడికల్ ఎమర్జెన్సీ కిట్ ట్రే లో ఉన్న పాయిజన్ బాటిల్ తో సిపిఎం నాయకుడు కరుణాకర్ పై దాడి చేసి విచక్షణ మరచి కొట్టున కొట్టిన డాక్టర్ డాక్టర్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ..అలాగే అక్కడ ఆ సందర్భంలో డ్యూటీలో ఉన్న స్టాప్ అందరిపై సస్పెన్స్ వేటు వేయాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది*

👉ప్రసాదం ఇవ్వలేదని పూజారిని కొట్టి చంపారు ఢిల్లీలో…*గుడిలో ప్రసాదం కోసం ఓ మనిషి ప్రాణం తీసిన గొడవ.. దేశ రాజధాని ఢిల్లీలో కల్కాజీ ఆలయం ఉంది. అందులో యోగేంద్ర సింగ్‌(35) గత 15 సంవత్సరాలుగా సేవకుడిగా పనిచేస్తున్నాడు. ఆలయంలో రకరకాల పనుల్లో అతని భాగస్వామ్యం ఉంటుంది. నిన్న కొందరు వ్యక్తులు ఆలయంలో దర్శనం పూర్తి చేసుకుని ప్రసాదం కోసం అతని దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో వారి దురుసు ప్రవర్తన వల్ల అతనికీ, వారికీ మధ్య గొడవ జరిగింది. అది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. కొద్దిసేపట్లోనే అది హింసాత్మకంగా మారింది.దీంతో వారు అతణ్ని బయటకు లాక్కొని వచ్చి, కర్రలతో చితకబాదారు. విచక్షణారహితంగా చేసిన ఆ దాడిలో యోగేంద్ర సింగ్‌‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అతను మరణించాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

👉పదవీ విరమణ అధికారులకు ఘన సన్మానం.

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదవీ విరమణ పొందిన 6 మంది పోలీసు అధికారులకు, పోలీస్ కమిషనర్  ఎస్.వి. రాజశేఖర బాబు,   ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. వారు ప్రజాసేవలో చేసిన అంకిత సేవలకు కృతజ్ఞతగా పోలీస్ మర్యాదలతో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

🌟పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..

👉నివాళులర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల**గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో అనారోగ్యంతో మరణించిన టిడిపి కార్యకర్త మండ్ల బుజ్జి మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు వ్యక్తం చేస్తూ వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు నివాళులు అర్పించారు..*
👉చోళ్ళవీడు గ్రామంలో రూ. 1 కోటి 22 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల**రాచర్ల మండలం, చోళ్ళవీడు గ్రామ పంచాయతలో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు రూ. 1,22,00000-00 ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా రూ. 43.60 లక్షలతో రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రూ. 24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ, 20.80 లక్షలతో నిర్మించిన హెల్త్ సెంటర్ ను, రూ. 34 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయని, ప్రజా అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కటికె యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి మాజీ జడ్పిటిసి సభ్యులు బత్తిని వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వెంకట్రామిరెడ్డి,  సుబ్బారెడ్డి, ఏ.ఈ సుబ్బారావు, బత్తిని రామకృష్ణ, బత్తిని రాజశేఖర్, ఈదుల రంగస్వామి రెడ్డి, యాస శ్రీనివాసరావు,  మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు..*
👉సురభేశ్వర కోనలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల*

*రాచర్ల మండలంలోని శ్రీ సురభేశ్వర కోనలో వెలసిన శ్రీ సురభేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి  స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి స్వామి వారి తీర్థ ప్రసాదాలను వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల నాయకులు  పాల్గొన్నారు..*
👉రాచర్ల మండలం, చోళ్ళవీడు గ్రామంలో నిర్వహించిన గణపతి ఉత్సవాలలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి ..*
👉పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల*

*బేస్తవారిపేట మండలం, చిన్న ఓబినేనిపల్లె గ్రామంలో బోయిళ్ళ బాల ఈశ్వర్ రెడ్డి గారి పదవీ విరమణ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గోని వారి దంపతులకు పూలమాల శాలువా వేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు కంభం, గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు పూనూరు భూపాల్ రెడ్డి, బైలడుగు బాలయ్య, స్థానిక సర్పంచ్ బోయిళ్ళ శ్రీనిశ్వరరెడ్డి, ఎస్సై రవీంద్రా రెడ్డి, మరియు మండల తెలుగుదేశం నాయకులు స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు..*

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా