🌟నిరుద్యోగం అతి పెద్ద వైఫల్యం.. ఎన్డీఏ ప్రభుత్వంపై పౌరుల మనోగతం🌟 ఇండియా టుడే-సీ ఓటర్‌ సర్వేలో🌟… 🌟ప్రతిపక్ష నేతగా దూసుకెళుతున్న రాహుల్.. ఇండియా టుడే సర్వేలో స్పష్టమైన ఆధిక్యం!🌟.. హైడ్రాను అభినందించిన హైకోర్టు🌟🌟లంచం తీసుకున్న ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష !*ఏసీబీ కోర్టు సంచలన తీర్పు*..👉రూ.56 లక్షల జీహెచ్ఎంసీ నిధులు కాజేసిన మహిళా కంప్యూటర్ ఆపరేటర్😱..👉 మహబూబాబాద్ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న శునకాలు…🌟పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్…👉 రోజా అవినీతి ఆటపై రిపోర్టు ఏమైంది?.. 👉లంచం తీసుకున్న ఎస్సై కి ఏడేళ్ల జైలు శిక్ష (కర్నూలు)..మహబూబాబాద్ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న శునకాలు..1,218 మందికి గాయాలు

🌟ప్రతిపక్ష నేతగా దూసుకెళుతున్న రాహుల్.. ఇండియా టుడే సర్వేలో స్పష్టమైన ఆధిక్యం!🌟

ప్రతిపక్ష కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకే ప్రజా మద్దతు.. ఇండియా టుడే-సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడి…రాహుల్‌కు 28.2 శాతం మంది ఓటు, రెండో స్థానంలో మమతా బెనర్జీ..లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ పనితీరు మెరుగుపడిందని వెల్లడి

ఆయన పనితీరు ‘అద్భుతం’ అన్న వారి సంఖ్య 28 శాతానికి పెరుగుదల..గత సర్వేతో పోలిస్తే రాహుల్‌పై వ్యతిరేకత గణనీయంగా తగ్గుదల… కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే అత్యంత సమర్థుడని తాజా సర్వేలో వెల్లడైంది. ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది ప్రజలు రాహుల్ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్షాలను సమర్థంగా నడిపించగల నేత ఎవరనే ప్రశ్నకు, సర్వేలో పాల్గొన్న వారిలో 28.2 శాతం మంది రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు… ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ 7.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (6.7 శాతం), ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (6.4శాతం), కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (4.4 శాతం) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే రాహుల్ గాంధీ ఆదరణ పెరగడం గమనార్హం. అప్పుడు ఆయనకు 23.9 శాతం మద్దతు లభించగా, ఇప్పుడు అది 28.2 శాతానికి చేరింది. అయితే, గత ఏడాది ఆగస్టులో వచ్చిన 32.3 శాతంతో పోలిస్తే ఇది కొంత తక్కువే.

🌟ప్రతిపక్ష నేతగా పనితీరు మెరుగుదల

లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరుపై కూడా ప్రజల అభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయన పనితీరు ‘అద్భుతంగా’ ఉందని చెప్పిన వారి సంఖ్య ఫిబ్రవరిలో 25 శాతం ఉండగా, ఇప్పుడు 28 శాతానికి పెరిగింది. అదే సమయంలో, ఆయన పనితీరు ‘బాగాలేదు’ (పూర్) అని చెప్పిన వారి సంఖ్య 27 శాతం నుంచి 15 శాతానికి గణనీయంగా తగ్గింది. మరో 22 శాతం మంది ‘బాగుంది’ అని, 16 శాతం మంది ‘సాధారణం’ అని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే-సీఓటర్ ఈ సర్వేను 2025, జులై 1 నుంచి ఆగస్టు 14 మధ్య దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించింది. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది.

🌟తెలంగాణకు కేంద్రం నుండి మరోసారి మొండి చేయి*

ఆంధ్రాకు 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు కేంద్రం ఆమోదం..ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు మొండి చేయి..కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రితో భేటీ అయిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు..గంగవరం పోర్ట్‌కు యూరియాను అనుకున్న సమయం కంటే వారం రోజుల ముందే పంపుతున్న కేంద్రం..సెప్టెంబర్ మొదటి వారం చివర్లో మరో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపిన అచ్చెన్నాయుడు.

🌟నిరుద్యోగం అతి పెద్ద వైఫల్యం.. ఎన్డీఏ ప్రభుత్వంపై పౌరుల మనోగతం🌟

ఇండియా టుడే-సీ ఓటర్‌ సర్వేలో వెల్లడి

గత 11 ఏండ్ల ప్రధాని మోదీ పాలనలో అతి పెద్ద వైఫల్యం నిరుద్యోగమని ఇండియా టుడే-సీ ఓటర్‌ నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వే తెలిపింది. ఈ 11 ఏండ్ల కాలంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారంటూ 27.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది గత సర్వేతో పోలిస్తే ఏడు శాతం ఎక్కువ. ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణంపై 16.8 శాతం, మందగమన ఆర్థికాభివృద్ధిపై 6.5 శాతం, మత హింస, మైనారిటీల్లో భయం అంశాలపై 5.8 శాతం, మహిళల భద్రతపై 5.3 శాతం, ఉగ్రవాద నిర్మూలించడంలో వైఫల్యంపై 4.8 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే దేశంలోని వ్యవసాయ దుస్థితిపై 6.8 శాతం, పేదరికంపై 6.6 శాతం, మౌలిక సదుపాయాల లేమిపై 6.1 శాతం మోదీ పాలనను వ్యతిరేకించారు. అయితే మొత్తం మీద మోదీ ప్రభుత్వం బాగానే ఉందని, అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తున్నదంటూ మెజారిటీ వర్గం ఈ సర్వేలో విశ్వాసం వ్యక్తం చేసింది. ఎన్డీఏ పాలనలో సాధించిన ఘనత అయోధ్య రామాలయ నిర్మాణమేనని అలాగే ఇటీవల జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌, మౌలిక అభివృద్ధి కూడా కేంద్రం సాధించిన ఘనతలేనని పౌరులు అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల మానసిక స్థితి (ఎంఓటీఎన్‌) పేరుతో ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో 54,788 మందిని సర్వే చేశారు. దీనికి అదనంగా సీ ఓటర్‌ నిత్యం చేసే 1,52,038 మంది ఇంటర్వ్యూల డాటాను కూడా విశ్లేషించి మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను క్రోడీకరించి సర్వే ఫలితాలను వెల్లడించారు.

*ట్రంప్‌ సుంకాలపై మెజారిటీ పౌరుల్లో ఆందోళన..భారత వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలపై భారతీయులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సీ ఓటర్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌(ఎంఓటీఎన్‌) తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో మూడువంతుల మంది (63 శాతం) ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 27 మంది మాత్రమే తాము పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రయోజనాలపై రాజీ పడకుండా అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగించాలని మెజారిటీ(61 శాతం) మంది అభిప్రాయపడగా అమెరికా సుంకాలను తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ నిలబడగలదని 23 శాతం మంది విశ్వసించారు.

అమెరికా షరతులను భారత్‌ ఒప్పుకోవాలని కేవలం 9 శాతం మంది మాత్రమే సూచించారు. వాణిజ్య చర్చలు విఫలం కావడానికి 54 శాతం మంది అమెరికాను నిందించగా 22 శాతం మంది భారత్‌ను నిందించారు. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించాలని 69 శాతం మంది సూచించగా రష్యన్‌ ముడి చమురు కొనుగోలు నిలిపివేయాలని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు. చైనాతో మరింత సన్నిహిత వాణిజ్య, దౌత్యపర సంబంధాలు ప్రపంచంలో భారత్‌ స్థానాన్ని పటిష్టం చేస్తాయని 52 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు

👉పూజారిని బైక్‌పై ఎత్తుకెళ్లిన యువకులు*సిద్దిపేట జిల్లా కోహెడ మండలం :ముందు తమ వినాయకుడి దగ్గర పూజ చేయాలని పూజారి కోసం పోటీ పడ్డ రెండు గ్రూపులు..ఆ పూజారి పూజకు బాగా డిమాండ్ ఉండడంతో *బైక్‌పై పూజారిని ఎత్తుకెళ్లిన* ఒక వర్గం యువకులు..

🌟హైడ్రాను అభినందించిన హైకోర్టు🌟

పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి హైడ్రా కృషి. నీటి వనరులు, ప్రజా ఆస్తుల సంరక్షణలో హైడ్రా కార్యక్రమాలకు హైకోర్టు ప్రశంస. ప్రజా ఆస్తులు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా అవసరం. రహదారులపై ఆటంకాలను తొలగించడంలో హైడ్రా కీలక పాత్ర. -హైకోర్టు

🌟లంచం తీసుకున్న ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష !*ఏసీబీ కోర్టు సంచలన తీర్పు*

ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది.
ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు, అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లపై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్సైగా పని చేస్తున్న సమయంలో సదరు మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో మంగరాజు, అతని కుటుంబ సభ్యులపై వరకట్నం నిషేధం చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఎస్సై తాత్సారం చేశారు. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మంగరాజు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

👉రూ.56 లక్షల జీహెచ్ఎంసీ నిధులు కాజేసిన మహిళా కంప్యూటర్ ఆపరేటర్😱😱😱

జీహెచ్ఎంసీలో క్రమక్రమంగా బయటపడుతున్న అవినీతి బాగోతాలు

శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవ కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుభాషిణి అనే మహిళ ట్రేడ్ లైసెన్స్, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తుల స్వీకరణ వంటి పనులకు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయలేదని తేల్చిన ఆడిటర్లు..

2024–25 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు రూ.56 లక్షలు కాజేసినట్టు నిర్ధారించిన ఆడిట్ అధికారులు…ఆడిట్ జరుగుతుందని తెలిసి విధులకు హాజరు కాకపోవడంతో, ఆమెను బలవంతంగా కార్యాలయానికి రప్పించిన ఉన్నతాధికారులు..నిధులు కాజేసినట్టు అంగీకరించి, కేవలం ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ ఖాతాలో రూ.56 లక్షలు జమ చేసిన మహిళా ఆపరేటర్ సుభాషిణి

👉 మహబూబాబాద్ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న శునకాలు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా శునకాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో 2021-22 సం.లో 2,877, 2022-235 3,423, 2023-245 3,531, 2024-2555 5,505, 2025 ລ້ ລ້ ఇప్పటి వరకు జిల్లాలో శునకాల వల్ల 1,218 మంది గాయపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, శునకాలకు టీకాలు వేయించాలని, అధికారులు సత్వరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
🌟పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉడాయ్ చీఫ్ భువనేశ్ కుమార్ కోరారు..పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.5-15 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ తప్పనిసరని పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్ చేయకపోతే ఎంట్రన్స్ పరీక్షలు రాసే, ప్రభుత్వ పథకాలు అందుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు~£
👉 రోజా అవినీతి ఆటపై రిపోర్టు ఏమైంది?

ఆడుదాం.. ఆంధ్రాపై విజిలెన్స్ రిపోర్టు వచ్చేసిందని ఇక ఆట ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు బయటకు లీక్ ఇచ్చి రెండు, మూడు వారాలు దాటిపోతోంది. కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదు. విజిలెన్స్ రిపోర్టు డీజీపీకి పంపిస్తారని.. దాన్ని ఆయన ప్రభుత్వానికి పంపి తదుపరి చర్యలపై డైరక్షన్స్ పొందుతారని చెప్పుకున్నారు. కానీ ఆ విజిలెన్స్ రిపోర్టు ఎక్కడి వరకూ వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. ముందడుగు పడటం లేదు… ఆడుదాం ఆంధ్రా పేరుతో అన్ని జిల్లాలలో రూ. 110 కోట్లుపైగా ఖర్చుపెట్టారు. అందులో జరిగిన వింతలు, విశేషాల గురించి చెప్పాల్సిన పని లేదు. రోజా డాన్సులు వేయడానికే ఆ ప్రోగ్రాం పెట్టినట్లుగా సాగిపోయింది. ఎక్కడికి వెళ్లినా నృత్యాలు కామన్. అదే సమయంలో.. ఆ ఆటల్లో పాల్గొన్నది కూడా వైసీపీ కార్యకర్తలే. క్రీడాభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను నాసిరకం క్రీడా సామాగ్రి కొని.. వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించి డబ్బులన్నీ కాజేశారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి.

ప్రభుత్వం మారిన తర్వాత అవకతవకలను గుర్తించడంతో… శాప్ చైర్మన్ రవి నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసింది. జిల్లాల వారీగా పూర్తిగా విచారణ జరిపింది. ఎక్కడెక్కడ ఎంత నొక్కేశారు. ఎవరి జేబుల్లోకి వెళ్లాయి. .. అన్నది కూడా తేల్చారు. మొత్తం రిపోర్టులో ఉంది. చర్యలు తీసుకోవాల్సింది మాత్రమే మిగిలి ఉంది. అయినా ముందుకు సాగడం లేదు. సరైన సమయం కోసం చూస్తున్నారేమో కానీ.. ఎప్పుడో ఓ సారి ఆట మొదలవడం ఖాయమని చెబుతున్నారు. అది ఎప్పుడన్నది తేలాల్సి ఉంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..