👉చంద్రబాబు రాజీనామా? లోకేష్ సీఎం? అసలు నిజం ఇదీ “…👉 అక్క ప్రియాంక ను ఎక్కించుకుని.. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ*…👉 శ్రీచైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం …ఐరన్ బాక్స్ తో కాల్చి..👉*ఆలయ ఉద్యోగి డబ్బులు కాజేసిన సైబర్ మోసగాళ్లు!.. 👉రోజు రోజు కి పెరిగి పోతున్న రైళ్ల లో దొంగల చేతివాటం….. 👉 జనసేనలో బాలినేని…ఊహించని సన్నివేశాలు !

👉చంద్రబాబు రాజీనామా? లోకేష్ సీఎం? అసలు నిజం ఇదీ “చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీయే కూటమి నుంచి బయటకి వస్తారని” కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలను ప్రసారం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియా ఆయనపై నిరంతరం దృష్టి సారించింది. -ఉత్తరాది మీడియాలో అసత్య కథనాలు కొన్ని ఉత్తరాది మీడియా సంస్థలు చంద్రబాబుపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. “చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీయే కూటమి నుంచి బయటకి వస్తారని” కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలను ప్రసారం చేశాయి. అంతేకాకుండా నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా కూడా రాశాయి. ఈ ప్రచారం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధికారిక ప్రకటన ఈ తప్పుడు ప్రచారంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వెంటనే స్పందించింది. పార్టీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసి, ఈ వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టంచేసింది. “చంద్రబాబు రాజీనామా చేస్తారని, లోకేశ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని ఉత్తరాది మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారం. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక తప్పుడు ప్రచారం మాత్రమే, దీని వెనుక ఎలాంటి వాస్తవం లేదు” అని పేర్కొంది. ఈ ప్రకటనతో తప్పుడు ప్రచారానికి చెక్ పడింది. చంద్రబాబు ఎన్డీయేకు మద్దతు అసలు విషయానికొస్తే, చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే ఎన్డీయే కూటమికి తన పూర్తి మద్దతును అందిస్తున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీ.పీ. రాధాకృష్ణన్‌కు ఆయన బలమైన మద్దతు ప్రకటించడం కూడా దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో కొందరు విమర్శకులు, మీడియా వర్గాలు ఎన్డీయేలో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన అబద్ధమేనని టీడీపీ తేల్చిచెప్పింది.

👉 అక్క ప్రియాంక ను ఎక్కించుకుని.. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ*

బిహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా బుధవారం ఆయన ముజఫర్పుర్లో బైక్ ర్యాలీ చేపట్టారు.ఈసందర్భంగా తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను ఎక్కించుకొని రాహుల్ బైక్ నడిపారు.

👉 శ్రీచైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం … ఐరన్ బాక్స్ తో కాల్చి..కోనసీమ జిల్లా,రాజమండ్రి మోరంపూడి:*

▪️చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం..▪️ఐరన్ బాక్స్ తో కాల్చి దుర్మార్గానికి పాల్పడ్డారు. .▪️కోనసీమ జిల్లా రాజమండ్రి మోరంపూడి శ్రీచైతన్య హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది..▪️పదో తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై సహచర విద్యార్థులు పైశాచికత్వానికి పాల్పడ్డారు…▪️ఐరన్ బాక్స్ తో పొట్ట భాగం, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టి… శ్రీచైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ చేసారు.. ▪️బిడ్డను చూసేందుకు శ్రీచైతన్య స్కూల్‌కు తల్లి వెళ్లడంతో ఈ ఘటన బయట పడింది. కానీ ఇప్పటికి స్పందించలేదు యాజమాన్యం. . ▪️ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదరించిన ఘటనకు పాల్పడ్డాడు విద్యార్థులు.. ▪️ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లి లక్ష్ణ్మీకుమారి.

👉*ఆలయ ఉద్యోగి డబ్బులు కాజేసిన సైబర్ మోసగాళ్లు!*

సైబర్ నేరగాళ్లు గంటల వ్యవధిలోనే రూ.లక్షలు కాజేసిన ఘటన కురవి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ఆలయ ఉద్యోగి జగన్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు రూ.20 లక్షలు విత్ డ్రా చేశారు. గంటల వ్యవధిలోనే సైబర్ మోసగాళ్లు డబ్బులు ఖాతా నుంచి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

*👉బాబోయ్.. రోజు రోజు కి పెరిగి పోతున్న రైళ్ల లో దొంగల చేతివాటం….*
*ఆ స్టేషన్లు వస్తున్నాయి అంటే నే ప్రయాణికులకు భయం భయం…*సెల్ ఫోన్ల దొంగతనాలకు అడ్డే లేదు.. మాజీ నేరస్తులకు కదిల కదలికలపై నిఘా ఏది???

*అర్ధరాత్రి ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది ..డౌట్ వచ్చి ప్రయాణీకులు లేచి చూడగా మెడలో బంగారు ఆభరణాలు చోరీ కి గురి అయ్యాయి..*
*వివరాలలోకి వెళ్తే!*..*పల్నాడు జిల్లా.*
గత కొన్ని నెలలు గా దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి రాత్రివేళ రైళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు…మంగళవారం రాత్రి నాగర్‌సోల్‌ – నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో..
సోమవారం హైదరాబాద్ – నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీలు జరిగింది.
దాచేపల్లి.. నడికుడి జంక్షన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో S1, S3 భోగిలో చోరీ చేశారు.
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపిన నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో.. నిద్రిస్తున్న ప్రయాణికురాలి మెడలో ఉన్న 68 తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కుని వెళ్లారు.

S5 భోగిలోని ప్రయాణికులు శబ్దాలు విని ఒక్కసారిగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు.
దోచుకెళ్ళిన బంగారు ఆభరణాలు విజయవాడకు చెందిన ప్రయాణికురాలు శ్రీదేవివి కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు…

*రాత్రిపూట రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమ సెల్ ఫోన్ లను చార్జింగ్ పెట్టుకుని నిద్రపోతుంటే సెల్ఫోన్లను చోరీ చేయడం పరిపాటి గా మారింది. పాత ముద్దాయిలపై నిందితులపై నిఘా పెట్టకపోవడం , వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయకపోవడం తదితర కారణాలతో సెల్ఫోన్ ల దొంగలు రెచ్చిపోతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

👉 జనసేనలో బాలినేని…ఊహించని సన్నివేశాలు ! ఒంగోలు రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవాలి. ఆయనది దాదాపుగా మూడున్నర దశాబ్దాలకు పైగా తలపండిన రాజకీయం. ఒంగోలు రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవాలి. ఆయనది దాదాపుగా మూడున్నర దశాబ్దాలకు పైగా తలపండిన రాజకీయం. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ లో ఆయన అనేక సార్లు గెలిచి సీనియర్ మోస్ట్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు వైఎస్సార్ సైతం ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. . వైఎస్సార్ సీఎం గా ఉండగానే బాలినేనికి కేబినెట్ లో బెర్త్ దక్కింది. ఇక కాంగ్రెస్ నుంచి జగన్ కోసం బాలినేని బయటకు వచ్చారు. అలా వైసీపీలో ఆయన కీలకం అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఆయనకు మంత్రి పదవి దక్కింది. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఆయన కొనసాగారు. అయితే విస్తరణలో తనను కంటిన్యూ చేయలేదని బాలినేని అలిగారు. అది కాస్తా తీవ్ర అసంతృప్తిగా మారింది. ఇక 2024లో బాలినేని తాను స్వయంగా ఓటమి పాలు కావడం ఏపీలో వైసీపీ కూడా ఓడిపోవడంతో వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు.  అయితే జనసేన టీడీపీలకు వ్యతిరేకంగా ఒంగోలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వచ్చిన బాలినేని సడెన్ గా జనసేనలో చేరడంతో కూటమి నేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు అని అంటున్నారు. అంతే కాదు ఆయనను ఇంకా వైసీపీ నాయకుడిగానే చూస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు గతంలో ఎదురు నిలిచి పోరాడిన వారు అంతా కూడా ఇపుడు ఆయన తమ పార్టీలో ఉన్నా ఇంకా ప్రత్యర్ధిగానే చూస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే బాలినేనికి జనసేనలో ఏమంతా బాగా లేదని చెబుతున్నారు.  తాజాగా అవమానమేనా : వీటికి ఒక నిలువెత్తు ఉదాహరణగా తాజాగా జరిగిన ఉదంతం ఉందని అంటున్నారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అధరిటీ ఒడా చైర్మన్ గా ఉమ్మడి ఒంగోలు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులయ్యారు. ఆయన తాజాగా పదవీ ప్రమాణం చేస్తే ఒంగోలు జనసేనకు చెందిన కీలక నాయకులు అంతా హాజరయ్యారు కానీ బాలినేనికి కనీసం కబురు కూడా లేదని అంటున్నారు. అంతే కాదు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ వెలసిన ఫ్లెక్సీలలో ఎక్కడా బాలినేని చిన్న పాటి ఫోటో కూడా లేకపోవడంతో ఆయన అభిమానులు అంతా కలవరపడుతున్నారు. ఇదేమిటి తన నాయకుడికి ఇలా జరిగిందిని వారు వాపోతున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..