👉మోడీ పుట్టిన రోజుకు ముందే ఆర్ఎస్ఎస్ కీలక భేటీ ! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17న అన్నది అందరికీ తెలిసిందే ఆయన పుట్టిన రోజు ఈ సారి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17న అన్నది అందరికీ తెలిసిందే ఆయన పుట్టిన రోజు ఈ సారి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఆయనకు 75 ఏళ్ళు నిండుతాయి. 76వ ఏట అడుగు పెడతారు. అయితే ఇందులో విశేషం ఏముంది అన్నది ప్రశ్న కాదు. 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల్లో కొనసాగరాదు, వారు హుందాగా తమ పదవుల నుంచి రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసింది అది మోడీ గురించే అని అంతా అంటున్న నేపథ్యం ఉంది.** పది రోజుల ముందే మీట్ : ఇదిలా ఉంటే మోడీ పుట్టిన రోజుకు పది రోజుల ముందే ఆర్ఎస్ఎస్ కీలకమైన భేటీ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి 7వరకూ ఈ మీట్ ఉండబోతోంది. అంటే మూడు రోజులు అన్న మాట. నిజానికి చూస్తే ఇది ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశం. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఈ సమావేశాల నుంచి బీజేపీకి కానీ మోడీకి కానీ ఆర్ఎస్ఎస్ ఏమైనా సలహాలు సూచనలు ఇస్తుందా అని అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
** అక్కడే సమావేశం : రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగే ఈ మూడు రోజుల మీటింగుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షత వహిస్తారు అని అంటున్నారు. ఇక ఈ వార్షిక సమావేశానికి బీజేపీతో పాటుగా ఏబీవీపీ భారతీయ మజ్దూర్, కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసీ కళ్యాణ్ సేవా సమితి వంటి అనుబంధ సంఘాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు అని చెబుతున్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నిక పైన : ఇక ఈ కీలక సమావేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల మీద కూడా చర్చిస్తుంది అని అంటున్నారు గత నాలుగేళ్ళకు పైగా జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్లేస్ లో సంఘ్ కి చెందిన వారిని నిబద్ధతతో పార్టీని నడిపించే వారిని నియమించాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. ఆర్ ఎస్ ఎస్ మదిలో ఎన్నో పేర్లు ఉన్నాయి. బీజేపీ పెద్దలకు కొన్ని పేర్లు ఉన్నాయని అంటున్నారు దాంతో ఆర్ ఎస్ ఎస్ ఈ సమావేశం ద్వారా ఏమి చెబుతుందన్నది అంతా ఆలోచిస్తున్నారు.
👉మోదీని ఇబ్బంది పాలు చేస్తున్న డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం.. అంత చిన్న విషయానికి కోర్టులు ఎందుకు మీరే చూపించొచ్చుగా మోడీజీ? .. మన ప్రియతమా ప్రధానమంత్రి మోడీకి తనను ప్రశ్నించే వారన్నా.. తనను సందేహంగా చూసే వాళ్లను అస్సలు ఇష్టపడ్డరన్న మాట మోడీ గురించి తెలిసినోళ్లంతా చెబుతుంటారు. అలాంటి మోడీసాబ్ మీద నింద ఒకటి పడటం తెలిసిందే.. ఆయన అప్పుడెప్పుడో పూర్తి చేసిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను పంచాయితీగా చేయటమే కాదు.. వాటిని బయటపెట్టాలని.. అధికారికంగా చూపించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఉదంతం గురించి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ తాజాగా కోర్టు నుంచి వెలువడింది. నీరజ్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి చేసిన డిగ్రీ కోసం సమాచార హక్కు చట్టం కింద సీఐసీకి అప్లికేషేన్ పెట్టటమే కాదు.. మోడీ మాష్టారి గ్రాడ్యుయేషన పట్టాను చూపించాలని కోరుతున్నారు. అయితే.. ఈ వాదనకు కౌంటర్ గా కొత్త పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ వివరాల కోసం పెట్టిన అప్లికేషన్ కు సంబంధించి కోరిన వివరాల్ని వెల్లడిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1978లో బీఏ పూర్తి చేశారని.. ఆ ఏడాది బీఏ పరీక్షలో పాస్ అయిన వారి రికార్డుల తనికీకి 2016 డిసెంబరులో ప్రధాన సమాచార కమిషనర్ అనుమతించారు. ఈ అంశాన్ని సవాలు చేయగా.. 2017లో ఢిల్లీ హైకోర్టుకు ఆ వివరాలు బయటకు వెల్లడి కాకుండా ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది వివరాలు తెలుసుకునే కన్నా.. వ్యక్తిగత గోప్యతా పరిరక్షణ హక్కు మిన్నగా పేర్కొంటూ.. సీఐసీ ఉత్తర్వులను కట్టేయాలని కోరుతూ ఢిల్లీ వర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రధాని డిగ్రీ వివరాల్ని కోర్టుకు అందించేందుకు సంబంధిత వర్సిటీ సిద్ధంగా లేరని.. ఆర్టీఐ కింద ఈ వివరాల్ని అపరిచుతులతో పంచుకునేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. కాసేపు కోర్టులు.. ఇతర సంస్థలకు చెందిన కమిషన్లు.. వారి ఆదేశాల్ని పక్కన పెట్టేద్దాం. అన్నింటిని త్యజించిన మోడీ లాంటి ప్రధానమంత్రికి సంబంధించి దారిన పోయే దానయ్యకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే.. నవ్వుతూ మరో ఆలోచన లేకుండా డిగ్రీని అడిగితే.. ముఖం మీద లాగి ఒక్కటి ఇచ్చినట్లుగా ఆ వివరాల్ని అందిస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా కోర్టులు.. కేసులు.. వాదనలు.. లాంటి వాటితో సాధించేది ఏమిటి? అన్నింటికి మించి అనుమానం వచ్చినప్పుడు దాన్నితీర్చస్తే సరిపోతుంది. ఈ చిన్న విషయాన్ని మోడీ మాష్టారు ఎందుకు మిస్ అవుతున్నట్లు..? అయినా.. ఆయన్ను అడిగింది.. సందేహాన్నివ్యక్తం చేసింది ఆయన పాలనలో బతుకు బండిని లాగే సామాన్యుడికే కదా? తన వాళ్లకు తన డిగ్రీ చూపించటంలో తప్పేముంది? సర్టిపికేట్లు అక్కర్లేదు.. ఈ సందేహాలకైనా సమాధానాలు చెప్పేస్తారా మోడీజీ?
👉 ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం…ఒంగోలు లోని A1 ఫంక్షన్ హాల్ లో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , కాకినాడ జనసేన శాసనసభ్యులు పంతం నానాజీ , యలమంచిలి జనసేన శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత గారు, 20 సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీ లంకా దినకర్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డా. శ్రీ సీతారామయ్య, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ , APMIDC చైర్మన్ చర్లపల్లి శ్రీనివాస్, గుంటూరు జనసేన ఇంచార్జ్ గాదె వెంకటేశ్వర రావు , ఒంగోలు జనసేన నాయకులు కంది రవి శంకర్ , జనసేన నాయకులు కిరణ్ రాయల్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.
👉 మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మాలపాటి వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ , రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మాత్యులు డోల బాల శ్రీవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి రాష్ట్ర మారీటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య , యర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు, దర్శి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ లలిత్ , మార్కాపురం జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి మార్కాపురం ఇంచార్జ్ పీవీ కృష్ణా రావు ఇతర ముఖ్య కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
👉ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి . ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలు మరియు అభివృద్ధి పనుల గురించి చర్చించినారు.
🌟కంభంలో రెండు చోట్ల దొంగతనం*. పీపుల్స్ వాయిస్ న్యూస్ ప్రకాశం జిల్లా కంభం .. కంభం పట్టణంలో ఆదివారం రాత్రి రెండు చోట్ల దొంగతనాలు జరిగాయి.. ఇటీవల కంభం పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.. కంభం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని షిరిడి సాయి నగర్ కు వెళ్ళుదారిలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కంభం పట్టణానికి చెందిన మట్టెమల్ల. భాస్కర్, ఝాన్సీ ప్రత్యేక పనుల నిమిత్తం నిన్న ఉదయం వేరే ఊరికి వెళ్లారు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చారు. తలుపులు ఉండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టారు. అందులోని రెండు తులాల బంగారం, పది తులాల వెండి, 15వేల నగదు దోచుకెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం భాస్కర్ వేరే ఊరికి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది.***అదే రాత్రి అక్కడికి సమీపంలోని పెట్రోలు బంకు పక్కన నిలబెట్టి ఉన్న లారీలో సామాన్లు చోరీ అయినవి. దొంగలు లారీ అద్దాలు పగలగొట్టి టార్పాలిన్ పట్టా రెండు బ్యాటరీలు, జాకి జాకీ రాడ్డు చోరీకి గురైనాయి. ఇటీవల కంభం పట్టణంలోని కాాప వీధిలో రంగయ్య ఫౌండరీ సమీపంలో, మరికొన్నిచోట్ల దొంగతనాలు జరిగాయి.. మోటార్ బైకులు సైతం తాళాలు వేసి ఉన్నప్పటికీ పట్టట పగలే చోరీకి గురవుతున్నాయి దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించి దొంగలపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

