👉 అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ…👉యువతిపై వీధి కుక్కల దాడి*కాన్పూర్:*.. ముఖానికి 17 కుట్లు వేసిన వైద్యులు..👉భార్యకు తిండి పెట్టకుండా.. విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త..👉 ఫోన్ మాట్లాడుతుందని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త..👉అకాడమీల పేరుతో ఆర్థిక దోపిడీ చేస్తున్న మెడికల్ అకాడమీలపై చర్యలు తీసుకోవాలి….Dsfi డిమాండ్..👉 40వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా IEC మెటీరియల్ ను ఆవిష్కరించిన ప్రకాశం జిల్లా  కలెక్టర్ తమీం అన్సారీయా.. 👉 భారీ చోరీ.. కంటైనర్ నుంచి 255 లెఫ్ట్ లు మాయం..👉సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన ఏ. శశి కుమార్..👉చెరువులోకి పల్టీలు కొట్టిన కారు( ప్రకాశం జిల్లా కంభం)

👉 అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ… అమెరికా ప్రణాళికలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలన్న అయతొల్లా ఖమేనీ..ఇస్లామిక్ రిపబ్లిక్ ను లొంగదీసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న ఆయతొల్లా ఖమేనీ..

🌟అమెరికాకు వ్యతిరేకంగా భాగస్వామ్య దేశాలన్నీ కలిసి పోరాటం చేయాలన్న ఖమేనీ..ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్రంగా మండిపడ్డారు. తమను లొంగదీసుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన అయతొల్లా… దీనికి వ్యతిరేకంగా భాగస్వామ్య దేశాలన్నీ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.”ఏ పరిస్థితిలోనూ అమెరికాకు తలొగ్గేది లేదు” అని ఖమేనీ స్పష్టం చేశారు. తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసిన ప్రకటనలో, జూన్‌లో తమ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేయడం తమను ప్రతీకార చర్యల వైపు నెట్టిందని పేర్కొన్నారు.తెహ్రాన్‌ను అస్థిరపరచాలనే లక్ష్యంతోనే అమెరికా ప్రణాళిక రూపొందించిందని ఆరోపించిన ఆయన, ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజే అమెరికా ఏజెంట్లు యూరప్‌లో సమావేశమయ్యారని, ఇరాన్ పాలనపై చర్చించినట్టు తెలిపారు. అంతిమంగా అమెరికా ఆశయం ఇరాన్‌ను విధేయ దేశంగా మార్చడమేనని విమర్శించారు.అంతర్గతంగా దేశం ఐక్యంగా నిలబడిందని, సైన్యం, ప్రభుత్వం, ప్రజలు అందరూ కలిసి శత్రువులకు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. ఇరాన్ చూపిన ధైర్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, అనేక దేశాలకు ఇరాన్ పట్ల గౌరవం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతర్గత విభేదాలను విదేశీ శక్తులు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.కాగా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో ఇరాన్ మంగళవారం అణు చర్చల కోసం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

👉యువతిపై వీధి కుక్కల దాడి*కాన్పూర్:*.. ముఖానికి 17 కుట్లు వేసిన వైద్యులు..కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థినిపై వీధికుక్కల దాడి.. కిందపడేసి ముఖాన్ని గాయపరిచిన మూడు కుక్కలు.. కర్రలతో కుక్కలను తరిమిన స్థానికులు..ఆహారం తినలేని స్థితిలో బాధితురాలు..వీధికుక్కల సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్….

👉ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను సీఎం అభినందించారు. ఈ సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, అధికారులు పాల్గొన్నారు.

👉భార్యకు తిండి పెట్టకుండా.. విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా ..

కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న(33) అనే మహిళకు, ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరగగా, మూడేళ్ల నుండి అశ్వారావుపేటలో నివాసం ఉంటున్న దంపతులు..శనివారం లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుండి కిందపడిపోయిందని, ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన నరేష్ బాబు..ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి, దీనస్థితిలో ఉన్న లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని చూసి షాకైన తల్లిదండ్రులు.. శరీరమంతా కొత్త గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు..రెండేళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీప్రసన్నను హతమార్చారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు

👉 ఫోన్ మాట్లాడుతుందని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త..

రాంగ్ నెంబర్ ద్వారా పరిచయం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకి రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్‌కు చెందిన శ్రావణి (27)..ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడి 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. వీరికి ఒక బాబు, పాప..పెళ్లయిన కొంతకాలానికే భర్త, పిల్లలను వదిలేసి తన అక్క భర్తతో వెళ్లిపోయిన శ్రావణి.. ఏడాది క్రితం మళ్ళీ తిరిగి రాగా ఆమెను భార్యగా అంగీకరించిన శ్రీశైలం..శ్రావణి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయడం గమనించి తరచూ గొడవపడ్డ శ్రీశైలం..పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆమెను హత్య చేయాలని పథకం వేసిన భర్త

👉 భారీ చోరీ.. కంటైనర్ నుంచి 255 లెఫ్ట్ లు మాయం..

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి ఒక కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తున్న ఓ కంటైనర్లోని 255 ల్యాప్టాప్లను దుండగులు అపహరించారు. చిన్న కొత్తపల్లి వద్ద కంటైనర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

👉గుర్తుతెలియని వ్యక్తులు రైలు కింద పడి మృతి….*

పల్నాడు జిల్లా … పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి..గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాలు..సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

👉సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన ఏ. శశి కుమార్..

ప్రకాశం జిల్లా ..  ఆగస్టు 24 గుంటూరు రేంజ్ పరిధిలో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీస్ అధికారులకు సీఐ లుగా పదోన్నతి పొందారు. వారిలో ఏ. శశి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. ఈయన 2009 బ్యాచ్ కి చెందిన ఎస్సై. ప్రకాశం జిల్లాలో బేస్తవారిపేట అర్ధవీడు, పొదిలి,నాగులప్పలపాడు, మార్కాపురం, తదితర పోలీస్ స్టేషన్ లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా నరసరావుపేటలో SB లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ సీఐగా పదోన్నతి పొందారు. వీధి నిర్వహణలో సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్ గా మంచి పేరు ఉంది.

👉 40వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా IEC మెటీరియల్ ను ప్రకాశం జిల్లా  కలెక్టర్ తమీం అన్సారీయా ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా DM&HO డాక్టర్ వెంకటేశ్వర్లు , డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ నళిని , PMOO లు ఎన్. వెంకటేశ్వర్లు, ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

👉అకాడమీల పేరుతో ఆర్థిక దోపిడీ చేస్తున్న మెడికల్ అకాడమీలపై చర్యలు తీసుకోవాలి….

ఈరోజు *ఖమ్మం జిల్లా కేంద్రంలో DM కాలేజ్ ఎదుట,పలు అకాడమీల ఎదుట DSFI జిల్లా కమిటీ* అధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది — యాజమాన్యానికి డిఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది…….!!

*DSFI జాతీయ సహాయ కార్యదర్శి మాలోతు శాంతి కుమార్,రాష్ట్ర అధ్యక్షులు బుర్ర వీరభద్రం….నిబంధనలకు విరుద్ధంగా ఒకటే బిల్డింగ్ లో జూనియర్ కాలేజ్ , మెడికల్ అకాడమీ నడిపిస్తూ విచ్చలవిడిగా లక్షల రూపాయలు నిలువు దోపిడి చేస్తున్న అకాడమీల గుర్తింపు రద్దు చేయాలి — *DSFI రాష్ట్ర కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్….

*ఖమ్మం జిల్లా కేంద్రంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ, శ్రీ చైతన్య, నారాయణ, ఎలైట్, శ్రీ వైవిద్య, ప్రజ్ఞ, భవిష్య, రైట్ అకాడమీ, ఆకాశ అకాడమీ, ఆర్యభట్ట ఇటువంటి అకాడమీల పై ప్రత్యేక నజర్ పెట్టాలని జిల్లా అధికారులను కోరారు…!!…*ప్రధానంగా అనుమతులు లేకుండా నడిపిస్తున్న నారాయణ మెడికల్ అకాడమి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు…….!!* *జిల్లా విద్య అధికారులకు స్పందించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు..*ఈ కార్యక్రమంలో DSFI రాష్ట్ర నాయకులు సిహెచ్ రామ్ చరణ్, కోర్ కమిటీ సభ్యులు ఎర్ర దిలీప్,ఖమ్మం జిల్లా బాధ్యులు హరిచందర్, ఖమ్మం పట్టణ నాయకులు పెరుమాండ్లపల్లి సిద్ధార్థ, మన్నె రాజేష్, గోపి,రాము,వెంకీ,సాయి, కౌశిక్ , సుజల్,అరుణ్, వినయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు….

👉చెరువులోకి పల్టీలు కొట్టిన కారు..* ప్రకాశం జిల్లా కంభం చెరువులోకి ఓ కారు పల్టీలు కొట్టింది. సరదా కోసం చెరువు కట్టకు వచ్చిన యువకులు ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో పొరపాటున కారు చెరువులోకి మూవ్ అయింది. దీంతో కారులో ఉన్న యువకుడు కారులో నుంచి దుమకడం జరిగింది. కారు హైదరాబాద్ కు సంబందించినదని, ఓ ఫంక్షన్ వచ్చిన నిమిత్తం కంభం వచ్చి చెరువు ను దర్శించినడానికి వచ్చారని సమాచారం..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..