బీజేపీని గుచ్చుతూనే అలా : తన సిద్ధాంతాలకు పడని బీజేపీని ఒక వైపు గుచ్చుతూనే మరో వైపు ఏపీ పాలిటిక్స్ లో కూడా కొత్త ట్విస్టులు చూపించే ప్రయత్నం ప్రకాష్ రాజ్ చేశారు.
**30 రోజుల బిల్లు వెనక కుట్ర ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించిన తీరుతో అన్ని పార్టీలను కలిపి మరీ పెద్ద డౌట్లే పెట్టేసారని అంటున్నారు. బీజేపీకి చూస్తే ఏపీ రాజకీయాల్లో బలం అత్యల్పం. పవన్ మీద ఆధారపడిందని అంటారు. సమయానుకూలంగా చంద్రబాబుని జగన్ ని వాడుకుంటూ ఏపీలో తన రాజకీయ ఆలోచనలను అమలు చేయాలని బీజేపీ ఎదురుచూస్తోందని అంటారు . బహుశా ఈ విషయాలు అన్నీ కూడా కేవలం ఒక చిన్న ట్వీట్ ద్వారా ప్రకాష్ రాజ్ వ్యక్తపరచారా అన్నదే చర్చ. మొత్తానికి ఏపీ మీద బీజేపీకి ఉన్న రాజకీయ అభిప్రాయం కానీ అవగాహన కానీ ఇదీ అని ప్రకాష్ రాజ్ తేటతెల్లం చేశారని అంటున్నారు. ఏపీలో అంతిమంగా బీజేపీ తన విస్తరణ చూసుకుంటుందని అంతా అంటున్నదే. **అందుకే ప్రకాష్ రాజ్ ట్వీట్ లో కూడా తన మాట వినే ఉప ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పారు. మొత్తం మీద 30 రోజుల జైలు బిల్లుకు సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ఏపీ పాలిటిక్స్ లో చర్చకు దారి తీసే లాగానే ఉంది. చూడాలి మరి ఆయన చిలిపి సందేహాలే నిజం అవుతాయా లేక ఏమవుతుంది అన్నది.
👉పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు: సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికీ అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు. పెన్షన్లపై ఉన్నతాధికారులతో CM సమీక్ష నిర్వహించారు.
👉వ్యవసాయ అధికారులను బంధించిన రైతులు..😲 మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడ యూరియా ఇవ్వడంలేదని అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేసిన రైతులు
👉 శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు.. ఏ1గా జనసేన ఇన్ఛార్జి.!
శ్రీశైలంలో అటవీశాఖ ఉద్యోగి కరీముల్లాపై దాడి కేసులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (ఏ2)పై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు జనసేన ఇన్ఛార్జి రౌతు అశోక్ (ఏ1)పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి అనంతరం ఉద్యోగులను ‘గొట్టిపాటి నిలయం’ అతిథిగృహంలో బంధించారని బాధితులు పోలీసులకు తెలిపారు.
👉రాచర్ల ఫారం గ్రామ పరిసరాల్లో పులి సంచారం…ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామ శివారులోని కంచనగుంట తిప్ప ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు. అక్కడ పులిజాడలు కనిపించడంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఈ విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పులి సంచరిస్తున్న అవకాశముందని, గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు.గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి సంచారం గమనిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
👉క్రిమినల్ కేసుల్లో రేవంత్ రెడ్డిదే అగ్రస్థానం..!!*
89 క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నంబర్ 1గా ఉన్నట్టు వెల్లడించిన ఏడీఆర్..30 రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితా విడుదల చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్..దేశంలో 42% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో 89 క్రిమినల్ కేసులతో మొదటి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి..!!
👉సిట్ అధికారుల అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధాన 👉మిచ్చా.. నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. కొన్ని ఛానెల్స్ లో పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు, నేను ఎలాంటి వాడినో జిల్లా ప్రజలు అందిరికీ తెలుసు.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, వదంతులు నమ్మవద్దు- నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సీఎం
👉ఆన్‌లైన్ విధానం పక్కన పెట్టిన అంశంపై నోరువిప్పని నారాయణస్వామి.*
*డిజిటల్ చెల్లింపులు పక్కన పెట్టాలని ఎవరు ఒత్తిడి తెచ్చారన్న.. ప్రశ్నలకూ తనకు సంబంధం లేదన్న మాజీ మంత్రి నారాయణస్వామి.*పై వాళ్లదే నిర్ణయం అని చెప్పిన నారాయణస్వామి.*లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి విక్రయాల వరకు తనకేం సంబంధం లేదని పైస్థాయి నిర్ణయాలు అమలుచేశానన్న నారాయణస్వామి.*రాజ్ కసిరెడ్డి సహా ఇతరుల నుంచి సేకరించిన ఆధారాలను నారాయణస్వామి ముందుంచిన సిట్.*మరోసారి నారాయణస్వామిని విచారించే అవకాశం.*
👉 సూర్యాపేట జిల్లాలో దారుణం.. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం..బైక్ మీద వెళ్తున్న ముగురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు వ్యక్తులు..సూర్యాపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందు బైక్ బయటపడవేసి అందోళనతో వైన్స్ లోపలికి వెళ్లిన ఆ ముగ్గురు..ఆముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తిన దుండగులు..వైన్స్ షాప్ లో ఉన్న వారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయిన దండగులు
👉ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన చంద్రబాబు నాయుడు..ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము.. ఆయనే దానికి సరైన అభ్యర్థి – సీఎం చంద్రబాబు నాయుడు
👉స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్ల నిరసన..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్… ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని నినాదాలు..కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
👉కమ్యూనిస్ట్ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత.. సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(83) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గద్వాల జిల్లా ఉండవల్లి మండలానికి చెందిన ఆయన 1998, 2004లో నల్గొండ నుంచి ఎంపీగా గెలిచారు.
🌟భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేసుకున్నారు.
విద్యార్థి దశ నుంచే అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, దేశ రాజకీయాల్లో ముఖ్యంగా వామపక్ష రాజకీయాల్లో వారు క్రీయాశీలక పాత్ర పోషించారని, వారి మరణంతో దేశం ఒక గొప్ప ప్రజాస్వామిక వాదిని కోల్పోయిందని పేర్కొన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికైన సురవరం గారు ప్రజా సమస్యల విషయంలో నిరంతరం ముందుండి పోరాటం చేశారని అన్నారు.సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. సురవరం గారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
🌟 దేశంలోనే మొదటిసారిగా ఏపీలో ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం. ఒక కోటి 45 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం. ఒక వైపు లబ్ధిదారుని ఫోటో, కార్డు వెనకవైపు కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి.
👉 పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి ..
*మైకులు డీజేలా సౌండ్లను ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి.. *మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి.. పర్యావరణాన్ని కాపాడాలి..మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు …. ప్రకాశం జిల్లా కంభం..
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని డి.ఎస్.పి యు.నాగరాజు కోరారు. శనివారం కంభం పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన పీస్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1915లో దేశంలో దేశభక్తిని పెంపొందించడానికి స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ హిందువులందరూ కులాలకు అతీతంగా సోదర భావంతో గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ఊరేగింపులు జరిపే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు .ప్రతి ఒక్కరూ ఈ పండుగను స్ఫూర్తిదాయకంగా తీసుకొని దైవ భక్తితో , ఇతర కులాలకు మతాలకు ఇబ్బంది కలుగకుండా స్నేహపూర్వక వాతావరణం లో పార్టీలకు అతీతంగా పండుగలను నిర్వహించుకోవాలని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం కంభం సీఐ కే మల్లికార్జున రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విగ్రహం వద్ద 24 గంటలు ఎవరో ఒకరు కాపలా ఉండాలని * సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ,*మైకులు డీజే ల శబ్దాలను శృతిమించకుండా చూసుకోవాలని, రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు, ఇతర మతాలను కించపరిచే విధంగా ఉద్రిక్తతను పెంచే విధమైన పాటలను పెట్టకూడదని హెచ్చరించారు . *విగ్రహాలను సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు విగ్రహాలు పది అడుగులకు మించకుండా ఉండే విధంగా చూడాలని కోరారు. *గులాములు ఎక్కువగా చల్లడం చేయొద్దని, ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
కార్యక్రమంలో తహసిల్దార్ ఏ కిరణ్ కంభం ఎస్ఐ బి నరసింహారావు తో పాటు పట్టణంలోని మసీదు కమిటీల సభ్యులు, ముస్లిం పెద్దలు,ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం డిఎస్ పి యు నాగరాజు ఎస్ఐ సిఐల తో కలిసి కంభం చెరువు ను సందర్శించి గణేష నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు.
🌟12 ఏళ్ల సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు!*… *పదవ తరగతి విద్యార్తే హంతకుడు?*
హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ను పోలీసులు చేదించడం తోపాటు..కీలక ఆధారాల ను వెలికి తీశారు. పదో తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడం తో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్ పై రాసుకున్నాడు నిందితుడు, బాలుడు రాసుకున్న పేపర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..సహస్ర ఇంట్లోకి ప్రవేశిం చడం, దొంగతనం చేయ డం, ఆపై తప్పించుకోవడం వరకు అన్నీ చీటీలో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వచ్చిన ఇంగ్లీషులో రాసిన ఆ లేఖలో, సహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్ళానని పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడని అధికారులు వెల్లడించారు..హత్య జరిగిన రోజు కూడా బాలుడు పోలీసుల ముందుకు వచ్చి కథలు చెప్పాడు. “సహస్ర ఇంట్లోం చి నాన్నా.. నాన్నా అని అరుపులు వినిపించాయి” అని చెప్పిన బాలుడు, మరొకరు హత్య చేసినట్లు గా అనుమానాలు కలిగిం చాడు. దీని ఆధారంగా మొదట విచారణను ఇతర కోణాల్లో కొనసాగించిన పోలీసులు, తరువాత మలుపు తిప్పారు.
శుక్రవారం ఉదయం మరోసారి ఆధారాలు సేకరించడానికి ఎస్ఓటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్క భవనం నుంచి సులభంగా సహస్ర ఇంట్లోకి దూకవచ్చని గుర్తించారు. దీంతో పక్క భవన నివాసు లందరినీ ప్రశ్నించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీలక సాక్ష్యాలు ఇచ్చాడు..హత్య జరిగిన రోజు తన గది పక్కనే బాలుడు 15 నిమిషాలు దాక్కొని ఉన్నా డని, ముఖం గుర్తుపడుతా నని చెప్పడంతో పోలీసులు అనుమానాలు బలపడ్డా యి.అనుమానాలపై స్కూల్‌కు వెళ్లిన ఎస్వోటీ పోలీసులు బాలుడిని పక్కకు పిలిచి ప్రశ్నించారు.*మొదట తనకు సంబంధం లేదని, హత్య చేయలేదని తప్పుదారి పట్టించాడు. అనంతరం బాలుడు ఇంటికి తీసుకెళ్ళి తల్లి దండ్రుల సమక్షంలో ఇంట్లో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో రక్తంతో తడిసిన దుస్తులు, కత్తి, అలాగే “మిషన్ డాన్” పేరుతో రాసుకున్న చీటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అంతేకాకుండా OTTలో చూసిన సిరీస్ ప్రభావంతో హత్య, దొంగతనం, ఎస్కేప్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిసింది. హత్యకు రెండు రోజుల ముందే కాగితం మీద పూర్తి “ప్లాన్ ఆఫ్ యాక్షన్” రాసుకున్న బాలుడు, గ్యాస్ లీక్ చేసి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.ఈ కేసు ఛేదనలో SOT, కూకట్‌పల్లి పోలీసులు కలిసి 300 మందిని విచారించారు. దీంతో సహస్ర హత్యకు బాలుడే బాధ్యుడని పోలీసులు తేల్చారు. దొంగతనం కోసం ప్రణాళిక వేసి, సహస్రను అడ్డం వచ్చినందుకు హత్య చేసినట్లు నిర్ధారించారు.
👉వ్యవసాయ అధికారులను బంధించిన రైతులు.. తెలంగాణ :మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడ యూరియా ఇవ్వడంలేదని అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేసిన రైతుల
👉 అనంతపురం..తాడిపత్రి పట్టణంలో కార్పొరేట్ సంస్థలు నాయి బ్రాహ్మణ కులవృత్తిలోకి ప్రవేశిస్తున్నందున తాడిపత్రి పట్టణంలో కటింగ్ షాపులు బంద్ చేసి కార్పొరేట్ సంస్థ ఓపెనింగ్ సిద్ధమవుతున్న షాపు దగ్గర నాయి బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్పొరేట్ సంస్థలు తాడిపత్రిలో చాలా వచ్చేందుకు అవకాశం ఉందని తాడిపత్రి నాయి బ్రాహ్మణులు కులవృత్తితో మాకు జీవనం గడిచేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుందని వాపోతున్నారు.

