👉 కేంద్రం బంతాట పై చంద్ర‌బాబు డైల‌మా.. !..*సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికీ అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని సీఎం చంద్రబాబు…👉రాహుల్ గాంధీ డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు…👉తమిళ రాజకీయాల్లో భారీ సంచలనం.. దళపతి విజయ్ సెన్సేషన్..👉పబ్జీకి బానిసై, ఫోన్ లాక్కున్నారని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి*..👉 శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు.. ఏ1గా జనసేన ఇన్ఛార్జి.!..👉మియాపూర్‌లో రహస్య మరణాలు..

👉 కేంద్రం బంతాట పై చంద్ర‌బాబు డైల‌మా.. ! కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై దీనికి మ‌ద్ద‌తు ఇస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు డైల‌మాలో ప‌డ్డారు. కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై దీనికి మ‌ద్ద‌తు ఇస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు డైల‌మాలో ప‌డ్డారు. గ‌తంలోను.. ఇప్పుడు కూడా… కేంద్రంలోని పెద్ద‌ల వ్య‌వ‌హారంపై బాబు విముఖ‌త‌తోనే ఉన్నారు. కానీ, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు.. ఇత‌ర‌త్రా అంశాల నేప‌థ్యంలోనే ఆయ‌న స‌ర్దుకు పోతున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. గ‌తంలోనూ 2014-19 మ‌ధ్య బీజేపీతో చేతులు క‌లిపిన చంద్ర‌బాబు 2018లోనే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం వంటి విష‌యాల్లో విభేదించారు. అంత‌ర్గ‌తంగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు.. వైసీపీతో చెలిమి చేయ‌డాన్ని చంద్ర‌బాబు అప్ప‌ట్లోనే త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌ధానంగా ఈ కార‌ణంతోనూ ఆయ‌న కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌న చ‌ర్చ అప్ప‌ట్లో జోరుగా సాగింది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి చేతులు క‌లిపినా.. బీజేపీ వ్య‌వ‌హారం మాత్రం.. చంద్ర‌బాబును డైల‌మాలోకి నెడుతోంది. ఉపరాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో రాజ్‌నాథ్ సింగ్‌.. జ‌గ‌న్‌కు ఫోన్ చేయ‌డం, దీనివెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా చ‌క్రం తిప్ప‌డం తెలిసిందే. అయితే, ఎన్డీయే కూట‌మిలో ఉన్న తాము సంపూర్ణ మద్ద‌తు ఇస్తున్నామ‌ని, ఇంకా జ‌గ‌న్‌తో ఏం ప‌ని అనేది చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు చేస్తున్న ఆలోచ‌న‌. తాము నిరంత‌రం.. పోరాటం చేస్తున్న జ‌గ‌న్‌తో మీరు చెలిమి చేస్తే.. ఇక‌, అర్ధం ఎక్క‌డ ఉంటుంద‌న్న‌ది ఆవేద‌న‌. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లిన‌ప్పుడు.. జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా బ‌లంగా విమ‌ర్శిస్తున్నామ‌ని.. దీనికి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు క‌లిసి రాక‌పోగా.. ఆయ‌న‌కు ఫోన్లు చేసి మ‌ద్ద‌తు కోర‌డం స‌రికాద‌న్న వాద‌న టీడీపీ, జ‌న‌సేన వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర బీజేపీ వైఖ‌రిపైనా వారు ఆవేద‌న‌తో ఉన్నారు. 👉 పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు: సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికీ అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు. పెన్షన్లపై ఉన్నతాధికారులతో CM సమీక్ష నిర్వహించారు.

👉 శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు.. ఏ1గా జనసేన ఇన్ఛార్జి.!

శ్రీశైలంలో అటవీశాఖ ఉద్యోగి కరీముల్లాపై దాడి కేసులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (ఏ2)పై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు జనసేన ఇన్ఛార్జి రౌతు అశోక్ (ఏ1)పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి అనంతరం ఉద్యోగులను ‘గొట్టిపాటి నిలయం’ అతిథిగృహంలో బంధించారని బాధితులు పోలీసులకు తెలిపారు.

👉రాహుల్ గాంధీ డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు… కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో అపశ్రుతి.. కాన్వాయ్ వాహనం తగిలి పోలీసు కానిస్టేబుల్‌కు గాయాలు..రాహుల్ గాంధీ వాహన డ్రైవర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు..ఈ ఘటనపై రాహుల్‌ను విమర్శించిన బీజేపీ నేత షెహజాద్ పూనావాలా. గాయపడిన కానిస్టేబుల్‌కు రాహుల్ గాంధీ పరామర్శ..

బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనం తగిలి ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడగా, ఆ వాహన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే రాహుల్ గాంధీ తన వాహనాన్ని ఆపి, గాయపడిన పోలీసుకి సహాయం చేశారు. ఈ ఘటన రాజకీయంగానూ కాక రేపింది. వివరాల్లోకి వెళితే, నవాడా జిల్లాలోని భగత్ సింగ్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతుండగా… ఈ క్రమంలో భద్రతా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ అదుపుతప్పి కాన్వాయ్‌లోని వాహనం ముందు పడిపోయారు. దీంతో ఆ వాహనం ఆయన కాలిపై నుంచి వెళ్లడంతో గాయాలయ్యాయి. ఈ విషయంపై నవాడా ఎస్పీ అభినవ్ ధీమన్ స్పందిస్తూ, “డ్రైవర్‌పై కేసు నమోదు చేశాం. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం” అని తెలిపారు.. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ, “రాహుల్ గాంధీ కారు ఓ పోలీసును తీవ్రంగా గాయపరిచింది. కనీసం ఆగి చూడకుండా ఆయన వెళ్లిపోయారు” అని తీవ్ర విమర్శలు చేశారు… **అయితే, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన మరో వీడియోలో వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే రాహుల్ గాంధీ తన వాహనాన్ని నిలిపివేశారు. కిందపడిన కానిస్టేబుల్‌ వద్దకు వెళ్లి, ఆయన్ను పైకి లేపి తన జీపులోకి ఎక్కించుకున్నారు. ఆయనకు మంచినీళ్లు అందించి, ఓదార్చిన తర్వాతే తన యాత్రను కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

👉పబ్జీకి బానిసై, ఫోన్ లాక్కున్నారని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి*నిర్మల్‌ జిల్లా భైంసాలో రోజుకు పది గంటలకు పైగా పబ్జీ గేమ్ ఆడుతూ బానిసైన బేతి రిశేంద్ర అనే పదవ తరగతి విద్యార్థి..ఎంతలా బానిసయ్యాడంటే గేమ్ ఆడటానికి సమయం ఉండదని, పదవ తరగతిలో చేరడానికి కూడా నిరాకరించిన రిశేంద్ర..సైక్రియాట్రిస్ట్‌, న్యూరోసర్జన్‌లకు చూపించినా తాను గేమ్ ఆడుతా అని, వారినే బెదిరించిన విద్యార్థి..తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఫోన్ లాక్కోగా.. మనస్తాపానికి గురై ఉరేసుకొని రిశేంద్ర ఆత్మహత్య.

👉తమిళ రాజకీయాల్లో భారీ సంచలనం.. దళపతి విజయ్ సెన్సేషన్ 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న దళపతి విజయ్ తాను మధురై నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ కీలక ప్రకటన చేశారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న దళపతి విజయ్ తాను మధురై నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ రోజు అక్కడ నిర్వహించిన బహిరంగ సభ తమిళ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. లక్షల మంది అభిమానులు తరలిరావడతో మధురైలో టీవీకే సభ విజయవంతంమైనట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అధికార డీఎంకే పార్టీకి టీవీకే మధ్యే జరగనుందని ఆ పార్టీ అధిపతి విజయ్ ప్రకటించారు. దక్షిణ భారత్ లో అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన హీరోగా విజయ్ కు గుర్తింపు ఉంది. ఇక గత కొన్నేళ్లుగా తమిళనాడులో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విజయ్.. గత ఏడాది సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. తమిళనాడులోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు సమదూరం పాటిస్తూ తానే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని విజయ్ వ్యూహం రచిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ బలప్రదర్శనకు దిగుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధురైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా లక్షల మంది జనం హాజరయ్యారు. ఎటు చూసినా అభిమానుల సందడితో సభా ప్రాంతం ఒక జన సముద్రాన్ని తలపించిందని చెబుతున్నారు. ఈ అభిమాన జనం ఓట్ల రూపం తీసుకుంటే విజయ్ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించడం ఖాయమంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సభకు వచ్చిన జనాన్ని చూసి విజయ్ కూడా ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. ఇక సభలో విజయ్ మాట్లాడుతూ, తమిళనాడులో అధికార డీఎంకే తన రాజకీయ విరోధిగా ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని భావజాల శత్రువుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేతోనే పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తట్టి వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను ఎంతగా విమర్శిస్తే, అంతగా ఎదుగుతానని ప్రత్యర్థులను హెచ్చరించారు. తమిళనాడులో ప్రధాన నగరమైన మధురై నుంచి తాను పోటీ చేయనున్నట్లు వెల్లడించిన విజయ్.. మధురై ఈస్ట్ నుంచి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కుల, మతాల తనకు ముఖ్యం కాదని, తమిళుడికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ముందు మనం ఎందుకు తల వంచాలని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ ఢిల్లీలో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో మహిళలకు రక్షణ లేకపోయిందని ధ్వజమెత్తారు. కాగా, 2024లో టీవీకేను స్థాపించగా, తొలి బహిరంగ సభ గత ఏడాది విల్లుపురంలో నిర్వహించారు. తాజాగా నిర్వహించిన సభతో విజయ్ సరికొత్త రికార్డు నెలకొల్పారని అంటున్నారు.
👉మియాపూర్‌లో రహస్య మరణాలు.. ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త మహబూబ్‌పేట కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందటం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఆ ఇల్లు లోపల విస్తరించిన నిశ్శబ్దం ఒక్కసారిగా భయంకర వాస్తవాన్ని బయటపెట్టింది. కుటుంబ పెద్ద ఉప్పరి లక్ష్మయ్య (60), ఆయన భార్య వెంకటమ్మ (55), కుమార్తె కవిత (24), అల్లుడు అనిల్ (32), రెండు ఏళ్ల చిన్నారి అప్పు – అందరూ నిర్జీవంగా పడివుండటం చూసి ఆరా తీయడానికి వచ్చినవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు తక్షణమే క్లూస్ టీమ్‌తో చేరుకున్నారు. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరించారు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం వారిని వెంటాడుతోంది – ఇది ఆత్మహత్యా? లేక పక్కా హత్యా? పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. మరణానికి గల నిజమైన కారణం ఇంకా బయటపడలేదు. అయితే ఆ ఇంటి గోడల మధ్య నడిచిన చివరి క్షణాలు ఎలాంటి వైనమో అనుమానాలు మరింతగా రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2025 జనవరిలో బెంగళూరులో టెకీ అనూప్‌కుమార్, భార్య రాఖీ, ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన గుర్తు వస్తోంది. ఆ ఇంటి సహాయకుడు తలుపు తట్టగా లోపల ఎలాంటి స్పందన రాకపోవడంతో బయటపడిన ఆ మర్మకథ అప్పుడు దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడీ మియాపూర్ ఘటన వెనక ఉన్న నిజం ఏమిటి? కుటుంబం ఒకేసారి ప్రాణాలు తీసుకున్నదా? లేక మరెవరైనా ఈ నేరాన్ని దాచిపెట్టారా? పోలీసుల దర్యాప్తుతోనే ఆ ఇంటి నిశ్శబ్దం వెనక దాగిన రహస్యాలు వెలుగులోకి రానున్నాయి.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..