👉ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు.. కౌంట్ డౌన్ షురూ!…👉లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. 👉30 రోజుల జైలు బిల్లు: చంద్రబాబు నితీష్ కోసమేనట!…👉 సీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు.. 👉షాద్‌నగర్ అదనపు న్యాయమూర్తి నియామకం*… 👉తిరుపతిలో జిల్లా కలెక్టర్ రేట్ దగ్గర దివ్యాంగుల ఆందోళన..👉యూరియా కోసం వచ్చి క్యూ లైన్లో సోమ్మసిల్లి కిందపడిన రైతు.. తల పగిలి తీవ్ర గాయం* 👉హైదరాబాద్ రిక్రూట్మెంట్లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం…*👉గుంతపల్లి లో ఎర్రచందనం దొంగలు అరెస్ట్ (కొమరోలు)*..👉 కంభం లోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సృజన ఆత్మహత్యాయత్నం.. 👉బాపట్ల తిరుపతి లలో దివ్యాంగుల ఆందోళన..

👉ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు.. కౌంట్ డౌన్ షురూ!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్..అడ్వకేట్ జనరల్, న్యాయవాదుల సూచనల తర్వాత.. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించిన స్పీకర్..మూడు నెలల్లోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గత నెల 25న స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు.
👉హైదరాబాద్ రిక్రూట్మెంట్లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం…*

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్
రిక్రూట్మెంట్లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపాయి.
2022 నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన కానిస్టేబుళ్లు ఫేక్
సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ పరిధిలో ఉద్యోగం కోసం స్థానికతను
చూపించడానికి నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించినట్ల
తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన 59 మందిలో 54 మంది కానిస్టేబుల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని పేర్కొన్నారు..వారిపై సిసిఎస్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థుల శిక్షణను నిలిపివేసి, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.అయితే.. నకిలీ సర్టిఫికెట్ల ప్రస్తావన మనం ఎక్కడో ఓ చోట చూస్తునే ఉంటాం.. కానీ పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను క్షుణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
👉షాద్‌నగర్ అదనపు న్యాయమూర్తి నియామకం*

హైదరాబాద్ హైకోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం న్యాయవ్యవస్థలో జరిగిన బదిలీలు మరియు కొత్త నియామకాలలో భాగంగా,  మల్యాల సాహితి ని షాద్‌నగర్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్-కమ్-అదనపు జూనియర్ సివిల్ జడ్జ్‌గా నియమించారు.
ఇంతకుముందు ఈ పదవిలో పనిచేసిన శ్రీ ధీరజ్ కుమార్ గారు బదిలీపై వెళ్ళిన కారణంగా, ఖాళీ ఏర్పడిన ఈ స్థానానికి హైకోర్టు నిర్ణయంతో మల్యాల సాహితి గారి నియామకం జరిగింది.
హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే, నియమిత న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం ద్వారా షాద్‌నగర్ న్యాయస్థానంలో న్యాయపరమైన వ్యవహారాలు మరింత సజావుగా సాగనున్నాయి..
👉తిరుపతిలో జిల్లా కలెక్టర్ రేట్ దగ్గర దివ్యాంగుల ఆందోళన..పెన్షన్లు కట్ చేయడంపై నిరసన..పెన్షన్లు కట్ చేస్తే బతికేదెలా అంటూ ఆవేదన..దేశ చరిత్రలో తొలి సారిగా వికలాంగులను రోడ్ పైకి తెచ్చిన పరిస్థితి చంద్రబాబు దే
**బాపట్లలో ఎమ్మార్వో ఆఫీసు వద్ద దివ్యాంగుల ఆందోళన..15 ఏళ్లుగా పింఛన్ అందుకుంటున్న దివ్యాంగుడు బాబా వలికి పెన్షన్ కట్ చేసిన టీడీపీ ప్రభుత్వం..పెన్షన్ నిలిపివేయడాన్ని నిరిసిస్తూ ఆందోళనకు దిగిన బాబా వలి..ధర్నా చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయిన బాబా వలి
👉యూరియా కోసం వచ్చి క్యూ లైన్లో సోమ్మసిల్లి కిందపడిన రైతు.. తల పగిలి తీవ్ర గాయం*

*మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుర్కితండా గ్రామపంచాయతీలో మల్లమ్మ కుంట తండాకు చెందిన అజ్మీరా లక్క, విజయ అనే దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకడం లేదని ఇవాళ ఇస్తున్నారని తెలిసి భార్య భర్తలు వచ్చి లైన్లో నిలబడ్డారు*..అయితే లక్కకు గతంలో పక్షపాతం ఉండగా అదే బాధలో యూరియా కోసం రాగా లైన్లో నిలబడి ఒకసారిగా సొమ్మసిల్లి మెట్ల పైనుంచి కింద పడడంతో తల పగిలి తీవ్ర గాయం..వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లక్కను పైకి లేపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
👉లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతని ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ కెసిరెడ్డి రూ.13 కోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ అతడు ఆస్తులు కొన్నట్లు సిట్ గుర్తించింది.

👉 ఒకే కుటుంబంలో 5 గురు మృతి..ఒకే కుటుంబానికి చెందిన 5 మంది అనుమానస్పదా స్థితిలో మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మక్త మహబూబ్ పేట్ కాలనిలో నివాసం ఉంటున్న ఉప్పరి లక్ష్మయ్య (60),
ఉప్పరి వెంకటమ్మ (55),కూతురు కవిత (24)
అల్లుడు అనిల్ (32 )
మనుమడు అప్పు (2)
మృతి వాత పడ్డారు.మియాపూర్ పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో మియాపూర్ పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.
మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


👉 సీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు
తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి (మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య), చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే మావోయిస్టులు లొంగిపోతున్నారని సీపీ తెలిపారు.
👉భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
పాల్వంచ: ఒడిస్సా రాష్ట్రం నుండి కేరళకు డీసీఎం వ్యాన్ లో తరలిస్తున్న ముగ్గురు నిందితుల నుండి 53 లక్షల విలువచేసే 107 కేజీల నిషేధిత గంజాయిని పాల్వంచ లో స్వాధీనం…డీసీఎం వ్యాన్,1 కారు, ఆరు సెల్ ఫోన్లు, 6 నైన్ ఎం ఎం పిస్టల్స్ ,12 ఖాళీ మ్యాగజైన్స్,45 బుల్లెట్లు ,35,500 నగదు,స్వాధీనం …విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు…
👉కంభంలో గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.*
👉 కంభం లోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సృజన ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పాఠశాల బాత్రూం లోనికి వెళ్లి లైజల్ త్రాగింది.. ఇవాళ ఉదయం స్టడీ అవర్లో ప్రాజెక్ట్ వర్క్ విషయంలో బయాలజీ టీచర్ అందరి ఎదుట కొట్టడం తో మనస్థాపం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికను కంభం ప్రభుత్వా వైద్యశాలకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం మార్కాపురం తరలించినట్లు సమాచారం….

👉గుంతపల్లి లో ఎర్రచందనం దొంగలు అరెస్ట్*

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుంతపల్లె గ్రామ సమీపంలో గురువారం ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి తిరుపతి టాస్క్ ఫోర్స్ స్టేషన్ లో మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నామని డిఎస్పి అన్నారు.

👉30 రోజుల జైలు బిల్లు: చంద్రబాబు నితీష్ కోసమేనట😲😲😲 …కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక రోజులో ముగుస్తాయనగా ఒక కీలక బిల్లుని సభ ముందుకు తెచ్చింది. బుధవారం ఆ బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక రోజులో ముగుస్తాయనగా ఒక కీలక బిల్లుని సభ ముందుకు తెచ్చింది. బుధవారం ఆ బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.ఈ బిల్లు పాస్ అయితే చంద్రబాబు రేవంత్ సీఎం పదవులు పోతాయా  ? ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టే బిల్లు అని విపక్షాలు అంటున్నాయి.  ఈ బిల్లులోని ముఖ్యాంశాలు చూస్తే చాలానే ఉన్నాయి. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉండే సందర్భంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవిని కోల్పోయేలా ఈ బిల్లుని రూపొంచారు ఈ బిల్లుని అనేకమైన నిబంధనలతో రూపొందించారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టడంతోనే మొత్తంగా విపక్షాలు వ్యతిరేకించాయి. ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టే బిల్లు అని విపక్షాలు అంటున్నాయి. ఈ బిల్లు కనుక చట్టం అయితే కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి ఆ మీదట అరెస్టయి నెల రోజులు కస్టడీలో ఉంటే చాలు 31వ రోజున వారు మాజీ అయినట్లే. వారి సమ్మతి లేకపోయినా వారి పదవి ఊడినట్లే. అలా ఆటోమేటిక్ గా పదవి పోయేలా కీలకమైన నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. ఇక కొంతమంది అయితే తాము పదవులకు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం దానికదే వర్తిస్తుంది. దాంతో పదవిని వెంటనే కోల్పోతారు. అందుకే దీనిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
* ద్వజమెత్తిన ప్రియాంకా గాంధీ : ఇక ఈ బిల్లు కనుక అమలులోకి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన దర్యాప్తు సంస్థలతో అక్రమ అరెస్టులు చేయించి వారిని జైలు పాలు చేస్తే చాలు 31న రోజున పదవి కోల్పోతారు అని విమర్శించారు. ఈ విధంగా విపక్షాల ముఖ్యమంత్రులు మంత్రులను తొలగించే విధంగా ఈ బిల్లు ఉందని ఆమె ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామిక మూలాలను దెబ్బ తీసేదిగా ఆమె అభివర్ణించారు. విపక్షం మూకుమ్మడిగా : ఈ బిల్లుని అసలు ప్రవేశపెట్టే ఆలోచననే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ బిల్లు కనుక చట్టం అయితే మాత్రం కార్యనిర్వాహక సంస్థలే జడ్జీ స్థానంలోకి వస్తాయని వారే శిక్ష అమలు చేసే వారుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వారికి అపరిమిత అధికారాలు లభిస్తాయని అదే విధంగా విపక్షంలో ఉండే ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు ఈ నిబంధనలను దుర్వినియోగం చేయవచ్చునని ఆయన విమర్శించారు. ***బాబు రేవంత్ లకు ముప్పేనా : ఏపీలో చంద్రబాబు 2023లో అరెస్టు అయ్యారు. ఆయన ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. మరి ఈ బిల్లు ప్రకారం చూస్తే 30 రోజులు జైలులో ఉంటే చాలు ఇక వారి పదవి ఊడినట్లే. ఆ విధంగా చంద్రబాబుకు కూడా ఈ బిల్లు వల్ల ఇబ్బందే అంటున్నారు. అంతే కాదు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో అరెస్టు అయి చాలా కాలం జైలులో ఉన్నారు. అది కూడా 30 రోజుల పై మాటే. మరి ఆయన సంగతి కూడా ఇంతేనా అని చర్చించుకుంటున్నారు. . జగన్ సైతం అదే విధంగా : ఇక వైసీపీ అధినేత జగన్ గతంలో పదహారు నెలలు ఏకంగా జైలులో ఉన్నారు. ఇక ఆయన మీద కొత్తగా కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలో ముప్పయి రోజులు జైలులో ఉంటే చాలు పదవీ భ్రష్టత్వం అంటే ఇక జగన్ సీఎం అయ్యే చాన్స్ ఉందా లేదా అన్నది మరో చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ బిల్లు విపక్షాల మీద ప్రయోగించిన అస్త్రంగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తీఎవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ కూడా కార్నర్ : ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. రేపటి రోజున విపక్షంలోకి వస్తే అపుడు ఇదే బిల్లు ఆ పార్టీకి కూడా ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. మరి బీజేపీ ఏమి ఆశించి ఈ బిల్లుని తెచ్చిందో తెలియదు కానీ అన్ని పార్టీలు విపక్షంలో వ్యతిరేకిస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో సైతం దీని మీద చర్చ సాగుతోంది. ఒక వ్యక్తి మీద కేసు నమోదు అయినపుడు కానీ అతను జైలులో ఉన్నపుడు కానీ నిందితుడు మాత్రమే అవుతారు అన్నది నిపుణులు చెప్పే మాట. నేరం రుజువు అయితే అపుడు అతను నేరస్థుడు అవుతారు. అలా కాకుండా ముందే పదవికి ఎసరు వస్తుందని కలవరపడుతున్నారు. మరి బీజేపీ వ్యూహం ఏమిటి అన్నది అయితే అర్ధం కావడం లేదనే అంటున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..