👉ప్రజలే ‘EC’ని అఫిడవిట్ అడుగుతారు: రాహుల్.. గాంధీ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఓట్ల చోరీపై సీఈసీతోపాటు ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ చెప్పారు. బిహార్ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా.. EC ఓట్ల అవకతవకల వ్యవహారం వెలుగుచూసినప్పటికీ.. ఇంకా తనను అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతోందని మండిపడ్డారు. ప్రజలే ఈసీని అఫిడవిట్ అడుగుతారన్నారు.
👉ఎన్నికల సంఘంపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..పోలింగ్ బూత్‌ల వద్ద సీసీటీవీ ఫుటేజీలను పారదర్శకంగా బయటపెట్టాలని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.మహిళల ప్రైవసీ కారణంగా సీసీటీవీ ఫుటేజీ ఇవ్వలేమన్న ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.”పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదు. మీరు చెప్పే సాకులపై మాకు ఆసక్తి లేదు, మాకు కావాల్సింది పారదర్శకత” అని ఆయన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు, పోలింగ్ సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
👉 ఏపీ పోలీసులకు వణుకు పుట్టిస్తున్న ‘అరుణ’ ఏపీ పోలీసు వర్గాల్లో శ్రీకాంత్ – అరుణ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కరుడుగట్టిన నేరస్తుడిగా.. జీవిత ఖైదుగా ఉన్న నేరస్తుడికి పెరోల్ రావటం ఒక ఎత్తు..
అయితే.. అతడ్ని బయటకు తీసుకురావటంలో అరుణ టాలెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పోలీసు వర్గాల్లో శ్రీకాంత్ – అరుణ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కరుడుగట్టిన నేరస్తుడిగా.. జీవిత ఖైదుగా ఉన్న నేరస్తుడికి పెరోల్ రావటం ఒక ఎత్తు అయితే.. అతడ్ని బయటకు తీసుకురావటంలో అరుణ టాలెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాంత్ ప్రియురాలిగా కొందరు.. కాదు భార్యే అంటూ మరికొందరు చెబుతున్న వైనం కొత్త రచ్చగా మారింది. జిల్లా ఎస్పీలు శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసినా.. హోంశాఖను ఒత్తిడికి గురి చేసి.. చివరకు తాను అనుకున్నట్లుగా శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించిన అరుణ టాలెంట్ అచ్చెరువు పొందేలా మారింది. హత్య కేసులో జీవితఖైదులో ఉన్న వ్యక్తిని పెరోల్ లో బయటకు తీసుకొచ్చిన వైనం ఒక ఎత్తు అయితే.. అలా బయటకు వచ్చిన శ్రీకాంత్ తో అరుణ విందులు.. వినోదాలు.. సన్నిహితంగా ఉన్న వేళలలో ఉన్న వీడియోలు బయటకు రావటం కలకలాన్ని రేపింది. దీంతో.. స్పందించిన కూటమి సర్కారు.. శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడికి అక్రమ పద్దతిలో పెరోల్ ఇప్పించిన అరుణను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు ముందు కారు డిక్కీలో కూర్చొని సెల్పీ వీడియో తీసుకున్న అరుణ.. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు.. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. పోలీసు శాఖను ఇంతలా ప్రభావితం చేసేలా అరుణకు ఉన్న పరపతి ఏమిటి? పోలీసు యంత్రాంగాన్ని తాను అనుకున్నది అనుకున్నట్లుగా పనులు ఎలా చేయించగలుగుతున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న దానిపై కొత్త చర్చ మొదలైంది. అవిలేలి శ్రీకాంత్ సొంతూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు. వైసీపీలో కొంతకాలం ఉన్న అతను తర్వాతి కాలంలో టీడీపీలో పని చేశారు. ఇతడో గ్యాంగ్ ను మొయింటైన్చేస్తూ.. బ్లాక్ మొయిల్ మొదలు పలు దందాలు చేసేవారని ఆరోపిస్తున్నారు . ఇతడి నేరాల చిట్టా తరుపతి.. నెల్లూరు జిల్లాల్లో భారీగా ఉంటాయని చెబుతారు. ఒక హత్య కేసులో అతను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జీవితఖైదు విధించారు. 2010 నుంచి నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదుగా ఉన్న అతను.. 2014లో సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకున్నాడు. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు తప్పించుకు తిరిగిన శ్రీకాంత్ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. జైల్లో ఉంటూనే అతను 60కు పైగా తీవ్రమైన నేరాల్లో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ ఉంది. గత ఏడాది ఎన్నికల వేళలో టీడీపీ నేతపై జరిగిన హత్యాయత్నం వెనుక కూడా శ్రీకాంత్ హస్తం ఉందన్నమాట బలంగా వినిపిస్తూ ఉంది. ఇక.. శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ గురించి కథలు కథలుగా చెబుతారు. ఆమె ప్రియురాలు కాదు.. శ్రీకాంత్ భార్యగా కొందరు చెబుతారు.అయితే.. వారిద్దరు పెళ్లి చేసుకున్న ఆధారాలు లేవని చెబుతారు. ఆమె 2002 నుంచి ఒక ఎన్జీవోను రన్ చేస్తుంటారని.. సదరు సంస్థ జైల్లోని ఖైదీల కోసం పని చేస్తుంటారని చెబుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు చెందిన ఆమె గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ పెరోల్ కోసం దాదాపు రూ.12 లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా ఆమే స్వయంగా చెప్పుకోవటం సంచలనంగా మారింది. దీనికి తోడు.. శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకురావటం.. తప్పుడు విధానాలతో పెరోల్ తీసుకున్న వైనాన్ని రాష్ట్ర హోంశాఖ గుర్తించింది. తన ప్రియుడు శ్రీకాంత్ ను బయటకు తీసుకొచ్చేందుకు వీలుగా ఆమె చేసిన ప్రయత్నాల్నితిరుపతి.. గూడూరు డీఎస్పీ.. సీఐతో పాటు నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ లు రాష్ట్ర హోం శాఖకు విన్నవించిన తర్వాత కూడా జులై 30న శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయటం సంచలనంగా మారింది. దీని వెనుక అరుణ మేజిక్ ఉందని చెబుతున్నారు. అయితే.. శ్రీకాంత్ పెరోల్ అంశం రచ్చ కావటం..చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయం హైలెట్ కావటంతో శ్రీకాంత్ కు మంజూరు చేసిన పెరోల్ రద్దు అయ్యింది. అసలీ ప్రాసెస్ ఎలా జరిగిందన్న అంశంపై హోంశాఖ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ క్రమంలో అరుణ లీలలు తెర మీదకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే డబ్బు.. కాదంటే మరేదైనా సరే.. ఇవ్వటం ద్వారా అరుణ తన పనుల్ని పూర్తి చేస్తారని చెబుతున్నారు. హోంశాఖలో అరుణకు ఉన్న పలుకుబడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన ప్రియుడికి జారీ చేసిన పెరోల్ రద్దు వేళ.. ఫస్ట్రేషన్ కు గురైన అరుణ.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. పెరోల్ జీవోను రద్దు చేయటం హోంశాఖ చరిత్రలోనే తొలిసారిగా అభివర్ణిస్తున్నారు. తనపైనా.. శ్రీకాంత్ పైనా సోషల్ మీడియాలోనూ.. టీవీ చానళ్లలో వస్తున్న కథనాలతో నిజం లేదని వాదిస్తున్న అరుణ.. మరో అడుగు ముందుకు వేసి.. మమ్మల్ని వాడుకొని వదిలేశారని.. ఇప్పుడు మాపైనే విష ప్రచారం చేస్తున్నారు. నేతల బండారం బయటపెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇన్ని నిందలు మోపుతుంటే మౌనంగా ఉండాలా? ఇంకా బాధలు పడాలా? ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు? మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా.. దేనికైనా సిద్ధపడిపోవటమే మేలు’ అంటూ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. పోలీసు శాఖలో ఆమెకున్న పట్టు ఇప్పుడు ఆ శాఖను కుదిపేస్తుంది. ఆమె నోరు విప్పితే తమ పరిస్థితి ఏమిటి? అన్నది ఏపీ పోలీసుశాఖలో జరుగుతున్న చర్చ సంచలంనగా మారింది.
👉బీ అలర్ట్..! *. భారీ వర్షాల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం..*. అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్ ..*. కలెక్టరేట్లో 1077 నంబరుతో కంట్రోల్ రూమ్..
రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ దిశగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బుధవారం తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోయే అవకాశం ఉన్న పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళలు, గర్భిణులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె చెప్పారు. స్థానికంగా ఉన్న కాలువలు, వాగులు, వంకలు, ఇతర నీటి వనరులు ఉదృతంగా ప్రవహిస్తున్న చోట అటువైపుగా వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వీఆర్ఏ, వీఆర్వోలను ఆయా ప్రాంతాలలో కాపలాగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేలా అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైనా, సహాయం అవసరమైనా ప్రజలు వెంటనే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేలా కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబరుతో ఈనెల 16వ తేదీ వరకు 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశారు. రెవిన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఈ కంట్రోల్ రూములో షిఫ్టులు వారీగా పని చేసేలా విధులను కేటాయించారు. ఇదేవిధంగా మండల, డివిజన్ల స్థాయిలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
👉మండల వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ నల్లకాలువ , నర్సిరెడ్డి పల్లె గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించినారు. అన్నదాత సుఖీభవ రాని వారు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు,పంటల భీమా ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. ఆ తర్వాత ప్రత్తి, కొర్ర పంటను పరిశీలించి సూచనలు చేశారు. పొలంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కు నీరు నిలిస్తే. బయటకు తీసివేసి 20 kg యూరియా మరియు 10 kg పొటాష్ లను ఎకరానికి వేయాలని, లేదా 19.19.19 or పొటాషియం నైట్రేట్ 1kg ఎకరానికి పిచికారీ చేయాలని వివరించారు. కార్యక్రమంలో vaa లు ప్రశాంత్, సాయి రైతులు పాల్గొన్నారు
👉పోగొట్టుకున్న ఫోన్ ను బాధితుడికి అప్పగించిన ఎస్ఐ నరసింహారావు* ప్రకాశం జిల్లా….*కంభం:* పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను ఎస్ఐ బి.నరసింహారావు బాధితుడికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఏప్రిల్ నెలలో షేక్ అహమ్మద్ బాషా తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. ఫోన్ పోయిన వెంటనే మొబైల్ స్విచ్చాఫ్ కావడంతో అహమ్మద్ బాషా వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటింటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్సైటులో నమోదు చేయగా పోగొట్టుకున్న ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ను ట్రాక్ చేసి పోలీసులు ఫోన్ ను బుధవారం రికవరీ చేశారు. అనంతరం ఎస్ఐ నరసింహారావు బాధితుడు అహమ్మద్ బాషా కు ఫోన్ ను అప్పగించారు. దీంతో అహమ్మద్ బాషా ఎస్ఐ నరసింహారావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ.. ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలను సీఈఐఆర్‌లో నమోదు చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు. దీని ద్వారా ఫోన్‌ను పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైనా మొబైల్ ఫోన్‌లు, అనుమానిత వస్తువులు, ఇతర విలువైన వస్తువులు దొరికితే సమీప పోలీష్‌స్టేసన్‌లో అప్పగించాలన్నారు. అంతే కాని అలాంటి వస్తువులను తమ దగ్గర ఉంచడం వల్ల నేరం అని ఎస్సై నరసింహా రావు తెలిపారు.
👉అక్రమ మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్*
35 గోవా మద్యం ఫుల్ బాటిళ్లు సీజ్.. ఒక వ్యక్తి అరెస్టు… ప్రకాశం జిల్లా… కంభం మండలం కంభం గ్రామంలో స్థానిక నెహ్రు నగర్ ఎందు గోవా మద్యం అమ్మకాలపై కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోతురాజుటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 35 గోవా ఫుల్ (750ml) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం సీసాలు అమ్మినా, బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్బంగా ఆయన తెలిపారు..
👉 పోలీస్ లమని వచ్చి.. మహిళను బెదిరించి 20,000/- వసూలు చేసిన నలుగురు విలేఖరులు…
పగో: తాడేపల్లిగూడెం రూరల్ : కుంచనపల్లి :భర్తతో విభేదాల కారణంగా తన ఇద్దరు పిల్లలతో కుంచనపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒక మహిళ..మహిళ వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి , ఇక్కడ వ్యభిచారం జరుగుతుంది మేము పోలీసుమని చెప్పి – బెదిరించి , దౌర్జన్యం చేసి 20,000/- రూపాయలు వసూలు చేసిన ప్రముఖ దినపత్రిక మరియు శాటిలైట్ ఛానల్స్ విలేకరులు..సదరు మహిళ ఫిర్యాదు పై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు…
Cr.No 142/2025 u/s 308(2), 319(2), 79, 351(2) R/w 3(5) B.N.S (384, 419,509,506 R/w 34 IPC)
1) A1.. 10 టీవీ – మహేష్. 2) A2..ఈనాడు – కళ్యాణ్. 3) A3..ఈనాడు – రాజశేఖర్..4) A4..సాక్షి టీవీ ప్రకాష్.
👉హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్*..రూ.60 వేలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గాప్రసాద్ ..బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద ఉన్న రెస్టారెంట్ ఓనర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కిన దుర్గాప్రసాద్ ..హైవే పక్కన రెస్టారెంట్ నడిపిస్తున్నందుకు లంచం డిమాండ్..
👉బురదమయంగా ఆర్టీసీ గ్యారేజ్… జారిపడి గాయపడుతున్న ఉద్యోగులు… గిద్దలూరు పట్టణం లోని ఆర్టీసీ గ్యారేజీలో జారిపడి వీరమ్మ అనే కండక్టర్ తీవ్రంగా గాయపడింది. ఆమెకు కుడికాలు విరగడంతో ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యారేజీలో వర్షం పడిన ప్రతిసారి ఏర్పడే బురద వల్ల పలువురు ఆర్టీసీ ఉద్యోగులు జారిపడి గాయపడుతున్నట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలా పలుమార్లు జరిగిందని ఉద్యోగులు అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు గాయపడుతున్న గ్యారేజ్ ప్రాంతాన్ని ఉన్నతాధికారులు మరమ్మతులు చేయలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని సమస్య పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

