👉 ‘ఓటు చోరీ’ పై సమాధానాలు లేని ఎన్నికలకమీషన్.. “ఓటు చోరీ” వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న కఠిన వైఖరి ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కమిషన్ (ఈసీ) అనేది ఒక స్వతంత్ర, నిష్పక్షపాత రాజ్యాంగ సంస్థ. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ప్రతిపక్షాల ఆరోపణలు, ఈ సంస్థ తటస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంధించిన అనుమానాలకు, ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు లేకుండా ఎదురుదాడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వివాదం దేశంలోని రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. “ఓటు చోరీ” వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న కఠిన వైఖరి ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆరోపణలకు ఆధారాలు చూపించమని, లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఈసీ చీఫ్ జ్ఞానేశ్ కుమార్ అల్టిమేటం జారీ చేయడం ప్రతిపక్షాలను ఆగ్రహానికి గురి చేసింది. సాధారణంగా ఇలాంటి ఆరోపణలను విచారించి నిజానిజాలు వెలికితీయాల్సిన ఈసీ, ఎదురుదాడికి దిగడం ఆశ్చర్యకరమైన విషయం. ఈసీ చర్య దాని విశ్వసనీయతపై సందేహాలను పెంచింది. ప్రతిపక్షాల ప్రధాన ప్రశ్నలు ఈసీపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలు చాలా తీవ్రమైనవి. వాటిలో కొన్ని..బీహార్‌లో 65 లక్షల ఓటర్ల పేర్లు ఎందుకు తొలగించారు? మహదేవపురలో లక్ష నకిలీ ఓటర్లు ఎలా నమోదయ్యారు? పోలింగ్ బూత్‌ల సీసీటీవీ ఫుటేజీని 45 రోజుల్లోనే ఎందుకు తొలగిస్తున్నారు? ఆధార్‌తో ఓటర్ ఐడీని అనుసంధానం చేయడాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఇలాంటి ఈసీ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం ఆ సంస్థ విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితులు ఓటర్లలో గందరగోళానికి దారితీస్తున్నాయి. రాజకీయ పరిణామం ఈసీ చీఫ్ జ్ఞానేశ్ కుమార్ పైన ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. అయితే, పార్లమెంటులో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అందరికీ తెలుసు. అయినప్పటికీ, ఈసీపై ఒత్తిడి పెంచడానికి, తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. భవిష్యత్ ప్రభావం ఈ వివాదం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈసీ – ప్రతిపక్షాల మధ్య తలెత్తిన ఈ ఘర్షణ రాబోయే ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కీలక సంస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే అది మొత్తం వ్యవస్థనే బలహీనపరుస్తుంది. ఈసీ తనపై వస్తున్న ఆరోపణలపై పారదర్శకంగా వ్యవహరించకపోతే, అది కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే ముద్ర మరింత బలపడే ప్రమాదం ఉంది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ తటస్థంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా అవసరం. ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదురుదాడితో కాకుండా, పారదర్శకమైన విచారణతో సమాధానాలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఈసీ తన విశ్వసనీయతను కాపాడుకోగలదు.
👉పవన్ నటించొద్దు.. హైకోర్టులో షాకిచ్చిన మాజీ ఐఏఎస్ ..🤔
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనితో ఈ కేసు రాజకీయ మరియు న్యాయపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. – అధికార దుర్వినియోగం ఆరోపణలు ఈ పిటిషన్‌లో విజయ్‌కుమార్.. ఏకంగా పవన్ కళ్యాణ్ మీద కీలక ఆరోపణలు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా తన హోదాను అడ్డుపెట్టుకుని, ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు ఫైల్‌ను స్వయంగా ప్రాసెస్ చేశారని, అంతేకాకుండా సినిమా ప్రచారానికి ప్రభుత్వ నిధులను వినియోగించుకున్నారని ఆయన వాదించారు. ఒక మంత్రి వ్యాపార కార్యకలాపాలలో నేరుగా పాలుపంచుకోవడం ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చర్య పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని విజయ్‌కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్.. కానీ తిరస్కరణ ఈ వ్యవహారం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడానికి, సీబీఐ లేదా ఏసీబీ ద్వారా దర్యాప్తు జరిపించాలని విజయ్‌కుమార్ కోర్టును కోరారు. అయితే ఈ దశలోనే పవన్ కళ్యాణ్, సీబీఐ, ఏసీబీలకు నోటీసులు జారీ చేయాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. – విచారణ వాయిదా, ఊహించని పరిణామం ఈ కేసును విచారించిన డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపా ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్, కేసును మరో వారం రోజులకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ కొట్టివేయబడుతుందని చాలామంది భావించినప్పటికీ, హైకోర్టు దీనిని విచారణకు స్వీకరించడం పవన్ కళ్యాణ్‌కు పెద్ద షాక్‌గా మారింది. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు అదే సినిమాపై న్యాయపరమైన వివాదం తలెత్తడం పవన్ కళ్యాణ్‌కు మరో సమస్యగా మారింది. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
👉 న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర రాష్ట్ర విద్య, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేష్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మరియు సహచర పార్లమెంట్ సభ్యులు.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని విజ్జప్తి చేసిన మంత్రి నారా లోకేష్ ..!! క్వాంటమ్ వ్యాలీకి రూ. 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెంట్రల్ ఇన్నొవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చి రూ. 300 కోట్లు సాయం అందించమని కోరిన కేంద్ర మంత్రిని కోరినారు.
👉ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి .
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్ గారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మరియు ఏపీ పార్లమెంట్ సభ్యులు న్యూడిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైననందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్ధవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.
👉* న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర రాష్ట్ర విద్య, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేష్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మరియు సహచర పార్లమెంట్ సభ్యులు. .అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని విజ్జప్తి చేసిన మంత్రి నారా లోకేష్ ..!! క్వాంటమ్ వ్యాలీకి రూ. 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెంట్రల్ ఇన్నొవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చి రూ. 300 కోట్లు సాయం అందించమని కోరిన కేంద్ర మంత్రిని కోరినారు.
👉ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి .
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్ గారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మరియు ఏపీ పార్లమెంట్ సభ్యులు న్యూడిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైననందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్ధవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.👉కిలేడీ పాపం పండింది*!😲😲😲
నెల్లూరులో పోలీసులనే శాసిస్తున్న మహిళ అనే కథనంపై హోంమంత్రి అనిత స్పందన. కథనంపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత. హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ కు పెరోల్ అంశంపైనా హోంమంత్రి ఆరా. పెరోల్ అంశంపై నివేదిక ఇవ్వాలని జైళ్లశాఖ డీజీకి హోంమంత్రి ఆదేశం.వైసీపీ హయాంలో నేతల అండతో మహిళ ఆగడాలు అంటూ కథనం. నెల్లూరు పోలీసుల అండతో ఐదేళ్లపాటు సెటిల్‍మెంట్లు చేసినట్లు ఆరోపణలు. మళ్లీ పైరవీలతో హత్య కేసు నిందితుడికి పెరోల్ ఇప్పించినట్లు ఫిర్యాదులు. ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత.
👉నెల్లూరు అరుణ : బయటకు రావాల్సింది చాలా ఉంది* !
వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు.. విజయవాడలో ఓ జేబుదొంగల కుటుంబానికి కార్పొరేటర్ టిక్కెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత కూడా ఆ కుటుంబం తమ వృత్తిని మానుకోలేదు. ఓ టీడీపీ సభలో జేబులు కొడుతూ దొరికిపోయారు. కేసులు అయ్యాయి. అప్పుడు వాళ్ల బ్యాక్ గ్రౌండ్ చూసి.. వైసీపీ స్ట్రాటజీ అదేనని అందరూ బిత్తరపోయారు. చిన్న చిన్న నేరస్తుల నుంచి పై స్థాయి వరకూ నేర మనస్థత్వం ఉన్న వారిని రాజకీయంగా ప్రోత్సహించడం ఆ పార్టీ స్ట్రాటజీలో ముఖ్యం. నెల్లూరు లేడీ డాన్ గా ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన అరుణకూ అలాగే ప్రోత్సాహం లభించింది. ఆమె చెలరేగిపోయారు.
వైసీపీ నేతగా ఎదిగిన అరుణ..
నెల్లూరు అరుణ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్ ప్రచారకురాలి అవతారం ఎత్తింది. ఆమె చేస్తున్న దందాలతో వైసీపీ నేతలు ఫిదా అయ్యారు. వారి సహకారంతో పోలీసు ఉన్నతాధికారులతో చనువు పెంచుకున్నారు. పోలీసులకే ఎలాంటి పనిని అయినా చేసిపెట్టే స్థాయికి వెళ్లారు. ఆమె ఎంత రేంజ్ కు వెదికారంటే.. ఓ ఖైదీని ఆస్పత్రికి పిలిపించుకుని పోలీసుల్ని కాపలా పెట్టుకుని ఆ ఖైదీతో సంసారం చేసేంత స్థాయికి ఎదిగారు. ఆ వీడియోలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు రాష్ట్రం అంతా ఆశ్చర్యపోతోంది..
వైసీపీ మాజీ మంత్రి కుమారుడి పని..ఇద్దరు ఐపీఎస్‌లు వద్దని చెప్పినా నేరుగా హోంశాఖ కార్యాలయం నుంచి పెరోల్ జీవోను రిలీజ్ చేయించుకోవడం వెనుక పెద్ద తలకాయ ఎవరో ఉండి ఉంటారని సులువుగా ఊహిస్తారు. ఓ వైసీపీ మాజీ మంత్రి కుమారుడు ఈ పని చేసి పెట్టినట్లుగా సచివాలయ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఈ విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. తాను పదకొండు లక్షలు ఇచ్చినట్లుగా అరుణ ఈ అంశంలో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అరుణ ఒకప్పుడు చిన్న బొతిక్ నడుపుకునేవారు. ఆమే నేర మనస్థత్వంతో.. రౌడీలతో పరిచయాలు పెంచుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారు. దానికి మనుషుల్ని అసువుగా చంపే…శ్రీకాంత్ అనే రౌడీతో పరిచయాలు పెంచుకుని ఆ పని చేస్తోంది.
*మొత్తం తీగ లాగుతున్న అధికారులు.. అసలు వైసీపీ హయాంలో ఈ అరుణ ఏం చేసింది.. ఇప్పుడు మళ్లీ ఏం చేస్తోంది అనేది అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పాత దందాలు, సెటిల్మెంట్లు, సహకరించిన అధికారులు.. ఇలా జాబితా మొత్తం రెడీ చేస్తున్నారు. బాగోతం అంతా బయట పెట్టి కఠిన చర్యలు తీసుకోనున్నారు.
👉 ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం *
* తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ నాలుగు రోజుల నుంచి మొత్తు కుంటున్న సౌమ్య* *సౌమ్యని ట్రోల్ చేస్తూ నెగెటివ్‌గా టీడీపీ నేతల పోస్టులు. *దీనితో మనస్థాపానికి గురై సౌమ్య ఆత్మహత్యాయత్నం..**చావు, బతుకు ల్లో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సౌమ్య*.. ఇప్పటికే ఎమ్మెల్యే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు . ఎమ్మెల్యే పై నివేదిక కోరిన సిఎం చంద్రబాబు..
👉 లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ” *అనంతపురం జిల్లా:*
▪️సోషియల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ … టీడీపి ఎమ్మెల్యే మరియు టీడీపి కార్యకర్త మధ్య సంభాషణ లీక్..నాపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అంటున్న టీడీపి ఎమ్మెల్యే దగ్గుపాటి..అనంతలో ‘వార్ 3’ ఎమ్మెల్యే × జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు..ఆ వాయిస్ నాది కాదు అంటున్న టీడీపి ఎమ్మెల్యే..ముమ్మాటికి ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న ఎన్టీఆర్ అభిమానులు..ఈ ఘటన ఫై అధిష్టానం మౌనం ఎవరికి సమాధానం.రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న ఈ ఆడియో ఘటన … ఆందోళనలు ఉదృతంగా మొదలు పెడుతున్న ఎన్టీఆర్ అభిమానులు.సోషల్ మీడియాలో ఆడియో వైరల్.
👉* న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర రాష్ట్ర విద్య, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేష్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మరియు సహచర పార్లమెంట్ సభ్యులు.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని విజ్జప్తి చేసిన మంత్రి నారా లోకేష్ ..!! క్వాంటమ్ వ్యాలీకి రూ. 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెంట్రల్ ఇన్నొవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చి రూ. 300 కోట్లు సాయం అందించమని కోరిన కేంద్ర మంత్రిని కోరినారు.
👉ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి .
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్ గారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మరియు ఏపీ పార్లమెంట్ సభ్యులు న్యూడిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైననందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్ధవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.

