👉 ఐటీ ముసుగులో భూములు లిఫ్ట్ .. 99 పైసలకే .. నచ్చిన రేటుకు తెగనమ్ముకోండి… టిడిపి పై ఆరోపణలు..**స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కార్యాచరణ ప్రకటిస్తాం..మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. 👉 ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి వీల్లేకుండా చట్టం తెచ్చారు: కేంద్రంపై రాహుల్ ఫైర్..👉ఓట్ల చోరీ కుట్రలు సాగనివ్వం..బీహార్‌ సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఉద్ఘాటన.. ఓటర్‌ అధికార్‌ యాత్ర ప్రారంభం👉 కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భేటీ..👉చిట్టీల పేరు తో ప్రజలకు కుచ్చు టోపి పెట్టె వారికి….బెజవాడ సీపీ మాస్ వార్నింగ్!…👉మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీకి మరోసారి బ్రేకులు👉పింఛ‌న్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు.. చిత్తూరు

👉 ఐటీ ముసుగులో భూములు లిఫ్ట్…? .. ఎంత భూమైనా సరే.. 99 పైసలకే విక్రయిస్తాం..మీకు నచ్చిన రేటుకు తెగనమ్ముకోండి… బాబు సర్కారు భలే ఎత్తుగడ  .. ‘రియల్’ దందాకు రెడీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా లోకేశ్ మార్కు విధానం.. అని ఆరోపణలు..ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పేరుతో ప్రత్యేక పాలసీ.. ఊరూ పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలు వందలాదిగా సృష్టించి ధారాదత్తం చేసే ఎత్తుగడ.. అని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు.ఉర్సాకు కారుచౌకగా కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు రావడంతో తెరపైకి మరో పాలసీ ..ఇక రాష్ట్రమంతటా పప్పు బెల్లాల మాదిరిగా అదే విధానంలో పందేరం..”ఫార్చూన్ 500 యూరోప్”పై ఉన్నతాధికారుల్లో అనుమానాలు..ఆ ఇండెక్స్ లో నల్లధన రాజదాని స్విట్జర్లాండకు చెందిన 36కిపైగా కంపెనీలు ..

👉స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కార్యాచరణ ప్రకటిస్తాం..మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే..మద్దతు ఉపసంహరిస్తామని చంద్రబాబు చెప్పగలరా అని స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం మాటతప్పిందనీ  ఆరోపించారు.

👉 ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి వీల్లేకుండా చట్టం తెచ్చారు: కేంద్రంపై రాహుల్ ఫైర్..

ఈసీపై చర్యలకు అవకాశం లేకుండా 2023లో కేంద్రం చట్టాన్ని తీసుకొచ్చిందన్న రాహుల్ గాంధీ..మోదీ – షాలకు ఈసీ సాయం చేస్తోందని ఆరోపణ..‘‘ఒక వ్యక్తి – ఒక ఓటు’’ సూత్రాన్ని కాపాడడం కోసమే తమ పోరాటమని వ్యాఖ్య..ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలులేకుండా కేంద్రం 2023లో ఓ చట్టాన్ని తీసుకువచ్చిందని; ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఈసీ సాయం చేయడం వల్లే ఇలా చట్టం చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్షాల ఆరోపణల పట్ల ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన ఆరోపణలు చేశారు. బిహార్‌లో ఓట్ల చోరీకి ఇది ఒక మార్గం కావచ్చని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఎన్నికల సంఘం సహాయం చేస్తోందని విమర్శించారు. బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ తొలిరోజు ముగింపు సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసిందన్నారు.

2023లో కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చింది. దాంతో, ఎన్నికల కమిషనర్లపై కేసులు పెట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే మోదీ, షాలకు ఈసీ సహకరిస్తోందని, ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చిందని ఆయన ప్రశ్నించారు. ‘‘ఒక వ్యక్తి – ఒక ఓటు’’ సూత్రాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు..అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈసీకి ఎలాంటి పక్షపాతాలు లేవు. అన్ని పార్టీలను సమానంగా చూస్తాం. ఓట్ల చోరీ అని అనవసర అనుమానాలు లేవనెత్తడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ సంస్థలను అవమానించకూడదు. రాహుల్ గాంధీ వారం రోజుల్లోగా దీనిపై అఫిడవిట్ సమర్పించాలి. లేనిపక్షంలో ఆయన ఆరోపణలను నిరాధారమైనవిగా పరిగణిస్తాం” అని స్పష్టం చేశారు.

👉ఓట్ల చోరీ కుట్రలు సాగనివ్వం..బీహార్‌ సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఉద్ఘాటన.. ఓటర్‌ అధికార్‌ యాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ/పాట్నా : అనైతిక, అక్రమ విధానాల్లో ఓట్లను దొంగలించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కుట్రలను ప్రతిపక్షాలతో కూడిన ‘ఇండియా’ ఫ్రంట్‌ సాగన్విబోదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఉద్ఘాటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కుమ్మక్కై ఎన్నికల సంఘం (ఇసి) ఓట్లను దొంగలిస్తోందని, ఈ సంగతి ఇప్పుడు దేశ ప్రజలం దరికీ తెలిసిపోయిందని ఆయన మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ కుట్రలో వాళ్లను ‘ఇండియా’ నెగ్గనివ్వదని పేర్కొన్నారు. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాల్లోకి ఓటర్లను కలిపి, తీసివేసి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలనూ ఓట్లను తస్కరించాలని ఇసి, బిజెపి కుట్ర పన్నాయని ఆయన వివరించారు. బీహార్‌లో ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ను ఆయన ఆదివారం ప్రారంభిం చారు. 16 రోజులపాటు 25 జిల్లాల్లో 1,300 కిమీ పరిధిలో ఈ యాత్ర సాగనుంది. యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా బీహార్‌లోని ససారంలో నిర్వహించిన సభలో రాహుల్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు దీపాంకర్‌ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.

*రాజ్యాంగ ధ్వంసానికి ఆర్ఎస్ఎస్‌, బిజెపి యత్నం.. పేదల చేతిలో ఉన్న ఏకైక శక్తి ఓటు హక్కు అని, దాన్ని పేదలకు దూరం కాకుండా చూస్తామని రాహుల్‌ తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఆర్ఎస్ఎస్‌, బిజెపి యత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ను ప్రారంభించామని వెల్లడించారు. యావత్‌ దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓట్ల చోరీ జరిగిందన్నారు.

*బిజెపికి గెలుపునకు కారణమదే.. ప్రతీ ఎన్నికలోనూ బిజెపి గెలుస్తోందని, ఇందుకు కారణం ఓటర్ల జాబితాలో చేసిన అక్రమ మార్పులు, చేర్పులేనని రాహుల్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో ఒపీనియన్‌ పోల్స్‌ అన్నీ కూడా ‘ఇండియా’ గెలుస్తుందని కోడైకూస్తే..ఆ ఎన్నికల్లోనూ బిజెపి క్లీన్‌స్వీస్‌ చేసిందని, దీని రహస్య కూడా ఈ కుట్రేనని రాహుల్‌ తెలిపారు. మహారాష్ట్రలో ఒక కోటి మంది ఓటర్లను ఇసి చేర్చిందని, ఇదే బిజెపికి అనుకూలంగా మారినట్లు తమ అధ్యయనంలో తేలిందని రాహుల్‌ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిజమైన కులగణనను చేయించలేరని, ఆ ఆలోచన కూడా ఆయనకు లేదని రాహుల్‌ విమర్శించారు. ‘ఇండియా’ ఫ్రంట్‌ మాత్రమే సిసలైన కులగణనను చేయించగలదన్నారు.

*లాలూకు కృతజ్ఞతలు.. ఓటర్‌ అధికార్‌ యాత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని వైద్యులు చెప్పినా..వినకుండా లాలూజీ ఇక్కడకు వచ్చారని, ఆయనకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాహుల్‌ అన్నారు.

*మోడీని గద్దె దించకపోతే అన్నిటికీ ముప్పే : ఖర్గే..

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లంతా మనకు ఓటుహక్కును ప్రసాదించారని, ఈ హక్కును సవాల్‌ చేసేలా ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగించారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. దేశ స్వాతంత్య్రోద్యమానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్‌ పనిచేసిందని, మహాత్మాగాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్సే ప్రధాన కారణమని తెలిపారు. కనీస అర్హత లేని వాళ్ల పేర్లను ఎర్రకోట వేదికగా మోడీ ప్రస్తావించడం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ చాలా ప్రమాదకారి అని, ఆయన్ను అధికారం నుంచి తప్పించకుంటే ఓట్లు, హక్కులు, స్వేచ్ఛ, రాజ్యాంగం అన్నీ ప్రమాదంలో పడతాయని ఖర్గే హెచ్చరించారు. మోడీ సర్కారుకు ఏజెంటులా ఇసి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

*ఎన్‌డిఎను ఓడిస్తాం..: లాలూ…  బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమిని ఇండియా ఫ్రంట్‌ ఓడించితీరుతుందని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్‌డిఎను ఓడించక తప్పదన్నారు. ఎమర్జెన్సీ కాలం కంటే దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. ఇలాంటి సమయంలో రాహుల్‌ గాంధీ చేపడుతున్న యాత్రతో ‘ఇండియా’ ఫ్రంట్‌ ప్రజలకు మరింత చేరువ అవుతుందని తెలిపారు.

*ఓట్ల లూటీ కోసమే ఎస్ఐఆర్‌ : తేజస్వీ యాదవ్‌..

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) అనేది ఓట్ల లూటీ తప్ప మరొకటి కాదని, ప్రజల ఓట్లను చోరీ చేసేందుకు ఇసి యత్నిస్తోందని ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్‌ అన్నారు. ఈ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని చెప్పారు. బిఆర్‌ అంబేద్కర్‌ మనకు ఓటు హక్కును ఇస్తే..దానిని ఇసి ద్వారా కాలరాసేందుకు బిజెపి కుట్ర పన్నిందని విమర్శించారు. బీహార్‌ రాష్ట్ర ప్రజలను దగా చేసే అవకాశాన్ని మళ్లీ మోడీకి ఇవ్వబోమన్నారు.

స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కార్యాచరణ ప్రకటిస్తాం..మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే..మద్దతు ఉపసంహరిస్తామని చంద్రబాబు చెప్పగలరా అని స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం మాటతప్పిందనీ  ఆరోపించారు.

👉 కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భేటీ.. న్యూ ఢిల్లీలో సోమవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సమావేశమయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలు సమస్యలు, నంద్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్చిన నిధులపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. అదేవిధంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ  మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, దశానికి అంకితభావంతో సేవ చేయడానికి నిరంతర శక్తి ఆ దేవుళ్ళు ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.

👉చిట్టీల పేరు తో ప్రజలకు కుచ్చు టోపి పెట్టె వారికి…. బెజవాడ సీపీ మాస్ వార్నింగ్!*

విజయవాడలో చిట్టీల పేరుతో వ్యాపారులు చేస్తున్న ఆర్థిక నేరాలు అన్ని ఇన్ని కావు..జిల్లా కమిషనరేట్ పరిధిలో ఇలాంటి కేసు రోజుకొకటి పుట్టుకోస్తుంది.. ఇటీవల విజయవాడలో ముచ్చెర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి చిట్టిలకు గోల్డ్ స్కీమ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసారు..వాయిదాల పద్ధతిలో చిట్టీలు కడితే 5 గ్రాముల బంగారం లేదా డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి వందలాది మంది బాధితుల నుంచి కోట్లు వసూలు చేసారు..అయితే ప్రతి నెల చిట్టీలు కట్టినా.. బాధితులకు అటు బంగారం ఇటు డబ్బులు రెండు ఇవ్వకపోవడంతో పాటు రాత్రికి రాత్రి అదృశ్యం అయ్యాడు..దీనితో ఈ కేసులో బాధితులు అటు సిపి ఆఫీసుకు ఇటు పోలిసు స్టేషన్లకు క్యూ కట్టారు.

ఇదిలా ఉండగా భవానిపురం, మాచవరం పోలీసు స్టేషన్ల పరిధిలో సైతం ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రోజు వారి కూలీలు, నెలవారి చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారే లక్ష్యంగా పెట్టుకొని చిట్టీల పేరుతో కట్టించుకొని రాత్రికి రాత్రే మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దీనితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి విషయంలో ఉపేక్షించకూడదని భావించిన పోలీసులు వారిపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధం అయ్యారు.ఇందులో భాగంగానే నగరంలో చిట్టీల వ్యాపారులకు విజయవాడ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే 300 మంది చిట్టి వ్యాపారాలు ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అనుమతులు లేకుండా చిట్టీలను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల వందల కోట్లను చిట్టీల పేరుతో స్కీమ్ పేరుతో వసూలు చేయడం, ఐపిలు పెట్టీ పారిపోవడం లాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో విజయవాడ సీపీ ఈ హెచ్చరికలు జారీ చేశారు.

👉మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీకి మరోసారి బ్రేకులు?… తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని మధ్యలోనే ఆపేసిన పోలీసులు.. హైకోర్ట్ ఆర్డర్ పై సుప్రీం కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసిన పోలీసులు..తాడిపత్రిలో శివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకున్న జేసీ..ఇరువర్గాలు ఎదురెదురు పడే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్..పోలీసుల వలయంలో తాడిపత్రి, జేసీ పెద్దారెడ్డి నివాసాలు.

👉పింఛ‌న్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు.. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేప‌ట్టిన దివ్యాంగులు.. మేమంతా నిజమైనా దివ్యాంగుల‌మే అంటూ స‌ద‌రం స‌ర్టిఫికెట్‌తో గ‌గ్గోలుపెట్టిన దుస్థితి..కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛ‌న్ల కోత విధించింద‌ని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..