👉మీరు నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తా …మీరు కారు గుర్తుకు ఓటేయండి నేనే గెలుస్తా:తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్..👉సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్..*APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి…👉 అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన..👉ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలు పై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఆర్.కే.రోజా..👉మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా బంద్ ప్రకటించిన ఆమనగల్లు లోకల్ వ్యాపారులు* ..👉13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్,  ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు* …డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్సెషన్ రిపోర్టులో కీలక అంశాలు..😲10వ తరగతి చదివే మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం..👉 ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవెల…ఆటో వాలాల పరిస్థితి అగమ్యగోచరం*👉లక్షల్లో లాభాలన్నారు.. కట్‌చేస్తే కోట్లు కాజేశారు…. సినిమాలకు యానిమేషన్ పేరిట మోసం.. 👉అధిక వడ్డీ ఆశ చూపి రూ.20 కోట్లకు టోకరా.. హైదరాబాద్‌లో ఘరానా మోసం!

👉నేటి నుంచి బిహార్‌లో రాహుల్ గాంధీ “ఓటర్ అధికార్ యాత్ర”..కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేప‌ట్ట‌నున్న‌ “ఓటర్ అధికార్ యాత్ర” బిహార్‌లోని ససారాం నుంచి నేడు (ఆదివారం) ప్రారంభం కానుంది. 16 రోజుల‌పాటు 25 జిల్లాల్లో 1300 కి.మీ. పర్యటించనున్నారు. ఈనెల 20, 25, 31వ తేదీల్లో మిన‌హా సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు యాత్ర జ‌రుగుతుంది. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలతో ప్రజల మధ్యకు రాహుల్ వెళ్ల‌నున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో “ఓటర్ అధికార్ యాత్ర” ముగియనుంది.

👉మీరు నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తా …మీరు కారు గుర్తుకు ఓటేయండి నేనే గెలుస్తా..చెయ్యి గుర్తుకు ఓటేయండి నేనే గెలుస్తాఇంకా దేనికైనా వేయండి నేనే గెలుస్తా… మోడీనే వస్తాడు……ECI మీద,ఓట్ల ప్రహసనం మీద  ఎంత నమ్మకం ఉంటే ఇలా మాట్లాడతాడు ఈ తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్..పక్క గోల్ మాల్ చేశారు అనిపిస్తుంది కదా… ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను బట్టి  చూస్తే ఎన్నికలలో తప్పకుండా చేశారని అనిపిస్తుంది..

👉సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్..*APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి…సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది సీఎం చంద్రబాబు గారు ? అని ఏపీ సి సి చీఫ్ వై ఎస్ షర్మిల రెడ్డి ప్రశ్నించారు . 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా?…నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా ? ..18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా ?- అన్నదాత సుఖీభవ కింద సొంతగా రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారు.. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారు. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారు..తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు. – రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారు.. మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి..  14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటనీ ఆమె ఎద్దేవా చేశారు.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదం.చంద్రబాబు  రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసం అని ఆరోపించారు . రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది.. అభివృద్ధి అటకెక్కింది.. సుపరిపాలన కొండెక్కింది.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం..అమలు మాత్రం అరచేతిలో వైకుంఠం

👉మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా బంద్ ప్రకటించిన ఆమనగల్లు లోకల్ వ్యాపారులు*

నార్త్ ఇండియా నుంచి తెలంగాణకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, తాము ఎలా బతకాలంటూ వాపోతున్న లోకల్ వ్యాపారస్తులు .. మార్వాడీ వ్యాపారస్తులు గోబ్యాక్ అంటూ నిరసన ..ఈనెల 18న స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చిన ఆమనగల్లు లోకల్ వ్యాపారస్తులు.

👉13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్,  ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు*

హైదరాబాద్: టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్.. జనరల్ కౌన్సిల్ లో చర్చించిన పిదప కార్మిక నేతలు ఇవాళ్టి చర్చల్లో పాల్గొంటున్నారు. అటు, ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు.ఇంతకుముందు, నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్‌‌‌‌ లో రెండు కండిషన్స్ దగ్గర చర్చలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 1) ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్, 2) సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షిట్. ఈ రెండు ప్రతిపాదనల దగ్గరే ఇరువర్గాల మధ్య పీఠముడి నెలకొంది..నిర్మాతలు అర్ధం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలనే కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్.. ఈ మూడు విభాగాలకు వేతనాలు పెంచకపోవడం పై ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అయితే, నిర్మాతలు తాము ఎవరికి వ్యతిరేకం కాదంటున్నారు. కార్మికులు ప్రస్తుతం తమ పరిస్థితులు అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలు ఏమేరకు ఫలప్రదం అవుతాయో చూడాలి..

*డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్సెషన్ రిపోర్టులో కీలక అంశాలు..😲😲😲*

ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో దంపతులను మోసం చేసిన నమ్రత…గర్భిణీలకు డబ్బుల ఆశ చూపి, ప్రసవం తర్వాత పిల్లల కొనుగోలు…ఏపీలోని మహారాణిపేటలో 4 కేసులు, విశాఖ 2 టౌన్ పీఎస్ లో 2 కేసులు, గుంటూరు కొత్తపేటలో ఒక కేసు, తెలంగాణలోని గోపాలవురంలో 5 కేసులు విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ లో ఉన్న డాక్టర్లు, స్టాఫ్ తో కలిసి సరోగసి దందా..పిల్లల కొనుగోలుపై నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత..

👉లక్షల్లో లాభాలన్నారు.. కట్‌చేస్తే కోట్లు కాజేశారు…. సినిమాలకు యానిమేషన్ పేరిట మోసం – యూపిక్స్‌ కేసులో ముగ్గురు అరెస్టు*

ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్ కుమార్ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో తాము మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు..హాలీవుడ్‌ సినిమాలకు యానిమేషన్ వర్క్ జరుగుతున్నాయని, తమది అంతర్జాతీయ కంపెనీ అంటూ పెట్టుబడులు ఆకర్షించారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు వస్తాయంటూ ఆశ చూపించారు. నరసరావుపేటకు చెందిన ఇద్దరు బాధితులు తమతో 20 కోట్ల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశారంటూ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు సమగ్ర దర్యాప్తును ఆదేశించారు.బెజవాడ పోలీసులు చేధించారు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 596 కోట్ల స్కాంలో కీలక నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో గురించి విజయవాడ పోలీసులు వివరాలు వెల్లడించారు. యూపిక్స్‌లో 344 మంది సభ్యులు కలిపి మొత్తం 592 కోట్లు పెట్టుబడులు పెట్టారని.. అందులో 183 మంది 353 కోట్లు ఇన్వెస్ట్ చేసి, కేవలం 159 కోట్లు మాత్రమే తిరిగి తీసుకున్నట్లు గుర్తించారు. 136 మంది 238 కోట్లు పెట్టుబడి పెట్టి 358 కోట్లు వెనక్కి తీసుకుని లబ్ధిపొందినట్లు గుర్తించారు. ఇక 25 మంది 42 కోట్లు పెట్టుబడి పెట్టి, లాభ నష్టాలు లేకుండా అదే మొత్తాన్ని తిరిగి తీసుకున్నారనీ.. ఏజెంట్లు మాత్రం కమిషన్ రూపంలో 6.51 కోట్లు తీసుకున్నట్లు గుర్తించారు. యూపిక్స్ యానిమేషన్ స్కాం పేరుతో విజయవాడ కేంద్రంగా కార్యాలయం తెరిచి 5,960 కోట్లకు పైగా వసూలు చేసారనీ పోలీసులు గుర్తించారు. 2014 నుంచి యూపిక్స్ సంస్థను నడుపుతున్న సంస్థ ఎండి కిరణ్ ఈజీ మనీకి అలవాటు పడి ఈ దందా చేసినట్లు గుర్తించారు. బాధితులు అంతా ఎక్కువగా గుంటూరు , నరసరావు పేటకు చెందిన వారు కావడంతో .. కేసులో అరెస్టైన నిందితుల ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు
👉 ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవెల…ఆటో వాలలా పరిస్థితి అగమ్యగోచరం*
ఆంద్రప్రదేశ్..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో ఆ ప్రభావం ఆటోలపై పడింది.
ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆటో స్టాండ్లు వెలవెలబోయాయి.స్త్రీ శక్తి పథకం ఆటోల యజమానులు, డ్రైవర్లను ఇరుకున పడేసింది.ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పే వారికి కనీసం అద్దె చెల్లించడానికి కూడా కిరాయి రాని పరిస్థితి నెలకొంది.ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.
👉కర్నూలు జిల్లా, బనగానపల్లె మండల కైప గ్రామంలో దారుణం😲😲😲
10వ తరగతి చదివే మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న యువకుడు…గర్భం దాల్చిన బాలిక… నిన్నటి రోజున మగ శిశువును జన్మనిచ్చిన బాలిక..పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
👉 అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ అభిమానుల ధర్నా..జూనియర్ ఎన్టీఆర్ పరుషంగా దూషించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. దగ్గుపాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా  అభిమానుల ఆందోళన

👉ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలు పై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఆర్.కే.రోజా..

చంద్రబాబు మ్యానిఫెస్టో ఎన్నికల ముందు ఓడమల్లన్న చందంగా తయారైంది.స్త్రీ శక్తి పేరుతో స్త్రీ ను దగా చేశారు..16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులుకు మాత్రమే అమలు చేస్తున్నారు..
14 నెలలు తర్వాత స్ట్రీశక్తి బస్సు ప్రారంభించారు..
లోకల్ గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచితబస్సులకు అమలు చేశారు..రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఈరోజు ఆంక్షలు పెట్టడం పై మండి పడ్డారు..
చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది..తిరుమల,అన్నవరం,విజయవాడ,శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు..
భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు..
పల్లెవెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు…మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు..*కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు..సూపర్ సిక్స్ ..హిట్ కాదు..సూపర్ ప్లాప్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
*తిరుపతి నుంచి తిరుమల కు ఉచిత బస్సు ప్రయాణం లేదు..శ్రీశైలం కు,విజయవాడ దుర్గమ్మ గుడికి,సింహాచలం ఉచిత ప్రయాణం లేదు..
*ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు..
ఆడబిడ్డ లేరు కాబట్టి చంద్రబాబు కు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు..
*కానీ, పవన్ కళ్యాణ్ కు ఆడబిడ్డలు ఉన్నారు ఆయన ప్రశ్నించాలి..
జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు..చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే..అబద్దాలు చెప్పారు..మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు..
మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా పధకాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు..కూటమి ప్రభుత్వం ను తరిమికొట్టండి
గ్రామాల్లోకి వచ్చిన వారిని టిడిపి నాయకుల్ని చొక్కా పట్టుకుని ప్రశ్నించాలని కోరారు.
👉అధిక వడ్డీ ఆశ చూపి రూ.20 కోట్లకు టోకరా.. హైదరాబాద్‌లో ఘరానా మోసం!*
అధిక వడ్డీ ఆశ చూపి 170 మంది నుంచి డబ్బు వసూలు…
షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో నమ్మించిన నిందితుడు..
వడ్డీ ఆగిపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు..
ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితుల ఆవేదన..
అధిక వడ్డీ ఆశ చూపి పలువురిని నమ్మించి సుమారు రూ.20 కోట్లతో ఓ వ్యక్తి పరారైన ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఎక్కువ మంది విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన దినేశ్ పాణ్యం స్థానికంగా ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. తాను షేర్ మార్కెట్లో నిపుణుడినని, పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు సంపాదిస్తానని పరిచయస్థులను నమ్మించాడు. తన వద్ద డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ మొత్తంలో ప్రతినెలా చెల్లిస్తానని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన పలువురు విశ్రాంత ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వృద్ధులు తమ వద్ద ఉన్న డబ్బును లక్షల్లో అతడికి అప్పగించారు.

నమ్మకం కుదిరేందుకు దినేశ్ పాణ్యం కొన్నాళ్లపాటు చెప్పినట్టుగానే ప్రతినెలా వడ్డీ డబ్బును బాధితుల ఖాతాల్లో జమ చేశాడు. దీంతో అతడిపై పూర్తి విశ్వాసం పెంచుకున్న మరికొందరు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఇలా దాదాపు 170 మంది నుంచి రూ. 20 కోట్ల వరకు వసూలు చేశాడు. అయితే, గత కొన్ని నెలలుగా వడ్డీ చెల్లింపులు ఆగిపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు.

దీంతో వారంతా ఏకమై జూన్ 2న కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన రెండ్రోజులకే నిందితుడు దినేశ్ పాణ్యం భార్య కవిత పాణ్యం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఆమెను సంప్రదించగా తన భర్తతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నట్లు బాధితులు తెలిపారు. తాము ఫిర్యాదు చేసి ఇన్ని రోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేసి, డబ్బును తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
👉 మేడిగడ్డ పేలుళ్లపై సిట్ ఏర్పాటు చేయాలి: RSP

మేడిగడ్డ పేలుళ్లపై సిట్ ఏర్పాటు చేయాలి: RSP
తెలంగాణ : మేడిగడ్డ బ్యారేజీ ఘటనను పేలుళ్ల కోణంలో ఎందుకు విచారణ జరగలేలేదు అని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ‘పేలుళ్లపై ఇప్పటివరకు ఎవరి స్టేట్ మెంట్ రికార్డు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర జరిగింది. దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆంధ్రా పెట్టుబడిదారుల ఏజెంట్. సీఎం రమేష్ కంపెనీకి ఫోర్త్ సిటీలో కాంట్రక్టులు ఇచ్చారు.మేడిగడ్డ పేలుళ్లపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..