👉కేంద్రం తొండి.. బాబుకు తెలియ‌కుండానే ఏపీకి అన్యాయం.. ! 👉రష్యా చమురు కొనుగోలుదారులపై సుంకాలు లేవు : ట్రంప్..* 👉సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం.. 👉 రక్షక్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు .. * ప్రియుడి కోసం భర్తను లేపేసి జైలు కి వెళ్ళింది…….ఉప్పల్‌లో దారుణం…ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య….టీడీపీ నేతల వేధింపులు, పోలీసుల నిర్ల‌క్ష్యానికి గర్భిణి బలి..ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గర్భిణి ( కళ్యాణదుర్గం)👉  రాజ్‌భవన్‌ లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌పై పిర్యాదు..👉*ఇన్స్టాగ్రామ్లో పెళ్లి సంబంధం – బంగారం కొనాలని రూ.45 లక్షలు కాజేసిన కిలేడీ

👉కేంద్రం తొండి.. బాబుకు తెలియ‌కుండానే.. ! కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఏపీకి ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వాస్తవానికి ఇది జాతీయ స్థాయిలో తీసుకున్న కీలక నిర్ణయమే తప్ప ఏపీకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టుగా చూడలేమని మేధావి వర్గాలు చెబుతున్నాయి. పైగా వనరులు పెద్దగా లేని ఒరిస్సాకు, వనరులు భారీగా ఉన్న ఏపీకి మధ్య ఉన్న తేడాను గమనించకుండా కేంద్రంలోని బిజెపి పెద్దలు అడుగులు వేశారు అన్నది కూడా మేధావులు చెబుతున్న మాట. ఎందుకంటే ఒరిస్సాకు 2066 కోట్ల రూపాయల విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఇస్తే ఏపీకి వచ్చేసరికి మాత్రం 435 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

నిజానికి ఒరిస్సా తో పోల్చుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అత్యంత కీలకంగా ఉంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది కూడా ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వమే. కానీ, ఈ విషయాన్ని మరిచిపోయారో లేక విదిలిస్తే సరిపోతుంది ఏపీ ప్రజల సంతోషిస్తారని అనుకున్నారో.. మొత్తానికి ఏపీ విషయంలో మరోసారి కేంద్రం తొండాట ఆడిందనేది రాజకీయ వర్గల్లో కూడా వినిపిస్తున్న ప్రధాన విమర్శ. కనీసంలో కనీసం ఏపీకి 1000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ అయినా ప్రకటించి ఉంటే బాగుండేదని టిడిపికి చెందిన కీలక ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చింది అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఒరిస్సాకు రెండువేల కోట్ల రూపాయల పైన ప్రాజెక్టును ఇచ్చి ఏపీకి మాత్రం కేవలం 400 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టు ఇవ్వడంపై కేంద్రంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ ముందు వరుసలో ఉంటే అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రంగా ఒరిస్సా ముందు వరసలో ఉంది.

👉 మతమార్పిడి … మాయగాళ్లు 😲😲😲*హైదరాబాద్,బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లో పాకిస్థాన్ యువకుడు ఫహద్ అరెస్ట్..▪️హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తూ కీర్తి అనే హిందూ యువతిని పెళ్లి..▪️కీర్తి పేరును మతం మార్చి “దోహా ఫాతిమా”గా మార్చిన ఫహద్…మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పాకిస్థానీ ఫహద్..ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. 1998లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఫహద్.. హైదరాబాద్‌లో స్థిరపడి మతమార్పిడి, పెళ్లి పేరుతో మోసాలు..పలువురు మహిళలను టార్గెట్ చేసినట్లు అనుమానం..ఫహద్ పూర్వ చరిత్ర సేకరిస్తున్న పోలీసులు.

👉సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం.*

*నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న NIA.*  *ధర్మవరం కోట కాలనీలో అదుపులోకి తీసుకున్న NIA.* *ఓ హోటల్లో కుక్‍‍గా పనిచేస్తున్న నూర్.. ఉగ్రవాదులతో నూర్ కు సంబంధాలపై NIA ఆరా..*నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్న NIA..*నూర్ సోషల్ మీడియా ఖాతాలపై NIA దృష్టి.*

👉రష్యా చమురు కొనుగోలుదారులపై సుంకాలు లేవు : ట్రంప్.. రష్యా చమురు కొనుగోలుదారులపై సుంకాలు లేవు : ట్రంప్…అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఈ భేటీలో చర్చించారు. ఈ భేటీ అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోలుదారులపై ప్రస్తుతానికి సుంకాల పెంపు లేదని స్పష్టం చేశారు. రష్యన్ భాగస్వాములపై సుంకాలు ప్రస్తుతానికి అవసరం లేదన్నారు. ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన తర్వాతే టారిఫ్ లపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు

👉మతమార్పిడి … మాయగాళ్లు ..*హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పాకిస్థాన్ యువకుడు ఫహద్ అరెస్ట్..హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తూ కీర్తి అనే హిందూ యువతిని పెళ్లి..కీర్తి పేరును మతం మార్చి “దోహా ఫాతిమా”గా మార్చిన ఫహద్..మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పాకిస్థానీ ఫహద్..ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. 1998లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఫహద్. హైదరాబాద్‌లో స్థిరపడి మతమార్పిడి, పెళ్లి పేరుతో మోసాలు..పలువురు మహిళలను టార్గెట్ చేసినట్లు అనుమానం..ఫహద్ పూర్వ చరిత్ర సేకరిస్తున్న పోలీసులు.

👉 *సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం.*

*నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న NIA.* ధర్మవరం కోట కాలనీలో అదుపులోకి తీసుకున్న NIA.* ఓ హోటల్లో కుక్‍‍గా పనిచేస్తున్న నూర్.. ఉగ్రవాదులతో నూర్ కు సంబంధాలపై NIA ఆరా.* నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్న NIA.* నూర్ సోషల్ మీడియా ఖాతాలపై NIA దృష్టి.*

👉 రక్షక్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు .. అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ వారి నాయకత్వంలో నిర్వహించబడుతున్న రక్షక్ ప్రైమరీ స్కూల్‌లో, వారి ఆదేశాల మేరకు కె. నీలకంటేశ్వర రెడ్డి , డీఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్, అనంతపురం వారు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండావందనం అనంతరం చిన్నారులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలకు మెడల్స్ బహూకరించి, వారిని ఆశీర్వదించి కార్యక్రమాన్ని మరింత ఉజ్వలంగా చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఆర్ఎస్ఐ బాబ్జాన్  మరియు టీచర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.. అనంతరం యూకేజీ మరియు 1వ తరగతి చిన్నారులు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో “ఓ దేశ్ మేరే” అనే పాటకు అద్భుతమైన నృత్యం చేసి, మంత్రివర్యులు మరియు మిగతా అధికారుల మనసులను దోచుకున్నారు.* ఈ సందర్భంగా, పయ్యావుల కేశవ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, చిన్నారుల గుర్తుగా టీచర్లకు మొమెంటో బహూకరించారు.

👉 అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… జిల్లా పోలీసు కార్యాలయంలో   స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి స్వీట్స్ పంచి పెట్టి 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు త్యాగం చేశారని తెలిపారు. త్యాగధనుల ఆశయాలు కొనసాగిద్దామన్నారు. దేశ భక్తి, జాతీయ సమైక్యత కోసం అహర్నిశలు పాటు పడదామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఓ రవిరాం నాయక్, ఆర్ ఐ పవన్ కుమార్, జిల్లా పోలీసు కార్యాలయం వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

👉వామ్మో వాయ్యో…ఇలా ఉన్నారు ఏంటి సాంబ… ప్రియుడి కోసం భర్తను లేపేసి జైలు కి వెళ్ళింది….అయిదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు రాగానే… కేసు మాఫీ కోసం మామను లేపేసింది..ఇలా తయారు అయ్యారు ఏంది రాములా…..*

ప్రస్తుత లవర్ కోసం భర్తను చంపడం ఒక ట్రెండ్‌గా మారింది..ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. ప్రియుడితో కలిసి ఉండేందుకు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి.. గత కొన్ని రోజులుగా ఆందోళన కలిగిస్తున్న ఘటనలు ఇవి.. ప్రస్తుత కాలంలో భర్తను చంపడం ఒక ట్రెండ్‌గా మారింది. .పెళ్లై 20 ఏళ్లు అయ్యాక కూడా ప్రియుడి కోసం భర్తను చంపిన ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి..ఇటీవల అమీన్‌పూర్‌లో లవర్‌తో ఉండాలనే ఆశతో ఏకంగా ముగ్గురు బిడ్డలను చంపేసింది ఓ మహిళ.. అమ్మతనానికే ఈ ఘటన ఓ మచ్చగా మిగిలింది..మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి తెలిసిందే..హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది.. ఈ క్రమంలో మరో దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.. వివాహేతర సంబంధం కోసం భర్తను హత్య చేసిన కోడలు, ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలై భర్త తండ్రిని కూడా హతమార్చింది..

*యూపీ లోనిబమ్రౌలి కటారాలో బబ్లీ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం హరి ఓమ్‌తో వివాహం జరిగింది. అయితే బబ్లీ తన భర్తను మోసం చేస్తూ ప్రేమ్ సింగ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్త హరి ఓమ్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ కేసులో ఆమెకు జైలు శిక్ష పడింది. కొన్నాళ్లకు ఆ దంపతుల కొడుకు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన కొడుకు, మనవడిని పొట్టనబెట్టుకున్న కోడలిపై హరి ఓమ్ తండ్రి రాజావీర్ సింగ్ న్యాయపోరాటం చేస్తున్నాడు..

సంధి పేరుతో మామ హత్య…ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన తర్వాత బబ్లీ కేసు విషయంలో రాజీ కుదుర్చుకోవడానికి తన మామ రాజావీర్ సింగ్‌ను మాట్లాడటానికి పిలిచింది. కానీ చర్చలను పక్కన పెట్టి అతన్ని కూడా హత్య చేసింది. ఈ ఘటనతో ఆ కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది. పచ్చగా ఉండాల్సిన కుటుంబం కోడలి స్వార్థం, క్రూరత్వం వల్ల సర్వం కోల్పోయింది. రాజాసింగ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

👉హైదరాబాద్‌: ఉప్పల్‌లో దారుణం…ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య…ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు…చెట్లపొదల్లో కనిపించిన బాలుడి మృతదేహం…బాలుడిని అత్యాచారం చేసి గొంతునులిమి చంపిన ఖమర్

👉 కడప జిల్లా. *ఉత్తమ సేవకు గుర్తింపు*..విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించినందుకు యర్రగుంట్ల మండల తహసిల్దార్ శోభన్ బాబుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవ ప్రశంసా పత్రం దక్కింది.కడపలో నిర్వహించిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని తహసిల్దార్ శోభన్ బాబు అందుకున్నారు.

👉 నా చావుకు కారణం పోలీసు అధికారులే అంటూ సూసైడ్ ఆడియో కాల్ రికార్డు చేసిన శ్రావణి*

టీడీపీ నేతల వేధింపులు, పోలీసుల నిర్ల‌క్ష్యానికి గర్భిణి బలి..ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గర్భిణి శ్రావణి (22)..కళ్యాణదుర్గం పట్టణంలో ఘటన …టీడీపీ కార్యకర్తగా ఉన్న శ్రావణి భర్త బోయ శ్రీనివాస్.. భర్త వేధింపుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు..త‌న‌కు భ‌ర్త‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా టీడీపీ నేత‌లు రమేష్, శర్మాస్‌లు పోలీసులపై ఒత్తిడి తెచ్చార‌న్న శ్రావణి .. నా చావుకు కారణం పోలీసు అధికారులే అంటూ సూసైడ్ ఆడియో కాల్ రికార్డు చేసిన శ్రావణి

👉  రాజ్‌భవన్‌ లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌పై పిర్యాదు..హైదరాబాద్ :

తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ ఆరోపణ., భర్త, పిల్లలను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఏఆర్‌ కానిస్టేబుల్ వెంకటేష్‌పై మహిళ ఫిర్యాదు, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న SRనగర్ పోలీసులు

👉*ఇన్స్టాగ్రామ్లో పెళ్లి సంబంధం – బంగారం కొనాలని రూ.45 లక్షలు కాజేసిన కిలేడీ*..ఎన్టీఆర్ జిల్లాలో ఇన్స్టాగ్రామ్ సంబంధం పేరిట మహిళ నయవంచన – వధువుకు బంగారం కొనాలంటూ రూ.45 లక్షలకు టోకరా..😯😯😯

అక్రమ సంపాదన కోసం విద్యాధికురాలైన మహిళ ఓ కుటుంబాన్ని నయవంచనకు గురి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు తెలిపిన వివరాల మేరకు సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం..అసలేం జరిగిందంటే? ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా పని చేస్తున్న ఈడేపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో అందంగా ఉన్న యువకుడి ఫొటో చూసి అతడిని అల్లుడిగా చేసుకోవాలని భావించాడు. ఇన్‌స్టాగ్రాంలో ఉన్న నంబరుకు ఫోన్‌ చేస్తే ఒక మహిళ ఫోన్ ఎత్తి మాట్లాడింది. తాను ఆ యువకుడి తల్లినంటూ తనను తాను పరిచయం చేసుకుని నమ్మించింది. ఆమె కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని వ్యక్తి కోరడం, అందుకు సదరు మహిళ సైతం సానుకూలంగా స్పందించడంతో వాట్సాప్‌ ద్వారా ఇరువురి కుటుంబాలకు చెందిన పూర్తి వివరాలన్నీ ఒకరికొకరు పంచుకున్నారు.. బంగారం కొనాలని రూ.45 లక్షలు కొట్టేసిన కిలేడీ: ఆ యువకుడితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం కట్నకానుకలు, ఇతర లాంఛనాల గురించి ఇరువురి కుటుంబాలు కాసేపు మాట్లాడుకున్నారు. కొద్దిరోజుల కిందట ఆమె ఫోన్‌ చేసి వివాహం నిమిత్తం తన కుమారుడు దిల్లీలో దాదాపు రూ.కోటి విలువ చేసే బంగారు నగలు కొనుగోలు చేస్తున్నాడని, వధువు తరఫున రూ.50 లక్షలను పంపాల్సిందిగా ఆ మహిళ పెళ్లికూతురు తల్లిదండ్రులను కోరింది. అనంతరం ప్రత్యక్షంగా ఒకరికొకరికి ఎటువంటి ముఖ పరిచయం లేకపోయినప్పటికీ ఏ మాత్రం అనుమానం లేకుండా వారు రూ.45 లక్షలు ఆమె చెప్పిన ఖాతాకు వెంటనే జమ చేశారు. అనంతరం తాము డబ్బులను బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు చెప్పేందుకు పెళ్లికూతురు తరఫు వారు ఫోన్‌ చేస్తే ఛార్జింగ్‌ తక్కువగా ఉందంటూ ఆమె సమాధానం చెప్పింది. అనంతరం ఆమె ఫోన్‌ అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు చివరికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు: దాంతో ఎట్టకేలకు ఆమె ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నట్లు తెలిసింది. బీటెక్‌ చదివి ఉద్యోగం చేసుకుంటున్న సదరు మహిళకు మగ సంతానమే లేదనీ, ఇద్దరు చిన్న కుమార్తెలు మాత్రమే ఉన్నారనీ తెలిసింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమం ద్వారా బాధితులకు వల వేసి రూ.లక్షలు దోచేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..