👉*ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీ నెరవేరుస్తాం..అమరావతి : మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్.* పీపుల్స్ వాయిస్ న్యూస్..
*ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీ నెరవేరుస్తాం.. ఉచిత బస్సుతో సూపర్-6 హామీలు పూర్తయినట్లే.*
*ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్ధం చేశాం.. పాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు.*
*తాను ఎప్పుడూ చేసే అరాచకాలు ఈసారి జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నాడు.. జగన్ నైజం ఏంటో ప్రజలకు తెలిసిందే.*
*వైఎస్ఆర్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు.*
*నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితుల నుంచి 11 మంది నామినేషన్ వేయగలిగారు.*
*2 పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్ ఎప్పుడైనా జరిగిందా?.. శాంతిభద్రతల నిర్వహణ పటిష్టంగా ఉన్నందునే ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారు : సీఎం చంద్రబాబు*
👉చంద్రబాబును మాబ్ స్టార్, ఫ్రాడ్ స్టార్ అంటారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..- పోలింగ్ బూత్‌ల వెబ్ క్యాస్టింగ్‌ను వైసీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా..? – పోలింగ్ బూత్ ఆవరణల్లోని సీసీ ఫుటేజీని ఇచ్చే ధైర్యం మీకుందా..?- మాజీ సీఎం వైఎస్ జగన్
👉చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ లో మరో గోల్డ్ స్కామ్…* 2021లో బంగారం తాకట్టు పెట్టి 1.90 లక్షలు తన భార్య పేరుతో లోన్ తీసుకున్న చిలకలూరిపేటకి చెందిన సుభాని…నగదు చెల్లించి తనఖా పెట్టిన గోల్డ్ తీసుకుందామని నేడు బ్యాంకుకి వచ్చిన దంపతులు.. మీ గోల్డ్,, మా బ్యాంకులో లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్న భార్యాభర్తలు…ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఆందోళనకి దిగిన భార్యాభర్తలు… తమ గోల్డ్ ఇవ్వక పోతే బ్యాంకు ఆత్మహత్య చేసుకుంటామని తెలిపిన బాధితులు….
👉జగన్‌కు కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ కౌంటర్*
* జగన్‌లా అమిత్ షాకి రాహుల్ గాంధీ లొంగిపోలేదు..జగన్‌లా మోదీని చూసి రాహుల్ గాంధీ భయపడరు-ఠాగూర్..ఓట్ల చోరీపై రాహుల్ పోరాటం కాంగ్రెస్ కోసం కాదు…ప్రజాస్వామ్యం కోసమే రాహుల్‌పోరాడుతున్నారు-ఠాగూర్‌జగన్‌కు దమ్ముంటే ఓట్ల చోరీపై పోరాడాలి…రేపు విజయవాడలో షర్మిల ర్యాలీలో పాల్గొనాలి -ఠాగూర్
👉మోడీ రాజీనామా చేయాలట… రాహుల్ ని మించిన ఎంపీ..
ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఉన్నఫళంగా రాజీనామా చేయాలట. ఈ డిమాండ్ చేసింది కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే కాదు. తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీ నుంచి వచ్చింది ఈ డిమాండ్. మోడీ ఎందుకు రాజీనామా చేయాలి అంటే 2024 ఎన్నికలు సాఫీగా సవ్యంగా సాగలేదని ఓట్ల తారుమారు ఓట్ల చోరీ కారణంగానే జరిగాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఆయన వల్లిస్తున్నారు. ఆ ఓట్లతో గెలిచిన గెలుపు సవ్యమైనది కాదని తర్కం కూడా చెబుతున్నారు.ఆ ఎన్నికల్లో ఓటు వేయరాదు: ఇక ఎంపీలుగా గెలిచిన బీజేపీకి చెందిన 240 మంది కూడా ఎన్నికల సంఘం సమర్పించిన తప్పుడు జాబితా కారణంగానే అని భారీ నిందనే వేశారు. అందుకే వారి ఎన్నిక కూడా చట్టబద్ధం కాదని వాదిస్తున్నారు. ఇక వీరంతా చేయాల్సింది రాజీనామాలే అని ఆయన అంటున్నారు. మోడీ ప్రభుత్వానికి కూడా ఎలాంటి చట్టబద్ధత లేదని మరో బాంబు కూడా పేల్చారు. ఈ ఎంపీలే రాబోయే రోజులలో రాష్ట్రపతి ఉప రాష్ట్రపతిలను కూడా ఎన్నుకోబోతారు కాబట్టి ముందుగా రాజీనామాలు చేయాల్సిందే అని ఆయన గట్టిగా చెబుతున్నారు. రాజీనామాలు చేయకపోతే ఇబ్బందే అని అంటున్నారు.
బీహార్ తో ముడిపెట్టి మరీ :
బీహార్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది అని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో దేశంలోని గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సరైనది అని ఎలా ఎన్నికల సంఘం చెబుతుందని ప్రశ్నించారు. దేశంలో చట్టం అన్ని చోట్లా వర్తిస్తుందని రెండు చట్టాలు ఉండవని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విధానం అంతకంటే ఉండదని అంటున్నారు. అందువల్ల దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించాలని కోరుతున్నారు. అంతే కాదు బీహార్ ఎన్నికల్లో పాత ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహిస్తే బీజేపీ ఓటమి పాలు అవుతుందని భావించే ఈ విధంగా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
ఈసీ మీద ఫైర్ :
కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబులు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. జవాబులు చెప్పి సందేహాలు తీర్చాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా మౌనం పాటిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి భయపడినట్లుగానే అర్ధం చేసుకోవాలని ఆయన అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక అభిషేక్ బెనర్జీ ఏకంగా ప్రధాని మోడీ ఆయన కేబినెట్ ని రాజీనామా చేయమని అంటున్నారు. ఆ తరువాత లోక్ సభను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు…
ముదురుతున్న వివాదం : రాహుల్ గాంధీ ఆరోపణలను సమర్థిస్తూ ఇండియా కూటమి మిత్రులు అంతా గళం విప్పుతున్నారు. మోడీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఈ ఫలితాలు సరైనవి కావు అని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధతనే ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా ఇది ఇబ్బందికరంగా మారుతున్న నేపధ్యం ఉంది. మరి దీని మీద ఈసీ కానీ కేంద్ర ప్రభుత్వం కానె ఎ ఏ విధంగా జవాబు చెబుతుంది ఏ విధంగా విపక్షాల రచ్చకు ఎండ్ కార్డు పడుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.
👉కథలొద్దు కలసిపోరాడదాం రా ..జగన్‌కు కాంగ్రెస్ పిలుపు!… ఓటు చోరీ అంటూ రాహుల్ పోరాడుతున్నా ఏపీ గురించి మాట్లాడటం లేదని జగన్ రెడ్డి చేసిన విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. కథలు చెప్పవద్దని.. ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి మద్దతుగా పోరాటానికి రావాలని పిలుపునిచ్చింది. గురువారం విజయవాడలో ఓటు చోరీకి వ్యతిరేకంగా షర్మిల ర్యాలీ చేస్తున్నారని అందులో పాల్గొనాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని.. రాజకీయం కోసం కాదన్నారు. కేసుల కోసం అమిత్ షా ,మోదీకి సరెండర్ అయిపోయి రాహుల్ పై విమర్శలు చేయడం ఏమిటని.. జగన్ రెడ్డిలా రాహుల్ సరెండర్ కాలేదన్నారు.తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా జగన్ తీరుపై స్పందించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదన్నారు. ఏపీ ఎన్నికల్లో ఓట్ల చోరీ అక్రమాలు జరిగితే.. రాహుల్ తో కలిసి పోరాడాలన్నారు. ఎన్నికల్లో తప్పులు జరిగితే ఈసీ, మోదీ, షాను తప్పు పట్టాలి.. రాహుల్ ను కలిసి పోరాడుతున్న దానికి మద్దతు పలకాలి కానీ ఇలా మాట్లాడుతున్నారేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్న జగన్ రెడ్డి.. తన కోసం కాంగ్రెస్ పోరాడాలని అనుకుంటున్నారు. ఏపీలో అక్రమాలు జరిగాయని అంటున్న ఆయన మాత్రం మోదీ , ఈసీ, అమిత్ షాలపై ఒక్క మాట కూడా మాట్లాడరట. కానీ కాంగ్రెస్ మాత్రం మాత్రం పోరాడాలంటున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదని మాణిగంఠాగూర్ మీద జగన్ ఏడుస్తున్నారు. జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును తీసుకుని పోయి బలపడ్డారు. ఆయనను బలహీనం చేస్తేనే కాంగ్రెస్ బలపడుతుంది. వారి రాజకీయం వారు చేస్తూంటే.. జగన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ పోరాడటం లేదని తన చేతకాని తనాన్ని బయట పెట్టుకుంటున్నారు.
👉సినిమా టికెట్ల ధరల రచ్చ.. జగన్‌కు ఎలివేషన్ కరెక్టేనా? జగన్ రేట్లు తగ్గిస్తే గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు ఆల్రెడీ టికెట్ల ధరలు పెంచి, వాటి మీద అదనపు రేట్లు వడ్డిస్తే బాగుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సౌత్ ఇండియాలో మరే రాష్ట్రాల్లోనూ లేనంత అధిక టికెట్ ధరలు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే. ముఖ్యంగా తెలంగాణలో అయితే మరీ ఎక్కువ. తమిళనాడు, కేరళతో పోలిస్తే పోలిస్తే ఏపీలోనూ రేట్లు అధికమే. కర్ణాటకలో మల్టీప్లెక్సుల్లో రేట్లు ఎక్కువే అయినా.. ఈ మధ్య సిద్ధరామయ్య ప్రభుత్వం టికెట్ రేట్ 200కు మించకూడదన్న ప్రతిపాదన తెచ్చింది. అది అమలైతే తెలుగు రాష్ట్రాల రేట్లే అధికం అవుతాయి. అయినా సరే.. పెద్ద సినిమాలకు తొలి వారం పది రోజుల్లో వాటి మీద ఇంకా రేట్లు పెంచుకునేందుకు అనుమతులు అడుగుతున్నారు. ఏపీలో ఈజీగా పర్మిషన్లు వచ్చేస్తున్నాయి. ఇది ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందులోనూ డబ్బింగ్ సినిమాలైన వార్-2, కూలీ చిత్రాలకు కూడా రేట్లు పెంచుతున్నారనే వార్తలతో సోషల్ మీడియా జనాలు యుద్ధం ప్రకటించారు. టాలీవుడ్‌కు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేశారు. ఈ సందర్భంగా ఒక వర్గం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇవ్వడం గమనార్హం. జగన్ రేట్లు తగ్గిస్తే గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు ఆల్రెడీ టికెట్ల ధరలు పెంచి, వాటి మీద అదనపు రేట్లు వడ్డిస్తే బాగుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐతే ఉన్న రేట్ల మీద అదనపు భారం మోపడం కచ్చితంగా తప్పే. అది ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పిస్తున్న మాట వాస్తవం. దీన్ని దోపిడీగానే బావించాలి. కానీ అంతమాత్రాన జగన్ చేసింది కరెక్ట్ అయిపోదు. ఆయన ప్రేక్షకులకు మేలు చేయాలనేమీ రేట్లు తగ్గించలేదు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను ను ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో తుప్పుపట్టిన జీవోను బయటికి తీసి మరీ 5, 10 రూపాయలకు టికెట్లు అమ్మించారు. అర్లీ మార్నింగ్ షోలు లేకుండా చేశారు. నిబంధనల పేరు చెప్పి హఠాత్తుగా థియేటర్లను టార్గెట్ చేయించి షోలు పడకుండా చేయించారు. ఐతే ఆ ఒక్క సినిమాకు పరిమితమైతే బాగుండదని.. తర్వాతి రోజుల్లో మొత్తం ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు. అందరూ తన కాళ్లదగ్గరకు వచ్చేలా చేశారు. ఈ రోజుల్లో 5, 10 రూపాయలు పెట్టి టికెట్లు అమ్మితే థియేటర్ల మనుగడ ఎలా సాధ్యం? ఫిలిం ఇండస్ట్రీ ఎలా బతుకుతుంది? అలాంటి చర్యలను ఈ రోజు రేట్ల పెంపుతో పోల్చి కొనియాడడం కచ్చితంగా తప్పే.
👉 ఒంగోలు నగరం నందు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ను ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులైన సందర్భంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు వారితో పాటు జనసేన నాయకులు పేరూరి రమేష్, షేక్ కాశింవలి (సోను), బి కొండల్ ప్రజాపతి , డి కాశిం, దుమ్మని చందు, షేక్ మస్తాన్ , యమ్మని శివకృష్ణ పాల్గొన్నారు.

👉 *ఎమ్మెల్యే ముత్తుములను ఘనంగా సన్మానించిన కంభం సొసైటీ బ్యాంకు నూతన కమిటీ సభ్యులు*
*ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ని కంభం సొసైటీ బ్యాంకు నూతన కమిటీ సభ్యులు బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు. కంభం సొసైటీ బ్యాంకు చైర్మన్ గా కేతం శ్రీను, మెంబర్లుగా కర్ణం బాలకోటయ్య, సందు వరలక్ష్మి శ్రీనివాసులు నియమించబడ్డారు. తమపై నమ్మకంతో తమను గుర్తించి బాధ్యతలను అప్పచెప్పిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కంభం సొసైటీ బ్యాంకు చైర్మన్ కు, మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీను మరియు మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
👉నీట మునిగిన మంగళగిరి* *రెండు రోజులుగా వస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు* *పొంగిపొర్లుతున్న రత్నాల చెరువు, నేషనల్ హైవేపై నిలిచిపోయిన వరద నీరు కాజా టోల్గేట్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల టిట్టుకో ఇళ్లలో భారీగా చేరుకున్న వరదనీరు నరకయాతన అనుభవిస్తున్న టిట్టుకో ఇళ్లల్లో నివాసం ఉంటున్న ప్రజలు*
*మంగళగిరి మండలం చుట్టూ గ్రామాల పరిధిలో నీట మునిగిన పంట పొలాలు* *యధావిధిగా ఎప్పటిలాగానే అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్న రైతులు మధ్యతరగతి కుటుంబాలు*
👉 భారీ వర్షాలకు అతలాకులంగా విజయవాడ …. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలోనే విజయవాడలో భారీగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. డ్రైనేజీలో పడి మరొకరు, చెట్టు కూలి ఇంకొకరు మృతి చెందారు.

