👉ఇక సినిమా చూపించడమే ఆలస్యం: రాహుల్ గాంధీ*👉పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది!: నారా లోకేష్..*చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్..👉ఆగష్టు 15 నుండి ఎపి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం*..👉జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో దొంగ ఓట్ల ప్రభావం ఉంటుంది : ఫిరోజ్ ఖాన్*..👉బీజేపీలో చేరే వారికి రాజాసింగ్ హెచ్చరిక..!!!.👉పులివెందుల లో “పోలీస్ నాయక్” పవర్…👉సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు సిట్ కు అప్పగించాం: నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్*..👉రాష్ట్రంలో 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం* *జీవో నెం. 17 వెంటనే రద్దు చేయాలి.* *బడా కాంట్రాక్టర్లకు సంపద అందివ్వడానికే జీవో 17.* *రేవంత్ రెడ్డి పాలనలో చిరు కాంట్రాక్టర్లకు అన్యాయం*డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ..👉 వివేకా హత్య కేసులో సునీత ఫిర్యాదుతో కమిటీ ఏర్పాటు..👉కూతురిపై అత్యాచారం.. తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష.,!!! 

👉ఇక సినిమా చూపించడమే ఆలస్యం: రాహుల్ గాంధీ*

ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. గత ఏడాది కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీతో కలిసి ఓట్ల చోరీ చేసిన ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చివర్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి సన్నద్ధమవు తోందన్నారు..ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఇందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. మంగళవారంనాడు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఒకటి రెండు సీట్లలో కాకుండా చాలా సీట్లలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఇది ఒక క్రమపద్ధతిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇది తెలుసుననీ, గతంలో దీనికి ఆధారాలు లేవనీ, ఇప్పుడు ఉన్నాయని పేర్కొన్నారు.’మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం. ఒక వ్యక్తి ఒకే ఓటు అనే విధిని ఎన్నికల కమిషన్ పాటించడం లేదు. ఇక సినిమా చూపించడమే ఆలస్యం’ అని రాహుల్ చమత్కరించారు. ఓట్ల చోరీ వావాదంపై విపక్షాల నిరసనను ‘టీజర్’గా రాహుల్ ఇంతకుముందు పేర్కొన్నారు.

బిహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓట్ల చోరీపై ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం ఉదయం పార్లమెంటు మకర ద్వారం నుంచి ర్యాలీగా బయలుదేరి తీవ్ర నిరసనలు తెలిపారు. అనుమతి లేదంటూ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్ సహా 29 మంది ఎంపీలను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితా స్కాన్‌ ఫోటోగ్రాఫ్‌లతో పోస్ట్ చేయడం కాకుండా మెషీన్-రీడబుల్ ఓటర్ లిస్టులు విడుదల చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. స్కాన్ ఫోటోగ్రాఫ్‌లతో తప్పులు చెక్ చేసుకోవడం దాదాపు అసాధ్యమని వారు తెలిపారు…

👉జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో దొంగ ఓట్ల ప్రభావం ఉంటుంది : ఫిరోజ్ ఖాన్*…జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అటూ అధికార పార్టీ, ఇటూ ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సీటు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మక అడుగులు వేస్తూ..ముందుకు వెళ్తున్నారు. మరోపక్క సానుభూతి కేటగిరీలో ఓట్లు గెలువాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తుంది. అయితే తాజాగా.. ఎన్నికలపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం ఉంటుందని బాంబు పేల్చారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం భారీగానే ఉంటుందని ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. దొంగ ఓట్లు 5 రకాలుగా ఉంటాయని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లను బయటపెడతానని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు భారత దేశ మనుగడకే ముప్పు అని పేర్కొన్నారు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం చేస్తే.. 90 శాతం దొంగ ఓట్లను అరికట్టవచ్చని సూచించారు. ఈసీకి ఎంత చెప్పినా.. ఎన్ని ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు..అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 8వ తేదీన గుండెపోటుతో మృతి చెందడంతో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంకు ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఆయన మృతితో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఉపఎన్నికలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే.. కాంగ్రెస్ తన పట్టు సాధించాలని చూస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టు పక్కల కాంగ్రెస్ అంతగా రాణించకపోవడంతో ఈ ఉపఎన్నిక ప్రభుత్వానికి సవాల్‌గా మారింది…

👉పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉపఎన్నికలపై జగన్ ట్వీట్*..చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు.తీవ్రవాదులుగా మారి ఎన్నికలను హైజాక్‌ చేశారు.. ఈరోజు బ్లాక్‌ డే-..పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికలు రద్దుచేయాలి..కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి- వై ఎస్ జగన్‌

👉పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది! 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం… భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు….నారా లోకేష్ ..విద్య, ఐటి శాఖల మంత్రి

👉ఆగష్టు 15 నుండి ఎపి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం*

*సే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు..*2026 జూన్ 5 నాటికి ఎపిని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యం**కార్యదర్శులతో సిఎస్ సమీక్ష*…అమరావతి : ఎపిని వచ్చే ఏడాది జూన్ 5 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యుం.దానిలో భాగంగా ఈనెల 15వ తేదీన నుండి ఎపి సచివాలయంలో ” సే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్” నినాదంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి మరీ ముఖ్యంగా మానవాళికి కలుగుతున్న నష్టం వర్ణణాతీతం.. ఈనేపధ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది.దానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన రాష్ట్ర సచివాలయం నుండే ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ద్వారా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేందుకు శ్రీకారం చుట్టనున్నారు..సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై చర్చిస్తున్నారు.ఆగష్టు 15 నుండి ఎపి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కార్యదర్శులతో సమీక్షిస్తున్నారు.ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఒకసారి వాడి పడేసే(Single Use Plastic) వివిధ క్యారీ బ్యాగులు,ప్లాస్టిక్ మంచినీటి సీసాలు,గ్లాసులు, ప్లేట్లు,కప్పులు,స్పూన్లు,పోర్కులు,ఫినాయిల్ సీసాలు, డబ్బాలు తదితర వస్తువులను పూర్తిగా నిషేధించే ఇందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఎస్ విజయానంద్ చర్చిస్తున్నారు.ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్,ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పిసిబి చైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు‌.అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా,కృష్ణబాబు,సిసిఎల్ఏ జయలక్ష్మి,జిఏడి ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా, సిఆర్డిడిఏ కమీషనర్ కె.కన్నబాబు,ముఖ్య కార్యదర్శి సునీత,కార్యదర్శులు తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.£
👉బీజేపీలో చేరే వారికి రాజాసింగ్ హెచ్చరిక..!!!

పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాదిలో పెట్టుకోండి.. మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి..బీజేపీలో వచ్చే ముందు కొందరితో చర్చించి, ఆ తర్వాత చేరండి….నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఎందుకు బీజేపీలో చేరి, మళ్ళీ వెళ్లిపోయారో ఆలోచించండి..బీజేపీలో చేరాక మీరు అనుకున్నది మీ నియోజకవర్గంలో జరగదు..మీతో పాటు చేరిన కార్యకర్తలకు మీరు ఏ పదవి ఇప్పించలేరు..మీకే టికెట్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు..మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారు.. మెల్లగా లాస్ట్ సీట్లోకి తోసేస్తారు.. తెలంగాణ బీజేపీలో కొంతమంది రాక్షసులు ఉన్నారు.. ఈరోజు కాకపోతే రేపైనా ఆ రాక్షసులు నాశనం అవుతారు – రాజాసింగ్.
👉పులివెందుల లో “పోలీస్ నాయక్” పవర్… కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లో మొట్టమొదటి సారి, పోలీసులు నిర్భయంగా, రాజకీయ ఒత్తిళ్ళ కు తలొగ్గ కుండా, నిభందనలు ప్రకారం బాధ్యతలు నిర్వహించి, పోలీస్ పవర్ సత్తా చూపారు.. తప్పుతాగి నోటికొచ్చినట్లు వాగిన వారికి పులివెందుల పోలీస్ పవర్ ఫుల్ మాటాలుతో చూపించి, పోలీసులు అంటే ఇలా ఉండాలి అనీ ఆచరణలో చూపారు పులివెందుల డీస్పీ మురళి నాయక్.. భద్రతా కారణాల దృష్ట్యా, ఆఫీస్ ఖాళీ చేయాలని, వైసిపి కార్యకర్తలను పోలీసులు అద్దెశించినా, వారు ఆగ్రహంతో నోటికొచ్చినట్లు మాట్లాడటం, పోలీసులు ను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో,, అప్పుడు అక్కడే వున్న పోలీస్ డీస్పీ మురళీ నాయక్ గారు, వైసిపి కార్యకర్తలు పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ, మీరు వైసిపి కార్యకర్తలు అయితే, తనది ఖాకి యూనిఫామ్ అనీ.. ఏకస్ట్రాలు చేస్తే.. గన్ తో కాల్చిపడేస్తా నంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.. అధి కధా పోలీస్ పవర్ అంటే అనీ అక్కడే వున్న ఓటర్లు,, నాయక్ గారిని కొనియాడారు.. పోలీస్ పవర్ ను నిలిపిన, డీస్పీ మురళీ నాయక్ ని, పోలీస్ అధికారులు ప్రశంసలతో ముంచేత్తారు..  పులివెందులలో, నిజమైన పోలీస్ అధికారిని చూచాం అనీ, టీడీపీ అభిమాన ఓటర్లు తో పాటు, తటస్థ ఓటర్లు మురళీ నాయక్ ను కొనియాడారు.. రాజకీయంగా పులివెందుల అంటే వైస్సార్ కుటుంబం, అనీ అందరికీ తెలుసు.. ఇక్కడ వైస్సార్ కుటుంబం అభిమానులు మాత్రమే, బోగస్ ఓట్లు వేస్తుంటారు.. వాస్తవ ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేయలేరు.. అంత ఘోరాతి ఘోరంగా పరిస్థితులు పులివెందులలో ఉంటాయి.. అలాంటి పులివెందుల లో భయపడకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లేసారంటే, పోలీస్ పవర్ ఎంతగా పనిచేసిందో స్పష్టమవుతోంది.. ఏది ఏమైనా IPS అధికారి కోయ ప్రవీణ్ కి, డీస్పీ నాయక్ కి హ్యాట్సఫ్…
👉సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు సిట్ కు అప్పగించాం: నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్*

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సిట్ కు బదిలీ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఆగస్టు 12న ఆమె మీడియాతో మాట్లాడుతూ…జులైలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నట్లు చెప్పారు. ఈ కేసులో మొదట 8 మందిని, తర్వాత 16 మందిని అరెస్టు చేశామని, అరెస్ట్ అయిన వారిలో వైద్యులు, ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. రెండో కేసులో చనిపోయిన బేబీని చూపించి బాధితుల నుంచి రూ.10 నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారని చెప్పారు.ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాను నిలిపివేశామని, గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ఉన్న లైసెన్స్ నంబర్, లెటర్ హెడ్స్లో వీరు అక్రమాలు చేశారన్నారు. ఆమె ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశామన్నారు. సికింద్రాబాద్ లో సృష్టి సెంటరు అనుమతులు లేకుండానే నడిపిస్తున్నారని తెలిపారు. ప్రధాన ఏజెంట్ అయిన ధనశ్రీ సంతోషి మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకొని నెట్ వర్క్స్ విస్తరించిందని వెల్లడించారు. విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యుల్లత, వైద్యులు రవి, ఉష వీరి కోసం పనిచేశారని తెలిపారు.ఈ కేసులో సరోగసీ, అండదానం చేసే వారిగా కొందరు మహిళా ఏజెంట్లు నటించారని, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మా వర్కర్లు కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. 9 నెలలు పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి సరోగసీ కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించేవారన్నారు. మగ బిడ్డకు రూ. 4.5 లక్షలు, ఆడబిడ్డ రూ. 3లక్షల ధర నిర్ణయించారని తెలిపారు. ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమతులు ఉన్న వాటినే సంప్ర దించాలని డీసీపీ సూచించారు…
👉రాష్ట్రంలో 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం*
*జీవో నెం. 17 వెంటనే రద్దు చేయాలి.*
*బడా కాంట్రాక్టర్లకు సంపద అందివ్వడానికే జీవో 17.*
*రేవంత్ రెడ్డి పాలనలో చిరు కాంట్రాక్టర్లకు అన్యాయం*డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. బిఆర్ఎస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపింది.గురుకులాలు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ధరను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5.50పైసల నుండి 7 రూపాయలకు పెంచింది.గతంలో ఇచ్చిన కోడిగుడ్ల బరువు 50 నుండి 60 గ్రాములు ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం కోడిగుడ్ల బరువు 42 నుండి 50 గ్రాములకు తగ్గించింది..గతంలో కోడిగుడ్ల కంట్రాక్టు రావాలంటే ఎలాంటి వార్షిక టర్నోవర్ చూపించాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టర్నోవర్ కనీసం 3 కోట్లు ఉన్న వారికే కాంట్రాక్టు ఇచ్చేలా జి వో నెం 17 తీసుకొచ్చింది.

ఫౌల్ట్రీ ఫాం,ఆగ్ మార్క్ కలిగిన వారికే కోడిగుడ్ల కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు మార్చారు.
ఇవి పేదలను కాంట్రాక్టర్లకు దూరం చేసే కుట్ర మాత్రమే. గతంలో టెండర్ ఫాం కేవలం 500 నుండి 1000 రూపాయలు ఉండేది.కానీ ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ ఫాం ధర 25000 కు పెంచింది.అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు ఇ.ఎమ్.డి లో 40 శాతం రాయితీ ఉండేది. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ ఆ రాయితీని తొలగించింది.పేద వర్గాలు, చిన్న వ్యాపారులు కాంట్రాక్టర్లుగా ఉండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది.అందుకే టెండర్ నిబంధనలు కొత్తగా బడా కాంట్రాక్టర్లతో కలిసి కఠినంగా రూపొందించి, కేవలం ధనికుడు,బడా కాంట్రాక్టర్లకు మాత్రమే కాంట్రాక్టులు వచ్చే విధంగా జీవో నెం.17 తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న జానారెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మెఘా కృష్ణ రెడ్డి,మాజీ ఎంపి రంజిత్ రెడ్డి మరియు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సిఎం రమేష్ వర్గీయులకే టెండర్లు వచ్చేలా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుంది. గతంలో స్థానికంగా ఉండే పేదలకు కాంట్రాక్టర్లుగా అవకాశం ఇచ్చేవారు, కానీ ఇపుడు మండలాన్ని ఒక యూనిట్ గా చేసి ఒక్కరికే కాంట్రాక్ట్ ఇచ్చేలాగా నిబంధనలు మార్చారు. జీవో నెం 17 వల్ల సుమారు 20 వేల మంది పేద వర్గాల కాంట్రాక్టర్లు రోడ్డున పడే ప్రమాదం ఉంది.గతంలో క్యాటరింగ్ కాంట్రాక్టుకు కేవలం 75 వేల డిపాజిట్ చేయాల్సి ఉండేది,కానీ ఇపుడు సుమారు 5 లక్షల డిపాజిట్,వార్షిక టర్నోవర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. బిఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ ఆధారంగా అర్హులైన వారికి కాంట్రాక్ట్ లభించేది, కానీ ఇపుడు వైన్ షాపుల మాదిరిగా లాటరీ తీసే పద్ధతిని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.గతంలో టెండర్ వెరిఫికేషన్ అధికారం పాఠశాల ప్రిన్సిపల్ చేతిలో ఉండేది.ఇపుడు కలెక్టర్ చేతికి అప్పగించడంతో, కలెక్టర్లు కూడా కమీషన్లు అడుగుతున్నారని తెలుస్తుంది.

రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఇదే నేర్పుతున్నారా?

గతంలో 2 నెలలకు ఒకసారి కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చేవి కానీ,ఇపుడు రేవంత్ సర్కార్ 4 నెలలు దాటినా బిల్లులు ఇవ్వడంలేదు.రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్సీ ఎస్టీ బిసి పేద వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు రాకుండా అడ్డుకుంటున్నారు.చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీలకు 25 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నారు, ఎందుకివ్వడం లేదు?..మల్లి ఖార్జున ఖర్గే ఏం చేస్తున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డిని నిలదీయడం లేదు?
భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఎందుకు పేద వర్గాలకు న్యాయం చేయడం లేదు? ఈయనేమో భంగళాలో కూర్చున్నారు,పేద కాంట్రాక్టర్లేమో రోడ్ల మీద పడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ లో బిసిలకు ప్రభుత్వ కాంట్రాక్టులల్లో వాటా ఇస్తామని హామీ ఇచ్చి ఎందుకు మోసం చేస్తున్నారు?..పేదవాడు ఓటేస్తే గెలవలేదా రేవంత్ రెడ్డి? కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మెఘా కృష్ణ రెడ్డి,సిఎం రమేష్ ఓటేస్తేనే గెలిచారా?

గతంలో కేసిఆర్ ప్రభుత్వం పేదలను ధనవంతులుగా చేయాలని కాంట్రాక్టులు ఇచ్చి,రాయితీలు ఇచ్చి,టర్నోవర్ సర్టిఫికెట్ అడగకుండా అన్ని అవకాశాలు ఇచ్చింది. అంతేకాదు దళిత బంధు,బిసి బంధు వంటి పథకాలు పెట్టి లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి పారిశ్రామికవేత్తలుగా చేసే ప్రయత్నం చేసింది.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను విస్మరించి, కేవలం ధనికులనే ఇంకా ధనవంతులుగా చేసే ప్రయత్నం చేస్తుంది..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 103 మంది విద్యార్థులు మరణించారు..చాలా చోట్ల వందల సంఖ్యలో విషాహార ఘటనలు జరిగాయి..బడా కాంట్రాక్టర్లు వస్తే… విద్యార్థులు,ఉపాధ్యాయులు,ప్రిన్సిపల్స్ చేతిలో అధికారం ఉండదు..బడా కాంట్రాక్టర్లు నచ్చింది తెచ్చి,పడేసి వెళ్తారు. నాణ్యత, తాజా కూరగాయల గురించి పట్టించుకోరు.
కోడిగుడ్లతో పాటు,నూనె,కూరగాయలు,వంట సామాగ్రి,చికెన్,మటన్ వంటి కాంట్రాక్టులలో వేల కోట్ల కుంభకోణం జరిగే ప్రమాదం ఉంది.కాంగ్రెస్ అంటేనే కుంభకోణం,కమీషన్లు,కేసులు..20 వేల మంది పేద కాంట్రాక్టర్ల నోట్లో మట్టి కొడుతుంది రేవంత్ సర్కార్.

వెంటనే జి వో నెం 17 ను రద్దు చేయాలి.
లేదంటే అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేపడుతాం..కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు అడిగే కలెక్టర్లపై ఛీఫ్ సెక్రటరీ,ఎసిబి,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం..జీవో నెం 17 రద్దు కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తాం..పేదలను కాంట్రాక్టుల నుండి దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధం… ఆర్టికల్ 14 కు వ్యతిరేకం. 45 పేజీల జీవో 17 ను కేవలం ఆంగ్లంలోనే విడుదల చేశారు,తెలుగులో కూడా ప్రజలందరికీ అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలి..కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం.. అందుకే మల్లీ కెసిఆర్ సర్కార్ రావాలనీ డిమాండ్ చేశారు.
👉 వివేకా హత్య కేసులో సునీత ఫిర్యాదుతో కమిటీ ఏర్పాటు.. పోలీస్, మెడికల్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో కమిటీ
నివేదిక అందిన వెంటనే చర్యలకు హోంశాఖ ఆదేశం
కడప జైలులో ఖైదీలకు బెదిరింపుల కేసు విచారణకు కమిటీ..మెడికల్ క్యాంప్‌ పేరుతో ఖైదీలను బెదిరించారని ఆరోపణ
👉తెలంగాణ : కూతురిపై అత్యాచారం.. తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష.,!!!
తెలంగాణ : కూతురు అత్యాచారం కేసులో తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. నల్గొండ జిల్లాకు చెందిన యాదమ్మ.. గ్యారాల శివకుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే యాదమ్మ కూతురిపై కన్నేసిన శివకుమార్.. ఆమె సహకారంతో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై 2023లో నల్గొండ PSలో కేసు నమోదు అయింది. విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం A2 నిందితురాలు అయిన యాదమ్మకు కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..