👉ఈసీ వర్సెస్ రాహుల్…ఆ విషయంలో సక్సెస్ అయ్యారా ?👉మహారాష్ట్రలో దారుణం.. 12 ఏళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మందికి పైగా అఘాయిత్యం!*..👉వీధి కుక్కలు దాడిలో మరణించిన కోటీశ్వరుడు*..👉పులివెందుల్లో టీడీపీ అరాచకాలు .. మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి..రాచమల్లు..👉పులివెందుల ఎన్నికల తీరుపై సతీష్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం..👉ఏజెంట్ మోసం.. యువతి ఆత్మహత్య..👉హైదరాబాద్ లో గాంధీభవన్ ను ముట్టడించిన నిరుద్యోగ యువత*..👉పులివెందుల ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల రద్దు..?.👉అంబులెన్స్ రాకపోవడంతో, యువతిని బైక్‌పై ఆసుపత్రికి తరలింపు*..👉ఆస్తి కోసం కన్నతల్లిపైనే కొడుకు కత్తితో దాడి ..👉గంజాయి దొంగలు అరెస్ట్….*8 కేజిల‌ గంజాయి స్వాధినం…*6 గురు అరెస్ట్ (పొదిలి)

👉ఈసీ వర్సెస్ రాహుల్…ఆ విషయంలో సక్సెస్ అయ్యారా ? ఈ రోజున దేశంలో అతి పెద్ద చర్చకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దారి చూపించారు. ఈ రోజున దేశంలో అతి పెద్ద చర్చకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దారి చూపించారు. ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన ఎన్నికల వ్యవస్థ మీదనే ఆయన అనేక సందేహాలను వ్యక్తం చేశారు. దేశంలో ఓట్లు పెద్ద ఎత్తున చోరీకి గురి అవుతున్నాయని రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశవ్యాప్తంగా రచ్చకు అవకాశం ఇస్తున్నాయి. ఎన్నికల్లో ఫేక్ ఐడీలు దొంగ ఓట్లు తప్పుడు చిరునామాలు లక్షల ఓట్ల గల్లంతు, జత చేయడాలు ఇవన్నీ రాహుల్ గాంధీ దేశం ముందు ప్రశ్నలు గా పెట్టారు. రాహుల్ ఏకంగా ఓటర్ చోరీ వెబ్ సైట్ : రాహుల్ గాంధీ ఈ నెల 7వ తేదీనిన ఢిల్లీలో ఒక గంట పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా అనేక సందేహాలు లేవనెత్తారు ఆయన కర్ణాటకలోని ఒక లోక్ సభ పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉదహరణగా తీసుకున్నారు. ఇక ఆయన లేవనెత్తిన అనేక అంశాలలో ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులను కొత్త ఓటర్లుగా కొన్ని చోట్ల చూపించడం, ఒకే వ్యక్తికి అనేక ఓట్లు ఉండడం, వేరు వేరు చిరునామాలతో ఒకే వ్యక్తికి ఓట్లు ఉండడం, వివిధ రాష్ట్రాలలో ఓట్లు ఉండడం, ఫేక్ ఐడీలతో ఓట్లు యాడ్ చేయడం ఇలా అనేక ఆరోపణలు చేశారు. ఇక ఈ దేశంలో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇప్పటికి అనేక సార్లు దేశంలో లోక్ సభకు అలాగే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఎన్నికల సంఘం మీద రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం ఎక్కువగా ఉంటోంది. గెలిచిన వారు మౌనంగా ఉంటున్నారు. ఓడిన వారే విరుచుకుపడుతున్నారు. ఈ విధంగా చేస్తున్న ఆరోపణలలో సహేతుకత ఎంత అన్నది మరో చర్చగా ఉంది. అలాగని ప్రతీ ఆరోపణను కొట్టి వేయాలని కూడా లేదని అంటున్నారు. ఈసీ ప్రజలకు ప్రజాస్వామ్యానికి జవాబుదారీ అని గుర్తు చేస్తున్నారు.


👉బీజేపీకి కౌంటర్ స్లోగన్ అందుకున్న రాహుల్ బీజేపీకి ఒకటి ఎపుడూ ముద్దు అని రాజకీయ పరిశీలకులు అంటారు. అఖండ భారతం ఆ పార్టీ ఫిలాసఫీ. చుట్టు పక్కన ఉన్న చిన్న దేశాలు అన్నీ కలసి ఒకే దేశంగా ఉండాలని అంతా అంటుంది. బీజేపీకి ఒకటి ఎపుడూ ముద్దు అని రాజకీయ పరిశీలకులు అంటారు. అఖండ భారతం ఆ పార్టీ ఫిలాసఫీ. చుట్టు పక్కన ఉన్న చిన్న దేశాలు అన్నీ కలసి ఒకే దేశంగా ఉండాలని అంతా అంటుంది. ఒక్కటే రేషన్ అని సైతం అన్నది. వన్ ఎలక్షన్ అని కూడా జమిలి ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఇక దేశంలో ఒకే పార్టీ చిరకాలం అధికారంలో ఉండాలని అని బయటకు అనదు కానీ కోరిక మాత్రం అదే అని ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తూ ఉంటారు. అలాంటి బీజేపీకి ఆంతా ఆల్ ఇన్ వన్ అంటున్న కాషాయం పెద్దలకు అదే భాషలో అదే పొలిటికల్ లాంగ్వేజ్ లో కౌంటర్ స్లోగన్ తో షాక్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. వన్ మాన్ వన్ ఓట్ అంటూ : ఇది శ్రీమాన్ రాహుల్ గాంధీ అందుకున్న కొత్త స్లోగన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే బాగుంది కానీ వన్ మాన్ వన్ ఓట్ అంటే బాలేదా అని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అచ్చ తెలుగులో చెప్పాలీ అంటే ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్నది తమ నినాదమని రాహుల్ గాంధీ అంటున్నారు. మరి ఈ దేశంలో ధనవంతుడికి అయినా పేదకు అయినా ఒక్కరికి ఒక్క ఓటే కదా ఎవరైనా అనవచ్చు. అంతేగా అలాగేగా జరుగుతోంది అని అనవచ్చు. కానీ అలా జరగడం లేదు అన్నదే కదా తమ పోరాటం అని రాహుల్ గాంధీ అంటున్నారు. వేరు వేరు పేర్లతో ఫేక్ ఐడీలతో చాలా ఓట్లు ఒకరి పేర్ల మీదనే ఉంటున్నాయని ఆయన అంటూ ఉద్యమిస్తున్నారు. *బీజేపీకే డైరెక్ట్ ఎటాక్ : నిజానికి ఈసీ మీద పోరాటం అని అంటున్నా అసలైన రాజకీయ పోరాటం మాత్రం బీజేపీ మీదనే. ఈ సంగతి అందరికీ తెలుసు. బీజేపీ వరుస విజయాలను దేశంతో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా సాధిస్తోంది. అయితే అవన్నీ ప్రజాభిప్రాయం పూర్తిగా కాషాయం ప్రతిబించి వచ్చిన ఫలితాలు కానే కావని కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్ర పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల చోరీతోనే ఈ విజయాలు దక్కుతున్నాయని బలంగా చెప్పదలచారు. అయితే ఇందులో కూడా పదునైన వ్యూహం ఉంది అని అంటున్నారు.
👉వీధి కుక్కలు దాడిలో మరణించిన కోటీశ్వరుడు*
అత్యంత విచారకరమైన (వాగ్ బక్రి టీ పౌడర్ యజమాని) పరాగ్ దేశాయ్, ₹2,000 కోట్ల విలువైన ఆస్తుల యజమాని మరియు 60 దేశాలలో వ్యాపారాన్ని విస్తరించి ఉన్నాడు, ఉదయం నడకలో వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి.వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో, అతను జారిపడి, తలపై పడి, మెదడులో రక్తస్రావం అయ్యాడు. అతను అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుక్కలు అతన్ని మరింత కరిచాయి. 7 రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన తర్వాత, అతను 49 సంవత్సరాల వయస్సులో విచారకరంగా మరణించాడు. దయచేసి వీధికుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. నిజంగా విషాదకరమైన మరియు హృదయ విదారకమైన సంఘటన. ప్రతి ఒక్కరూ చదవాలి మరియు అప్రమత్తంగా ఉండాలి – వీధికుక్కల నుండి మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించుకోండి..

👉ఇటీవల వీధులలోని కుక్కలు చిన్నారులను పెద్దలను సైతం వెంటపడి కరిచేస్తున్నాయి .. కుక్కలను, మూగజీవాలను కాపాడడానికి బ్లూ క్రాస్ సొసైటీ ఉంది.. కానీ మనుషులను కాపాడడానికి మానవ హక్కుల సంఘాలు పోరాడాల్సిన అవసరం లేదా?

👉హైదరాబాద్ KPHB లో*
*షటిల్ కాక్ తీసేందుకు వెళ్ళి బాలుడు మృతి. స్నేహితులతో బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. ఇంటి గోడ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పై పడ్డ కాక్ . బ్యాట్ తో కాక్ ను తీసేందుకు ప్రయత్నించిన విజయ్ కార్తీక్. విద్యుత్ షాక్ తో స్పాట్ లోనే బాలుడు మృతి. మేన మామ ఇంట్లో జరిగే బారసాల వేడుకకి బాపట్ల నుంచి వచ్చిన విజయ్ కార్తీక్ ఫ్యామిలీ..వర్షా కాలం లో జాగ్రత్తగా ఉండాలి….*
👉👉మహారాష్ట్రలో దారుణం.. 12 ఏళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మందికి పైగా అఘాయిత్యం!*
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు
బంగ్లాదేశ్ బాలిక దారుణ కథ..
బాలికను వ్యభిచార కూపంలోకి దింపిన మహిళ..
పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
మహారాష్ట్రలో వెలుగు చూసిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 12 ఏళ్ల బంగ్లాదేశ్ బాలికపై మూడు నెలల వ్యవధిలో 200 మందికి పైగా పురుషులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లా, నైగావ్‌లో సెక్స్ రాకెట్ నుంచి ఆ బాలికకు విముక్తి కల్పించిన తర్వాత ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మీరా-భయందర్ వసాయి-విరార్ పోలీస్ విభాగంలోని మానవ అక్రమ రవాణా నిరోధక బృందం జులై 26న ‘ఎక్సోడస్ రోడ్ ఇండియా ఫౌండేషన్’, ‘హార్మొనీ ఫౌండేషన్’ అనే ఎన్జీవోల సహాయంతో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన 12 ఏళ్ల బాలికను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు..పోలీసుల విచారణలో బాలిక చెప్పిన విషయాలు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటనపై హార్మొనీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్రహం మథాయ్ మాట్లాడుతూ.. ఆ బాలికను మొదట గుజరాత్‌లోని నడియాద్‌కు తీసుకెళ్లారని, అక్కడ మూడు నెలలపాటు 200 మందికిపైగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని ఆ బాలిక వివరించిందని తెలిపారు.
పాఠశాలలో ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయంతో తనకు తెలిసిన ఒక మహిళతో కలిసి ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయిందని మథాయ్ వివరించారు. “ఆ మహిళే బాలికను రహస్యంగా భారతదేశానికి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టింది. ఆ బాలిక చెప్పిన ప్రతీ ఒక్కరినీ అరెస్ట్ చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కేసుపై పోలీస్ కమిషనర్ నికెత్ కౌశిక్ స్పందిస్తూ, ఈ నెట్‌వర్క్‌ను మొత్తం బట్టబయలు చేయడానికి, అభాగ్యులైన యువతులకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి తమ విభాగం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు.సామాజిక కార్యకర్త మధు శంకర్ మాట్లాడుతూ “వాషి, బేలాపూర్ ప్రాంతాల్లో బాలికలు భిక్షాటన చేయడం నేను చాలాసార్లు చూశాను. వీరిని చిన్నతనంలోనే గ్రామాలనుంచి దొంగిలించి నగరాలకు తీసుకొచ్చి దోపిడీకి గురిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే కొందరు మహిళలు వ్యభిచారంలోకి కూడా దింపుతున్నారు. త్వరగా యుక్తవయస్కులుగా కనిపించడానికి వారికి హార్మోన్ల ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారు” అని తెలిపారు. ఈ నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

👉👉ఆస్తి కోసం కన్నతల్లిపైనే కొడుకు కత్తితో దాడి .. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఘటన..
తల్లి లక్ష్మీనరసమ్మపై కత్తితో దాడి చేసిన కుమారుడు శివాజీ…
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…
ఆస్తి కోసం కన్నతల్లిపైనే కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. కొడుకు చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. లక్ష్మీనరసమ్మ భర్త పిల్లలు చిన్నప్పుడే చనిపోవడంతో, ఆమె కొయ్యలగూడెంలో రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఏడేళ్ల క్రితం కుమారుడు శివాజీకి వివాహం కాగా, అనంతరం అతడు అత్తగారి ఊరైన ఎల్ఎన్‌డీ పేటకు వెళ్ళిపోయాడు. కుమార్తెకు కూడా వివాహం అయి వెళ్లిపోవడంతో లక్ష్మీనరసమ్మ ఒంటరిగా ఉంటూ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం గడుపుతోంది.
అయితే, శివాజీ కొంతకాలంగా తమకున్న ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిపై ఒత్తిడి తెచ్చేవాడని మృతురాలి బంధువులు తెలిపారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తల్లీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగి రెండుసార్లు కర్రతో లక్ష్మీనరసమ్మను కొట్టి గాయపరిచాడు. ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వడానికి లక్ష్మీనరసమ్మ అంగీకరించకపోవడంతో ఆదివారం పట్టపగలే అందరూ చూస్తుండగా కత్తితో ఆమెపై దాడి చేశాడు.
తల, మెడతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న ఆమె మృతి చెందింది.
తల్లిపై కత్తితో దాడి చేసి ఆమె మరణానికి కారణమైన నిందితుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
👉కుప్పం తరహాలో ఇక్కడ ఎన్నికలు చేయాలనుకుంటే కుదరదు.*
*వైసీపీ ఏజెంట్లు కావాలని వృద్ధులు, మహిళలను వేధిస్తున్నారు.*
*పులివెందుల, ఒటిమిట్టలో గెలిచేది మేమే.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయించాల్సిన అవసరం మాకు లేదు.*
*కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు.. అందుకే అరెస్టు చేశారు : మంత్రి రాంప్రసాద్ రెడ్డి*

👉పులివెందుల ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల రద్దు..?

అత్యవసర నివేదికలు తెప్పించుకుంటున్న ఎన్నికల కమిషన్..పోలీసుల తీరు పై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ . ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు… ఎన్నికల కమీషన్ కు పోలీసు అధికారుల నివేదిక..పోలీస్ అధికారులు నివేదిక చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ ..పులివెందుల ఒంటిమిట్ట జడ్ పి టి సి ఎన్నికలను రద్దు చేయడానికి ఎన్నికల కమీషన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం..మంగళవారం ఉదయం నుంచి పులివెందుల ఒంటిమిట్టలో ప్రారంభమైన ఎన్నికలు అప్రజాస్వామికంగా తీవ్ర గొడవలతో ప్రారంభమై ప్రతిపక్ష పార్టీ స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి వెళ్లకుండా అధికార కూటమి పార్టీ నేతలు అడ్డుకోవడం వారికి పోలీసులు అండగా నిలవడం సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలలో ప్రత్యక్ష ప్రసారాలు కావడంతో వాటిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారి నీలం సాహ్ని ఎన్నికలను రద్దుచేసి రీపోలింగ్ నిర్వహించడానికి అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం.నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంతో ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ విషయమై సంబంధిత పోలీసు ఉన్నతాధికారులను నివేదిక అడుగగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఇచ్చిన నివేదికలను చూసి ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని సైతం నిబంధనలకు వ్యతిరేకంగా అదుపులోకి తీసుకొని నిర్బంధించిన విషయాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ విషయమై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వైసీపీ శ్రేణులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది .రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి చివాట్లు రాకముందే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.

👉గంజాయి దొంగలు అరెస్ట్….*8 కేజిల‌ గంజాయి స్వాధినం…*6 గురు అరెస్ట్…. వివరాలు వెల్లడించిన దర్శి డిఎస్పి బి.లక్ష్మినారాయణ…**పొదిలి ఎస్సై,సిఐ కి ప్రశంసలు…*గంజాయి రహిత సమాజం కొసం అందరు కృషి చేయాలని డిఎస్పి లక్ష్మినారాయణ…* ప్రకాశంజిల్లా పొదిలిలో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పొదిలి ప్రాంతంలోని ఇరువురు వ్యక్తుల ద్వారా అమ్మకం చేస్తుండగా రాబాడిన సమాచారం మేరకు వారిని పట్టుకొని వారి వద్దనుంచి 8 కేజిల స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు..ఈ సమావేశంలో పొదిలి ఎస్సై వి.వేమన,సి.ఐ టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..గంజాయిని పట్టుకొవడంలో సి.ఐ,ఎస్సై బాగా కృషిచేసారని డిఎస్పి వారిని ప్రశంసించారు.


👉పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోయిన అవినాష్‌రెడ్డి*
* కడప: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి కడపకు బయలుదేరారు. ఈక్రమంలో వైకాపా కార్యకర్తలు ఎర్రగుంట్ల వద్ద వీరి వాహనాన్ని అడ్డుకున్నారు. అవినాష్‌రెడ్డి కూడలి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లుగప్పి ఎర్రగుంట్ల నుంచి అవినాష్‌రెడ్డి వాహనంలో వెళ్లిపోయారు. సింహాద్రిపురం వైపు వెళ్తున్నారన్న సమాచారంలో పోలీసులు ఆయన్ను వెంబడించారు. పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అవినాష్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.

👉 రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈరోజు పులివెందుల్లో టీడీపీ అరాచకాలు ..

నిబంధనల ప్రకారం ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ కావాలి.. కానీ ఓటర్లని భయపెట్టి నిన్న రాత్రి ఓటర్ స్లిప్ లు తీసుకున్న టీడీపీ వాళ్లు ఉదయం 5 గంటలకే రిగ్గింగ్ మొదలుపెట్టారని..ఓటర్లు ఎవరూ బయటికి రాకుండా పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు గ్రామాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్నారని,ఇంత మాత్రం దానికి నోటిఫికేషన్.. ప్రచారం.. పోలింగ్ ఎందుకు? -మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి..రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు.

👉ఒంటిమిట్ట మండలం ZPTC పోలింగ్ బూత్ నెంబర్ 4లో ఈరోజు వైసీపీ గూండాలు అక్రమంగా బూత్‌లోకి చొరబడి, అక్కడ విధులు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి నల్ల వెంకట సుబ్బయ్యపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఎన్నికల ప్రక్రియను భంగపరచడానికి, భయాందోళనలు సృష్టించడానికి వైసీపీ నేతలు ప్రణాళికాబద్ధంగా ఈ దాడి జరిపారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
👉ఏజెంట్ మోసం.. యువతి ఆత్మహత్య..
జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ లో ఘటన
హైదరాబాద్ కు చెందిన కొందరు ఏజెంట్లు అమెరికా పంపిస్తామని చెప్పడంతో ఏడాది క్రితం రూ.10 లక్షలు ఇచ్చి మోసపోయిన హర్షిత
ఆ తర్వాత జర్మనీ వీసా కోసం ప్రయత్నించిన హర్షిత
అయితే వీసాల కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో కొన్ని రోజులు తర్వాత వెళ్లొచ్చని హర్షితకు చెప్పిన కుటుంబ సభ్యులు
దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హర్షిత.
👉 హైద‌రాబాద్ కేపీహెచ్‌బీ కాల‌నీలో భారీ చోరీ
వృద్ధ దంప‌తుల‌పై దాడి చేసి దోపిడి
20 తులాల బంగారం, మూడు లక్ష‌ల న‌గ‌దు చోరీ.ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు.
👉దూసుకొచ్చి… దోచుకెళ్లారు*
*హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు..*
*అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు*
*ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ..*
హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. వరుసగా రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఆరుగురు దొంగలు అక్కడ వృద్ధులను బెదిరించి రూ.2 లక్షలతో పాటు బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు.
అలాగే మరో ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అలాగే ఇటు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్ లోనూ ఈ ఉదయం ఆరుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. అప్పుడే షాప్ ఓపెన్ చేసి ఉదయం 10.30 గంటలకు ప్లెడ్జ్ చేస్తున్న సిబ్బందిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన ఆరుగురు నిందితులు అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరిపారు.
దీంతో ఆయన కాలులోకి బులెట్ దూసుకుపోయింది. కాల్పులలతో ఒక్కసారిగా భయపడిన జ్యువెలరీ షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దొంగలు అందినకాడికి దోచుకుని పరారయ్యారు. ఎక్కువగా వెండి వస్తువులు, బంగారం చోరీకి గురైనట్లు తెలుస్తుంది. గాయపడిన అసిస్టెంట్ మేనేజర్ సతీష్‌ను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఖజానా జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని క్లూస్ సేకరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అలాగే దొంగలు జహీరాబాద్ వైపు పారిపోగా.. జిల్లా సరిహద్దు పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. దొంగలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.
👉 ఇన్ని అరాచకాలు చేస్తున్న నారా లోకేష్.. ఒక మనిషా?..ఎన్నికలు జరిపే కలెక్టర్ ఏం చేస్తున్నాడు?
మీకు ఉద్యోగం, జీతం ఇచ్చేది కొమ్ము కాయడానికా ?
ఓటర్లను వెళ్ళనివ్వకుండా అధికారులు అడ్డుకోవడం ఏంది ?..నారా లోకేష్ చేస్తున్న అహంకారపు చేష్టల వల్ల.. తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అవుతుంది.
– ఎన్నికల తీరుపై సతీష్ కుమార్ రెడ్డి  తీవ్ర ఆగ్రహం.

👉హైదరాబాద్ లో గాంధీభవన్ ను ముట్టడించిన నిరుద్యోగ యువత*.. 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన నిరుద్యోగ యువత.రాబోయే మునిసిపల్ మరియు పంచాయతీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన నిరసనకారులు. అడ్డుకున్న పోలీసులు.

👉అంబులెన్స్ రాకపోవడంతో, యువతిని బైక్‌పై ఆసుపత్రికి తరలింపు*..తెలంగాణలో దారుణంగా వైద్యశాఖ దుస్థితి.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామంలో బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి గూగులోత్ హారికఅంబులెన్స్‌కు ఫోన్ చేసినా ఎంతసేపటికి రాకపోవడంతో, బైక్‌పై యువతిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..