👉 *రొయ్యకు ట్రంప్‌ దెబ్బ* *సుంకాల బాదుడుతో విలవిల..👉టారిఫ్‌లు వెనక్కి? 😳.. గ్రేట్‌ డిప్రెషన్‌ వస్తుందంటూ ట్రంప్‌ హెచ్చరిక!..ట్రంప్ టారిఫ్స్ తో అల్లాడుతున్న అమెరికన్లు!* ..👉 ఓట్లు లేవు..!!!..లాలూ, నితీశ్‌ సొంతజిల్లాలో భారీగా ఓట్లకు గండి.. ఛిద్రంగా బీహార్‌ ఎన్నికల ముఖచిత్రం..‘సర్‌’తో లక్షలాదిమంది ఓటుకు దూరం.. 👉 ఆడుదాం ఆంధ్రా: సోమవారం నుంచే అసలు ఆట !..👉రియల్ పుష్ప .. 86 ఎర్రచందనం కేసులు.. అరెస్ట్ !..👉లేబర్ కోడ్స్ రద్దు చేయాలి ..సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు..👉 పులివెందులలో హై టెన్షన్..భారీగా పోలీసుల మోహరింపు..

👉టారిఫ్‌లు వెనక్కి? 😳.. గ్రేట్‌ డిప్రెషన్‌ వస్తుందంటూ ట్రంప్‌ హెచ్చరిక! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన అధికారంలోకి వచ్చాక విదేశీ వస్తువులపై భారీ సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్నారు. టారిఫ్‌లు రద్దు చేస్తే 1929 నాటి గ్రేట్‌ డిప్రెషన్‌ వంటి ఆర్థిక మాంద్యం వస్తుందని హెచ్చరించడం సంచలనం సృష్టించింది. -ట్రంప్‌ వ్యూహం: ‘టారిఫ్‌లు’ అనే బలమైన అస్త్రం డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్ లతో ప్రపంచ వాణిజ్య విధానాలపై భారీ ప్రభావం చూపారు. ప్రధానంగా చైనా, ఐరోపా సమాఖ్య, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ టారిఫ్‌లు విధించారు. దీని వెనుక ఆయన సిద్ధాంతం ఏమిటంటే, విదేశీ వస్తువులపై సుంకాలు పెంచడం వల్ల అమెరికాలోని వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి, తద్వారా అమెరికాలోని పరిశ్రమలు, ఉద్యోగాలు రక్షించబడతాయి. ట్రంప్‌ ప్రకారం, టారిఫ్‌లు అనేవి అమెరికా ఆర్థిక వ్యవస్థకు గొప్ప రక్షణ కవచం.  ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ఒక “ట్రూత్‌” పోస్ట్‌లో ఇలా రాశారు: “ఒక రాడికల్‌ లెఫ్ట్‌ కోర్టు, అమెరికా ఇప్పటివరకు సృష్టించిన అతిపెద్ద సంపద, ప్రభావాన్ని కూల్చడానికి లేదా దెబ్బతీయడానికి ప్రయత్నించి, ఈ దశలో మాపై వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, మేము ఎప్పటికీ కోలుకోలేం. అది 1929 మాదిరిగానే మరో గ్రేట్‌ డిప్రెషన్‌ అవుతుంది!” -1929 నాటి గ్రేట్‌ డిప్రెషన్‌: అసలేం జరిగింది? ట్రంప్‌ తన వాదనకు బలాన్ని చేకూర్చేందుకు 1929 నాటి గ్రేట్‌ డిప్రెషన్‌ను ఉదాహరణగా చూపించారు. అయితే ఆ సంక్షోభానికి గల కారణాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా భిన్నం. 1929 అక్టోబర్‌లో న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలిపోవడం గ్రేట్‌ డిప్రెషన్‌కు ప్రధాన కారణం. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదిపేసింది. అప్పట్లో అమెరికాలోని హూవర్ ప్రభుత్వం ‘స్మూట్‌-హాలీ టారిఫ్‌ యాక్ట్‌’ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం విదేశీ వస్తువులపై భారీగా సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై అదే స్థాయిలో సుంకాలు విధించాయి. ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యం భారీగా పడిపోయింది. ఈ పరిణామం గ్రేట్‌ డిప్రెషన్‌ తీవ్రతను మరింత పెంచింది. అంటే 1929 నాటి గ్రేట్‌ డిప్రెషన్‌కు టారిఫ్‌లు రద్దు చేయడం కాదు, టారిఫ్‌లు పెంచడమే ఒక కారణం. ట్రంప్‌ వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. * ట్రంప్‌ వాదనలో నిజమెంత? ట్రంప్‌ హెచ్చరికలు కేవలం న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా మాత్రమేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే గ్రేట్‌ డిప్రెషన్‌ అనేది కేవలం టారిఫ్‌లతో ముడిపడి ఉన్న ఒక అంశం కాదు. అది సంక్లిష్టమైన ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థలో లోపాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత సమస్యల వల్ల సంభవించింది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, టారిఫ్‌లు రద్దు చేయడం వల్ల గ్రేట్‌ డిప్రెషన్‌ రాదు, బదులుగా వాణిజ్య యుద్ధాలు తగ్గి, అంతర్జాతీయ వాణిజ్యం పుంజుకునే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా ప్రజలకు తక్కువ ధరలకు వస్తువులు లభించడమే కాకుండా, ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయట.

👉 *రొయ్యకు ట్రంప్‌ దెబ్బ* *సుంకాల బాదుడుతో విలవిల.. ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్‌* .. *ఏటా రూ.20 వేల కోట్ల ఎగుమతి* ..*అందులో అమెరికాకే 16 వేల కోట్లు* ..*గోదావరి జిల్లాల వాటానే 60 శాతం* .. *సుంకాల ప్రకటనతో పడిపోయిన ధర* …*టన్నుకు రూ.40 వేలకు పైగా నష్టం* … *ధరలు మరింత తగ్గే అవకాశం*

*అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆక్వా ఎగుమతులపై తొలుత విధించిన 25 శాతం సుంకం ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.* *దీంతో లక్షకు 25 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి రవాణా, ఇతర ఖర్చులు అదనం. తాజాగా సుంకాన్ని 50 శాతానికి పెంచడంతో లక్షకు రూ.50 వేలు చెల్లించాలి.*

*ఈ నెల 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ట్రంప్‌ ప్రకటన వెలువడగానే రొయ్యల ధరలు పడిపోయాయి. టన్నుకు రూ.40 వేల దాకా నష్టపోతున్నామని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు అండగా నిలవకపోతే ఆక్వా రంగం కుదేలయ్యే ప్రమాదముంది.*

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ ఎగుమతులపై భారీగా సుంకాలు విధించడం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఆక్వా రంగంపై భారీ దెబ్బ పడనుంది. ఆక్వా ఎగుమతులపై ట్రంప్‌ 50 శాతం సుంకం విధించడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు తాజాగా సుంకాల దెబ్బకు తమపై పెనుభారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో రొయ్యల ధరలు మరింత పతనమైతే ఆక్వా సాగు చేయాలా, వద్దా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

మరోవైపు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) యాంటీబయోటిక్‌ ఆరోగ్య ప్రమాణాలను కఠినతరం చేసింది. దీనివల్ల మందులు ఎక్కువ వాడిన రొయ్యలను తిరస్కరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు, ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆక్వా ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. సుంకాల పెంపు వల్ల ధరలు, ఎగుమతులపై ప్రభావం, ఆక్వా రంగ పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది.

*గోదావరి’ ఆయువు పట్టు*

ఆక్వా రంగానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆయువు పట్టు. దేశవ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో ఈ రెండు జిల్లాల నుంచే దాదాపు 60 శాతం ఉత్పత్తి జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 10-11 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా, అందులో ఉభయ గోదావరి జిల్లాల్లోనే 6లక్షల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. అందులో అమెరికాకు 40 శాతం, చైనాకు 30 శాతం ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తోంది. భీమవరం కేంద్రంగా ప్రఖ్యాతి పొందిన రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఉన్నాయి. తాజాగా ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకం ఈ నెల 27నుంచి అమల్లోకి రానుంది. ఇక్కడి నుంచి అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేయాలంటే 40 రోజుల వ్యవధి పడుతుంది. దీంతో వ్యాపారులు ఇప్పటి నుంచే ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

*పడిపోయిన రొయ్యల ధరలు*

ఆక్వా ఉత్పత్తులలో అమెరికాకు 40 శాతం ఎగుమతి అవుతున్నది. 20 కౌంటు నుంచి 60 కౌంటు మాత్రమే ఎక్కువ శాతం ఎగుమతి చేస్తున్నారు. తొలుత ఆక్వా ఎగుమతులపై 25 శాతం సుంకం విధించినపుడు అమెరికాలోని బయ్యర్లు ఈ భారాన్ని భరించేందుకు అంగీకరించారని చెబుతున్నారు. 50 శాతం సుంకం పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేశాక అమెరికాలోని బయ్యర్లు చేతులెత్తేశారనే ప్రచారం తెరపైకి తెచ్చి, రొయ్యల ధరలను స్థానిక ఎగుమతిదారులు తగ్గించివేశారని ఆక్వా రైతులు అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్పత్తయ్యే పెద్దరొయ్యలలో 50 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా అఽధ్యక్షుడు సుంకం పెంచుతున్నట్లు ప్రకటన చేసిన వెంటనే స్థానికంగా ఉన్న ఎగుమతిదారులు గత మూడు, నాలుగు రోజులుగా రొయ్యల ధరలను తగ్గించి వేశారు. గతంలో కిలోకు 25 తూగే రొయ్యల ధర రూ.565 ఉండగా, ఇప్పుడు రూ.430కు తగ్గించారు.

*కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలి*

గతంలో అసైన్డ్‌ భూములలో సాగు చేసే రొయ్యల చెరువులకు కూడా విద్యుత్‌ సబ్సిడీ ఇచ్చేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాయితీని ఎత్తివేసింది. దీంతో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పట్టాదార్‌ పాస్‌పుస్తాకాలు ఉన్న భూములనే ఆక్వా జోన్‌ పరిధిలోకి తెచ్చి అసైన్ఢ్‌ భూములను మినహాయించింది. ఆక్వా జోన్‌లో ఉన్నప్పటికీ ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకే విద్యుత్‌ రాయితీని ఇస్తామని గత ప్రభుత్వం మెలికపెట్టింది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పరిశ్రమగా గుర్తించింది. మేత ధరలు తగ్గించింది. రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఆక్వా జోన్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. కేంద్రం కూడా రాయితీలు కల్పిస్తే అమెరికా విధించిన టారిఫ్‌ నుంచి గట్టెక్కే అవకాశం ఉందని అటు వ్యాపారులు, ఇటు రైతులు ఆశిస్తున్నారు.

*ఏటా 20వేల కోట్ల ఎగుమతులు*

అమెరికాకు రొయ్యల ఎగుమతిలో ఏపీ ప్రధాన వాటాదారు. దాదాపు రూ.20 వేల కోట్ల రొయ్యలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుండగా.. ఇందులో అమెరికాకు వెళ్లే రొయ్యల విలువే రూ.16 వేల కోట్లు ఉంది. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా నిలిచే యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలకు ఆక్వా ఉత్పత్తులు పంపడం సవాల్‌తో కూడుకున్నదని ఆక్వా ఎగుమతిదారులు అంటున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగంపై దాదాపు 10 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సుంకాల పెంపుతో ఎగుమతులు, ఉత్పత్తులు నిలిచిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రప్రభుత్వం, కేంద్రం చర్యలు తీసుకోవాలని ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు పి.భాస్కర్‌ కోరారు. ప్రధానంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణలో సహకరించాలని కోరారు.

*ట్రంప్ టారిఫ్స్ తో అల్లాడుతున్న అమెరికన్లు!*

ప్రపంచ దేశాలపై ట్రంప్ మొండి వైఖరి చూస్తూనే ఉన్నాం., వివిధ దేశాలపై ఏకపక్షంగా టారిఫ్స్ విధిస్తున్నారు. అయితే, ఈ ధోరణితో నష్టపోతోంది అమెరికన్లు అనే చెప్పాలి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్స్ పుణ్యమా అమెరికాలో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. గతంలో 6 డాలర్లకు దొరికిన దుస్తులు ఇప్పుడు 10 డాలర్లుగా ఉన్నాయి. వస్తువుల ధరలైతే ఒక డాలర్ నుంచి 10 డాలర్ల వరకు పెరిగాయని వాపోతున్నారు. మరియు నిత్యవసర సరుకులపై భారీగా టారిఫ్ పడటం , సరైన సమయానికి రవాణా సరుకులు సరఫరా చేయకపోవడం తో సూపర్ మార్కెట్లో మూతపడుతున్నాయి, ఉద్యోగస్తులను తొలగిస్తున్నారు.

👉 ఓట్లు లేవు..!!!..లాలూ, నితీశ్‌ సొంతజిల్లాలో భారీగా ఓట్లకు గండి.. ఛిద్రంగా బీహార్‌ ఎన్నికల ముఖచిత్రం..‘సర్‌’తో లక్షలాదిమంది ఓటుకు దూరం

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదించి, కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అమల్లోకి తెచ్చిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ప్రాంతీయ పార్టీలదే హవా. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఈ పార్టీలకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా బీహార్‌ పాలిస్తుంటారు. మోడీ సర్కార్‌ తెచ్చిన ‘సర్‌’తో ఇప్పుడు వీరి ఆధిపత్యానికి గండిపడనుంది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 15.10 శాతం ఓట్లను ‘సర్‌’ పేరుతో జాబితా నుంచి తొలగించారు. అలాగే బీహార్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ సొంత జిల్లా నలంద. ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా ఆరు శాతం ఓట్లను ‘సర్‌’ పేరుతో ఓటర్ల జాబితా నుంచి ఎత్తేశారు. తొలగించబడిన ఓట్లన్నీ ఆ రెండు పార్టీల గెలుపోటములను తారుమారు చేసేవే కావడం గమనార్హం! బీహార్‌ రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లోనూ ఇదే తరహాలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొడుతూ ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించారు. సీఈసీ ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. బీహార్‌లో ఎక్కువగా వలసలు, నిరుద్యోగంతో పాటు చదువుకోని వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సీఈసీ పెట్టిన ధ్రువీకరణ పత్రాల మెలికతో భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోతున్న విషయం తెలిసిందే.

ఓట్ల తొలగింపు ఇలా…

2025 జూన్‌ 24 నాటికి బీహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. వీరిలో 7.24 కోట్ల మంది ఓట్లు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ప్రతిలో ఉన్నాయి. 65.6 లక్షల (8 శాతం) ఓటర్ల పేర్లను ఆ జాబితా నుంచి తీసేశారు. తమ అభ్యంతరాలను ఓటర్లు సకాలంలో నమోదు చేసి, ‘సర్‌’ ధృవీకరించిన పత్రాలను చూపించలేకపోతే తుది జాబితా నుంచి వారందరి పేర్లు తొలగిస్తామని కేంద్రఎన్నికల సంఘం (సీఈసీ) ఇప్పటికే ప్రకటించింది. బీహార్‌లో ‘సర్‌’ అమలు తర్వాత, గోపాల్‌గంజ్‌ జిల్లాలోని నియోజకవర్గాల నుంచి 15.10 శాతం ఓటర్ల పేర్లను తొలగించారు. సీమాంచల్‌లో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో పూర్ణియాలో 12.08 శాతం, కిషన్‌గంజ్‌ 11.82 శాతం, కతిహార్‌లో 8.27 శాతం , అరారియాలో 7.59 శాతం ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ నాలుగు జిల్లాల్లో ముస్లిం జనాభా ఇతర జిల్లాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. నలంద జిల్లాలోని షేక్‌పురా నియోజకవర్గంలో 5.13 శాతం, అర్వాల్‌లో 6 శాతం, నలందలో 5.57 శాతం ఓట్లను తొలగించారు. బీహార్‌ రాజధాని పాట్నాలో 7.84 శాతం ఓటర్లను డ్రాఫ్ట్‌ జాబితాలో చేర్చలేదు.

ఇదీ ‘సర్‌’ లెక్క

బీహార్‌లోని 38 జిల్లాల్లో ‘సర్‌’ అమలు తర్వాత 22,34,501 మంది ఓటర్లు మరణించినట్టు గుర్తించారు. మరో 36,28,210 మంది ఓటర్లు వలస వచ్చినట్టు గుర్తించారు. 7,01,364 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు చేసుకున్నారనే చెప్తూ, వారందరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.

👉 పులివెందులలో హై టెన్షన్..భారీగా పోలీసుల మోహరింపు.. పులివెందుల ZPTC ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. నువ్వా, నేనా అన్నట్లు వైసీపీ, టీడీపీ ప్రచారం ముగిసింది. పోలీసులు భారీగా మోహరించారు. 6 పంచాయితీల్లో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పులివెందులలో స్థానికేతరులకు నో ఎంట్రీ ప్రకటించారు. టీడీపీ నుంచి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు.

👉 రూ. 5.8 కోట్లు లంచం తీసుకున్న రాబర్ట్.!

ఈడీ వెల్లడి..ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. అవినీతి ద్వారా రూ. 5.8 కోట్లు లంచంగా అందుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. గురుగ్రామ్లో జరిగిన ఈ వివాదాస్పద భూ కేసులో వాద్రా కంపెనీకి ఈ మొత్తం చెల్లింపులు జరిగాయని ఈడీ పేర్కొంది. దీనిపై కోర్టు వాద్రాకు నోటీసులు జారీ చేసింది.

👉  నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి*

హైదరాబాద్ బంజారాహిల్స్లో నాలుగేళ్ల బాలికపై కన్నతండ్రి లైంగిక దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలి తల్లి బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించి ఆరా తీయగా, బాలిక తండ్రి అఫాన్ అఘాయిత్యానికి పాల్పడిన విషయం బయటపడింది. నెలరోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దాడి జరిగిందని, సైకియాట్రిస్ట్ పరీక్షలో కూడా లైంగిక దాడి కారణంగానే బాలిక ప్రవర్తన మారిందని నిర్ధారణ అయింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

💥ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా..*

తరలి వచ్చిన 24 క్రాఫ్ట్స్ కార్మికులు.. కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం తప్పు.. ఇకపై ఏ షూటింగ్స్ జరగవు.. నిర్మాత విశ్వప్రసాద్ మాకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు..  మేము ఛాంబర్‌తో మాత్రమే మాట్లాడతాం.. పీపుల్స్ మీడియా మాకు రూ. 90 లక్షల బకాయి ఉంది.. మా వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా గుర్తించడం లేదు.. ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు.. చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారు: ఫిల్మ్ ఫెడరేషన్

*ట్రంప్ టారిఫ్స్ తో అల్లాడుతున్న అమెరికన్లు!*

ప్రపంచ దేశాలపై ట్రంప్ మొండి వైఖరి చూస్తూనే ఉన్నాం., వివిధ దేశాలపై ఏకపక్షంగా టారిఫ్స్ విధిస్తున్నారు. అయితే, ఈ ధోరణితో నష్టపోతోంది అమెరికన్లు అనే చెప్పాలి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్స్ పుణ్యమా అమెరికాలో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. గతంలో 6 డాలర్లకు దొరికిన దుస్తులు ఇప్పుడు 10 డాలర్లుగా ఉన్నాయి. వస్తువుల ధరలైతే ఒక డాలర్ నుంచి 10 డాలర్ల వరకు పెరిగాయని వాపోతున్నారు. మరియు నిత్యవసర సరుకులపై భారీగా టారిఫ్ పడటం , సరైన సమయానికి రవాణా సరుకులు సరఫరా చేయకపోవడం తో సూపర్ మార్కెట్లో మూతపడుతున్నాయి, ఉద్యోగస్తులను తొలగిస్తున్నారు

👉 ఆడుదాం ఆంధ్రా: సోమవారం నుంచే అసలు ఆట !

ఆడుదాం ఆంధ్రా పేరుతో దోచేసిన డబ్బుల గురించి విజిలెన్స్ పూర్తి స్థాయిలో ఆరా తీసింది. అన్నిజిల్లాల్లో విచారణ నిర్వహించింది. ఎక్కడెక్కడ ఎలా దోచాలో వివరాల లెక్కలు తీసింది. విచారణ నివేదికను డీజీపీకి సోమవారం విజిలెన్స్ సమర్పించనుంది. శాప్ చైర్మన్ రవి నాయుడు. .. ఆడుదాం ఆంధ్రా పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేశారని ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ దర్యాప్తు చేసింది. అన్ని వివరాలతో నివేదికను సిద్ధం చేసింది.

ఆడుదాం ఆంధ్రాను ఫక్తు రాజకీయ ప్రమోషన్ కోసం వాడుకున్నారు. వైసీపీ కార్యకర్తలను ఆటగాళ్ల పేరుతో తీసుకు వచ్చి వారికి డబ్బులు ఇచ్చారు. గెలవకపోయినా ఆడకపోయినా గెలిచినట్లుగా రివార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం మంత్రి రోజా, నాడు శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనుసన్నల్లో జరిగింది. కనీసం రూ. 120 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

సామాగ్రి కొనుగోలు చేసిన దాని కన్నా ఎక్కువగా బిల్లులు పెట్టుకోవడం, నాసిరకం సామాగ్రి కొనుగోలు చేయడం సహా .. దొరికిన ప్రతీ దాంట్లోనూ దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ విజిలెన్స్ విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సోమవారం డీజీపీ చేతికి విచారణ నివేదిక వస్తుంది. ఆ తర్వాత చర్యలు ప్రారంభించనున్నారు.

👉రియల్ పుష్ప – 86 ఎర్రచందనం కేసులు – అరెస్ట్ !* పుష్ప సినిమాలో హీరో ఎర్రచందనం స్మగ్లర్. అలాంటి వారు ఉంటారా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఉంటారని అప్పుడప్పుడు దొరికే స్మగ్లర్ల బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది.

రెండు రోజుల కిందట కడప జిల్లాలోని లంకమల్ల అటవీ ప్రాంతంలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. అందులో ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా ఒకరిని గుర్తు పట్టిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని పేరు నాగదస్తగిరెడ్డి.. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా గుర్తించారు. ఎందుకంటే అతనిపై 86 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి..లంకమల్ల అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల నుంచి రూ.కోటి విలువైన టన్ను ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు స్వాధీనం. చేసుకున్నారు. నాగదస్తగిరి రెడ్డిపై 86 ఎర్రచందనం కేసులు, 34 చోరీ కేసులు ఉన్నాయి. ఆయన భార్య కూడా పెద్ద స్మగ్లరే. స్మగ్లర్ భార్య లూలుబీపై కూడా ఎర్రచందనం కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. ఢిల్లీలోని బడా స్మగ్లర్ కు ఎర్రచందనం దుంగలు సరఫరా చేసి.. హవాలా ద్వారా డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇలా డబ్బులు పంపుతున్న హవాలా వ్యాపారి విక్రమ్ సింగ్ సోలంకి వారం క్రితం అరెస్టు అయ్యారు.పదుల సంఖ్యలో ఎర్రచందనం కేసులు ఉన్నాయంటే ఇతని వెనుక బడా వ్యక్తులు ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ఎవరూ లేకపోతే ఇన్ని కేసుల్లో అరెస్టు అయి మళ్లీ బయటకు రావడం సాధ్యం కాదు. దొరకకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ దస్తగిరిరెడ్డి ఎవరి అనుచరుడో.. ఎవరితో లావాదేవీలు నిర్వహిస్తారో పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈయన భార్య కూడా స్మగ్లింగ్ క్వీన్ అని చెప్పారు కాబట్టి.. ఆ కోణంలో పుష్ప 3 సబ్జెక్ట్‌ను దర్శకుడు డెవలప్‌ చేసుకోవచ్చేమో ?

👉💎 ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల మం పరిటాల లో దోరికిన 52 క్యారెట్ల వజ్రం..*పరిటాల చెరువు వద్ద వజ్రాల వేట కోసం వెతుకుతున్న వారికి 52 క్యారెట్ల వజ్రం దోరికినట్లు సమాచారం..దీని విలువ బహిరంగ మార్కెట్లో 4 కోట్లు పలుకుతుందంటున్న వ్యాపారులు..ఈ వజ్రాన్ని 2.20 కోట్ల కు అమ్మినట్టు సమాచారం..పరిటాల గ్రామాన్ని అప్పట్లో నిజాం నవాబు పరిపాలించారని చరిత్ర నేపధ్యంలో లో వజ్రాల వేట కోసం వస్తున్న ఆశావాహులు..

👉లేబర్ కోడ్స్ రద్దు చేయాలి ..సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు .. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తెచ్చిన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆదిత్య పాఠశాల ఆవరణలో ఆ సంఘం మండల మహా సభ మండ్ల వలి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రద్దు చేసిన 40 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమిస్తేనే కార్మిక అనుకూల చట్టాలు అమల్లొకొస్తాయని సూచించారు. ఏ ఒక్క కార్మిక రంగం సమస్యను ఎదురుకుంటున్నా.. దాని పరిష్కారానికి మిగతా రంగాలు మద్దతుగా నిలవాలని సమన్వయ సూత్రాన్ని సూచించారు. సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్దరించాలని, క్లయిములు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ సాధనకు సెప్టెంబర్ 15 న రాష్ట్ర కార్మిక కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. జీవో నంబర్ 1214 ను రద్దు చేయాలని అన్నారు. మహాసభకు ఎమ్మార్పిఎస్ జిల్లా కార్యదర్శి గోనా మోహన్ రావు సంఘీభావం ప్రకటించారు. కంభం మండల సిఐటియు నాయకులు దానం పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఐటియు మండల సమన్వయ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా మండ్ల వలి, కో కన్వినర్ గా భారతి, సభ్యులుగా మండ్ల నాగేశ్వరరావు, షేక్ నాసర్ వలి, రాజేష్, ఎస్ జోసఫ్, రామ కృష్ణ, దర్శనం ఏలీయా రాజు, ఎస్కె సత్తార్, యూసఫ్, ఎన్ రాజు, ఎస్డి హనీఫ్ ఎన్నికయ్యారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..