👉 టీడీపీ సీఎం అభ్యర్థిగా లోకేశ్?
ఆంధ్రప్రదేశ్ : మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ తనకంటూ ఓ ఇమేజ్, బ్రాండ్ సృష్టించుకుంటున్నారు. పార్టీ భవిష్యత్ లీడర్‌గా కేడర్ నీరాజనాలందుకుంటున్నారు. ఈ క్రమంలో 2029లో పార్టీ సీఎం అభ్యర్థిగా ఎదగాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారని, సొంత టీమ్‌ను రంగంలోకి దించారని ‘రైజ్’ సర్వే సంస్థ చీఫ్ ప్రవీణ్ పుల్లట చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇదే నిజమైతే జనసేన ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

👉జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం*
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్లు తెలిపిన ఎన్టీపీసీ బృందం..సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు వివరించిన ఎన్టీపీసీ సీఎండీ.ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని తెలిపిన ఎన్టీపీసీ బృందం .రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
👉జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..ఇద్దరు సైనికులు మృతి
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుత్రికి తరలించగా.. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం సైన్యం చేపట్టిన ఆపరేషన్ అఖాల్ తొమ్మిదో రోజుకు చేరింది.
👉ప్రజాశక్తి విలేకరి ఇంటిపై రాళ్లతో దాడి..
ప్రజాశక్తి అచ్చంపేట : అచ్చంపేట మండల కేంద్రంలో ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్న గుంజి రవికుమార్ ఇంటి మీద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు టి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దాడి జరిగిన స్థలాన్ని శుక్రవారం పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అచ్చంపేటలో 20 ఏళ్ల నుండి ప్రజాశక్తి విలేకరిగా, ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రశ్నించే ప్రజా గొంతుకుగా గుంజి రవికుమార్ పనిచేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారికే రక్షణ లేకుంటే, సామాన్యులకు ఏమి రక్షణుంటుందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసే విలేకరులకు అటు అధికారులతో, ఇటు ప్రజలతో నిత్యం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని, విషయమేమైనా ఉంటే సంబంధిత అధికారులతో చర్చించే ప్రయత్నం చేయాలేగాని భౌతిక దాడులకు దిగడం సరికాదని అన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ప్రశ్నించేవారిని దాడుల ద్వారా ఆపలేరన్నారు. తాజా ఘటనపై పోలీసుల స్పందించాలని, నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరారు. దీనిపై తాము ఇప్పటికే సిఐకు వివరించామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, విలేకరి రవికుమార్ కుటుంబీకులు పాల్గొన్నారు.
👉 ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్
‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ : ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సోదరుడు, విశాఖ కేజీహెచ్ అనస్థీషియా హెడ్ డాక్టర్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రతతో కలిసి వీరు కూడా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మంది అరెస్ట్ చేశారు.
👉అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.. మంత్రి నారా లోకేష్…ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసి… ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాది కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వివరించి…. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై వారితో చర్చించి నేడు నిర్ణయాలు ప్రకటిస్తాం. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.
*మంగళగిరి ఆడపడుచులు నా అక్కాచెల్లెళ్లు!*
*మీ ఆశీస్సులతో మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దుతా*
*మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు*
ఉండవల్లి: నాకు సొంతంగా అక్కలు, చెల్లెళ్లు లేరు, మంగళగిరి మహిళలు నా అక్కాచెల్లెళ్లు, ఈరోజు మీరంతా రాఖీకట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయి, మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెం.1గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరి ఆడబిడ్డలందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. 2019 ఎన్నికల్లో నేను తొలిసారిగా పోటీచేసినపుడు 5,300 ఓట్లతో ఓటమిచెందాను. అప్పుడు నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను విమర్శించడమేగాక కొడుకును గెలిపించుకోలేక పోయావంటూ చంద్రబాబు గారిని కూడా అవమానించారు. అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేశాను. సొంత నిధులతో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో నన్ను రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిపించి విమర్శించిన వారి నోళ్లు మూయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఆనాడు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ప్రభుత్వభూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్లపట్టాలు. తొలి ఏడాదిలోనే దాదాపు 3వేలమందికి పైగా వెయ్యికోట్ల విలువైన ఆస్తిని పంపిణీచేసి మాట నిలబెట్టుకున్నా. త్వరలోనే మరోవిడత ఇళ్లపట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాను. ఇందులో ప్రధానమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజి, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్ల ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు వంటివి పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం. మహా ప్రస్థానం పేరుతో శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఇలా ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషిచేస్తున్నాను. మీరు ఇచ్చిన భారీ మెజారిటీ నాలో మరింత బాధ్యతను పెంచాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రెట్టింపు కష్టపడుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా. మీ అందరి సహకారంతో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
👉*మగవారికి రాఖీ గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం*
రాష్ట్రవ్యాప్తంగా 50–100 శాతం బస్సు ఛార్జీలను పెంపు
నల్గొండ టు మిర్యాలగూడ మామూలు సమయంలో బస్సు ఛార్జీ రూ.60.. రాఖీ పండుగ సందర్భంగా రూ.120కి పెంపు..ఎల్బీ నగర్ నుండి సూర్యాపేటకు రూ.200 ఉన్న బస్సు ఛార్జీ రూ.310కి పెంపు..జేబీఎస్ టు కామారెడ్డి బస్సు ఛార్జీ రూ.240 నుండి రూ.340కి పెంపు
👉 *రాఖీ పండుగ రద్దీపై ఆర్టీసీ దోపిడి “స్పెషల్ బస్సుల”పేరుతో అధిక చార్జీల వసూలు*
కరీంనగర్..రాఖీ పండుగ సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే, స్పెషల్ బస్సుల పేరుతో అధిక వసూలు చేస్తూ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్–వరంగల్ మార్గంలో సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తూ ‘రాఖీ స్పెషల్’ బస్సుల పేరుతో ప్రయాణికులపై భారం మోపుతున్నారు.సాధారణ టికెట్‌కు అదనంగా వసూలు చేస్తూ, బస్సుల ముందు ‘గోల్డ్’ లేదా ‘స్పెషల్’ బోర్డులు అతికించి అధిక రేట్లను విధించడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని సద్వినియోగం చేసుకునే ఈ విధానాన్ని ఆపాలని, ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
👉 ఆటోడ్రైవర్ కు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత
AP: రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదరభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటోడ్రైవర్ గిరీశ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. ఆయనకు ధైర్యం చెప్పిన మంత్రి.. సహాయం అందిస్తామన్నారు.
👉 ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సయిన యువతి..! తమ చెల్లి మిస్ అయింది అంటూ పోలీసులను ఆశ్రయించిన కుటుంబం..!
ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు..!
పది రోజులు గడుస్తున్న జాడ లేని యువతి..!
యువతిని తీసుకువెళ్లిన యువకుడి ఫోన్ వివరాలు సేకరించి విచారించాలని స్టేషన్ చుట్టూ తిరుగుతున్న అక్క చెల్లెళ్ళు..! తమ చెల్లెల ఆచూకీ తెలపాలంటూ స్టేషన్ కి వెళ్తున్న అక్క చెల్లెళ్లను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కానిస్టేబుల్.!
కానిస్టేబుల్ చేష్టలతో విసిగి చెంది ఐజీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసిన యువతులు!
🌟స్పందించిన ఉన్నతాధికారులు..!
కానిస్టేబుల్ పై కొనసాగుతున్న అంతర్గత విచారణ.!…
👉కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం.*
జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద JSW సంస్థ నిర్మించే ఈ పరిశ్రమ ప్రహరీ నిర్మాణ పనులకు ఇవాళ భూమి పూజ చేశారు.
మూడేళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
👉యర్రగుంట్ల రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన ఏడిఆర్ఎం*
యర్రగుంట్ల రైల్వే స్టేషన్ ను ఏడీఆర్‌ఎం సుధాకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లోని కనీస వసతులు కల్పించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని 2 వ ప్లాట్ ఫామ్ మాత్రమే టాయిలెట్స్ ఉండడం వల్ల మహిళా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారని రాత్రి సమయాల్లో ప్లాట్ ఫామ్ మీద లైట్లు లేకపోవడంతో చోరీలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని దివ్యాంగులు వెళ్లేందుకు కనీసం వీల్ చైర్ కూడా అందుబాటులో లేదని *ఆంధ్ర డైరీ రిపోర్టర్* ప్రశ్నించగా త్వరలోనే వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
👉🏽ధర్మస్థలపై సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు! కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల మిస్టరీ కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే…కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల మిస్టరీ కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను, బాలికలను కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ.. రంగంలోకి దిగిన ‘సిట్’ పరిశోధనల్లో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ సమయంలో సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అవును… కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల మిస్టరీ కేసు తీవ్ర సంచలనంగా మారిన వేళ ఈ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఆ ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడి చేసి, హత్య చేసి పూడ్చి పెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా… కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని.. ఆ ట్రస్ట్ కు ఏడాదికి రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని.. ఈ నేపథ్యంలో ఆ ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని.. ట్రస్ట్ ను ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని నారాయణ తాజాగా తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే… 500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ తవ్వే కొద్దీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయని.. అసలు అది దేవస్థానమా లేక స్మశాన వాటికా?.. అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా… కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేశారని.. అదే మరో ప్రభుత్వం అయితే ఇది బయటకు వచ్చేది కాదని అన్నారు. సుప్రీం కీలక నిర్ణయం!: మరోవైపు.. ధర్మస్థలలో సిట్ చేపట్టిన కార్యాచరణకు, తమకు సంబంధాన్ని అంటగడుతూ కొన్ని ప్రచార మాధ్యమాలు, యూట్యూబర్లు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలయ ప్రముఖుడు హర్షేంద్ర కుమార్ హెగ్డే వేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రచార మాధ్యమాలను నియంత్రించాలని పదేపదే కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
👉 6 ఒప్పందాలు, 529 బాంబింగ్ లు… ట్రంప్ కు నోబెల్ సాధ్యమేనా?..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని నానారకాల తాపత్రయాలు పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని నానారకాల తాపత్రయాలు పడుతున్నారు. ఏ రెండు దేశాల మధ్య ఏ చిన్న సమస్య ఉన్నా.. వెంటనే అక్కడ వాలిపోతున్నారు. ఆ దేశాధినేతలను వైట్ హౌస్ కి రప్పించి శాంతి ఒప్పందాలు చేయించేస్తున్నారు. అనంతరం వారితో నోబెల్ ప్రైజ్ కు మద్దతు ప్రకటించే కార్యక్రమానికి తెరలేపుతున్నారు! మొన్న పాకిస్థాన్ అయినా, నిన్న ఇజ్రాయెల్ అయినా, అనంతరం కంబోడియా అయినా.. తాజాగా అర్మేనియా, అజార్ బైజాన్ అయినా… ప్రొసీజర్ సేమ్ అనే చెప్పాలి! కాకపోతే వీటిలో భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ పాత్ర లేకపోయినా… పాక్ మాత్రం ట్రంప్ ని ఈ విషయంలో తెగ పొగిడేసింది. ఈ క్రమంలో అసలు ట్రంప్ కు శాంతి బహుమతి సాధ్యమేనా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే మూడుసార్లు నోబెల్ కమిటీకి నామినేషన్లు పంపించి, తిరస్కరణకు గురైన ట్రంప్.. ఈసారి ఎలాగైనా సంపాధించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర దేశాధినేతల సంగతి అలా ఉంచితే… ఈ ప్రయత్నం కోసం వైట్ హౌస్ ప్రయత్నమూ పీక్స్ కి చేరిందని అంటున్నారు. దీనికి ఉదాహారణ… ఇటీవల వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వ్యాఖ్యలు! నెలకు సగటున ఒకటి చొప్పున శాంతి ఒప్పందాలు!: ఇటీవల కరోలిన్ లీవిట్ స్పందిస్తూ… శాంతి రంగంలో అధ్యక్షుడు ట్రంప్ థాయిలాండ్ – కంబోడియా మధ్య తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు సహాయం చేశారని తెలిపారు. ఇదే సమయంలో… ఇజ్రాయెల్ – ఇరాన్, రువాండా – కాంగో, భారత్ – పాక్, సెర్బియా – కొసావో, ఈజిప్ట్ – ఇథియోపియా మధ్య ఘర్షణలను ట్రంప్ ఇప్పటివరకూ ముగించరని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ తన ఆరు నెలల పదవీకాలంలో సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా సీజ్ ఫైర్ కు మధ్యవర్తిత్వం వహించారని కరోలిన్ అన్నారు. అనంతరం… ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు ఇదే సరైన అవకాశం అని తెలిపారు. 240 ప్రదేశాల్లో 529 బాంబింగ్ లు!: వైట్ హౌస్ ప్రకటించినట్లు సగటు నెలకు ఒకటి చొప్పున శాంతి ఒప్పందాలు చేయిస్తున్న మాటల సంగతి అలా ఉంటే… ట్రంప్ ఆరు నెలల వ్యవధిలో చేయించిన బాంబింగ్ ల అంశం సంగతేమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. కారణం… ఆరు నెలల వ్యవధిలో సుమారు 240 ప్రదేశాల్లో 529 బాంబింగ్ లను ట్రంప్ చేయించారు!
👉 టీడీపీ సీఎం అభ్యర్థిగా లోకేశ్?..👉 *రాఖీ పండుగ రద్దీపై ఆర్టీసీ దోపిడి “స్పెషల్ బస్సుల”పేరుతో అధిక చార్జీల వసూలు*..👉 ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సయిన యువతి..!..👉ప్రజాశక్తి విలేకరి ఇంటిపై రాళ్లతో దాడి..👉 ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్..👉యర్రగుంట్ల రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన ఏడిఆర్ఎం….*అసలు అది దేవస్థానమా లేక స్మశాన వాటికా?..ధర్మస్థలపై సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు!..👉 6 ఒప్పందాలు, 529 బాంబింగ్ లు… ట్రంప్ కు నోబెల్ సాధ్యమేనా?
Recent Posts

