👉జయబచ్చన్ vs రేఖా గుప్తా : దేశభక్తి ఫైట్ ఈ అంశంపై బాలీవుడ్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలు, ఆపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇచ్చిన కౌంటర్ ఈ చర్చను మరింత తీవ్రతరం చేశాయి.

భారత సైన్యం పాకిస్థాన్‌పై నిర్వహించిన తాజా సర్జికల్ స్ట్రైక్‌కు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై బాలీవుడ్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలు, ఆపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇచ్చిన కౌంటర్ ఈ చర్చను మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు చుట్టూ జరుగుతున్న రాజకీయ, సామాజిక చర్చ వివాదాస్పదమవుతోంద.. సిందూర్: సంస్కృతి, భావోద్వేగాల బొత్స, ధర్మాన మౌనమెందుకు? భారతీయ సంస్కృతిలో సింధూరం అనేది కేవలం ఒక సౌందర్య సాధనం కాదు. ఇది సౌభాగ్యానికి, వివాహ బంధానికి, మహిళల గౌరవానికి ప్రతీక. వివాహిత మహిళలకు ఇది ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ఈ నేపథ్యంలో సైనిక చర్యకు ఈ పేరు పెట్టడంపై జయా బచ్చన్ అభ్యంతరం వ్యక్తంచేయడం వెనుక భావోద్వేగ కోణం ఉంది. యుద్ధంలో వీరులైన సైనికులు ప్రాణాలు కోల్పోతే, వారి భార్యలు కోల్పోయే సింధూరం ఆమెకు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఈ అభిప్రాయం ఒక వ్యక్తిగత, భావోద్వేగ ప్రతిస్పందనగా చూడాలి. దేశభక్తి, రాజకీయ కోణం జయా బచ్చన్ వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గట్టిగా ఖండించారు. దేశభక్తిని ప్రశ్నించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది కేవలం సినిమా డైలాగుల స్థాయిలో ఉందని రేఖా గుప్తా విమర్శించారు. దేశం మీద ప్రేమ ఉండాలని, దేశ శత్రువుల పట్ల సానుభూతి ఉండకూడదని ఆమె పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ స్పందనలో దేశభక్తి అంశం ప్రధానంగా కనిపిస్తుంది, కానీ ఇది వ్యక్తిగత దూషణలకు దారితీయడం వల్ల చర్చలో సమతుల్యత దెబ్బతింది.
👉రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తే భారత్‌పై ఎంత భారం? ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో మార్పులు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతాయి. ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో మార్పులు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తక్కువ ధరలకు లభిస్తున్న రష్యా చమురును భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ ఈ దిగుమతులను భారత్ తగ్గించాల్సి వస్తే, దేశ ఆర్థిక వ్యవస్థపై అది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఇంధన మార్కెట్ విశ్లేషణ సంస్థ Kpler ఇచ్చిన అంచనాల ప్రకారం, ఒకవేళ భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తే, ఏటా సుమారు రూ.78 వేల కోట్ల నుంచి రూ.95 వేల కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. భారీ ప్రభావం ప్రైవేట్ రిఫైనరీలపైనే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగిపోతే ఆ ప్రభావం ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని భారీ చమురు రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ , నయారా ఎనర్జీ వంటి సంస్థలపై పడుతుంది. ఈ కంపెనీలు అధిక మొత్తంలోకి రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. కాబట్టి, ఈ పరిస్థితి వాటి వ్యాపార నమూనాలు, లాభాలు, ఉత్పత్తి వ్యయాలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. మిడిల్ ఈస్ట్ నుంచి కొనుగోలు చేస్తే… రష్యా చమురుకు ప్రత్యామ్నాయంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటే, బ్యారెల్‌కు సగటున $5 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని Kpler నివేదిక తెలిపింది. భారత్ రోజుకు సుమారు 18 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ ధరల పెరుగుదల వల్ల సంవత్సరానికి వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఈ అదనపు భారాన్ని రిటైల్ మార్కెట్‌లో ధరల పెంపు ద్వారా ప్రజలపై వేసే అవకాశం ఉంటుంది. భారత్ వ్యూహం.. సవాళ్లు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను బ్యాలెన్స్ చేస్తోంది. అయితే, భవిష్యత్తులో అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా ఈ సరఫరా తగ్గితే, ప్రభుత్వం కొత్త ఎమర్జెన్సీ వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటి ధరలు పెరిగి, చివరికి సాధారణ ప్రజల జీవన వ్యయాలపై ప్రభావం పడుతుంది. అందుకే, రష్యాతో సంబంధాలను కొనసాగిస్తూనే, ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టడం ఇప్పుడు భారత్‌కు చాలా కీలకంగా మారింది.
👉సృష్టి కేసులో సంచలన విషయాలు.. మరిన్ని అక్రమాలు..? ఇటీవల ఒక గృహిణి తన బాబుకు క్యాన్సర్ సోకిందని డీఎన్ఏ టెస్టుకు పట్టుబట్టింది. మాతృత్వంను ప్రతీ గృహిణి ఆస్వాదించాలనే ఆరాటపడుతుంది. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. కొందరిలో భర్తలో లోపం ఉండడం, మరికొందరిలో భార్యలో లోపం.. ఇలా మాతృత్వానికి దూరం అయ్యే వారు చాలా మంది ఉన్నారు. ఇందులో కొందరు అనాథాశ్రయం నుంచి పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటే.. మరికొందరు తన రక్తబంధమే కావాలని కోరుతుంటారు. వారి ఆనందాలను, కలలను నిజం చేసేందుకే ఫెర్టిలిటీ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లు చాలా మంది గృహిణులను అమ్మలను చేశాయి. కొందరు మాతృత్వం వరంగా ప్రసాదిస్తామని ఫెర్టిలిటీ సెంటర్లు నడిపిస్తుంటే.. మరికొందరు వ్యాపారంగా నడుపుతూ దంపతులను కష్టాల్లోకి నెడుతుంటారు. ఇటీవల హైదరాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వెలుగులోకి రావడంతో సంచలన విషయాలు బయటకువచ్చాయి. అసలు విషయం బయటపడింది ఇలానే.. ఇటీవల ఒక గృహిణి తన బాబుకు క్యాన్సర్ సోకిందని డీఎన్ఏ టెస్టుకు పట్టుబట్టింది. ఈ డీఎన్ఏ టెస్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తన భర్త, తన డీఎన్ఏతో బాబు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో కేసు బయటకు వచ్చింది. ఈ కేసు నడుస్తుండగానే మరో నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఐవీఎఫ్ కు వచ్చిన తమకు సరోగసి పేరిట డబ్బులు తీసుకున్నారని కేసులో పేర్కొన్నారు. ఈ మేరకు గోపాలపురం పీఎస్ లో 4 కేసులు నమోదయ్యాయి. వారి మెడికల్ రిపోర్టులు తీసుకువచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు దండుకున్న తీరిది.. తాము ఐవీఎఫ్ కోసం వస్తే సరోగసిని చూపి తమ వద్ద ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత రూ. 44 లక్షల వరకు తీసుకుందని బాధితులు పేర్కొన్నారు. దీనితో పాటు హైదరాబాద్ కు చెందిన ఒక గృహిణికి సరోగసి చేస్తానని హార్మోన్ ఇంజిక్షన్ ఇచ్చిందని తెలిపింది. ఇలా హాస్పిటల్ కు చెందిన నమ్రతతో పాటు కల్యాణి, సదానందం, చెన్నారావు, సురేఖ, అర్చన, శేషగిరి, శ్రీనివాస్ లపై కేసులు నమోదయ్యాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గ్యాంగ్ ఎన్ఆర్ఐలను కూడా వదల్లేదని ఫిర్యాదులను చూస్తే తెలుస్తోంది. ఒక ఎన్ఆర్ఐ ఈ ఫెర్టిలిటీ సెంటర్ పై ఫిర్యాదు చేసింది. తమ వద్ద నుంచి రూ. 25 లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా చాలా వరకు కేసులు నమోదయ్యాయి. కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
👉👉నువ్వు నిజంగానే దేవుడివయ్యా.. సూర్యపై ప్రశంసలు..!!_*

నటుడు సూర్య నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ అగరం ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. కాగా అగరం ఫౌండేషన్ స్థాపించి 15 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో వేడుకను నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు శివకుమార్, సూర్య, కార్తీ, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్, వెట్రిమారన్ నిర్మాత కలైపులి ఎస్ ధాను, డ్రమ్స్ శివమణి ప్రముఖులు పాల్గొని, అగరం ఫౌండేషన్ విద్యా సేవలను కొనియాడారు. ఈ వేడుకకు నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ ఇది అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం అని విద్య అనేది ఆయుధం అన్నదే అగరం ఫౌండేషన్ నమ్మకం అని, అది ఈరోజు నిజం అయ్యిందని పేర్కొన్నారు. విద్య అనేది చదువు మాత్రమే కాదని విద్యార్థులకుమన సాంప్రదాయాన్ని నేర్పించేదన్నారు. వారి ప్రతిభను వెలికి తీసే పనిని అగరం ఫౌండేషన్ చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే విద్యార్థులకు అగరం ఫౌండేషన్ విద్యాసేవలు అందిస్తుందని, విద్య ఎంత మార్పు తీసుకొస్తుందన్నది గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు తెలియజేయాలన్నదేఆగరం ఫౌండేషన్ ప్రయత్నం అని సూర్య పేర్కొన్నారు.
15 ఏళ్ల ప్రయాణం..51 మంది వైద్యులు
కాగా అగరం ద్వారా ఈ 15 ఏళ్లలో 51 మంది విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించి, వైద్యులు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ నుంచి సుమారు 8 వేలకు పైగానే విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. రెట్రో సినిమా లాభాల్లోంచి రూ.10 కోట్లు అగరం ఫౌండేషన్‌కు సూర్య విరాళంగా ఇచ్చారు. పేదవారికి అండగా నిలబడుతున్న సూర్య నిజంగానే దేవుడు అంటూ సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలహాసన్ మాట్లాడుతూ విద్య,ప్రేమ ఒకే చోట లభించడం సాధ్యం కాదన్నారు. అయితే అది అమ్మ వద్ద, అగరం వద్ద లభిస్తాయన్నారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి లభించేది ముళ్ల కిరీటాలేన్నారు. తాను విద్యను నేర్చుకునే తీరుతాను, ఇతరులకు నేర్పించే తీరుతాను అనేది ఒక సాగదీత ప్రక్రియగా పేర్కొన్నారు. 2017 తర్వాత విద్యార్థుల వైద్యవిద్య అనేది కొనసాగలేక పోతోందన్నారు. కారణం నీట్ పరీక్ష అని పేర్కొన్నారు. అందుకే నీట్ పరీక్షలు వద్దని తాము చెబుతున్నామన్నారు. అందుకు చట్టాన్ని మార్చే బలం విద్యకే ఉందన్నారు. విద్య అనేది ఈ యుద్ధంలో ఆయుధంగా మాత్రమే కాదని, దేశాన్ని చక్కదిద్దేది కూడా అని అన్నారు. సనాతన సంకెళ్లను, సర్వాధికార సంకెళ్లను నుగ్గు నుగ్గు చేసే ఆయుధం విద్య అని కమలహాసన్ పేర్కొన్నారు.
👉 *భారత్‌కు ట్రంప్ బెదిరింపులు*
24 గంటల్లో భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తాం
భారత్‌తో వ్యాపారం చేయడం కష్టంగా మారింది-ట్రంప్
ట్రంప్ కోసం రష్యాను దూరం చేసుకోం: భారత్..
👉**ట్రంప్ బెదిరింపులు భారత్ వైఖరిని మార్చలేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
తక్కువ ధరలో లభిస్తే రష్యా చమురే ఎంచుకుంటామని తెలిపాయి. దేశీయ ఇంధన ధరల తగ్గింపు, యూరప్కి డీజిల్, జెట్ ఫ్యూయల్ సరఫరా వంటి లాభాలున్నాయని వివరించాయి. ట్రంప్ సుంకాల హెచ్చరికపై వాణిజ్య వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి.
👉*రూ.17వేల కోట్ల మోసం కేసు.. ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ*
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు.
👉👉👉 *వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తయింది: సీబీఐ*న్యూ ఢిల్లీ :
వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీం కోర్ట్ ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ సుప్రీం కోర్ట్ ధర్మాసనానికి తెలిపింది. జస్టిస్ ఎమ్.ఎమ్ సుందరేష్ ధర్మాసనం కాసేపట్లో వివేకా హత్య పై మరోసారి విచారణ చేపట్టనుంది.
👉’కాళేశ్వరం’లో బాధ్యులు వీళ్లే: ఘోష్ కమిషన్
TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, పాలనా వైఫల్యాలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 22 మంది పేర్లను ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. వీరిలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, స్మితా సబర్వాల్, ఎస్.కె.జోషి, మురళీధర్, ఇంజినీర్లు హరిరామ్, వెంకటేశ్వర్లు, నరేందర్, ఫైనాన్స్ కార్యదర్శులు, ఇరిగేషన్ కార్యదర్శులు, కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు ఉన్నారు.
👉 *రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్: డీజీపీ హరీష్ కుమార్*
ఏపీలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ నెల 10 వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 నుంచి 17 వరకు హై స్పీడ్, 18 నుంచి 24 వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై డ్రైవ్లు చేపడతామన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు డ్రైవ్ చేపట్టనున్నారు.
👉 సినీ నిర్మాతలు, కార్మికుల మధ్య కుదరని సయోధ్య
కార్మికులకు జీతాలు పెంచేది లేదంటున్న నిర్మాతలు
కార్మికులు షూటింగ్‌కు వస్తేనే చర్చలు-నిర్మాతలు
సాయంత్రం చిరంజీవిని కలవనున్న గిల్డ్ నిర్మాతలు
👉 *ఉప్పల్‌లో జొమాటో డెలివరీ బాయ్స్ నిరసన.. రోడ్డెక్కిన కార్మికులు*
రోజుకు 12-14 గంటలు పని చేసినా కనీస ఆదాయం కూడా అందడంలేదంటూ జొమాటో డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సెంటివ్స్, ఇన్సూరెన్స్ లేకుండా కంపెనీ శ్రమను అనుసంధానించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డెలివరీ సమయంలో ప్రమాదాలు జరిగినా తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ, కష్టానికి తగిన వేతనం, ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ అందించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
👉 రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో గిద్దలూరు, కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం.*
*కూటమి శ్రేణులతో పండుగ వాతావరణంలో గిద్దలూరు పట్టణం.*
*గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో “గిద్దలూరు, కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్” ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు..*
*గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా వేలాదిమంది కూటమి శ్రేణుల కేరింతలతో, కన్నుల పండుగగా నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్,రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్.ఎమ్ కొండయ్య, యర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి టీడీపీ నాయకులు కడియాల లలిత్ సాగర్, రాష్ట్ర మారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నూకసాని బాలాజీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మొదటగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు.రాష్ట్ర గేయంతో సభను ప్రారంభించారు.*
*గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బైలడుగు బాలయ్య యాదవ్, కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పూనూరు భూపాల్ రెడ్డి మరియు వైస్ చైర్మన్లు, డైరెక్టర్లతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు…*
*అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు సభను ఉద్దేశించి మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేక వైసిపి నాయకులు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నారని, పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే ఈ ప్రాంత రెడ్లు ఇంకా జగన్ జపం చేయటం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తీవ్రంగా విమర్శించారు. కులం ఒక పూటకూడా అన్నం పెట్టదని,నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అశోక్ రెడ్డి అని అన్నారు. మార్కాపురం జిల్లాగా సాధిస్తామని పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నాసిరకం మద్యాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో వైసిపి చలగాటం ఆడుకున్నదని, మద్యం కుంభకోణంతో కట్టలు కట్టలుగా డబ్బులు దొరుకుతున్నాయని అన్నారు. మద్యం కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులు చట్టం నుండి తప్పించుకొలేరన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ సందర్బంగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్లకు రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియచేశారు.. సభ అనంతరం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,మార్కెట్ యార్డ్ చైర్మన్లకువేద పండితుల ఆశీర్వచనాలు, ముస్లిం మత పెద్దలు, ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమంలో జనసేన, బీజేపీ ఇన్ఛార్జ్ లు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్,మండల పార్టీ అధ్యక్షులు, సొసైటీ బ్యాంకు చైర్మన్లు,సర్పంచులు,కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు,ఎన్డీయే కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు..

