👉 🌟అణు బాంబు లాంటి ఆధారాలు…ఈసీ వర్సెస్ రాహుల్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో ఈ మధ్య కాలంలో లెక్కలేనన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయని రాజకీయ పార్టీలు అంటున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం, రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర వ్యవస్థ. అయితే కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో ఈ మధ్య కాలంలో లెక్కలేనన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయని రాజకీయ పార్టీలు అంటున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తూ ఉంటాయి కానీ ఇపుడు ఈసీని కూడా ముగ్గులోకి లాగుతున్నారు. గత కొంతకాలంగా ఈసీని టార్గెట్ చేస్తుకుంటూ తనదైన శైలిలో ఆరోపణల శరసంధానం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. అన్ని రెడీగా ఉన్నాయట : తాము గత ఆరు నెలలుగా ఈసీ వ్యవహార శైలి ఎన్నికల్లో అనుసరిస్తున్న విధానాల మీద సొంతంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా రాహుల్ గాంధీ చెబుతున్నారు. తన దర్యాప్తులో అణు బాంబుల లాంటి ఆధారాలు లభించాయని ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ ఆధారాలు కనుక బయటపెడితే ఈసీకి ఎక్కడ కూడా దాక్కోవడానికే చోటు ఉండడని అంటున్నారు. ఈసీ చేస్తున్నది కచ్చితంగా దేశ ద్రోహం అని ఆయన ఫైర్ అవుతున్నారు. అణు బాంబు పేల్చేది ఎపుడు : అణు బాంబు పేలిన రోజున ఈసీకి ఇబ్బందికరం అవుతుందని రాహుల్ గాంధీ అంటున్నారు. అయితే అణు బాంబు ఎపుడు పేలుతుందన్నది మాత్రం ఆయన డేటూ టైం అయితే చెప్పలేదు కానీ ఏదో నాడు పేలుతుందని స్పష్టంగా పక్కా క్లారిటీతో చెబుతున్నారు. ఈసీ బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడుతోందని కూడా తీవ్రమైన వ్యాఖ్యలనే రాహుల్ గాంధీ చేశారు. వీటి వివరాలు అన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నయని ఆయన చెబుతున్నారు. పూర్తిగా వ్యతిరేకిస్తున్న రాహుల్ : బీహార్ లో కొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈసీ చేపట్టింది. అయితే దానిని మొదటి నుంచి రాహుల్ గాంధీ తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇబ్బందిని కలిగించే ప్రక్రియ అని ఆయన అంటున్నారు. ఇక బీహార్ ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. దాంతో ఆగ్రహించిన రాహుల్ ఈసీ తీరు మీద నిప్పులు చెరుగుతున్నారు.

👉ఫోన్ లో 2,000కు పైగా వీడియోలు… కోర్టులో బిగ్గరగా ఏడ్చేసిన మాజీ ఎంపీ!.. ఇరకాటంలో బిజెపి.. గత ఏడాది కర్ణాటక రాజకీయాల్లో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది కర్ణాటక రాజకీయాల్లో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలిన సంగతీ తెలిసిందే. ఈ సమయంలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకున్నాడు.. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. అవును… అత్యాచారం మరియు లైంగిక వేధింపుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో మాజీ పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులో విలపించారు. తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకుంటూ బిగ్గరగా ఏడ్చాడు.. తీర్పు ప్రకటించిన వెంటనే కన్నీరు మున్నీరుగా విలపించాడు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరమూ వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు విచారణ ప్రారంభమైన అనంతరం.. ప్రభుత్వ న్యాయవాది బిఎన్ జగదీష్ కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా… ఇది హై ప్రొఫైల్ కేసు అని.. నిందితుడు సాధారణ వ్యక్తి కాదని.. అతడు నాయకుడు కాబట్టి సమాజానికి ఒక పాఠంగా మారే విధంగా శిక్ష ఉండాలని.. ఈ క్రమంలో ప్రజ్వల్ కు జీవిత ఖైదు విధించాలని న్యాయవాది డిమాండ్ చేశారు. మరోవైపు తనకు తక్కువ శిక్ష విధించాలని రేవణ్ణ కోర్టును కోరాడు! కాగా… కేఆర్ నగరకు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా… గన్నిగడ ఫాంహౌస్ లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు (47) తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్ పై నమోదయ్యాయి. ఈ క్రమంలో 14 నెలలుగా ప్రజ్వల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. వాస్తవానికి గత లోక్ సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇతడి అత్యాచార ఘటనల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో.. ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయారు. అయితే.. కుటుంబసభ్యుల హెచ్చరికతో చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అతడి ఫోన్ లో 2,000కు పైగా వీడియోలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిజమైన ఇటువంటి ఎంపీ గెలుపు కోసం ప్రచారం చేసిన బిజెపి నేతలు ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు .
👉సూపర్ సిక్స్ – సూపర్ సక్సెస్*
*అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసిన సీఎం*
*రైతుల ఖాతాలకు తొలివిడతగా రూ.7 వేల చొప్పున జమ* *46,85,838 మంది రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్ది**రైతును రాజు చేయాలన్నదే కూటమి లక్ష్యం*
*టెక్నాలజీ ద్వారా పంటలపై సూచనలు*
*వచ్చే సీజన్‌కు వెలుగొండ ఫేజ్ 1 పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు కృష్ణా నీళ్లు* *రాజకీయ ముసుగేసుకున్న నేరస్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి*
*ప్రకాశం జిల్లా దర్శిలో పచ్చని పొలాలు, రైతన్నల మధ్య అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు*


*దర్శి, ఆగస్టు 2:-* రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ పంట వేస్తే లాభాలు వస్తాయన్నది అధ్యయనం చేసి వారికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. సూపర్ సిక్స్ లో ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా, దర్శి మండలం, వీరాయపాలెంలో ప్రారంభించారు. పచ్చని పొలాల్లో రైతుల మధ్య కూర్చుని ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కర్షక సోదరులతో కలిసి పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రైతులతో కాసేపు ముచ్చటించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో గత ప్రభుత్వానికి…కూటమి ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఎంత మేర ఉందో చూడాలని సీఎం అన్నారు. ఎన్నికల్లో చేసిన ప్రకటన మేరకు రైతులకు ఏటా రూ.20,000 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చా మన్నారు. ఈ పథకం ద్వారా 3 విడతల్లో రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
*రైతుల కళ్లలో ఆనందం చూశా*
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇలా పచ్చని పొలాలు, దేశానికి అన్నం పెట్టే రైతుల మధ్య ప్రారంభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ‘రైతు కళ్లల్లో ఆనందాన్ని నేరుగా చూస్తున్నాను. రైతు ఎప్పటికీ రాజే. కరోనా వంటి విపత్తులోనూ అన్నదాత నాగలి చేతపట్టి పొలంలో పనిచేశాడు. ఎన్ని కష్టాలున్నా రైతులు బాగుండాలనేది నా కోరిక. ఎన్నికలకు ముందు విధ్వంస, సైకో పాలనతో అందర్నీ ఇబ్బంది పెట్టి వారు ఆనందపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సూపర్ సిక్స్ అమలు నాకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున జమ చేశాం. దీనికోసం రూ.2,343 కోట్ల నిధుల్ని కేటాయించాము. మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,000 చొప్పున రూ.832 కోట్లు ఇస్తోంది. మొదటి విడతలో కేంద్రం-రాష్ట్ర వాటాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేశాం. ఈ విడతలో రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్ది కలుగుతోంది.” అని సీఎం తెలిపారు.
*సందేహాల నివృత్తికి పోర్టల్, టోల్ ఫ్రీ నెంబర్*
పథకం అమలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఫిర్యాదులు, సందేహాలు ఉన్నా అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని ఆర్ఎస్ కే లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే 155251 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. “అన్నదాత సుఖీభవ కింద ప్రకాశం జిల్లాకు రూ.186 కోట్లు ఇస్తున్నాం. జిల్లాలోని 2,65,317 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది కలుగుతోంది. అలాగే దర్శి నియోజకవర్గంలో 42,786 మంది రైతులకు రూ.29 కోట్లు ఇస్తున్నాం. దర్శి మండలంలో 10,972 మంది రైతులకు రూ.7.36 కోట్లు ఇస్తున్నాం. ఒక్క వీరాయపాలెంలోనే 476 మంది రైతులకు రూ.31,00,000 లక్షలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
*సూపర్ సిక్స్ అమలు సంతోషాన్నిస్తోంది*
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసింది. చాలా సమస్యలు వచ్చాయి. ఎన్ని కష్టాలున్నా, ఇచ్చినమాట నిలబెట్టుకోవాలని సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం. నేను హామీ ఇచ్చినట్టే పెంచిన రూ. 4000 పింఛను గత ఏడాది ఏప్రిల్ నుంచే ఇచ్చాను. పింఛన్ల కోసం ఏడాదికి 64 లక్షల మందికి రూ. 32,134 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1000 మాత్రమే పెంచింది. భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ ఎగ్గొట్టారు. ఎవరైనా లబ్దిదారులు రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
*15వ తేదీ నుంచి ఉచిత బస్సు*
తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు ఇచ్చాం. గత ప్రభుత్వం అందరికీ ఇస్తామని ఎన్నికల్లో చెప్పి తీరా గెలిచాక మాట మార్చి ఒక్కరికే పరిమితం చేశారు. దీపం పథకం కింద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాను. దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందుకోసం రూ. 2,700 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈనెల ఆగస్టు 15న స్త్రీ శక్తి కింద ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. దీని వల్ల రాష్ట్రంలోని 2 కోట్ల 60 లక్షలమంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. మీ పెద్దలు ఇచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీ చేసే సాయమే ఎక్కువ. ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెట్టి రూ.5 కే భోజనం పెడుతుంటే గత ప్రభుత్వం క్యాంటీన్లను మూసేసిందని సీఎం చంద్రబాబు అన్నారు.
*డ్రిప్ ఇరిగేషన్ లో దేశంలో ఏపీ టాప్*
వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు, రైతుల జీవితాలను బాగు చేసేందుకు ఈ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోంది. ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి ఉన్నంతలో ప్రకృతి సేద్యం వైపు రైతులు వెళ్లాలి. ఈ ఏడాది పొలం పిలుస్తోంది కార్యక్రమం కింద 15,424 గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాం. నేను డ్రిప్ ఇరిగేషన్ కింద రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. డ్రిప్ ఇరిగేషన్ రాయితీని ఎస్సీ, ఎస్టీలకు 100 శాతానికి, రాయలసీమ-ప్రకాశం జిల్లాలో 90 శాతానికి, కోస్తాలో 70 శాతానికి పెంచాం. గతేడాది 1,17,880 హెక్టార్లకు డ్రిప్ విస్తరించాం. దీని వల్ల 1.11 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. డ్రిప్ ఇరిగేషన్ లో ఏపీనే దేశంలో నెంబర్ వన్ గా ఉంది. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మత్స్య కార సేవలో సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచాం. దీని వల్ల 1,29,178 మత్స్య కార కుటుంబాలు రూ.259 కోట్లు అందించాం. 26 వేల మంది రైతులకు 50 శాతం రాయితీపై రూ.61 కోట్లతో వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం. సాగుకోసం 875 కిసాన్ డ్రోన్లు త్వరలో సేవలు అందించనున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో మరో వెయ్యి కిసాన్ డ్రోన్లు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
*కూటమిది రైతు ప్రభుత్వం*
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చాను. రైతులు ఏ వాతావరణంలో ఏ పంట వేయాలో , నీరు ఎప్పుడు ఇస్తామో ముందే చెబుతాం. దాని ప్రకారం పంట వేయమని కోరుతున్నాను. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు చేపట్టి రైతులు నష్ట పోకుండా చూశాం. ఇందుకోసం రూ.273 కోట్లు మంజూరు చేశాం. మామిడి రైతులకు కేజీకి రూ.4 చొప్పున అదనంగా ఇచ్చాం. మొత్తం 4,29,521 మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోళ్లు పూర్తిచేశాం. 50,922 మంది రైతులకు రూ.172 కోట్లు చెల్లించాం. రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఇది. 2,358 మెట్రిక్ టన్నుల కోకో కొనుగోళ్లకు కేజీకి రూ.50 చొప్పున రూ.12 కోట్లు చెల్లించాం. మార్కెట్ ఇంటర్ వెన్షన్ కింద మిర్చి క్వింటాకు రూ.11,781 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాం. మార్కెట్ ఇంటర్ వెన్షన్ కింద మిర్చి క్వింటాకు రూ.11,781 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాం.రూ.8,282 కోట్లతో ఖరీఫ్‌లో 6 లక్షల మంది రైతుల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, రబీలో రూ.4,575 కోట్లతో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం.
*పంటలకు గిట్టుబాటు ధర కల్పించాం*
సబ్సిడీ విత్తనాల నుంచి గిట్టుబాటు ధర వరకు అండగా నిలిచాం. 2014-2019 మధ్య మా హయాంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకువచ్చాం. రూ.15,279 కోట్ల రుణ మాఫీ చేశాం. ఉచితంగా భూసార పరీక్షలు జరిపి 1.33 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాం. ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేశాం. 6 లక్షల పంట కుంటలు తవ్వించాం. రూ.1,488 కోట్లతో4.99 లక్షల మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందించాం. రైతు రథం పేరుతో 23,500 ట్రాక్టర్లు సబ్సిడీపైన పంపిణీ చేశామని సీఎం తెలిపారు.
*రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి*
ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీరు వదలడంతో 700 టీఎంసీలతో రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, సోమశిలలో సమృద్ధిగా నీరు ఉంది. ఎవరికీ తాగు, సాగు నీటి కొరత లేకుండా నదుల అనుసంధానం చేస్తాం. భూగర్భ జలాల పెంపుపై ప్రజలు కూడా దృష్టి సారించాలని కోరుతున్నాను. 2014-19 మధ్య కాలంలో సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గత పాలకులు ఉచిత బీమా పథకాన్ని నాశనం చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ మేం దాన్ని పునరుద్ధరించాం. వైసీపీ హయాంలో రూ.1,670 కోట్ల ధాన్యం డబ్బులను రైతులకు ఎగ్గొట్టారు. కూటమి వచ్చాకే ఆ బకాయిలన్నీ చెల్లించాం. గుండ్లకమ్మ గేట్లకు మేం మరమ్మతులు చేసి ప్రాజెక్టును సంరంక్షించాం. వెలిగొండను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వచ్చే సీజన్ కి ఫేజ్ వన్ పూర్తిచేసి కృష్ణా జలాలు వెలిగొండ ద్వారా ప్రకాశం జిల్లాకు తీసుకువస్తాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
*రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులతో జాగ్రత్త*
రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. గతంలో ఎన్నడూ చూడని కొత్త రాజకీయాలు చూస్తున్నాను. మన రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ …అమరావతి ఆడబిడ్డలను వేశ్యలుగా చిత్రీకరించింది. ఆ పార్టీ అధినేత ప్రకాశం జిల్లా పొదిలి వచ్చినప్పుడు ఆడబిడ్డలు క్షమాపణ చెప్పమని కోరగా వారిపై దౌర్జన్యం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని వైసీపీ నేత నల్లపురెడ్డి పశువులా దూషించాడు. పార్టీ అధినేత ఏం చేశాడు? మందలించకుండా.. మా వాళ్లకు చెప్తే చాలు…ఇళ్లలోకి పోయి రప్పా రప్పా లేపేస్తారని అంటున్నాడు. బాబాయ్ హత్య విషయంలో నన్నూ ఏమార్చారు. పల్నాడులో వైసీపీ కార్యకర్త ఆయన కారు కిందే పడితే ఎత్తి పొదల్లో పడేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం లో మామిడికి ధర లేదని మామిడి పళ్లను ట్రాక్టర్ల కింద తొక్కించి రాజకీయ విన్యాసం చేశాడు. నెల్లూరులో జనం వచ్చినట్టు ఫేక్ వీడియో ప్రదర్శించాడు.
*జగన్‌ను చూసి బూతులు నేర్చుకోవాలా*
రాజకీయ పార్టీలు ప్రజల కోసం పని చేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైనప్పటికీ నైతిక విలువలు, పద్దతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా పాటించాలి. జగన్ ను చూసి రప్పా రప్పా, బూతుల పంచాంగం, గొడ్డలి వేట్లు నేర్చుకోవాలా? పేదల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు నేను పనిచేస్తున్నాను. నేను అభివృద్ధి చేసిన తెలంగాణ ఎలా ఉందో చూశారుగా. అంతకు మిన్నగా ఏపీని 2047 నాటికి దేశంలోనే నెంబర్ వన్ గా తయారు చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.
***విజయనగరం జిల్లా*
*ఒడిస్సా నుండి కేరళకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు..*
*ఒడిస్సాలో గంజాయి కొనుగోలు చేసి కేరళ తరలించే క్రమంలో ఎల్.కోట పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులు*
*నిందితుల వద్ద నుండి 145 కిలోల గంజాయి, ఒక బొలెరో వాహనంను స్వాధీనం..*
*కేరళకు చెందిన మరో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,*
విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 71ప్యాకెట్లలోగల 145కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు.
***అమరావతి రాజధాని ప్రాంతంలో నందమూరి బాలకృష్ణ పర్యటన..
తుళ్లూరులో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన బాలకృష్ణ
ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన..మొత్తం 21 ఎకరాల్లో 3 దశల్లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం..మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్న బాలయ్య..ఇకపై తాను తీయబోయే సినిమాల్లో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని వెల్లడి
***భర్త వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మనీషా (28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన మనీషా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని, తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
***ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే – ఫ్యాప్టో హెచ్చరిక – ఒంగోలు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నాడు ప్రకాశం భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఫ్యాప్టో చైర్మన్ కె. ఎర్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను విముక్తులను చేయాలని, బోధన వ్యవస్థకు ఆటంకం కలిగించే యాప్‌లను పూర్తిగా రద్దు చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని, పీఆర్‌సీ కమిషన్ లోపు 30% ఐఆర్ ప్రకటించాలని, మొత్తం 19 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లోనుంచే ఎంఇఒ -1 పోస్టుల భర్తీకి తీసుకున్న జీవోను ఫ్యాప్టో తీవ్రంగా వ్యతిరేకించింది. జడ్పీ, గవర్నమెంట్ మేనేజ్మెంట్లలో సంయుక్త సీనియారిటీ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏకికృత సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని,సిఎస్సీ వేదింపుచర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.ధర్నా కార్యక్రమం లో ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు సెక్రటరీ జనరల్ ఎస్‌కే ఎండి రఫీ,ఎంఇఒ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ బాబు, జిల్లా అధ్యక్షులు ఎన్ నాగేంద్ర వదన్, ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ మంజుల, హెచ్‌ఎంఅసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వై వెంకట రావు , బి టిఏ రాష్ట్ర నాయకులు పర్రె వెంకట్రావు,యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు , అధ్యక్షులుషేక్ అబ్దుల్ హై, డి. శ్రీనివాసులు (ఎపిటిఎఫ్ -257), బి. వెంకట్రావు, చల్లా శ్రీనివాసులు, ఎస్. రవి, పి. వెంకట్రావు, పి. వి సుబ్బారావు, ఎన్. చిన్నస్వామి, పెన్షనర్స్ యూనియన్ నాయకులు టి సిహెచ్ సుబ్బారావు, డాక్టర్ కంచర్ల సుబ్బారావు, పరిటాల సుబ్బారావు, వెంగళ రెడ్డి, అట్లూరి అమ్మయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.
👉15 ఏళ్ళు…ఈ లెక్కేమిటి పవన్ !

రాజకీయం అంటే ఒక చిత్రమైన ఆట. నిన్నలా నేడు ఉండదు, రేపు అంతకంటే ఉండదు. రాజకీయం అంటే ఒక చిత్రమైన ఆట. నిన్నలా నేడు ఉండదు, రేపు అంతకంటే ఉండదు. ఆ మాటకు వస్తే ఇక్కడ ఎవరూ ఎవరికీ శాశ్వత మిత్రులు అయితే ఉండరు. ఇది ఒక అందమైన పద్మవ్యూహం. ఇందులో అందరూ అభిమన్యులే ఉంటారని కాదు అలాగే అర్జునులూ ఉండాలని కూడా లేదు. ఈ రోజులలో విభేదాలకు ఎక్కడ చూసినా తావు ఉంటోంది రాజకీయాల్లో అయితే అది మరింతగా ఉంటుంది. కానీ పవన్ ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా : పవన్ ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. అదే పదిహేనేళ్ళ పాటు కూటమి కలసి ఉండాలని. అది కూడా కూటమిలో ఆయన ఒక్కరే చెబుతున్నారు. ఇదే మాట బీజేపీ అనడం లేదు, టీడీపీ అయితే అసలు అనడం లేదు. కానీ పవన్ మాత్రం మరో పదిహేనేళ్ళు కలసి ఉండాలని కూటమి ఐక్యత కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. ఇలా మళ్ళీ మళ్ళీ పవన్ చెబుతున్నది కూటమి పార్టీలకు పెద్దలకు ఏ మేరకు ఎక్కిందో తెలియదు కానీ జనసైన్యంలో మాత్రం నిరాశను పెంచేస్తోంది అని అంటున్నారు. * గ్రౌండ్ లెవెల్ లో వేరేగా : ఇక మరో మాట కూడా వినిపిస్తోంది. కూటమి ఐక్యంగా ఉండాలి. పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండాలి. మొదటిదే రాజకీయ పార్టీల మధ్య డౌట్ గా ఉంటోంది. ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో మూడు పార్టీలు పొత్తులు కలిపినా అవన్నీ కొంతకాలమే మరో అయిదేళ్ళ తరువాత మనమే అన్నది ఆ వైపూ ఈ వైపూ ఉంటుంది. అలాంటి సుదీర్ఘ కాలం అంటే గ్రౌండ్ లెవెల్ లో నిజంగా నిస్పృహతో అంతా ఉంటారు అని అంటున్నారు. పైపెచ్చు బలమున్న చోట వేరే వారిని గెలిపించి తాము చేతులు కట్టుకుని కూర్చోవడం ఎవరికీ నచ్చదు అని అంటున్నారు అందుకే గ్రౌండ్ లెవెల్ లోనే గొడవలు వస్తున్నాయని అంటున్నారు. సరే కూటమిగా ఉండాలి అంతా కలసి ముందుకు సాగాలని పవన్ చెప్పారు కదా అని అంతా కలసి ఎన్నికల్లో పోటీ చేసినా జనాలు గెలిపిస్తారు అన్న గ్యారంటీ ఉందా అన్న చర్చ కూడా ఉంది. రాజకీయాల్లో ఎపుడూ వన్ ప్లస్ వన్ రెండు కాదు అలాగే మైనస్ ప్లస్ అవవచ్చు కూడా. అలా కనుక చూసుకుంటే కలవిడిగా ఉన్నా ఒక రకమైన అభిప్రాయం జనంలో ఉండాలి. వారికి అన్నీ నచ్చాలి. వారి మూడ్ ని బట్టే తీర్పు వస్తుంది. ఇదంతా రాజకీయంగా అన్ని చోట్లా జరుగుతూ ఉన్నదే. ఉత్తరప్రదేశ్ లో చూస్తే 2022లో బీజేపీని ఓడించాలని అన్ని పార్టీలూ కూటమి కట్టినా ఓటమి తప్పలేదు. అంటే జనాలూ ఫోకస్ ఆ వైపు లేదు అన్న మాట.

