👉 ‘ఐ డోంట్ కేర్’… భారత్ పై ట్రంప్ ప్రేలాపనలు ఎందుకంటే..! అవును… భారత దిగుమతులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ పై అమెరికా విధించిన 25శాతం సుంకాల వ్యవహారం.. దేశీయ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా… రైతులు, వ్యవస్థాపకులు, ఎం.ఎస్.ఎం.ఈ లు తీవ్రంగా నష్టపోతాయని.. దుస్తుల పరిశ్రమకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ సమయంలోనే… భారత్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అవును… భారత దిగుమతులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు దేశాలను ‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు’గా ఎగతాళి చేశారు! ఇదే సమయంలో… రష్యాతో కలిసి భారతదేశం ఏమి చేసినా తనకు డోంట్ కేర్ అని నిర్మొహమాటంగా ప్రకటించారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా డోంట్ కేర్ అని మొదలుపెట్టిన ట్రంప్… వారి (భారత్ – రష్యా) ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో… తాము న్యూఢిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామని.. ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇదే సమయంలో… రష్యా, అమెరికా కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని స్పష్టం చేసిన ట్రంప్… అనంతరం రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మద్వెదేవ్ పైనా విరుచుకుపడ్డారు. తమతో వాషింగ్టన్ గేమ్ ఆడుతుందని, అది యుద్ధానికి దారితీయొచ్చని దిమిత్రి హెచ్చరించడంపై ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా… ఆయన ఇంకా అధ్యక్షుడిననే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా… రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్ తో సహా పలు ప్రపంచ దేశాలను పలుమార్లు హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు.. ఇదే కారణాన్ని చూపుతూ.. భారత దిగుమతులపై 25 శాతం సుంకంతో పాటు, పెనాల్టీలు కూడా విధించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందన్నారు. నియంతృత్వమా… మూర్ఖత్వమా..? ఉత్తరకొరియాకు కిమ్ నియంత అయితే, ప్రపంచ దేశాలకు తానే నియంత అన్నట్లుగా ట్రంప్ వ్యవహార శైలి మారిపోయిందనే చర్చ… ఆయన రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఇటీవల స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా చేసిన వ్యాఖ్యలు… ఈ సందర్భంగా మరోసారి చర్చకు వచ్చాయని అంటున్నారు.
👉సింగపూర్ మూడో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్ లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. నాలెడ్జి ఎకానమీ, సెమికండక్టర్లు, అమరావతి అభివృద్ధి, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం విషయమై ఇద్దరు నేతలతో చర్చించారు.
👉*భయం నీడలో జగన్‌రెడ్డి**నెల్లూరులో జగన్ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం*

*పోలీస్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జగన్‌పై కేసుపెట్టాలి*
అధికారం కోసం ఆరాటపడే జగన్ రెడ్డి ప్రణాళికా బద్ధంగా అనుచిత వ్యాఖ్యలకు దిగజారుతున్నారు: వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
ధ్వజం
*మద్యం కుంభకోణంలో వేలాది కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన పాత్రధారులందరూ తెరపైకొచ్చారు:మంత్రి సత్యకుమార్*
*అసలు సూత్రధారి ఎవరో వెల్లడయ్యే తరుణంలో జగన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని అర్ధం చేసుకోవాలి:మంత్రి సత్యకుమార్ యాదవ్*
*సిట్ విచారణలో ఇటీవల ఒక డెన్ లో రూ.11 కోట్ల భారీ నిధులు దొరకడంతో జగన్‌రెడ్డిలో వణుకు మొదలయ్యింది:మంత్రి సత్యకుమార్ యాదవ్*
*మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతుగా జగన్ మాట్లాడొచ్చా:మంత్రి సత్యకుమార్*
*6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు పెట్టడం తప్పా:మంత్రి సత్యకుమార్ యాదవ్*
*చంద్రబాబును హడావుడిగా అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సిఎంగా చేసిన విషయం గుర్తుకురాలేదా:మంత్రి సత్యకుమార్*
*సొంత పార్టీకి చెందిన రఘురామ కృష్ణంరాజును పోలీసులు కుళ్లబొడిచినపుడు ఆయన లోక్ సభ సభ్యులన్న సంగతి జగన్ మరిచారా*
*అప్పటి ప్రతిపక్ష నాయకులు అచ్చన్నాయుడు, కొల్లు రవీంద్రలను అక్రమ కేసులతో వేధించినపుడు వారి గతాలు స్ఫురణకు రాలేదా*
*పవన్ కళ్యాణ్ పర్యటనలను అక్రమంగా అడ్డుకొని జగన్‌రెడ్డి సిఎంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేయలేదా:మంత్రి సత్యకుమార్ యాదవ్*
*కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలను జగన్‌రెడ్డి పరమ పవిత్రులుగా వర్ణించడం ఎంతవరకు సబబు*
*దిగజారుడు వ్యాఖ్యలతో జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రమాణాలను , ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే విధానాలను మరోసారి వెల్లడించుకున్నారు*
*రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి మనుగడతో వాటిల్లే తీవ్ర నష్టాన్ని ప్రజలు నిత్యం గమనించాలి:మంత్రి సత్యకుమార్ యాదవ్*
*జగన్‌రెడ్డి ప్రణాళికాబద్ధమైన వ్యాఖ్యలు ఆయన అంతరంగాన్ని వెల్లడిస్తున్నాయి:మంత్రి సత్యకుమార్*
*మద్యం కుంభకోణంలో వాస్తవాలు వెల్లడయ్యే కొద్దీ జగన్‌లో
నెలకొన్న భయం బయటపడుతోంది*
*ఈ భయంతోనే ఆయన ప్రజల సానుభూతి కోసం నానా పాట్లు పడుతున్నారు*
*రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలనపై కూటమి ప్రభుత్వానికి అపారమైన విశ్వాసముంది*
ప్రభుత్వాన్ని , ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో జగన్‌రెడ్డి మాట్లాడడం మానుకోవాలనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 ఎమ్మెల్యే… క్యాంప్ ఆఫీస్ లోకి తన బర్లను తోలుకుని వెళ్లిన మహిళ*…ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, భూపాలపల్లి నియోజకవర్గం,జిల్లా భూపాలపల్లి..!😲😲😲 మా “బర్ల షెడ్డు” కూలగొట్టిండ్రు..షెడ్డయ్యే దాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే..కూసుంటా అప్పడిదాకా ఈ ఇంట్లనే ఉంటా..
ఎవరిని అడిగిన ఎమ్మెల్యే సారే చేసిండు అని.. చెప్తున్నారు ఎమ్మెల్యే సార్ నాకు న్యాయం చేయాలి.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది..
👉ధర్మస్థల మిస్టరీ కేసు… అడ్రస్ చెప్పి కీలక అప్ డేట్ ఇచ్చిన సిట్! కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల’ మిస్టరీ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే.

కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల’ మిస్టరీ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో ఒక చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. దీంతో… ఈ కేసులో దీన్నీ బిగ్ బ్రేక్ త్రూ గా చెబుతున్నారు. ఈ తీగతో డొంక మొత్తం కదిలే అవకాశాలున్నాయని అంటున్నారు. అవును… ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు.. ప్రభుత్వం ఏకంగా స్పెషల్ ఇన్ వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేసింది. ఎందుకంటే.. అతడు చేసిన ఆరోపణలు అంత తీవ్రమైనవి. అయితే… తాజా అప్ డేట్ లో అతడు చెప్పింది అవాస్తవం కాదని తేలింది! అతడు చూపించిన ఒక చోట అస్తిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. 4 అడుగుల లోతులోనే అవి కనిపించాయని అంటున్నారు. ఈ సమయంలో… మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 15 చోట్లను సదరు పారిశుధ్య కార్మికుడు గుర్తించగా.. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు! ఈ క్రమంలోనే అతడు చూపించిన ఆరో ప్రాంతంలో గురువారం మానవ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో… కర్ణాటక రాష్ట్రంలో, అతడు చెప్పిన కాలంలో నమోదైన మిస్సింగ్ కేసులలో కదలిక వచ్చే పలు అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో తమను సంప్రదించొచ్చని సిట్ ప్రకటించింది. 1998 నుంచి 2014 వరకు సుమారు 100 నుంచి 300 హత్యలు జరిగాయని చెబుతోన్న వేళ.. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ నివేదిక కోరారు. ఈ సమయంలో… ఈ కాలంలో మిస్సింగ్ కేసులు నమోదు చేసిన కుటుంబ సభ్యులు.. సిట్ అధికారులను నేరుగా కానీ, ఫోన్ లో కానీ సంప్రదించొచ్చని చెబుతున్నారు. తద్వారా కేసు పురోగతికి హెల్ప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు! ధర్మస్థల సామూహిక ఖననం కేసు దర్యాప్తుకు సంబంధించి మంగళూరులోని మల్లికట్టెలోని ఐబీలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయబడిందని సిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా సిట్ ను కలవాలనుకునే వారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య కార్యాలయాన్ని సందర్శించవచ్చని తెలిపింది. ప్రజలు 0824 – 2005301, 8277986369 నంబర్లకు డయల్ చేయవచ్చని తెలిపింది. కాగా… ఆలయంలో 1998 నుంచి 2014 మధ్య పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఓ భయంకరమైన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తానే స్వయంగా ఖననం చేశానని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, యువతులతో పాటు మైనర్ బాలికలు ఉన్నారంటూ చేసిన ఆరోపణలతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది!
👉 రాహుల్ మాట నిలబెట్టుకోవాలి.. సుప్రీం తీర్పుపై కేటీఆర్ రియాక్షన్ రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తాను చెప్పిన నీతులకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. చట్ట విరుద్ధంగా 10 మంది పార్టీ మారారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదన్నారు. 
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలు లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలు లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తున్నట్లు చెప్పిన కేటీఆర్.. రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో మరో మూడు నెలల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయని సిద్ధంగా ఉండాలని కేడర్ కు పిలుపునిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ ఖుషీగా ఉంది. తమ పోరాటం ఫలించిందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ప్రయత్నాలు వేగవంతం చేసింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పిన బీఆర్ఎస్ నేత కేటీఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో చెప్పిన మాటపై నిలబడాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్ గా అనర్హత వర్తించాలని రాహుల్ గాంధీ చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తాను చెప్పిన నీతులకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. చట్ట విరుద్ధంగా 10 మంది పార్టీ మారారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదన్నారు. పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రానున్నాయని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పునిచ్చిన సుప్రీం సీజేఐకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, సుప్రీం తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ ను ఏకంగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది. సుప్రీం తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోందని అంటున్నారు. అయితే స్పీకర్ కు గడువు విధించడం, మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సుప్రీం తీర్పు అమలుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా ఆయన న్యాయ నిపుణులను సంప్రదించినట్లు చెబుతున్నారు.
👉👉👉మూడు నెలలలోగానా : సుప్రీంకోర్టు మూడు నెలలలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి సూచించింది. స్పీకర్ ఆఫీస్ దీని మీద అధ్యయనం చేస్తుంది అని అంటున్నారు. తెలంగాణా స్పీకర్ అయితే తీర్పు మీద స్పందిస్తూ తాను ఇంకా పూర్తిగా చదవలేదని న్యాయ నిపుణులతో మాట్లాడి ఏమి చేయాలో చూస్తామని అన్నారు మూడు నెలల గడువు అంటే స్పీకర్ పిలిచి అనర్హత ఉన్న ఎమ్మెల్యేల మీద వేటు వేస్తారా అది సాధ్యపడుతుందా అన్న చర్చ వస్తోంది. స్పీకర్ కే అధికారం : రాజ్యాంగం ప్రకారం చూస్తే స్పీకర్ కే ఈ విషయంలో అధికారం ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేల మీద వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి వారు కాంగ్రెస్ లోకి వచ్చి ఈ విధంగా ఉప ఎన్నికలు ఎదుర్కోవడం అంటే అది పార్టీకి కూడా ఇబ్బంది. ఇక ఉప ఎన్నికలే వస్తే బీఆర్ఎస్ కే అడ్వాంటేజ్ గా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే వారు జనంలోకి వెళ్ళి ప్రచారం చేస్తారు. తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు అని కాబట్టి వారిని ఓడించమని కూడా పిలుపు ఇస్తారు. రాజకీయంగా చూడాల్సిందే : అదే సమయంలో ఏణ్ణర్ధం దాటి రెండవ ఏడాదిఓకి రేవంత్ రెడ్డి పాలన ప్రవేశిస్తోంది. దాంతో యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. కాంగ్రెస్ అంతా ఏకమొత్తంగా పైచేయాల్సి ఉంటుంది. ఒకటీ రెండూ కాదు పది అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు అంటే మినీ సార్వత్రిక ఎన్నికలే. పైగా అన్ని సీట్లూ గెలిస్తే ఓకే లేకపోతే కాంగ్రెస్ కి ఇబ్బంది. దాంతో కాంగ్రెస్ అయితే ఉప ఎన్నికలు కోరుకోదు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి స్పీకర్ అయిన వారు వీరి విషయంలో అనర్హత వేటు వంటి సీరియస్ డెసిషన్ తీసుకుంటారా లేక మరోసారి నోటీసులు విచారణలు అని మూడు నెలలూ గడిపేస్తారా అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. సుప్రీం కోర్టు సూచించడమే కానీ స్పీకర్ విషయంలో వేరే విధంగా చేయలేదని స్పీకర్ చెయిర్ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కావడమే అందుకు కారణం అంటున్నారు. మొత్తానికి చూస్తే అనర్హత వేటు ఆ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద పడుతుందా లేదా అన్నది అయితే చూడాలి ఉంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైన మౌలికమైన విషయంగా మారిపోయింది కాబట్టి.
👉ఉపఎన్నికలు ఖాయం, సిద్దంగా ఉండండి..!!🌟🌟🌟
ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారుతోంది. అనర్హత పిటీషన్ ల పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
అనర్హత పిటీషన్ల పైన సుదీర్ఘ విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెలువరించారు. ఈ తీర్పు పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఓ చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సీజేఐకి ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు.
👉 లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన ఆత్మకూరు ఆర్డీవో ఆపిస్ సీనియర్ అసిస్టెంట్ రమేష్..నంద్యాల జిల్లా
ఆత్మకూరు ఆర్డీవో ఆఫీసులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ ఆర్ రమేష్ జూపాడు బంగ్లా కు చెందిన ఈశ్వరయ్య అనే రైతు వద్ద నుండి రూ..40,000/- వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..రమేష్ తో పాటు ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతిని విచారిస్తున్న అదికారులు
👉కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ఎమ్మెల్యే పీఏ.. కోర్టులో హాజరు..
తాను ఎలాంటి తప్పు చేయలేదు, తన మీద అనవసరంగా నిందలు మోపుతున్నారు అంటూ గతంలో బుకాయించిన మునుగోడు ఎమ్మెల్యే పీఏ దేవిరెడ్డి సతీష్ రెడ్డి అలియాస్ సదాశివ రెడ్డి**కోట్ల రూపాయలు మోసపోయిన బాధితులు వేసిన కేసులో భాగంగా కోర్టుకు హాజరైన నిందితుడు సతీష్ రెడ్డి..ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టు కేసులో ఎందుకు హాజరు అవుతున్నారు అనేది సదరు పీఏ గారే చెప్పాలి
👉 **డిజిటల్ చెల్లింపులు చెల్లవు..గుడివాడ ప్రముఖ ఎముకల ఆసుపత్రిలో … దాస్తికం ..
వీడియోస్ తీస్తే సహించాము, పిచ్చి వేషాలు వేయకండి.. ఇదేమి ధర్మ సత్రం కాదు…
రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తి కి వైద్యం చేసేందుకు నిరాకరణ..500 నగదు చెల్లిస్తే వైద్యం..
డిజిటల్ ప్రెమెంట్స్ కి అనుమతి లేదని ఆసుపత్రి సిబ్బంది..
తీవ్ర రక్త స్రవంలో బాధితుడు ఆసుపత్రిలో..
👉మా వార్తలు రాస్తే చెట్టుకు కట్టేసి కొడతాం…*
*ప్రభుత్వం కార్యాలయంలో అధికారుల సాక్షిగా విలేకరుల అంతు చూస్తాం అంటూ వీరంగం*
*విలేకరులపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల జులుం*
*ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పోలీస్ స్టేషనులో ఫిర్యాదు* శ్రీసత్యసాయిజిల్లా :
నంబులపూలకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్దకు వార్త సేకరణకు వెళ్లిన విలేకరుల పట్ల ఇరువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసభ్యకర పదజాలంతో దూషించారు. వివరాలలోకి వెళితే గురువారం మండల కేంద్రంలోని నల్లగంగమ్మ గుడి వద్ద అక్రమంగా ఫ్లాట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈటే నాగరాజు, నూర్ @ కాంత రానాలను మండల పరిషత్ కార్యాలయానికి రావాలని ఎంపీడీవో, తహసీల్దార్, డిప్యూటీ ఎంపీడీవోలు పిలిపించారు. కాగా అప్పటికే అక్కడ ఉన్న విలేకరులను చూసి దూషణలకు దిగారు. మా వార్తలు రాస్తే చెట్టుకు కట్టేసి కొట్టి మీ అంతు చూస్తాం అంటూ వీరంగం సృష్టించారు. అనంతరం మండల ఏపీయూడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో విలేకరులపై దుర్బాషలాడిన ఇరువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సై వలీబాషా కు ఫిర్యాదు చేశారు.
** కర్నూలు ACB అధికారుల దాడులు..
పొలం విషయంలో 40,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ ఆర్ రమేష్
నంద్యాల జిల్లా.. ఆత్మకూరు ఆర్డీవో ఆఫీసులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ ఆర్ రమేష్ .. పొలం విషయంలో జూపాడు బంగ్లా కు చెందిన ఈశ్వరయ్య అనే రైతు వద్ద నుండి రూ..40,000/- వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులకు..
పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ ఆర్ రమేష్ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు..ఈ దాడుల్లో కర్నూలు ACB DSP సోమన్న ,సిఐ కృష్ణయ్య ,ఎస్సై సుబ్బరాయుడు , తమ సిబ్బంది పాల్గొన్నారు.
👉 ‘ఐ డోంట్ కేర్’… భారత్ పై ట్రంప్ ప్రేలాపనలు ఎందుకంటే..👉*భయం నీడలో జగన్‌రెడ్డి*…*నెల్లూరులో జగన్ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం*… 👉ధర్మస్థల మిస్టరీ కేసు… అడ్రస్ చెప్పి కీలక అప్ డేట్ ఇచ్చిన సిట్!..👉 రాహుల్ మాట నిలబెట్టుకోవాలి.. సుప్రీం తీర్పుపై కేటీఆర్ రియాక్షన్..👉 లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన ఆత్మకూరు RDO ఆపిస్ సీనియర్ అసిస్టెంట్ రమేష్..👉 డిజిటల్ చెల్లింపులు చెల్లవు..గుడివాడ ప్రముఖ ఎముకల ఆసుపత్రిలో … దాస్తికం .👉మా వార్తలు రాస్తే చెట్టుకు కట్టేసి కొడతాం: శ్రీ సత్య సాయి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల బెదిరింపులు
Recent Posts

