👉మోడీ సర్.. సమాధానం చెప్పాల్సింది ప్రజలకే! వరుస విజయాలు.. వరుసగా మూడోసారి ప్రధాని.. సుదీర్ఘ కాల రాజకీయ పార్టీ కాంగ్రెస్ రికార్డులను కూడా తోసిపుచ్చిన నాయకుడుగా ప్రధాని మోడీ పేరు జగద్వితం కావొచ్చు. “వరుస విజయాలు.. వరుసగా మూడోసారి ప్రధాని.. సుదీర్ఘ కాల రాజకీయ పార్టీ కాంగ్రెస్ రికార్డులను కూడా తోసిపుచ్చిన నాయకుడుగా ప్రధాని మోడీ పేరు జగద్వితం కావొచ్చు. ఆయన `విశ్వగురు`గా పేరు తెచ్చు కుని ఉండొచ్చు. కానీ.. ఇదంతా ప్రజల చేత.. ప్రజల వలన.. వచ్చిన గౌరవమే. వారిని మరిచి.. ఏకపక్షంగా వ్యవహరిస్తే.. అది మొదలుకే మోసం తెచ్చుకున్నట్టు అవుతుంది.“ ఇదీ.. బుధవారం నాటి జాతీయ మీడియాలో వచ్చిన అనేక ఎడిటోరియల్స్‌లోని సారాంశం. . దీనికి కారణం.. పార్లమెంటును బుల్డోజ్ చేయడమే. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్తావరాలపైనా.. ఉగ్రవాదులపైనా మే 7వ తేదీ చేపట్టిన `ఆపరేషన్ సిందూర్`పై అనేక అనుమానాలు పెల్లుబికాయి. ఇవి కేవలం కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలకు తలెత్తిన సందేహాలే కాదు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ వాదులకు, సంఘ్ పెద్దలకు కూడా తలెత్తిన సందేహాలు కూడా!. ఆపరేషన్ సిందూర్ ద్వారా.. పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసి.. చివరకు పీవోకే కూడా స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చిందని సంబర పడిన.. సమయంలో అనూహ్యంగా దీనిని నిలిపివేశారు. ఇదే అతి పెద్ద ప్రశ్న అయితే.. దీనికి అనుబంధంగా అనేక ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. వీటినే పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తాయి. కానీ, ఎప్పటిలానే.. మోడీఈ ప్రశ్నలను దాట వేశారు. 1960లలో చైనా యుద్ధంలో మీరు ఏం చేశారంటూ.. ప్రశ్నించారు. ముంబై ఉగ్రవాద దాడులకు ఎవరు బాధ్యత వహించారని ఆయన నిలదీశారు.అయితే.. ప్రశ్నకు ప్రశ్న ఎప్పటికీ సమాధానం కాదన్నది వాస్తవం. కాంగ్రెస్ వ్యవహరించిన.. రాజకీయాలే ఆ పార్టీని పుట్టిముంచాయి.

👉అసలు ట్రంప్ పేరు ఎత్తేందుకు కూడా మోడీ భయపడుతున్నారా?… ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంటు ఉభయ సభల్లోనూ.. 16 గంటల చొప్పున ప్రభుత్వం కేటాయించి.. చర్చ చేపట్టింది. `ఆపరేషన్ సిందూర్`పై పార్లమెంటు ఉభయ సభల్లోనూ.. 16 గంటల చొప్పున ప్రభుత్వం కేటాయించి.. చర్చ చేపట్టింది. సోమవారం, మంగళవారం లోక్‌సభలోను, మంగళవారం, బుధవారం.. రాజ్యసభలోనూ ఈ చర్చ నడిచింది. మంగళవారం లోక్‌సభలో ప్రధానినరేంద్ర మోడీ దాదాపు 2 గంటల 15 నిమిషాలకు పైగా నే సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇక, బుధవారం కూడా ఆయన రాజ్యసభలో దీనిపై ప్రసంగించనున్నారు. అయితే.. మంగళవారం నాడు ప్రధాని చేసిన ప్రకటనపై విపక్షాలు బుధవారం కూడా ఆందోళనను కొనసాగించాయి. బుధవారం ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని ప్రసంగాన్ని తప్పుబడుతూ.. ఆయన ప్రజలను, దేశాన్ని కూడా ఏమార్చారని నినాదాలతో హోరెత్తించారు. విపక్షాలు.. అడిగిన ఏ ప్రశ్నకూ సూటిగా ప్రధాని సమాధానం చెప్పలేక పోయారని.. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ఇక, లోక్‌సభలోనూ.. ఇదే తంతు నడిచింది. సభ 11 గంటల కు ప్రారంభమయ్యాక.. ఇరు సభల్లోనూ ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. అయితే.. స్పీకర్ ఓంబిర్లా.. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీనికి విపక్ష సభ్యులు అడుగడుగునా అడ్డు పడ్డారు. ప్రధాని మోడీకి చిత్తశుద్ధి లేదని.. సైనిక బలగాలను చెప్పుచేతల్లో పెట్టుకుని దేశ భద్రతను పణంగా పెడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్(బెంగాల్ అధికార పార్టీ) సభ్యులు నిప్పులు చెరిగారు. అసలు ఆపరేషన్ సిందూర్ తానే ఆపేశానని ట్రంప్ చేసిన ప్రకటనలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ప్రశ్నించారు. అంతేకాదు.. అసలు ట్రంప్ పేరు ఎత్తేందుకు కూడా మోడీ భయపడుతున్నారా? అని నిలదీశారు.
👉బెంగళూరులో మహిళా అలఖైదా టెర్రర్ అరెస్టు !!!
బెంగళూర్ అల్ ఖైదా టెర్రరిస్టును పోలీసులు అరెస్టు చేశారు. AQIS టెర్రర్ మాడ్యుల్ మాస్టర్మైండ్ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకుంది. 30ఏళ్ల షామా పర్వీన్..అల్ ఖైదా ఉగ్రవాద మాడ్యూల్ లో కీలక కుట్రదారుగా ఉందని,కర్ణాటక నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు.

👉లిక్కర్ స్కాంలో ఇక సంచలనాత్మక అరెస్టులు ?
లిక్కర్ స్కాంలో సంచలనాత్మక అరెస్టులకు సమయం దగ్గర పడిందని సిట్ సంకేతాలు పంపుతోంది. ఇంత కాలం దుబాయ్ లో దాక్కున్న వ్యక్తిని రప్పించి.. ఎయిర్ పోర్టులో అరెస్టు చేసింది. వెంటనే డబ్బులు ఎక్కడ దాచి పెట్టారో కనుక్కుని శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ నుంచి రూ.11 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఇంకా పదకొండు మంది దుబాయ్, థాయ్ ల్యాండ్ నుంచి రావాల్సి ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయకముందే వస్తే బెదరని ఆయా నిందితులకు సంకేతాలు పంపుతున్నారు.
ఎయిర్ పోర్టులో వరుణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి.. విజయవాడ తరలిస్తున్నారు. వరుణ్ దగ్గర చాలా సమాచారం ఉంది. ఆధారాలను కూడా తీసుకు వచ్చారు. కీలక నేతలు.. వైసీపీ ముఖ్యులు ఈ లిక్కర్ స్కాంలో ఎలా ప్రధాన పాత్ర పోషించారో ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. వాటికి మరింత సపోర్టు ఇచ్చే ఆధారాలు వరుణ్ ఇచ్చిన సమాచారంతో వెలుగులోకి వచ్చాయి.
అంతిమ లబ్దిదారులు ఎవరు.. డిస్టిలరీస్ డబ్బులు ఎవరికి చేర్చాయి అన్నదానిపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకూ మీడియాకు తెలిసింది కొంతేనని అసలు బయటపడిన విషయాలు మైండ్ బ్లాంక్ చేస్తాయని అంటున్నారు. అందుకే సిట్ అధికారుల నుంచి.. సంచలనాత్మక అరెస్టులకు సమయం అయిందన్న సంకేతాలు వస్తున్నాయంటున్నారు. మరికొన్ని డెన్స్ లో సోదాలు నిర్వహించి.. మరింత నగదు స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
👉 కాంగ్రెస్ పాలనలో..గురుకుల విద్యార్థుల గోస😲😲😲
తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించి, నిర్బంధించిన దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్
నిన్నటి వరకు ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను నిర్బంధించిన కాంగ్రెస్ సర్కార్..
నేడు తాగడానికి నీళ్ళు లేక, పురుగుల అన్నం తినలేక తమ సమస్యలు పరిష్కరించాలని అలంపూర్ చౌరస్తా నుంచి జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ కు పాదయాత్రగా వెళ్లిన విద్యార్థులను సైతం నిర్బంధించిన నీచ కాంగ్రెస్ ప్రభుత్వం…
👉ఇంటర్ విద్యార్థిని మృతి..విద్యార్థి సంఘాల ఆందోళన😲
తెలంగాణ : మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొత్తపల్లి సహస్ర అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కాలేజీ యాజమాన్యం వల్లే సహస్ర చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మిమ్స్ కాలేజీ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
👉 “బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు*
*మార్కాపురం టౌన్ స్థానిక వైయస్సార్సీపీ కార్యాలయం నందు తర్లుపాడు మండలానికి సంబంధించిన “బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ” కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రతి ఇంటికీ వెళ్లి తెలియజేయాలి అని చంద్రబాబు మేనిఫెస్టో రీసైక్లింగ్ కార్యక్రమన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అని కోరిన గిద్దలూరు మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు.. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*
👉 కoభం మండలం లోని చిన్న కంభం గ్రామంలో తేది 30.07.2025 న జిల్లా వనరుల కేంద్రం ఒంగోలు సహాయ వ్యవసాయ సంచాలకులు కె రామ్మోహన్ రావు ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 2025 క్రింద ఖరీఫ్ సీజన్ నందు సాగు చేసే పంటలలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణా కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాదికారి మహమ్మద్ వ్యవసాయ శాఖ నందు అమలులో ఉన్న పధకాలు, విత్తనాలు మొదలైన అంశాల గురించి వివరించారు.
జిల్లా వనరుల కేంద్రం ఎ డి ఎ వరి, కంది,మినుము, ప్రత్తి పంటలలో విత్తనం వేసే దగ్గర నుండి పంట కొత్త వరకు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, నానో ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరించారు. వేపగింజల కషాయం తయారు చేయు విధానం, ఉపయోగాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో వి. ఎ. ఎ. ప్రతాప్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.
👉జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన పంచాయతీరాజ్ ఎఈఈ అనీల్*
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…
23 లక్షల బిల్లు కోసం 18 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్…
కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంతో 10 వేల రూపాయలకు ఒప్పందం…మొదటగా 3 వేల రూపాయలు తీసుకున్న ఏ ఈ ఈ…మిగతా 7 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన అనిల్ కుమార్..
👉రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ కు వినతి పత్రం
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిన్న గుడిపాడు గ్రామంలో హైవే రోడ్డుకు ఇరువైపులా బార్కెట్లు లేనందున దాదాపు 20 గేదెలు చనిపోయాయి మరియు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ గ్రామస్తులకు ఇరువైపులా భూములు ఉండడంవల్ల అటు నుండి ఇటువైపుకు ఇటు నుండి అటువైపుకు వెళ్ళవలసి వస్తుంది కావున డ్రైనేజీ విలేజ్ రోడ్ బార్కెట్లు వీధి దీపాలు వేయాలని మరియు అదేవిధంగా చిన్నగుడుపాడు చెరువుకు నీళ్లు రాకుండా ఇందుకు ముఖ్య కారణం దోర్నాలకు పడమర వైపు వెలుగొండ మేజర్ కాలువ తీయడమైనది ఆ కాలువ చిన్న గుడిపాడు చెరువుకు నీళ్లు వచ్చే నల్లవాగును కట్ చేస్తూ వాగుకు అడవి నుంచి వచ్చే నీరు వెలుగొండ పెద్ద కాలవలో పడిపోతున్నవి చిన్నగుడిపాడు గ్రామస్తులమైన మేము వెలుగొండ ప్రాజెక్ట్ లను సంప్రదించి మేజర్ కాలువ మీద ఒక వంతెన ఉన్నది దానిని కొంచెం ఎత్తు తగ్గించి ఆ పైనుంచి వచ్చే వాటర్ మొత్తాన్ని ఆ వంతెన ద్వారా నల్లవా కాలువకు వచ్చి చెరువులోకి వచ్చేలాగా చూడాలని అర్జీలు సమర్పించాము
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.. జిల్లా సహాయ కార్యదర్శి…దుగ్గెంపూడి తిరపతి రెడ్డి మరియు చిన్న గుడిపాడు గ్రామ ప్రజలు రైతులు..
👉మోడీ సర్.. సమాధానం చెప్పాల్సింది ప్రజలకే!….👉అసలు ట్రంప్ పేరు ఎత్తేందుకు కూడా మోడీ భయపడుతున్నారా?… 👉బెంగళూరులో మహిళా అలఖైదా టెర్రర్ అరెస్టు..**లిక్కర్ స్కాంలో ఇక సంచలనాత్మక అరెస్టులు ?..👉రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి కి వినతి పత్రం..(ప్రకాశం జిల్లా గుడిపాడు రైతులు ప్రజలు)..👉 “బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు..మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణా కార్యక్రమం ..👉 కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యార్థుల గోస..👉జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన పంచాయతీరాజ్ ఎఈఈ అనిల్..👉ఇంటర్ విద్యార్థిని మృతి..విద్యార్థి సంఘాల ఆందోళన😲
Recent Posts

