👉మోడీకి మంట పెడుతున్న‌ ట్రంప్ సెల్ఫ్ గోల్‌!… ప్రకాశం జిల్లాలోని కంభం గిద్దలూరులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన..*సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు* *గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*…*మద్యం సేవించడం వల్ల మీ కాలేయం దెబ్బతినడమే కాకుండా, 7 రకాల ప్రాణాంతక క్యాన్సర్‌లకు కూడా కారణమవుతుందా!!!…*షూటింగ్స్ లో నాన్ వెజ్ భోజనాలు స్టార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా!!!…

👉మోడీకి మంట పెడుతున్న‌ ట్రంప్ సెల్ఫ్ గోల్‌! అయితే.. ఈ కీల‌క స‌మ‌యంలో ట్రంప్ అధికార పక్షాన్ని ఇర‌కాటంలో ప‌డేసేలా.. ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రిన్ని ఆయుధాలు ఇచ్చేలా వ్యాఖ్యానించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి.. అమెరికా అధ్య‌క్షుడు మిత్రుడు. ఇద్ద‌రూ కూడా అనేక సంద‌ర్భాల్లో ఈ మాట చెప్పుకొచ్చారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ కూడా.. ట్రంప్ విజ‌యం ద‌క్కించుకో వాల‌ని కోరుకున్న‌ట్టు భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ కూడా ప‌లు సంద‌ర్బాల్లో వ్యాఖ్యానించారు. అయితే.. మోడీకి ఇప్పుడు ఆ మిత్రుడే కంట్లో న‌లుసుగా మారారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌మావేశాల్లో.. `ఆప‌రేష‌న్ సిందూర్‌` పై 16 గంట‌ల సుదీర్ఘ చ‌ర్చ సాగుతోంది సోమ‌వారం లోక్‌స‌భ‌లో ప్రారంభ‌మైన ఈ చ‌ర్చ‌.. వాయిదాల ప‌ర్వంతో ముందుకు సాగుతోంది. మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో ఆప‌రేష‌న్ సిందూర్‌.. అనంత‌ర ప‌రిణామాల‌పై చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. ఈ స‌భ‌లో కూడా 16 గంట‌ల పాటు చ‌ర్చ సాగ‌నుంది. అయితే.. ఈ కీల‌క స‌మ‌యంలో ట్రంప్ అధికార పక్షాన్ని ఇర‌కాటంలో ప‌డేసేలా.. ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రిన్ని ఆయుధాలు ఇచ్చేలా వ్యాఖ్యానించారు. తానే లేక పోతే.. పాకిస్థాన్‌-భార‌త్ మ‌ధ్య ఇప్ప‌టికీ యుద్ధం జ‌రుగుతూనే ఉండేద‌ని.. తానే ఇద్ద‌రినీ నిలువ‌రించాన‌ని.. చెప్పారు. అంతేకాదు.. వాణిజ్య ఒప్పందాలు పునః స‌మీక్షించ‌డంతోపాటు.. సుంకాలు మ‌రింత బాదుతాన‌ని చెప్ప‌డంతోనే ఇరు దేశాలు వెన‌క్కి త‌గ్గాయ‌న్నారు. ఇప్పుడు కొత్త‌గా చేయ‌క‌పోయినా.. గ‌త నుంచి కూడా ట్రంప్ ఇదే చెబుతున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ కు సంబంధించి కాల్పుల విర‌మ‌ణ‌ను భార‌త్-పాక్ ప్ర‌క‌టించ‌డానికి ముందే.. ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇది పెను దుమారంగా మారింది. అందుకే.. మోడీ స‌ర్కారుపై విపక్షాలు దుమ్మెత్తిపోసి.. చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. ఇప్పుడు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు కూడా.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 16 గంట‌ల చొప్పున కేటాయించి.. చ‌ర్చ చేప‌ట్టాయి. ఇలాంటి కీల‌క స‌మ‌యంలోనూ.. ట్రంప్ మ‌రోసారి ఈ వాద‌న వినిపించ‌డంతో ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రిన్ని ఆయుధాలు ఇచ్చిన‌ట్టు అయింది.
ప్రకాశం జిల్లా కంభంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన

విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి గురుకుల పాఠశాలల్లో, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చుచేస్తుందని, పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కంభం మండలం, కందులాపురంలో గల డా. బి ఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా ముట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వసతి గృహంలో నీటి సమస్య ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ ఓ వాటర్ నిర్వహణ రూమ్ ను, డార్మెటరీ, టాయిలెట్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు బాలికలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా, శుభ్రం చేసే ప్రదేశాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా, లేదా, వాటి నిర్వహణ, ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న వేళలు, నిర్వాహకుల పనితీరు తదితర అంశాలలో బాలికలను, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను కచితంగా అమలు చేయాలని, అలాగే నాణ్యతతో భోజనం విద్యార్ధులకు అందించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రత పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డ్వామా పిడి జోసెఫ్ కుమార్,తహసిల్దార్ కిరణ్, విద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
పి-4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్) కార్యక్రమం పై అధికారులకు, గ్రామసచివాలయ సిబ్బందికి మార్గదర్శకులకు,అవగాహన కల్పించేందుకు గిద్దలూరు లోని శ్రీ సీతా రామ కల్యాణ మండలంలో ఏర్పాటు చేసిన గిద్దలూరు నియోజక వర్గం అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, స్థానిక శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ పీ 4 కార్యక్రమం లక్ష్యం
సమాజంలో ఎవరైతే బాగా ఆర్థికంగా బలంగా ఎదిగారో, వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకు సహాయం అందిస్తే అసమానతలు తొలగుతాయి, సమాజంలో సమానత్వం నెలకుంటుంది. ప్రతి ఒక్కరూ వెల్తీ, హెల్దీ, హ్యాపీ ల పౌరులుగా జీవించగలుగుతారు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా, సామర్థ్యం ఉన్నవారిని మార్గదర్శకులుగా గుర్తించి నమోదు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 74,911 బంగారు కుటుంబాలను గుర్తించగా, ఇప్పటి వరకు 34 వేల బంగారు కుటుంబాలను దత్తతు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ పథకం పూర్తిగా వాలంటరీ, అంటే స్వచ్ఛందమే, ఎవరూ ఎవరినీ బలవంతంగా ఇందులో చేర్చడం లేదని తెలిపారు. అలాగే పీ4 పథకంలో పాల్గొంటున్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది కూడా దీన్ని స్వచ్ఛంద కార్యక్రమంగానే చూడాలని ఎటువంటి బలవంతం లేకుండా పని చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రాపర్ గా నీడ్ అసెస్మెంట్ సర్వే పక్కాగా చేపట్టడంతో పాటు ఈ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలను చేపట్టి మార్గదర్శకులను గుర్తించి బంగారు కుటుంబాలతో అనుసంధానం చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన సంవత్సర కాలంగా ప్రధాన మంత్రి సహకారంతో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు.కేవలం సంక్షేమం, అభివృద్ధి చేసినంత మాత్రానా సమాజం ముందుకు పోదని, పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజమే ఏర్పడినప్పుడే రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సమాజంలో ఆర్థికం వృద్ధి చెందిన వ్యక్తులు, సామాజిక పరంగా అట్టడుగు స్థానంలో ఉన్న కుటుంబాలను గుర్తించి సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాలను వృద్ధిలోకి తేవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ నియోజక వర్గం వెనుకబడిన ప్రాంతమైనప్పటికినీ, ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటున్నారు. నియోజక వర్గంలో 10,879 బంగారు కుటుంబాలను గుర్తించగా, ఇప్పటివరకు 5,868 కుటుంబాలను దత్తతు తీసుకోవడం జరిగిందని, ఇంకా 5,011 కుటుంబాలను దత్తతు తీసుకోవాల్సి ఉందన్నారు. నియోజక వర్గంలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తతు తీసుకోవడంలో మరియు మార్గదర్శకులను గుర్తించడంలో తన వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు.
తొలుత జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి పి 4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని వివరించగా, పలువురు మార్గదర్శకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ శ్రీ వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్య, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, ఎస్డిసి సీతారామిరెడ్డి, ఐ సి డి ఎస్ పిడి సువర్ణ లత, నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన మండల అధికారులు, సచివాలయం సిబ్బంది,ఎంపిక చేసిన మార్గదర్శకులు తదితరులు పాల్గొన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, గిద్దలూరు లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనం ను సందర్శించి మౌలిక సదుపాయాలు, వసతులను పరిశీలించి, వివరాలను అడిగితెలుసుకున్నారు. ఈ భవనం చాలా పాతబడి పోయిందని, మరమత్తులు లేదా కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని బాల సదనం అధికారులు,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్,ఐసిడిఎస్ పిడి సువర్ణ,బాలసదనం అధికారి ఝాన్సీ,తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
👉ఇచ్చిన హామీలు నెరవేర్చటం కూటమి ప్రభుత్వ లక్ష్యం.*
*సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు*
*గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల అమలుతో అన్నీ వర్గాల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఏడాది పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని మహిళలకు, ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణి చేశారు.. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నవ రత్నాల పేరుతో ప్రజల నడ్డి విరిచాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుంటే, కళ్ళు ఉండి చూడలేని వైసీపీ పాలకులు విమర్శించటం సిగ్గు చేటు అన్నారు. గత ఐదేళ్ళ పాలనా కాలమంతా బటన్ నొక్కటం తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం పథకాలను అమలు చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు..*
* కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కడియం శేషగిరి గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, AMC వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మన్లు దుత్తా బాల ఈశ్వరయ్య, ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, డైరెక్టర్లు వినుకొండ చిన్న, బాదుల్ల, కో ఆప్షన్ మెంబర్ పఠాన్ సయ్యద్ ఖాన్, శీలం కృష్ణమూర్తి, సయ్యద్ బాషా, మండ్ల రంగనాయకులు, ఆరిగేల వీరనారాయణ, సూరె మహేష్, అశోక్ నాయక్, రెక్కల లక్ష్మి నారాయణ రెడ్డి,బత్తుల శ్రీను, కొమ్మునూరు సర్పంచ్ కర్ణాటి రామసుబ్బారెడ్డి, పసుపుల మల్లీశ్వరయ్య,మండల నాయకులు నంది శ్రీను, చెన్నబోయిన రామకృష్ణ,దప్పిలి శ్రీనివాసరెడ్డి,నారాయణ రెడ్డి, మంద రంగస్వామి,ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.
🌟🌟🌟👉*మద్యం తాగితే 7 ప్రమాదక క్యాన్సర్లు.. ఎయిమ్స్‌ అధ్యయనంతో షాకింగ్‌ నిజాలు*
👉 మద్యం తాగడం ఎంజాయ్‌ అనిపించవచ్చు….
కానీ దాని వెనుక ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలియదు. ఈ మద్యం తాగడం అరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే మీరే షాకవుతారు.
*AIIMS వైద్యుల అధ్యయనం ఒక షాకింగ్ నిజం బయటపడింది.*
మద్యం సేవించడం వల్ల మీ కాలేయం దెబ్బతినడమే కాకుండా, 7 రకాల ప్రాణాంతక క్యాన్సర్‌లకు కూడా కారణమవుతుంది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS) నిర్వహించిన అధ్యయనంలో ఏడు రకాల క్యాన్సర్‌లకు మద్యం సేవించడం ప్రధాన కారణమని వెల్లడైంది. దీనిపై క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ అభిషేక్ శంకర్ మాట్లాడుతూ.. మద్యం సీసాలపై రాసిన హెచ్చరికలను ప్రజలు విస్మరిస్తున్నారని, దాని పరిణామాలు తీవ్రమైన వ్యాధుల రూపంలో అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నిజానికి నేటి సమాజంలో మద్యం సేవించడం ఒక సాధారణ అలవాటుగా మారుతోంది. కొన్నిసార్లు పార్టీలో, కొన్నిసార్లు ఒత్తిడి పేరుతో, కొన్నిసార్లు స్నేహితులతో సరదాగా గడిపే పేరుతో, మద్యం తాగడం ఎక్కువైపోతుంటుంది. కానీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటున్నారు.
*7 రకాల క్యాన్సర్లు ఏమిటి?*
* పెద్దప్రేగు క్యాన్సర్ (మల క్యాన్సర్)
* కాలేయ క్యాన్సర్
* రొమ్ము క్యాన్సర్
* అన్నవాహిక క్యాన్సర్
* స్వరపేటిక క్యాన్సర్
* ఫారింక్స్ క్యాన్సర్ (గొంతు క్యాన్సర్)
* నోటి క్యాన్సర్
*ఎవరికి అది సమస్య కావచ్చు?*
క్రమం తప్పకుండా మద్యం సేవించే వ్యక్తులు..
మద్యపానం చేసేవారికి ప్రమాదకరం..మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ..
జీవనశైలిలో వ్యాయామం, పోషకమైన ఆహారం, నిద్ర లేని వారు..
*నివారణే ఉత్తమ పరిష్కారం:*
మీరు క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే మద్యానికి దూరంగా ఉండటమే ఏకైక సురక్షితమైన మార్గం.
మద్యం మానేయడం మాత్రమే సరిపోదు. దానితో పాటు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కాలానుగుణ ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం.
మద్యం తాగడం అనేది కేవలం ఒక అలవాటు కాదు. శరీరాన్ని లోపలి నుండి బయటకు నెట్టే ఒక విషం. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ చేసిన ఈ అధ్యయనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇంకా ఉందని హెచ్చరిస్తోంది. ఈ రోజు మన అలవాట్లను మార్చుకోకపోతే రేపు మనం పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది.
(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన సలహాలు, సూచనల, అలాగే అధ్యయనాలలో వెలువడిన సమాచారం ప్రకారం అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
👉🌟🌟🌟షూటింగ్స్ లో నాన్ వెజ్ భోజనాలు స్టార్ట్ చేసిన కృష్ణ.
ఈక్రమంలో మూవీ టీమ్స్ కు షూటింగ్ టైమ్ లో వెజిటేరియన్ భోజనాలు పెట్టడమే కష్టంగా భావించే టైమ్ లో, ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారి షూటింగ్స్ లో మాంసాహారభోజనం రుచి చూపించాడు ఓ స్టార్ హీరో. హీరోగా ఎన్ని సినిమాలు చేసినా.. నిర్మాతగా ఆయన అడుగు పెట్టగానే ఇలా సంచలన నిర్ణయతో ప్రత్యేకంగా నిలిచారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఎవరో కాదు ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. అవును కృష్ణ ఏం చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన తెలుగు పరిశ్రమలో ప్రయోగాల కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. టాలీవుడ్ లో చాలా ట్రెండ్స్ కృష్ణ నుంచే స్టార్ట్ అయ్యాయి.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..