👉 జమ్మూకశ్మీర్ లో ‘ఆపరేషన్ మహదేవ్’.. పహల్గాం దాడి ఉగ్రవాదులు హతం! 😲😲😲 ఆవును… శ్రీనగర్ లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి అనంతరం సరిహద్దుల్లో భారత్ అణువణువూ జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో రెగ్యులర్ గా కూంబింగ్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూకశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా.. వారు పహల్గాం దాడికి పాల్పడినవారని వెల్లడైంది! ఆవును… శ్రీనగర్ లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెబుతుండగా… వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులనే వివిషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు ఆల్ ఇండియా రేడియో వెబ్ సైట్ లో వెల్లడించింది. వాస్తవానికి జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ‘ఆపరేషన్ మహదేవ్’ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం రావడంతో సుమారు నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఉదయం శ్రీనగర్ లోని లిద్వాస్ జనరల్ ఏరియాలోని మౌంట్ మహాదేవ్ సమీపంలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది! ఈ సమయంలో… ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు! ఈ సందర్భంగా… మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తయిబాకు చెందినవారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాగి ఉన్న ప్రదేశం నుండి అనేక గ్రెనేడ్లు, రేషన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్… జబర్వాన్, మహాదేవ్ శిఖరాల మధ్య జరిగినందున “ఆపరేషన్ మహాదేవ్” అని పేరు పెట్టి ఉండొచ్చని అంటున్నారు. కాగా… ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో గల బైసరన్ లోయ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అక్కడినుంచి సమీపంలోని అటవీప్రాంతం గుండా పరారయ్యారు! అప్పటినుంచి భారత భద్రతా దళాలు ఈ ముష్కరుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. ఈ క్రమంలో… లష్కరే తయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో ఈ మారణహోమానికి పాల్పడిన ఉగ్రమూకలో ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షల వరకు రివార్డును ప్రకటించారు.
👉🌟🌟🌟సడెన్ గా జగన్ ఢిల్లీ టూర్…మ్యాటర్ సీరియస్ ? 
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా చంద్రబాబు దేశంలో లేనపుడు. జగన్ ఢిల్లీ టూర్ ఇపుడే ఎందుకు ఏమా తొందర అంటే మ్యాటర్ సీరియస్ అని అంటున్నారు. ఇక జగన్ ఈ మధ్య కాలంలో అయితే ఢిల్లీకి వెళ్ళినది లేదు. ఆయన గత ఏడాది అంటే వైసీపీ ఓడిన కొత్తల్లో ఒకసారి ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారు. ఏపీలో పోలీసులు తమ పార్టీకి చెందిన వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అన్న విషయం మీద వైసీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. ఆ సమయంలో ఎన్డీయే నేతలు తప్ప మిగిలిన పార్టీల నుంచి నాయకులు వచ్చారు. సుదీర్ఘకాలం తరువాత మళ్ళీ : ఇంతకాలం తరువాత జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఇందులో విషయం చాలానే ఉంది అని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి గత వైసీపీ అయిదేళ్ళ పాలనలో సాగిన లిక్కర్ స్కాం మీద విచారణను జరిపిస్తోంది. ఇదిపుడు లాజికల్ ఎండింగ్ కి వచ్చిందని అంటున్నారు. ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కచ్చితంగా అరెస్టు అవుతారు అని అంతా చెబుతున్నారు. ప్రచారం చూసినా ఆ విధగానే సాగుతోంది. దాంతో జగన్ ఇదే పని మీద ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. ఇక జగన్ ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు అన్నది మరో చర్చ. కేంద్రంలో బీజేపీకి చెందిన నాయకులను ఆయన కలుస్తారు అని ప్రచారం సాగుతోంది. అలాగే ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కూడా భేటీ అయి ఏపీలో లిక్కర్ స్కాం పేరుతో వైసీపీ మీద రాజకీయ దాడి జరుగుతోంది అని జగన్ చెప్పబోతున్నారని అంటున్నారు. ఆ విధంగా ఏపీలో లిక్కర్ స్కాం అంశాన్ని జాతీయ స్థాయిలో ఉంచి వైసీపీ మీద అది రాజకీయ ప్రతిదాడిగా జగన్ వివరించబోతున్నారు అని అంటున్నారు.
🌟మాగుంట చొరవతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పధకం క్రింద పాలేరుపై వంతెన మరియు 2 రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అభ్యర్ధనపై, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పధకం క్రింద ఏంతో కాలంగా పెండింగులోవున్న పాలేరునదిపై హై లెవెల్ వంతెన, పెళ్లూరు నుండి కొణిజేడు మరియు టంగుటూరు – తాళ్ళపాలెం రోడ్డు నుండి పాకల వరకు రెండు రోడ్లు మంజూరు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని 2024 మార్చి నెలలో కోరినారు.
దానిపై రాష్ట్ర ప్రభుత్వ పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ 2025 జూలైలో ఈ క్రింది మొత్తాలతో సదరు పనులకు పరిపాలన అనుమనుమతులు ఇచ్చినారు.
1.పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామం వద్ద పాలేరు నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి రూ.27.83 కోట్లు .
2.ఒంగోలు మండలంలో పెళ్లూరు గ్రామం నుండి కొణిజేడు గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 4.50 కోట్లు.
3.టంగుటూరు మండలం టంగుటూరు – తాళ్ళపాలెం రోడ్డు నుండి పాకల వరకు రోడ్డు
నిర్మాణానికి రూ. 5.60 కోట్లు
తన అబ్యర్ధన మన్నించి పై మూడు పనులు మంజూరు చేసినందుకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, కె. పవన్ కళ్యాన్ కి, సాంఘిక సంక్షేమ మంత్రి, డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి కృతఙ్ఞతలు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు.
**సముద్రాల వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*త్రిపురాంతకం అమ్మవారిశాల నందు సముద్రాల సుబ్బారావు,జ్యోతి ల కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన దీపిక,రాకేష్ కుమార్ లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్సీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు…*
*రాయచోటి సబ్ రిజిస్ట్రార్ పై నాన్ బెయిలబుల్ కేసు*..*అన్నమయ్య జిల్లా*
అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్ట్రార్ షేక్ సత్తార్ పై నాన్ బెయిలెబుల్ కేసు నమోదు చేసినట్లు నంద్యాల ఒకటో పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. సత్తార్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పని చేసేటప్పుడు రూ. 2 కోట్ల విలువైన స్థలాన్ని, బాలాజీ కాంప్లెక్స్ ఉన్న పద్దెనిమిది సెంట్ల వివాదాస్పద స్థలాన్ని జైలాల్బి కి రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకు గాను ఆయన భారీగా ముడుపులు దండుకున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
*పామును కొరికిన బాలుడు*
బిహార్‌లోని బేతియాలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఏడాది వయసున్న బాలుడు ఓ పాముని పళ్లతో కొరకడంతో అది చనిపోయింది.
చనిపోయిన పాము విషపూరితమైన కోబ్రా అని చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇప్పుడా బాలుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాడు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు.
పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ జిల్లా కేంద్రం బేతియా.బేతియా జిల్లా. మఝౌలియా బ్లాక్‌లోని మోహ్చి బనకట్వా గ్రామానికి చెందిన సునీల్ సాహ్ ఐస్‌క్రీమ్ అమ్ముతుంటారు.

