ఢిల్లీ ఎయిర్ పోర్టులో సిబిఎన్ కు స్వాగతం పలికిన ఒంగోలు ఎంపీ మాగుంట..👉ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!.. 👉ట్రోల్స్ చిక్కుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ …👉షాక్: డ్రగ్స్ దందాలో మాజీ ఐపీఎస్ కొడుకు..*హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు..* దిల్ షుక్ నగర్ లో కాల్పుల కలకలం…*కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య*..*ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి (జమ్మలమడుగు )

👉ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్ర బాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు
** దిల్ షుక్ నగర్ లో కాల్పుల కలకలం ,
చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు..శాలివాహన నగర్ లోని పార్క్ వద్ద చందు నాయక్ పై కాల్పులు..అక్కడిక్కడే మృతి చెందిన చందు నాయక్ ..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
** *కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య*
సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య…
మునగాల మండలం కలకోవకు చెందిన తనుజగా గుర్తింపు…నిన్న సాయంత్రం మృతురాలు తనుజను చూసేందుకు వచ్చిన తండ్రి…
మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది…
** *ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి*
ఏపీలో దారుణం జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగులో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న వైష్ణవి.. నిన్న తన ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లింది. తిరిగి యువకుడు ఒక్కడే రావడం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గండికోటలో వైష్ణవి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే వైష్ణవి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
** హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు..
మలక్‌పేట శాలివాహన నగర్ పార్క్ వద్ద మార్కింగ్ వాక్‌కి వెళ్లిన చందు రాథోడ్‌ను కారం చల్లి కాల్చి చంపిన దుండగులు..
ఉదయం 7.30 గంటల సమయంలో తెల్లటి స్విఫ్ట్ కారులో వచ్చి హత్య చేసిన నలుగురు దుండగులు..
పట్టపగలే నగరం నడిబొడ్డున హత్య జరగడంతో భయాందోళనలో నగర వాసులు
👉ట్రోల్స్ చిక్కుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ..! జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. ఆయన చేస్తున్న ప్రసంగాలు, తీవ్ర విమర్శలు వంటివి నెటిజ‌న్ల‌కు ఆటపట్టుగా మారాయని చెప్పాలి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నిజానికి.. జనసేన నాయకులకు కూడా మింగుడు పడడం లేదనే చెప్పాలి. ఏదైనా ఒక విషయంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా గతంలో మాట్లాడిన మాటకు ప్రస్తుతం మాట్లాడే మాటకు మధ్య పొంతన ఉండేలా చూసుకోవాలి. సుప్రీం స్పష్టీకరణ కానీ, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో దారి తప్పుతున్నారనేది నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ ను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. గతంలో హిందీ భాష పై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ ఇటీవల కాలంలో మాత్రం హిందీని ప్రశంసిస్తున్నారు. బిజెపిని భారతీయ జనతా పార్టీ కాదని అది హిందీ జనతా పార్టీ అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. దీనిపై అప్పట్లోనే ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో హిందీని ఆయన పూర్తిగా భుజాల మీద ఎక్కించుకున్న ప‌రిస్థితి ఉంది. బిజెపి నాయకుల కంటే ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ హిందీ ప్రచారం చేస్తున్నారనే మాట‌ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. హిందీని ఒకప్పుడు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పేముంది.. దీనివల్ల మనకి కమ్యూనికేషన్ పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు. త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్నారు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ త్రిభాషా సూత్రాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. విమర్శించారు. బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుర్తించారు.
👉ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?! జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జనసైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు చదివింది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అది కూడా ఇంచార్జ్ హోదాలో ఉండనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ కొనసాగనుంది. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు సైతం ఈ బృందంతో కలిసి వెళ్తారు. ఈనెల 26 నుంచి 30 వరకు సీఎం బృందం అక్కడ పర్యటించనుంది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చేవరకు ఇంచార్జ్ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగనున్నారు. జనసైనికుల ఆశ అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జనసైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయితే, జనసైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. పవన్ తో సమానంగా మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అప్పట్లో జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్‌కు సీఎం పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమై, తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలు ఇచ్చింది. నాలుగు రోజుల పాటు బాధ్యతలు ప్రస్తుతం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళ్తోంది. నాలుగు రోజులపాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఇంచార్జి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు మాత్రం ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.
👉షాక్: డ్రగ్స్ దందాలో మాజీ ఐపీఎస్ కొడుకు.. ఈగిల్ కంటికి దొరికేశాడు! ఈ క్రమంలో వారు విస్తుపోయే వివరాలు వెల్లడయ్యాయి. ఒక సీనియర్ పోలీసు అధికారి కొడుక్కి డ్రగ్స్ దందాలో కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తించారు. డాక్టర్లు. యాక్టర్లు.. సెలబ్రిటీలు.. పొలిటీషియన్లు.. ఐటీ ఉద్యోగులు.. వీళ్లు.. వాళ్లు అన్న తేడా లేకుండా డ్రగ్స్ దందాలోకి అన్ని వర్గాలు చేరుకుంటున్నాయి. ఇటీవల అదుపులోకి తీసుకున్న డ్రగ్స్ నిందితుడ్ని ఆరా తీసే క్రమంలో షాకింగ్ నిజం ఒకటి వెలుగు చూసింది. సీనియర్ పోలీసు అధికారి కొడుకు.. డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తునన్న వైనాన్ని గుర్తించారు. మరింత విస్మయానికి గురి చేసే అంశం ఏమంటే.. సదరు పోలీసు అధికారి కొడుకు ఏడాది క్రితం డ్రగ్స్ దందా కేసులో నిందితుడైనప్పటికి.. ఇప్పటికి అరెస్టు చేయకపోవటం విశేషం.ఇటీవల కాలంలో ‘ఈగిల్’ పేరుతో ఒక టీంను పోలీసు శాఖలో ఏర్పాటు చేయటం తెలిసిందే. మాదకద్రవ్యాలపై డేగకన్ను వేసి.. వాటి అంతు చూసేందుకు ఏర్పాటు చేసిన ఈ టీం ఇప్పటివరకు పలు డ్రగ్స్ రాకెట్లను బద్ధలు చేస్తోంది. ఇటీవల మేడ్చల్ పరిధిలోని కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ దందాలో భాగస్వామి అయిన అతడితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారు విస్తుపోయే వివరాలు వెల్లడయ్యాయి. ఒక సీనియర్ పోలీసు అధికారి కొడుక్కి డ్రగ్స్ దందాలో కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తించారు. సదరు పోలీసు అధికారి సుపుత్రుడి గురించి వివరాలు ఆరా తీసే క్రమంలో మరో షాకింగ్ అంశం వెలుగు చూసింది. 2024 జనవరిలో సదరు సుపుత్రుడు నిజామాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో అతడిపై కేసునమోదు చేశారు. సదరు కేసులో ఏ3గా ఉన్నప్పటికి..ఇప్పటివరకు అతడ్ని అరెస్టు చేసింది లేదు. ఇతడు ఢిల్లీ.. హిమాచల్ ప్రదేశ్.. పంజాబ్ నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి తెలంగాణలోని పలుచోట్ల అమ్ముతాడని.. డ్రగ్స్ నెట్ వర్కులో ఇతడు కీలక భూమిక పోషిస్తారని చెబుతున్నారు. ఇక.. ఈ సుపుత్రుడి తండ్రి విషయానికి వస్తే ఆయన సీనియర్ పోలీసు అధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం పోలీసు శాఖలోని ఒక విభాగంలో ఓఎస్డీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. హైప్రొఫైల్ కేసు కావటంతో ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించినట్లుగా చెబుతున్నారు.
👉 ట్రంప్కు థ్యాంక్స్ చెప్పిన జెలెన్స్కీ
ఉక్రెయిన్తో రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి రాకపోతే.. నాటో ద్వారా కీవ్కు అత్యాధునిక ఆయుధాలను అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రకటన యుద్ధ భూమిలో మరణాలు ఆపడానికి, శాశ్వత, న్యాయమైన శాంతిని నెలకొల్పడానికి ఉపయోగపడుతుందన్నారు. తమకు మద్దతుగా నిలిచిన ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు.
👉రష్యాకు డెడ్ లైన్ విధించిన ట్రంప్

ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ విధించారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని 50 రోజుల్లోగా కుదుర్చుకోకపోతే రష్యాను సుంకాలతో శిక్షలు తప్పవని హెచ్చరించారు. వాణిజ్యాన్ని తాము చాలా వాటికి వాడుకుంటుంటామని, యుద్ధాలను పరిష్కరించడానికి అవి ఉపయోగపడడం గొప్పగా ఉంటుందన్నారు. దీనికి ఉదాహరణ భారత్-పాక్ ఘర్షణను ప్రస్తావించారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..