👉👉👉విమాన ప్రమాద దర్యాప్తులో దీనిదే కీలక పాత్ర.. ఏమిటీ ‘గోల్డెన్ చాసిస్’? ఈ విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఓ పరికరం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. దాని పేరు గోల్డెన్ చాసిస్! దేశం మొత్తాన్ని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ప్రమాద ఘటన దర్యాప్తులో తాజాగా కీలక అప్ డేట్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఎయిరిండియా ఏఐ 171 బోయింగ్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోన్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఓ పరికరం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. దాని పేరు గోల్డెన్ చాసిస్! డేటా సేకరణలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్ లోడ్ చేయడంలో ఈ అమెరికా స్పెషల్ పరికరమే కీలక భూమిక పోషించిందని చెబుతున్నారు. అవును… ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కు సంబంధించిన బ్లాక్ బాక్స్ ను అధికారులు వేగంగానే కనుగొన్నప్పటికీ.. దాని నుంచి డేటాను డౌన్ లోడ్ చేయడం కత్తిమీద సాముగా మారిందనే కథనాలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో… ఈ బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలిస్తున్నారని.. అక్కడ అందులోని డేటాను డౌన్ లోడ్ చేస్తారని కథనాలొచ్చాయి. అందుకు కారణం… ప్రమాద సమయంలో వెలువడిన తీవ్రమైన వేడి కారణంగా అది దెబ్బతిని ఉందని.. దీంతో ఏఏఐబీ సంప్రదాయ ల్యాబ్ లో దీని నుంచి డేటా డౌన్ లోడ్ సాధ్యం కాలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వినియోగించే ఈ ‘గోల్డెన్ చాసిస్’ అనే ప్రత్యేక ఇది తీవ్రగా దెబ్బతిన్న ఫ్లైట్ రికార్డర్స్ నుంచి డేటాను డౌన్ లోడ్ చేసే సమయంలో.. వాటి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ ను తొలగించి, ఈ గోల్డెన్ చాసిస్ పై దానిని అమరుస్తారు. దీంతో ఫ్లైట్, కాక్ పీట్ వాయిస్ డేటాను డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.

తాజా దర్యాప్తులో కూడా గోల్డెన్ చాసిస్, కేబుల్స్ ను అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించి వాడారు. కాగా… తాజాగా ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో… రెండు ఇంజిన్లకు సెకను వ్యవధిలో ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే అహ్మదాబాద్ లో ఎయిరిండియాకు చెందిన ఏఐ171 విమానం కూలిపోయిందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర్మంలో..ఇంధన సరఫరాను ఎందుకు ఆపావని ఒక పైలట్ ప్రశ్నించగా..తాను ఆపలేదని మరో పైలట్ సమాధానమివ్వడం కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) లో నమోదైందని తెలిపింది.
👉వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: మంత్రి సవిత..
వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: మంత్రి సవిత
ఆంధ్రప్రదేశ్ : చేనేత కార్మికులకు మంత్రి సవిత శుభవార్త అందించారు.ఆగస్టు 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేనేత కూలీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని సవిత ప్రకటించారు.చేనేత కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.అలాగే చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించేందుకు కొత్తగా మరిన్ని ఆప్కో కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు హామీ ఇచ్చారు.
👉 ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్’ మిస్టరీ.. మృతదేహం లభ్యం ..😱😱😱
త్రిపురకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి స్నేహ దేవ్‌నాథ్ ఢిల్లీలో అదృశ్యమైన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. చివరకు సిటీలోని యమునా నది ఒడ్డున యువతి మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జులై 7న ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్దకు క్యాబ్‌లో వెళ్లిన ఆమె.. అప్పటి నుంచి కనిపించకుండా పోయి.. తాజాగా శవమై కనిపించింది.
👉రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు..!!మోటార్లు ఆన్ చేస్తే అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు:హరీశ్
సిద్దిపేట, జూలై 13 ‘మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్ నిండిపోతుంది.
అలా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. ఈసారి వర్షాలు పడతలేదు. దీంతో పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి ఉంది. రేవంత్‌రెడ్డి ఏమో మోటర్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నడు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డీ.. దమ్ము, సత్తా ఉంటే అసెంబ్లీ పెట్టు. నువ్వేం చేసావో, మేమేం చేసామో ఎంతసేపైనా మాట్లాడుకుందాం. కానీ అసెంబ్లీ పెట్టే దమ్ముందా నీకు?’ అని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను హరీశ్‌రావు పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే, గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నయి.
అంటే రోజుకు 80 టీఎంసీల నీళ్లు పోతున్నయి. కళ్ల ముందు నీళ్లు పోతున్నా రేవంత్ రెడ్డి రైతులకు మాత్రం నీళ్లు ఇస్తలేడు. కేవలం స్విచ్ ఒత్తితే నీళ్లు వస్తాయి. నువ్వు ఇస్తావా, లేకపోతే మేము రైతులతో కలిసి స్విచ్ వేయాలా’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదని, మేడిగడ్డ కూలితే బ్రిడ్జి పైన లారీలు, వాహనాలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్‌పైన, మాపైన కోసం ఉంటే కేసులు పెట్టుకో కానీ, రైతులు ఏంచేశారు? కాళేశ్వరం ఏం చేసిందని? అని ప్రశ్నించారు. నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్ చిత్తశుద్ధితో చేసిన కృషికి సీతారామ ప్రాజెక్టే ఓ సజీవ సాక్ష్యమని హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆన్ చేసినట్లే, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా మోటర్లు ఆన్ చేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
👉గృహ హింస కేసులో యువకుడి ఆత్మహత్య.. కరీంనగర్ మహిళా సీఐపై కేసు నమోదు..!!*
గృ హ హింస కేసును పర్యవేక్షిస్తున్న మహిళా సీఐకి ఊహించని షాక్ తగిలింది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య గృహ హింస కేసు పెట్టడంతో.. ఆ కేసును పర్యవేక్షిస్తున్న సీఐ..
యువకుడి మృతికి కారణమైందనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది..
కరీంనగర్ మహిళా పోలీస్టేషన్ సీఐ శ్రీలతపై కేసు నమోదు కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. తమ కొడుకు మృతికి కారణం సీఐ శ్రీలతతో పాటు అత్తింటి వారి వేధింపులే కారణమని మృతుడి తండ్రి కడారి లింగయ్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గృహ హింస కేసులో బయటకు రాకుండా చేస్తానని పలు మార్లు సీఐ శ్రీలత బెదిరించారని.. భయంతో తనకొడుకు కడారి శ్రావణ్ కుమార్ చనిపోయాడని ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐతో పాటు మృతుడి భార్య బంధువులపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
చొప్పదండికి చెందిన కడారి శ్రావణ్ కుమార్ (34) కు కరీంనగర్ కు చెందిన బత్తుల నీలిమతో 2021 లో వివాహం అయ్యింది. వీరికి నాలుగేండ్ల పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగి 2024లో నీలిమ తన తల్లిగారి ఇంటికి వెళ్లి ఉంటోంది. కుటుంబ కలహాలు ముదిరి శ్రావణ్ పై నీలిమ కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో గృహహింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిందని మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే ఈ కేసులో మహిళా స్టేషన్ సీఐ శ్రీలత పలుమార్లు తన కొడుకును బెదిరించిందనీ.. ఈ కేసులో
బెయిల్ కోసం రావాల్సిందిగా స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పాడు. స్టేషన్ కు వెళితే కొడతారనే భయంతో తన కుమారుడు పురుగుల మందు తాగి చనిపోయినట్లు మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కోడలు నీలిమతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది..!!
👉‘ఉప్పాల హారికపై దాడి ఘటన.. మంత్రి అనిత సమాధానం చెప్పాలి’‘ మాజీ మంత్రి అంబటి
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ ఘటనపై హోంమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. అరాచక శక్తులను అదుపు చేసే బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఒక బీసీ మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయడానికి సిగ్గుపడాలన్నారు.
👉జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరం కాదు: పేర్ని నాని..
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేయడం సీఎం చంద్రబాబు తరం కాదని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నారని మంత్రి తెలిపారు. “రప్పా.. రప్పా అనొద్దని కార్యకర్తలకు చెప్పా. 8వ తేదీన మాట్లాడితే.. 12న టీడీపీ శ్రేణులు హడావుడి చేశారు. చీకట్లో నరకమని చెప్పానంటూ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.” అని పేర్ని నాని వెల్లడించారు.
చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు: బొత్స
👉చంద్రబాబు,పవన్ ప్రజలను మోసం చేశారు: బొత్స
ఆంధ్రప్రదేశ్ : విజయనగరంలో ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుపుకోలేదని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఓడ దాటకముందు వాడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా కూటమి ప్రభుత్వం తయారైందని విమర్శించారు.
👉కనిగిరిలో విద్యుత్తు సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.

👉పత్రికా ప్రకటన:-
సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ మరియు సెక్యూరిటీ అలారం నందు ఉచిత శిక్షణ :-
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు సీసీ కెమెరా సర్వీసింగ్ మరియు రిపేర్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 24 వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు 13 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు యువకులు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను 9573363141..ఇట్లు ..డైరెక్టర్
రూట్ సెట్ సంస్థ, ఒంగోలు.
👉విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి..
విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి
ఆంధ్రప్రదేశ్ : కడప జిల్లా బద్వేల్‌లో ఆదివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలపై భారం మోపే విధంగా తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.
👉 కొత్త రేషన్ కార్డులు.. పేర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియ షురూ!..
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డులకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం మే 7వ తేదీ నుంచి ప్రత్యేక ప్రక్రియ ప్రారంభించింది. కుటుంబ సభ్యుల విభజన, మృతుల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కొత్త సభ్యుల చేర్పు వంటి అంశాలకు కూడా ఈ సందర్భంగా అవకాశం కల్పించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
👉వైసీపీ నేత తురకా కిశోర్‌పై హత్యాయత్నం కేసు
వైసీపీ నేత, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. 2022 అక్టోబర్ 7న టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై పార్టీ మారాలంటూ కిశోర్ తీవ్రంగా దాడి చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో కిశోర్‌పై కేసు నమోదు చేయలేదు. తాజాగా అతడిపై చర్యలు తీసుకోవాలని దారపనేని శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు కిశోర్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు
👉చంద్రబాబు,పవన్ ప్రజలను మోసం చేశారు: బొత్స..👉విమాన ప్రమాద దర్యాప్తులో దీనిదే కీలక పాత్ర.. ఏమిటీ ‘గోల్డెన్ చాసిస్’?..👉ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్’ మిస్టరీ.. మృతదేహం లభ్యం.. 👉రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు.. 👉గృహ హింస కేసులో యువకుడి ఆత్మహత్య.. కరీంనగర్ మహిళా సీఐపై కేసు నమోదు..👉‘ఉప్పాల హారికపై దాడి ఘటన.. మంత్రి అనిత సమాధానం చెప్పాలి’‘ మాజీ మంత్రి అంబటి…👉జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరం కాదు: పేర్ని నాని..👉వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: మంత్రి సవిత.. వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: మంత్రి సవిత..👉 కొత్త రేషన్ కార్డులు.. పేర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియ షురూ!..👉విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి..**సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ మరియు సెక్యూరిటీ అలారం నందు ఉచిత శిక్షణ …వైసీపీ నేత తురకా కిశోర్‌పై హత్యాయత్నం కేసు
Recent Posts

