కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు..👉ఏఐ వల్లే జాబ్స్ పోతున్నాయా? అసలు నిజం ఏంటి?..👉డబ్బులు విషయంలో ఒకరిపై ఒకరు కూరగాయల కోసే కత్తితో దాడి….*సబ్ జైలును తనిఖీ చేసిన అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ యం. బాలాజీ…👉 ఒంటిమిట్ట చెరువులో అక్రమంగా మట్టి తోలకాలు చోద్యం చూస్తున్న అధికారులు..👉మామతో అక్రమ సంబంధం…కూతురిని హత్య చేసి మరో యువకుడిపై నెట్టిన తల్లి..*👉వక్స్ బోర్డ్ బొమ్మల్లో ఆక్రమణ తొలగింపుకు నిరసనగా తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎరుకుల సంఘం ధర్నా…👉ఆక్రమణదారులకు మరోచోట ఇళ్ల స్థలాలు : ఎమ్మెల్యే కందుల.-పొదిలి.

👉కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు..
గుజరాత్‌ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది. రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురిని కాపాడగా..నలుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.
👉ఏఐ వల్లే జాబ్స్ పోతున్నాయా? అసలు నిజం ఏంటి? ఏఐకి ‘నైతికత’ ఉండదు. మీ నిర్ణయాలపై ‘సౌలభ్యంగా’ స్పందించదు. మీ చెత్త ఆలోచనలను ప్రశ్నించదు.ఈ మధ్య కాలంలో ఉద్యోగ తొలగింపులకు (లేఆఫ్స్‌) ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌) కారణమని ఒక అపోహ బలంగా ప్రజల్లోకి వచ్చింది. అయితే నిజానికి ఈ యంత్రమేధ దీనికి కారకం కాదు. అసలు సమస్య కంపెనీల్లో పేరుకుపోయిన వ్యవస్థాత్మక అసమర్థతనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ వచ్చిందని ఉద్యోగుల భద్రత కరిగిపోతోంది.. ఉద్యోగులు భయపడుతున్నారు, మానవ శక్తిని యంత్రాలు తొలగిస్తాయని ఆందోళన చెందుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మరిచిపోతున్నారు. ఏఐ మీ సంస్థను నిర్వాహకంగా మార్చలేదు. అది మీ కంపెనీ ఆర్గనైజేషన్‌ చార్ట్‌ను దెబ్బతీయలేదు. అస్పష్టమైన పాత్ర నిర్వచనాన్ని, బాధ్యతల కేటాయింపును, పనితీరు విధానాలను ఏఐ సృష్టించలేదు. ఇవన్నీ మానవ నేతృత్వం వల్లే ఏర్పడ్డ పొరపాట్లు. సంస్థలలో విఫలమైన వ్యవస్థలు చాలా కంపెనీల్లో విధుల స్పష్టత లేదు. ఎవరు ఏం చేయాలి అనే అవగాహన ఉండదు. యాజమాన్యం ఈ అస్పష్టతను ‘సాధారణ దశ’గా భావిస్తుంటుంది. వాస్తవానికి అభివృద్ధికి కొన్ని లోపాలు సహజం. కానీ వాటిని గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంటుంది. అయితే చాలామంది “ఏఐ వస్తోంది, అది సమస్యలను తేలికగా పరిష్కరిస్తుంది” అనే భ్రమలో లేఆఫ్స్‌కు పాల్పడుతున్నారు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మూల సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఏఐ అంటే ఉద్యోగి! కానీ బాస్‌ ఎవరు? ఏఐను ఒక అత్యుత్తమ ఉద్యోగిగా భావించి, ఆ పనిని మానవుల కన్నా త్వరగా, సమర్థవంతంగా చేస్తుందని అనుకోవడం సబబే. కానీ అసలు ప్రశ్న ఆ ఏఐకి హెడ్ ఎవరు? ఆ టూల్‌కు సరైన సమాచారం ఎవరు ఇస్తారు? దాని అవుట్‌పుట్‌ను ఎవరు సమీక్షిస్తారు? వాడే విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఒక కొత్త ఉద్యోగిని నియమిస్తే అతనికి శిక్షణ ఇస్తాం, మార్గనిర్దేశం చేస్తాం, పని ఫలితాలను తనిఖీ చేస్తాం. కానీ అదే ప్రాతిపదికతో ఏఐని తీసుకొస్తే సరైన పద్ధతిలో బాధ్యతలు కేటాయించకుండా వదిలేస్తే, అది కూడా ఒక నిరాశా ఉద్యోగిగా మారిపోతుంది. అంతేకాదు, తప్పుల్ని పెద్దదిగా స్కేల్ చేయగలదు.
👉డబ్బులు విషయంలో ఒకరిపై ఒకరు కూరగాయల కోసే కత్తితో దాడి..*పల్నాడు జిల్లా వినుకొండ*
*వినుకొండ* :-పట్టణంలో ఆర్కెస్ట్రా ఈవెంట్స్ డబ్బులు పంపిణీలో ఒకే రూమ్ లో ఉన్న ఇరువురు ఒకరిపై ఒకరు కూరగాయల కోసే కత్తులతో దాడి చేసుకున్న సంఘటన ముట్లగుంట కాలనీ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే ఒకే రూమ్ లో నివాసం ఉంటున్న షబ్బీర్, దరియా డబ్బుల విషయంలో మనస్పర్ధలు కారణంగా కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా షబ్బీర్ కు తీవ్ర గాయాలయ్యాయి.ఎస్సై షామీర్ భాష. సత్యనారాయణలు ఘటన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులు ని వినుకొండ ప్రభుత్వ వైశాల్ తరలించారు.
మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బంధువులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
***ఆటో బోల్తా పడి ఒకరు మృతి*
*అర్ధవీడు:* ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం మిట్టమీదపల్లె సమీపంలో మంగళవారం అడవి పందులు అడ్డు రావడంతో ఆటో బోల్తా పడి తిరుపతయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత క్షతగాత్రులను మొదట కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు. జిల్లా స్టాపర్ షేక్ రహిమాన్
***సబ్ జైలును తనిఖీ చేసిన అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ యం. బాలాజీ…
ప్రకాశం జిల్లా మార్కాపురం ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మార్కాపురం లోని సబ్ జైలును అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ యం. బాలాజీ తనిఖీ చేశారు .ఈ సందర్భంగా న్యాయమూర్తి విచారణ ఖైదీలను మరియు కేసులలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను, వారి కేసుల వివరములను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తరువాత జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన మానవ జన్మ ను మంచిని,చెడును గ్రహించే విచక్షణ జ్ఞానం మనుషులు కలిగి ఉండాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య స త్స0బంధాలు ఉండాలని, అవి కొరవడిన నాడు మానవ సంబంధాలు మరియు కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైనప్పుడు సమాజంలో శాంతి ఉండదన్నారు .మనుషులు ఆవేశంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, నిగ్రహం నశించి నేరాలకు పాల్పడుతున్నారని, తద్వారా కుటుంబ సభ్యులను కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరు చట్టాలను అతిక్రమించకూడదన్నారు. మత్తు పదార్థాలను వాడిన యువత ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసుకోవడమే కాక కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారని, ఇంద్రియ నిగ్రహం లేక నేరాలకు పాల్పడుతున్నారన్నారని, చేసిన తప్పులకు పశ్చాతాపం చెంది ,చెడు అలవాట్లను వీడి పటిష్టమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలన్నారు. బెయిలు ,అరెస్టు ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విచారణ ఖైదీలకు అందుతున్న సదుపాయాలను,వారికి అందుతున్న ఆహారము పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం నందు సబ్ జైల్ సూపరెండేంట్ కోర్ట్ సిబ్బంది ,జైలు సిబ్బంది. పాల్గొన్నారు.
👉 ఒంటిమిట్ట చెరువులో అక్రమంగా మట్టి తోలకాలు చోద్యం చూస్తున్న అధికారులు..
ఉమ్మడి కడప జిల్లా: రాజంపేట: ఒంటిమిట్ట చెరువును భారీ ఎత్తున మిషన్ల తో మట్టి తోలుతున్నారని స్థానికులు తెలిపారు. అక్కడున్న స్థానికులు మాట్లాడుతూ..
పెద్ద ఎత్తున పగులు రాత్రి అన్నకున్న మట్టిని తోలుతున్నారంటే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు. ఎటువంటి పర్మిషన్లతో టిప్పర్లతో భారీ ఎత్తున మిషన్లు పెట్టి రెండు మిషన్లు పెట్టి మట్టితోలు తుంటే నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని భారీ ఎత్తున వాహనాలు రెండు మిషన్లు ఉన్నాయి మీకు కనిపించలేదా ? ఒక రైతుకు తమ పొలాలకు మట్టి తోలుకోవాలంటే పాస్బుక్కులు పట్టుకొని ఇరిగేషన్ల ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, కానీ భిన్నంగా భారీ ఎత్తున రెండు మిషన్లు పెట్టి పగలు,రాత్రి తేడా లేకుండా తోలుతున్నారే కనిపించలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. రైతులకు మట్టి తోలుకోవడానికి ట్రాక్టర్లతో పర్మిషన్ ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ భారీ ఎత్తున మిషన్ లు రెండు చెరువులో ఉన్నాయి ఎందుకు పెట్టినట్టు వెంటనే దీనిపైన అధికారులు దృష్టి పెట్టాలికలెక్టర్ గారికి కూడా మేము ఒకటే అడుగుతున్నాం సార్ మట్టి మాఫియాకు సంబంధిత అధికారులు సహకారం ఉంటేనే ఈ విధంగా జరుగుతుంది తప్ప లేకుంటే ఈ విధంగా జరగదు. వెంటనే నిలుపుదల చేయాలి పర్మిషన్లు ఉన్నాయా లేదా అని పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతుల మేరకే మట్టి తోలడానికి పర్మిషన్ ఇస్తారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారో విచ్చలవిడిగా చెరువును ద్వంసం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి భారీ ఎత్తున మిషన్లను చెరువులో నుంచి తీసేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజంపేట నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూల భాస్కర్ డిమాండ్ చేస్తున్నాం.
👉మామతో అక్రమ సంబంధం…కూతురిని హత్య చేసి మరో యువకుడిపై నెట్టిన తల్లి.._*
మామతో ఆ యవ్వారం… కూతురిని హత్య చేసి మరో యువకుడిపై నెట్టిన తల్లి.. పోలీసుల దర్యాప్తులో బయటపడిన అసలు ట్విస్ట్!…
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు అనే తన కొడుకు హరికృష్ణకు, సునీత అనే మహిళతో వివాహం జరిపించాడు. కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులు ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
ఆ బిడ్డ పెరిగి 12 ఏళ్ల వయస్సుకు వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా ఆమె తల్లి సునీత, తన మామ నసింహరావుతో వివాహేతర సబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన భర్త హరికృష్ణ ఇంట్లో లేని సమయంలో సునీత, తన మామతో ఏకాంతంగా ఉండడాన్ని ఆమె 12 ఏళ్ల కుమార్తే చూసింది.
కూతురు తమను చూడడాన్ని తల్లి, ఆమె మామ గమనించారు. తమ సంబంధం గురించి ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిపోయారు. ఈ క్రమంలోనే తన కుమార్తెను హత్య చేసేందుకు సునీత తన మామాతో కలిసి ప్లాన్ వేసింది.
పథకం ప్రకారం ఇంట్లో బాలిక నిద్రిస్తున్న సమయంలో తన మామతో కలిసి సునీత ఇంట్లోకి వచ్చింది. నిద్రిస్తున్న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి హతమార్చింది. ఈ నెపం తమ మీదకు రాకుండా ఉండేందుకు బాలికకు ఫిట్స్‌ వచ్చిన పడిపోయినట్టు నాటకం ఆడారు. బాలికను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు ఖమ్మం తరలించాలని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయొద్దని సుతీన, ఆమె మామ వైద్యులను కోరారు.
ఈ క్రమంలో బాలిక మెడపై వైర్‌తో బిగించిన అచ్చులను గుర్తించిన వైద్యులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్న నాటి ఎస్‌ఐ కవిత ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
👉ఆక్రమణదారులకు మరోచోట ఇళ్ల స్థలాలు : ఎమ్మెల్యే కందుల.-పొదిలి.

ఆక్రమిత స్థలాల్లో అర్హులైన వారికి మరోచోట ఇళ్ల స్థలాలు ఇస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పొదిలి పట్టణంలోని పొదిలి ఒంగోలు ప్రధాన రహదారిలో బాప్టిస్ట్ పాలెం వద్ద ఉన్న వక్స్ బోర్డ్ భూములలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు కూల్చివేశారు. ఈ ఈ సందర్భంగా బుధవారం అక్కడ పర్యటించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వారితో మాట్లాడుతూ ఇల్లు కూల్చివేసిన వారిలో అర్హులైన వారికి త్వరలోనే వేరే చోట ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వ భూముల ఆక్రమణ చట్టరీత్యా నేరమని అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యులవుతారని అన్నారు.అధికారులు అన్యాయంగా తమ కట్టడాలను వేశారని తమకు న్యాయం చేయాలని పలువురు ఆక్రమణదారులు చేసిన కోరిక మేరకు అధికారులతో మాట్లాడారు.ఆక్రమణదారుల్లో ఇల్లు లేని వారిని తనిఖీ చేసి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఆయన వెంట తాసిల్దార్ ఎం వి కృష్ణారెడ్డి,పొదిలి సీఐ టి వెంకటేశ్వర్లు,టిడిపి నాయకులు పోలీస్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
👉వక్స్ బోర్డ్ బొమ్మల్లో ఆక్రమణ తొలగింపుకు నిరసనగా తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎరుకుల సంఘం నాయకుల ధర్నా.
పొదిలి పట్టణంలో ముస్లిం సంబంధించిన వక్స్ బోర్డ్ భూమిలోని అక్రమ కట్టడాలను అధికారులు మంగళవారం తొలగించిన నేపథ్యంలో నిరసనగా బుధవారం సాయంత్రం పొదిలి తహసిల్దార్ కార్యాలయం బయట తమకు న్యాయం చేయమంటూ బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షులు మోహన్ ధర్మ పాల్గొని మాట్లాడుతూ అధికారులందరూ కలిసి ఇల్లు లేని పేదల పొట్ట కొట్టారంటూ ఆరోపించారు. ఇల్లు కోల్పోయిన తమ కులస్తుల ఆదుకోవాలని ఆయన తాహాసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఇల్లులేని వారికి ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..