👉చైనా, టర్కీలపై ఈ రకంగా పగ తీర్చుకున్న భారత్…👉కేంద్ర ప్రభుత్వం కాల్పులు ఆపివేయాలి.. అన్ని వర్గాలు స్పందించాలని విజ్ఞప్తి..*కొండపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుకు ..👉 వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదు-మంత్రి సవిత..👉జిల్లాలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్..*అన్నమయ్య జిల్లా*..👉అధ్యాపకురాలి ఆత్మహత్యా యత్నానికి కారకులైన వనిపెంట బిసి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలి*ఎస్ఎఫ్ఐ..*ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు..👉 *రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి*ఎమ్మెల్యే ముత్తుముల..

👉చైనా, టర్కీలపై ఈ రకంగా పగ తీర్చుకున్న భారత్..!!
పొరుగుదేశం చైనాతో సుదీర్ఘకాలంగా సరిహద్దు గొడవలను ఎదుర్కొంటోంది భారత్. లఢక్ మొదలుకుని.. అరుణాచల్ ప్రదేశ్ వరకూ తరచూ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోన్నారా దేశ సైనికులు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి.
అటు టర్కీ కూడా తక్కువేమీ తినలేదు. భారత్ కు వ్యతిరేకంగా చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ కు బాహటంగా మద్దతు ఇచ్చింది. భారత్ పై దాడులు సాగించడానికి డ్రోన్ సహాయాన్నీ అందించింది టర్కీ. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత సంభవించిన పరిణామాల్లో పాక్ వైపు నిలిచింది.
భారత్ కు వ్యతిరేకంగా తమ దేశ ప్రజలను ఎగదోస్తోన్నాయి కొన్ని మీడియా సంస్థలు. భారత్ కు వ్యతిరేకంగా విస్తృతంగా కథనాలను ప్రచురిస్తోన్నాయి. అంతంత మాత్రంగానే కొనసాగుతూ వస్తోన్న సత్సంబంధాలు మరింత దెబ్బతినేలా కథనాలను వండివార్చుతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో- ఈ రెండు దేశాలకు చెందిన ప్రధాన మీడియా సంస్థలపై వేటు వేయడానికి కేంద్ర ప్రభుత్వం తెర తీసింది. చైనాకు చెందిన అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ న్యూస్, టర్కీలోని టీఆర్టీ వరల్డ్ ఎక్స్ అకౌంట్లను విత్ హెల్డ్ లో ఉంచింది. వాటిని నిషేధించింది.
ఎక్స్ లోకి వెళ్లి గ్లోబల్ టైమ్స్ న్యూస్ లేదా టీఆర్టీ వరల్డ్ అని టైప్ చేస్తే.. అవి ఓపెన్ కావట్లేదు. అకౌంట్ విత్ హెల్డ్ ఇన్ ఇండియా అనే అక్షరాలు కనిపిస్తోన్నాయి. ఎక్స్ గైడ్ లైన్స్, కోర్టు ఉత్తర్వులు.. వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే తరహా ఇబ్బందిని రాయటర్స్ కూడా ఎదుర్కొన్నప్పటికీ-ఆ తరువాత దీన్ని పరిష్కరించుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి రాయటర్స్ ఎక్స్ అకౌంట్ భారత్ లో అందుబాటులో ఉంటోంది.రాయటర్స్ టెక్ న్యూస్, రాయటర్స్ ఫ్యాక్ట్ చెక్,రాయటర్స్ పిక్చర్స్,రాయటర్స్ ఆసియా,రాయటర్స్ చైనా వంటి ఇతర ఎక్స్ అకౌంట్స్ ప్రస్తుతం పని చేస్తోన్నాయి.
👉 AICC అగ్రనేత సోనియా గాంధీకి,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాసిన APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి. హైదరాబాద్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థంYSR మెమోరియల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.. స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష
👉 దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి..* ఇడుపులపాయలోని తండ్రి సమాధికి నివాళులర్పించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి,..𖧹 వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి, కుటుంబ సభ్యులు..జగన్ తో పాటు నివాళులర్పించిన పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు ..
👉కేంద్ర ప్రభుత్వం కాల్పులు ఆపివేయాలి..అన్ని వర్గాలు స్పందించాలని విజ్ఞప్తి..
ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో 30 వేల మంది కేంద్ర పోలీసు బలగాలు, చత్తీస్ ఘడ్ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులను ఆదివాసీలకు చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్నారని సమాచారం.
బస్తర్ ఐ.జి. సుందర్ రాజ్ మావోయిస్టులను లొంగిపొమ్మని హెచ్చరికలు చేస్తున్నాడు లేదా చావుకు సిద్ధం కండి అని మాట్లాడుతున్నాడు.మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కార్యదర్శి గణపతి, హిడ్మా వంటి నాయకులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు..ప్రజలు,ప్రజాస్వామికవాదులు ,హక్కుల సంఘాలు వామపక్ష పార్టీలు, మేధావులు ఈ మారణహోమం పై తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశాయి.పోలీసులు చట్టం, రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా హత్యలు చేయడం, హత్య చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. తక్షణమే మారణహోమాన్ని ఆపాలి. బలగాలను వెనక్కి పిలవాలి…
👉ఇబ్రహీంపట్నం కొండపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుకు తల్లిదండ్రుల ఆస్తికోసం తల్లిదండ్రులను చంపడానికి ప్రయత్నించిన చిన్న కొడుకు మద్దాల రవి
ఇబ్రహీంపట్నం కొండపల్లి ఇందిరానగర్ లో నివాసముంటున్న మద్దాల వెంకటేశ్వరరావు చిన్న కొడుకు మద్యం, గంజాయికి బానిసై డబ్బుల కోసం తల్లిదండ్రులపై ప్రతినిత్యము గొడవలు
ఇప్పటికీ మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు..
నచ్చచెప్పి పంపించేయడమే తప్ప చర్యలు తీసుకోకపోవడంతో నేడు తల్లిదండ్రులను చంపటానికి ప్రయత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మద్దాల రవిని అదుపులోనికి తీసుకున్నారు.. స్టేట్ ఇంచార్జ్ ఫారు
👉 వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదు-మంత్రి సవిత*కడప..
*ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు దారుణం*
*నల్లపురెడ్డిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం-సవిత*.
*మహిళలను వైసీపీ అగౌరవపరుస్తోంది-హోంమంత్రి అనిత*
*మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్‌ వ్యాఖ్యలు దారుణం*
*గతంలో నాపైనా ప్రసన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు*
*ప్రసన్నకుమార్‌ను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి-అనిత*.
*మహిళల జోలికి వస్తే ఊరుకోం* *మంత్రిలోకేష్‌*
*ఇదేమీ జగన్‌ గారి జంగిల్ రాజ్‌ కాదు*
*మహిళలకు అండగా నిలిచే ప్రభుత్వం మాది*
*మహిళా ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు దారుణం*
*పెద్ద చదువులు చదివితే సరిపోదు-నారా లోకేష్‌*
👉జిల్లాలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్..*అన్నమయ్య జిల్లా*
కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న షాపులలో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అన్నమయ్య జిల్లా పోలీసు వారు మరియు ఈగల్ టీంలు.
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి. హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు,కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ.కోయ ప్రవీణ్ సూచనలతో అన్నమయ్య జిల్లా ఎస్పీ.వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని పాఠశాలలు, కళాశాలలకు 100 గజాల సమీప దూరంలో ఉన్న షాపులు, దుకాణాలలో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రతి దుకాణంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.
👉అనుమతులకు వ్యతిరేకంగా విక్రయాలు నిర్వహిస్తే.. పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలను COTPA ACT ప్రకారం సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ .వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ… ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయని, యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపిన ఏ మాత్రం ఉపేక్షించేది లేదని, అటువంటి షాపు యజమానులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో జిల్లా సబ్ డివిజన్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఈగల్ టీం అధికారులు, ఇతర పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
👇తండ్రిపై కొడుకు కత్తితో దాడి..అన్నమయ్య పోలీస్*
తిరుపతి.
డిబిఆర్ హాస్పిటల్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘటన.
ఐరాల మండలం ,గురవారంపల్లె గ్రామానికి చెందిన బాబు తిరుపతిలోసెక్యూరిటీగా విధులు.
బాబు కుమారుడు సంతోష్ కత్తితో దాడి చేయడంతో రుయా ఆసుపత్రి లో చికిత్స.ఆసుపత్రి నుండి ఈస్ట్ పోలీసులకు ఇంటిమేషన్ . ఆసుపత్రి వద్దకు చేరుకొన్న ఈస్ట్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్.కుటుంబ తగాదాల వల్లే తండ్రి పై కొడుకు దాడి జరిగినట్లు సమాచారం.
👉అధ్యాపకురాలి ఆత్మహత్యా యత్నానికి కారకులైన వనిపెంట బిసి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలి.* *ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.*
ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకొని కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న జ్యోతి అనే బయాలజీ అధ్యాపకురాన్ని మంగళవారం పరామర్శించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..
కడప జిల్లా వనిపెంట మండలంలోని ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో సోమవారం ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న నిర్మల గారి వేధింపులు భరాయించలేక అక్కడే చదువు బోధిస్తున్నటువంటి జ్యోతి అనే బయాలజీ అధ్యాపకురాలు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగించడం జరిగింది.
అధ్యాపకురాలు వివరణ మేరకు గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి అభిషేకం లేకుండా ఉద్యోగం సక్రమంగా చేసుకుంటున్నా కూడా కులం పేరుతో, తక్కువ స్థాయితో ప్రతిసారి సూటిపోటి మాటలతో మాట్లాడుతూ వేధింపులు చేస్తుందన్నారు. పాఠశాలలో జరిగే ప్రతి విషయాన్ని తానే బయటకు చెప్తున్నారని అన్న అనుమానంతోనే వేధింపులు చేస్తున్నారన్నారు. విద్యార్థుల పైన కూడా కక్ష పూర్వకంగా వేధించే వారిని విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చినా కూడా వారి ని గౌరవించకుండా అఘోర పరుస్తూ ప్రవర్తించే వారన్నారు. అధ్యాపకురాలికి మూడు నెలల పాప ఉన్నప్పటికీ కూడా ప్రతి క్రాస్ కి క్రమం తప్పకుండా విద్యను బోధించేవారు అన్నారు. మరియు ఇతర అధ్యాపకురాళ్ళని సపోర్టుగా పెట్టుకొని ప్రతి విషయం లో నీకు మెమో ఇస్తాము, నువ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తరుచు వేధించే వారని వారన్నారు. ఒక పాఠశాలను క్రమశిక్షణలో పెట్టాల్సినటువంటి ఉన్నత ప్రిన్సిపల్ స్థాయిలో ఇలా వ్యవహరిస్తే రాబోవు రోజుల్లో విద్యార్థులు చదువుకు దూరమై పాఠశాలలను మూసుకోవాల్సి వస్తాయని. కావున ఇప్పటికైనా కూడా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి కారకులైన ప్రిన్సిపాల్ గారిపై మరియు ఇతర అధ్యాపకులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.ఎస్ఎఫ్ఐ నాయకులు ఉదయ్,సాయి తదితరులు పాల్గొన్నారు.
👉 ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.. దర్శి గడియార స్తంభం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పూల మాల వేసి నివాళి అర్పిస్తున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
👉 దివంగత ముఖ్యమంత్రి కి శే డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్బంగా శిoగరాయకొండ మండలం వైస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, పి ఏ సి సభ్యులు,కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జ్ డాక్టర్. ఆదిమూలపు సురేష్ వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి శిoగరాయకొండ మండలం పరిధిలోని సుందర్ నగర్, కందుకూరు రోడ్, మూలాగుంటపాడు మరియు బాలయోగినగర్ లో ఉన్న వైస్సార్ విగ్రహాలకు పూలమాలతో మరియు పాలాభిషేకంతో నివాళులు అర్పించారు.కార్యక్రమంలో శిoగరాయకొండ మండలం వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.


👉దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరుగుమల్లి లో నిర్వహించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి ysrcp అధ్యక్షులు పిన్నిక శ్రీనివాసరావు,మాజీ కన్వీనర్ బత్తిన మనోహర్ పాల్గొన్నారు
👉 మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు తో పాటు కేక్ కట్ చేసి, వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి సంబరాలు నిర్వహించిన రాష్ట్ర ఇంటిలెక్చువల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ,మాజీ మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్మారీ శ్రీనివాస్ రెడ్డి,పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 *రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి*
తాళ్లపల్లె గ్రామంలో పండ్ల మొక్కలు నాటిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. గిద్దలూరు మండలం, తాళ్లపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, డ్వామా ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు.ఈ సందర్బంగా పొలంలో జామ చెట్లను నాటి, మట్టి పోసి, నీరు పోశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యాన వన పంటలు పండించే రైతులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా భరోసాగా ఉంటుందని, జామ, మామిడి పండ్ల మొక్కలు వేసే రైతులకు మొక్కలు ప్రభుత్వమే ఉచితంగా అందచేసి, నాటించటం, నీరు అందించటం, కూలీలు వంటి ప్రతీ విషయంలో ప్రభుత్వమే సహకారం అందిస్తుందన్నారు. రైతులు ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రైతులకు ఎటువంటి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు..ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, ఎంపీడీఓ రమణారెడ్డి, హార్టికల్చర్ అధికారులు, NREGS సిబ్బంది, మండల నాయకులు, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

👉సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన*
*కూటమి ప్రభుత్వ పాలన పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనంగా రాచర్ల మండలంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటన కొనసాగింది.*
*రాచర్ల మండలంలోని సత్యవోలు, యడవల్లి, గుడిమెట్ట, సోమిదేవిపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభించింది, గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి అక్క చెల్లెమ్మలు, ప్రజలు ఎదురొచ్చి పూలమాల శాలువాలు వేసి, హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రతి ఇంట్లో సాదరంగా ఆహ్వానించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో ప్రభుత్వం పై తమకున్న నమ్మకాన్ని చాటి చెప్పారు.గ్రామస్థుల ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అందించిన సంక్షేమం వివరాలు తెలియజేసి కరపత్రాలను పంపిణి చేశారు.. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలు గురించి వివరించడం జరిగింది. అనంతరం గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, స్థానిక నాయకులు దూదేకుల సయ్యద్మియా, మాజీ సర్పంచ్ శ్యామలమ్మ, ఎంపీటీసీ ఈదుల సుజాత, పందనబోయిన శ్రీను, భవనం పుల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇరగనబోయిన రంగలక్ష్మమ్మ, సర్పంచ్ రెడ్డి కాశిరెడ్డి,మాజీ ఎంపీపీ లక్ష్మిదేవి, కప్పేట వెంకటేశ్వర రెడ్డి, రమణ,ఖాదర్,కార్యకర్తలు పాల్గోన్నారు. జిల్లా ఇన్చార్జ్ షేక్ రహిమాన్..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..