👉కరేడు రైతులది బతుకు పోరాటం..ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు..*జగన్ సొంత ఇలాక పులివెందులలో దివ్యాంగుల దొంగ పెన్షన్లు..👉ఢిల్లీ : అధిక గేట్ వసూలు చేస్తున్న టోల్గేట్ టెండర్ దారులు ..👉మత్స్యకారుడిని నీటిలోకి లాక్కెళ్లిన *కొమ్ముకోనాం ‘చేప…👉 ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..**👉పొగాకు రైతులకు బాసటగా ఎమ్మెల్యే ముత్తుముల..👉భారత్ కు అమెరికా తీవ్ర హెచ్చరిక..👉అనిల్ అంబానీ కంపెనీ 31వేల కోట్ల కుంభకోణం! ..👉‘చీకటి గదే మేలు’… మునీర్ పై ధ్వజమెత్తిన ఇమ్రాన్ ఖాన్!

👉కరేడు రైతులది బతుకు పోరాటం..ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు..
వైఎస్ షర్మిలా రెడ్డి..APCC ఛీఫ్ ..విజయవాడ
కరేడు రైతులది బతుకు పోరాటం.. ⁠ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు.. ⁠కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. ⁠సోలార్ ప్లాంట్ కి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.
పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం.

⁠ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం.
ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం.
⁠గత YCP ప్రభుత్వం శిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూ సేకరణకు కనీసం గ్రామ సభలు పెట్టలేదు.
⁠మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమ వద్దనే రైతుల గోడు వినలేదు.. ⁠ఇండోసోల్ కంపెనీకి అదనంగా భూములు కేటాయించి, ఊరినే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. శాంతియుత ఉద్యమం చేసే కరేడు గ్రామ ప్రజలను నిర్బంధించడాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే భూసేకరణకు ఇచ్చిన నోటిఫిషన్ ను రద్దు చేయండి.
– ⁠సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై కరేడు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. ⁠గ్రామ సభలు నిర్వహించండి. రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించండి.. ⁠పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు..అలా అని రైతుల శవాల మీద అక్రమంగా భూసేకరణ చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు.
👉6 నెలల్లో లక్ష మందికి లేఆఫ్‌లు.. బెంబేలెత్తిస్తున్న ఉద్యోగాల కోతలు*
టెక్‌ రంగంలో ఉద్యోగులకు ఈ ఏడాది కూడా గడ్డుకాలమే నడుస్తోంది. దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు (layoffs) ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది.
👉 *కడప : జగన్ సొంత ఇలాక పులివెందులలో దివ్యాంగుల దొంగ పెన్షన్లు.*మొత్తం 7,487 దివ్యాంగుల పెన్షన్లలో 1,708 బోగస్‍విగా గుర్తింపు.*
👉ఢిల్లీ : అధిక గేట్ వసూలు చేస్తున్న టోల్గేట్ టెండర్ దారులు
గూగూడు బ్రహ్మోత్సవాల శుభ సందర్భముగా వివిధ ప్రాంతాల నుండి వివిధ రకాల వాహనాలలో భక్తులు తరలి వస్తుండడంతో ఇదే అదునుగా భావించి గేటు టెండర్ పాడినవారు వాహనదారుల నుంచి అధికతో గేటు వసూలు చేస్తుండటంతో వాహనదారులు విస్మయం చేస్తున్నారు. వాస్తవానికి ఆటో నుంచి 30రూపాయలు, నాలుగు చక్రాల వాహనాలకు 100 రూపాయలు, ఆరు చక్రాల వాహనాలకు 130 రూపాయలు వసూలు చేసుకోవచ్చని పంచాయతీ తీర్మానించడమైనది. పంచాయతీ శాఖ వారి ఆదేశాలను బేఖాతరు చేసి గేటు వసూలు చేస్తుండడం గమనార్గం. ఒక ఆటో నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. గేటు వసూల్ ధరల పట్టిక వేయకుండా, వాహనదారులకు ఇచ్చే టోకెన్ మీద ఎటువంటి పంచాయతీ శాఖకు చెందిన సీలు లేకపోవడం గమనార్హం. వాహనదారులు అధిక టోల్ ఫీజులను అరికట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు
👉మత్స్యకారుడిని నీటిలోకి లాక్కెళ్లిన *కొమ్ముకోనాం ‘చేప* యువకుడు గల్లంతు..అనకాపల్లి జిల్లా
సముద్ర జలాల్లో లభ్యమయ్యే కొన్ని మత్స్యాలు ప్రమాదకరంగా ఉంటాయి. జాలర్లు వేట సాగించే సమయంలో అప్రమత్తంగా లేకుంటే ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి నెలకొంటోంది. తాజాగా ఆ యువకుడు కొందరు వ్యక్తులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో గేలానికి ఓ భారీ చేప చిక్కింది. పెద్ద చేప చిక్కిందని సంతోషపడ్డాడు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తాడుతో బోటులోకి దానిని లాగే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ మత్స్యం అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. పక్కనున్న తోటి మత్స్యకారులు అతణ్ని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి యర్రయ్య (26) ఆయన తమ్ముడు కొర్లయ్య, గనగళ్ల అప్పలరాజు, వాసుపల్లి యల్లాజి బుధవారం నాడు తెల్లవారుజామున సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తున్నారు. ఆ సమయంలో గేలానికి సుమారు 100 కిలోల బరువుండే కొమ్ముకోనాం చేప చిక్కింది. దాన్ని యర్రయ్య తాడుతో బోటులోకి లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో చేప యర్రయ్యను బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. కళ్లముందే అతను గల్లంతు కావడంతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే అతడి సోదరుడు కొర్లయ్య గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు పడవల్లో సాయంత్రం వరకు గాలించినా యరయ్య ఆచూకీ లభించలేదు. దీంతో పూడిమడక గ్రామంలో విషాదం నెలకొంది. తల్లి కోదండమ్మ కన్నీరుమున్నీరయ్యారు.
👉 ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సుప్రీంకోర్టు ప్రమాద బీమా క్లెయిమ్లపై కీలక తీర్పు ఇచ్చింది. నిర్లక్ష్యంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బీమా క్లెయిమ్లకు హక్కు లేదని స్పష్టమైంది. కోర్టు మృతుడి బీమా ఉన్నా, అతని “రాష్ డ్రైవింగ్” కారణంగా ప్రమాదం జరిగితే బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదని వెల్లడించింది.
👉భారత్ కు అమెరికా తీవ్ర హెచ్చరిక..!!!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా అమెరికా నుంచి భారత్‌కు కీలక హెచ్చరిక అందింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే, భారత్, చైనా వంటి దేశాలపై 500 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ సెనేట్‌లో త్వరలోనే ఒక బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
**భారత్, చైనాల లక్ష్యంగా బిల్లు?
ఈ బిల్లు ముఖ్యంగా భారత్, చైనా దేశాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలులో భారత్ 70 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వని దేశాలు.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తే, వారి ఎగుమతులపై 500% దిగుమతి సుంకాలు అమలు చేస్తామని గ్రాహం హెచ్చరించారు. ఇది అమలైతే భారత ఔషధాలు, వస్త్రాలు, ఇతర ఎగుమతి ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
*ఉక్రెయిన్‌కు మద్దతుగా సవరణలు
లిండ్సే గ్రాహం మాట్లాడుతూ రష్యాను ఆర్థికంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నామని చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాలకు మాత్రం ప్రత్యేక వాణిజ్య సవరణలు, తగ్గిన సుంకాలు వంటి ప్రయోజనాలున్న ఒప్పందాలను కూడా ప్రతిపాదించనున్నట్లు తెలిపారు.
⭐భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ స్పందన
మరోవైపు భారత్‌తో తక్కువ సుంకాల వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశముందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.”భారత్‌తో ఓ కొత్త డీల్ కుదుర్చుకోబోతున్నాం.

అది చాలా తక్కువ సుంకాలతో ఉండే ఒప్పందం అవుతుంది. అయితే ఇప్పటివరకు భారత్ దానిని అంగీకరించలేదు. కానీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని ఆయన చెప్పారు. ఈ ఒప్పందంపై జూలై 9 నాటికి రెండు దేశాలూ నిర్ణయానికి రావాలని చూస్తున్నాయని వర్గాలు తెలిపాయి.
అమెరికా తీసుకుంటున్న ఈ విధానాలు రష్యాపై ఒత్తిడిని పెంచేలా ఉంటే, మరోవైపు భారతదేశం వంటి దేశాలకు ఇది వాణిజ్య పరంగా పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాలపై ఈ క్లిష్టమైన సమయంలో భారత్ తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. భారత ప్రభుత్వం రష్యాతో కొనసాగుతున్న చమురు ఒప్పందాలపై మౌనం వీడి, సమగ్ర దృష్టితో నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది.
👉బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్*
_*22 క్వార్టర్ బాటిళ్లు సీజ్.. ఇద్దరు అరెస్టు*…_
*కంభం:* ప్రకాశం జిల్లా కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బేస్తవారిపేట గ్రామం నందు N.చెంచయ్య అనే వ్యక్తి అక్రమంగా 10 మద్యం సీసాలు కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది మరియు సదరి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లి గ్రామంలో N.మంత్రుడు అనే వ్యక్తి అక్రమంగా 12 మద్యం సీసాలు కలిగి ఉన్నందుకు అరెస్టు చేసి సదరి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యంను మరియు నాటు సారాయి, బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా ఇతర రాష్ట్రాల మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
👉 *మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి*
ప్రకాశంజిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. మండలంలోని దిగువమెట్ట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు నుంచి గిద్దలూరు వైపు వస్తున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జరిగిన ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే తన వ్యక్తిగత వాహనంలో గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే ఔదార్యానికి స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.
👉అలా చేస్తే తల్లిదండ్రులు జైలుకే: గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్*
పాఠశాలలు, కళాశాలలు వెళ్లే పిల్లలకు తల్లితండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి పంపిస్తే కఠిన చర్యలు తప్పవని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ హెచ్చరించారు. బుధవారం రోడ్డు ప్రమాదాలపై సీఐ మాట్లాడారు. తల్లితండ్రులు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని ఇటీవల ముండ్లపాడు గ్రామంలో ముగ్గురు మైనర్లు వాహనం నడిపి ఓ వ్యక్తి ప్రాణం పోయేందుకు కారణమయ్యారన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష తప్పదు అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు.
👉*నూతన ఎంఈవో అబ్దుల్ సత్తార్ కు సన్మానం*
కంభం: మండలంలో ఎంఈవో-1 గా బాధ్యతలు చేపట్టిన టి.అబ్దుల్ సత్తార్ ను, పూర్వ ఎంఈవో- 1 మాల్యాద్రి,ఎంఈవో-2 శ్రీనివాసులు, కార్యాలయ సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంఈవో-1 అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ,కార్యాలయ సిబ్బంది సహకారంతో మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండల సమన్వయకర్త చిన్ని.పద్మావతీదేవి, సీఆర్పీలు, అకౌంటెంట్ రామచంద్రుడు,డేటాఎంట్రీ ఆపరేటర్ శేఖర్ తదిరులు పాల్గొన్నారు.
👉పొగాకు రైతులకు బాసటగా ఎమ్మెల్యే ముత్తుముల..
*రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి*
*ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటానని రైతులకు ఎమ్మెల్యే హామీ*
*గిద్దలూరు నియోజకవర్గలోని పొగాకు రైతులకు బాసటగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నిలిచారు. నియోజకవర్గంలోని రైతులు ఎమ్మెల్యేని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం కలిసి తాము పండించిన పొగాకు బేళ్ళకు కొనుగోలు లేక ఇబ్బందులు పడుచున్నామని తెలుపగా, వెంటనే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గంలోని రైతులు పండించిన నల్లబర్లీ పొగాకు తెల్లబర్లీ పొగాకు బేళ్ళను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుపగా పొగాకు పండించిన రైతుల వివరాలు పంపాలని తెలియచేయగా, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పొగాకు రైతుల వివరాలు అందచేయాలనీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతుల వివరాలను మంత్రికి పంపించి పొగాకు కొనుగోలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.*
👉అనిల్ అంబానీ కంపెనీ 31వేల కోట్ల కుంభకోణం!
అనిల్ అంబానీ కంపెనీ 31వేల కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. అనిల్ అంబానీ కంపెనీ 31వేల కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. నష్టాల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మరో వివాదంలో చిక్కుకుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్‌కామ్‌కు ఇచ్చిన రుణాన్ని ‘మోసపూరితం’ (ఫ్రాడ్)గా ప్రకటించడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆర్‌కామ్ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి అధికారికంగా నివేదించేందుకు ఎస్‌బీఐ సిద్ధమవుతోంది. రుణ మోసం వివరాలు ఏమిటి? ఎస్‌బీఐతో సహా అనేక బ్యాంకులు ఆర్‌కామ్‌కు, దాని అనుబంధ సంస్థలకు కలిపి మొత్తం ₹31,580 కోట్లు రుణంగా ఇచ్చాయి. అయితే ఈ నిధులను చట్టవిరుద్ధంగా ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించారని, సంక్లిష్టమైన లావాదేవీలు నిర్వహించారని ఎస్‌బీఐ ఆరోపించింది. బ్యాంక్ ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపిన అనంతరం, ఈ రుణ ఖాతాను అధికారికంగా మోసపూరితంగా గుర్తించింది. బ్యాంకుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? Also Read – అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు ఉత్తమ విమాన ఎంపికలు ఇవే! ఒక రుణ ఖాతాను ‘మోసపూరితం’గా గుర్తించిన తర్వాత, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్లు , పూర్తికాల డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా, అనిల్ అంబానీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఐదేళ్ల పాటు బ్యాంకు రుణాలపై నిషేధం విధించింది. మోసపూరితంగా గుర్తించిన కంపెనీల ప్రమోటర్లకు భవిష్యత్తులో ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడానికి వీలుండదు. ఇప్పటికే ఉన్న రుణాల పునర్వ్యవస్థీకరణకు లేదా కొత్త రుణాల మంజూరుకు ఆర్‌బీఐ లేదా ఇతర నియంత్రణ సంస్థల ముందుస్తు అనుమతులు తప్పనిసరి అవుతాయి. బ్యాంకు మోసాలపై విచారణ చేపట్టేందుకు సీబీఐ లేదా స్థానిక పోలీసులకు ఈ కేసును నివేదించడం తప్పనిసరి అవుతుంది.
👉‘చీకటి గదే మేలు’… మునీర్ పై ధ్వజమెత్తిన ఇమ్రాన్ ఖాన్! ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అనేక కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో… 2023 ఆగస్టు నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. బెయిల్‌ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చుక్కెదురు అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు.. ఆర్మీ చీఫ్ మునీర్ అరాచకాలపై ఎక్స్ వేదికగా స్పందించారు! అవును… పాకిస్థాన్ లో ప్రజలు మునీర్ అనధికారిక నిరంకుశ పాలనలో మగ్గిపోతున్నరనే విమర్శలు ఇటీవల కాలంలో తీవ్రంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో… ఇటీవల పార్లమెంటులో చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ‘ఎక్స్’ లో స్పందించారు. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వం పైనా, మునీర్ పైనా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్… ఇటీవల చేసిన ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ.. ‘ఓటుహక్కు, చట్టబద్ధ పాలన, నైతికత, స్వేచ్ఛాయుత మీడియా’.. వీటన్నింటినీ నాశనం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా… జులై 6 తర్వాత ఈ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఈ మేరకు దేశం మొత్తానికి ముఖ్యంగా పీటీఐ కార్యకర్తలకు, మద్దతుదారులకు ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఈ బానిసత్వాన్ని అంగీకరించడం కంటే జైల్లో చీకటి గదిలోనే జీవించడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా ప్రభుత్వం అన్నివిధాలా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా… పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ పైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఇమ్రాన్ ఖాన్… ఓ నియంత అధికారంలోకి వస్తే.. అతడికి ఓట్లు అవసరం లేదని, ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో పాలన కొనసాగిస్తాడని విమర్శించారు. కోర్టుల్లో ‘ఎంపిక చేసిన’ న్యాయమూర్తులే ఉంటున్నారని.. స్వతంత్రంగా వ్యవహరించే వాళ్లు శక్తిహీనులుగా మారిపోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో… దేశంలో వాక్‌ స్వాతంత్ర్యం పూర్తిగా కనుమరుగవుతోందని.. నిజాయతీ గల జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. ఈయన పిలుపు మేరకు పాక్ లో 6వ తేదీన నిరసనలు ఏ స్థాయిలో జరుగుతాయనేది ఆసక్తిగా మారింది.
👉మీడియా సంస్థలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం*
ప్రకాశం జిల్లా కంభం మండలం అరాఫత్ నగర్ కు చెందిన ఓ మహిళ మీడియా సంస్థలపై అందులో పని చేస్తున్న రిపోర్టర్ల పై దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో దూషిస్తున్న షేక్ సమీరా అలియాస్ రిజ్వానతో పాటు గుంటూరు జిల్లా చేబ్రోలు చెందిన సూర్య దుర్గాప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టగా విచారించిన జడ్జి నిందితులిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పును ఇచ్చారు… పేరు మార్చుకొని వివిధ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రమని చెప్పుకుంటూ తిరుగుతున్న సమీరా అలియాస్ రిజ్వాన స్వస్థలం కొమరోలు మండలమని పోలీసులు విచారణలో గుర్తించారు. సూర్య దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చేబ్రోలు మండలంలో దొంగ బంగారం విక్రయించి అక్కడ స్థానికులను రూ.30 లక్షలకు పైగా టోకరా వేశాడు. FIR NO :- 203/2022 ఈ నేరంలో అతని తమ్ముడు. తండ్రి కూడా పాలుపంచుకున్నారని అక్కడి పోలీసులు అప్పట్లో వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. చేసిన నేరం బయటపడుతుందని తాను అనాధనాన్ని చెప్పుకుంటూ మభ్యపెడుతూ తిరుగుతున్నాడు. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా మరియు మీడియా సంస్థలను దూషించేందుకు సూర్య దుర్గాప్రసాద్ కూడా నిందితురాలికి సహకరించాడని పోలీసులు తెలిపారు…
👉మీడియా సంస్థలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం*
ప్రకాశం జిల్లా కంభం మండలం అరాఫత్ నగర్ కు చెందిన ఓ మహిళ మీడియా సంస్థలపై అందులో పని చేస్తున్న రిపోర్టర్ల పై దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో దూషిస్తున్న షేక్ సమీరా అలియాస్ రిజ్వానతో పాటు గుంటూరు జిల్లా చేబ్రోలు చెందిన సూర్య దుర్గాప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టగా విచారించిన జడ్జి నిందితులిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పును ఇచ్చారు… పేరు మార్చుకొని వివిధ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రమని చెప్పుకుంటూ తిరుగుతున్న సమీరా అలియాస్ రిజ్వాన స్వస్థలం కొమరోలు మండలమని పోలీసులు విచారణలో గుర్తించారు. సూర్య దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చేబ్రోలు మండలంలో దొంగ బంగారం విక్రయించి అక్కడ స్థానికులను రూ.30 లక్షలకు పైగా టోకరా వేశాడు. FIR NO :- 203/2022 ఈ నేరంలో అతని తమ్ముడు. తండ్రి కూడా పాలుపంచుకున్నారని అక్కడి పోలీసులు అప్పట్లో వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. చేసిన నేరం బయటపడుతుందని తాను అనాధనాన్ని చెప్పుకుంటూ మభ్యపెడుతూ తిరుగుతున్నాడు. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా మరియు మీడియా సంస్థలను దూషించేందుకు సూర్య దుర్గాప్రసాద్ కూడా నిందితురాలికి సహకరించాడని పోలీసులు తెలిపారు…
👉 *పాఠశాల ఆకస్మిక తనిఖీ*
స్థానిక అర్బన్ కాలనీ ఉర్దూ మోడల్ పాఠశాలను గురువారం ఎంఈఓ-1 అబ్దుల్ సత్తార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన నిర్వహణ, విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలను,పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీపై ఆరా తీశారు. పాఠశాల సమగ్ర అభివృద్ధిపై ఉపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో సిఆర్పి. మురళీమోహన్, ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..