👉అమెరికా ముఖంపై పిడిగుద్దు’.. సీజ్ ఫైర్ తర్వాత ఖమేనీ ఫస్ట్ రియాక్షన్! ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఖమేనీ.. ‘అమెరికాపైనా, మోసపూరిత జియోనిస్ట్ పాలనపైనా విజయం సాధించినందుకు ఇరాన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను.ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన భీకర యుద్ధం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ యుద్ధంలో.. అపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ జరిగిన రెండు రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫస్ట్ టైమ్ స్పందించారు. అవును… ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ పై ఇరాన్ విజయం సాధించినట్లు తన మొదటి ప్రసంగంలో ప్రకటించారు.ఇదే సమయంలో.. ఈ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు స్పందిస్తూ.. దీనివల్ల అమెరికా ముఖానికి గట్టి దెబ్బ తగిలిందని అన్నారు. ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల గురించి ప్రస్థావించిన ఖమేనీ… ఆ దాడుల వల్ల పెద్దగా నష్జమేమీ జరగలేదని.. ఆ దాడుల వల్ల అమెరికా పెద్దగా ఏమీ సాధించలేకపోయిందని అన్నారు.

ఈ సందర్భంగా… ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ అయుతుల్లా ఖమేనీ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఖమేనీ.. ‘అమెరికాపైనా, మోసపూరిత జియోనిస్ట్ పాలనపైనా విజయం సాధించినందుకు ఇరాన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను.. అలా చేయకపోతే జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనం అవుతుందని భావించి, అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి ప్రవేశించింది..అయితే, ఈ యుద్ధం నుండి అది ఏమీ సాధించలేదు’ అని అన్నారు.ఇదే సమయంలో…ఈ యుద్ధంలో ఇస్లామిక్ రిపబ్లిక్ విజయం సాధించిందని..ప్రతిగా అమెరికా ముఖానికి గట్టి దెబ్బ వేసిందని..కీలకమైన అమెరికా స్థావరాలలో ఒకటైన అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించిందని వెల్లడించారు.
***స్టేట్ ఇంచార్జీ.. ఫర్జానా..
👉👉👉ట్రంప్ విమర్శలతో హాట్ టాపిక్ అయిన భారత సంతతి జోహ్రాన్ మమ్దానీ అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ పేరు హాట్ టాపిక్‌గా మారింది.అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ పేరు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ మేయర్ రేసులో డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీలో అద్భుత విజయం సాధించిన మమ్దానీ, మేయర్ పదవికి అత్యంత చేరువలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తవడంతో ఆయన మేయర్ కావటం ఇక లాంఛనమేనని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడు” అంటూ ట్రంప్ మండిపడ్డారు. “డెమోక్రాట్లు హద్దులు దాటి పోయారు. మమ్దానీ మేయర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది భయంకరమైన స్థితి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా ట్రంప్ మమ్దానీ గాత్రం దురదృష్టకరమని,ఆయన తెలివితక్కువ వ్యక్తి అని ‘AOC ప్లస్ 3’ అనే పేరుతో కొందరు ప్రజాప్రతినిధులు మద్దతిస్తున్నారని ఎద్దేవా చేశారు.”మరోవైపు గొప్ప నాయకుడిగా చెప్పుకునే పాలస్తీనియన్ సెనేటర్ చక్ షూమర్ కూడా మమ్దానీకి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు” అని ట్రంప్ విమర్శించారు. ఇటీవలి కాలంలో ఒక అధ్యక్షుడు ఓ మేయర్ అభ్యర్థిపై ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ వ్యాఖ్యలు ఒక్కసారి కాకుండా చాలా తీవ్రంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో మమ్దానీ స్పందించాల్సి ఉన్నా, ఆయన ఇప్పటివరకు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించలేదు.అయితే ఆయన మేయర్‌గా బాధ్యతలు చేపడితే న్యూయార్క్ చరిత్రలో భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు. మొత్తానికి ట్రంప్ అసహనం స్పష్టంగా కనిపిస్తుండగా…మమ్దానీ విజయం మాత్రం కొత్త యుగానికి నాంది పలుకుతోందని అనేవారూ ఉన్నారు. అమెరికాలో వలసదారుల రాజకీయ చైతన్యం మరింత బలపడుతోందని విశ్లేషకుల అభిప్రాయం.
👉👉లోయలో పడ్డ బస్సు.. 10 మంది గల్లంతు*
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ బస్సు అలకనంద నదిలో పడి ఒకరు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. రుద్రప్రయాగ్ జిల్లా ఘోత్తీర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
👉విశాఖలో భారీగా పట్టుబడిన పీడీఎస్ బియ్యం..
పేదలకు అందించాల్సిన బియ్యం మూడు లారీల నిండా తరలింపు?..పార్టీల అండతో విశాఖలో పీడీఎస్ బియ్యం మాఫియా రెచ్చిపోతున్నట్లుగా ఆరోపణలు?
👉శ్రీశైలం వెళ్తున్న మినీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు*
తెలంగాణ : నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు బ్రేక్ ఫెయిలై దోమలపెంట బస్టాండ్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 30 మంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పూర్తి వివరాలు చేయాల్సి ఉంది.
👉 ఇటీవల సంచలనం కలిగించిన మర్రిపూడి ఎమ్ ఈ ఓ కార్యాలయ ఉద్యోగి హత్య కేసులోనీ ముద్దాయిల అరెస్ట్ చేసినట్లు కనిగిరి డి ఎస్పీ యశ్వంత్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ *ఈనెల 18 వ తేదీ పొదిలి కొండ సమీపంలో మర్రిపూడి లో మండల విద్యాశాఖ కార్యాలయం లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న కొల్లా రాజశేఖర్ హత్య కేసులో ప్రధాన ముద్దాయిలైన జగన్నాథం రాజశేఖర్, పల్లా అనూషలను అరెస్ట్ చేసి కోర్ట్ కు హాజరు పరుస్తున్నట్లు కనిగిరి డి ఎస్పీ యశ్వంత్ మీడియా సమావేశంలో తెలిపారు. కార్యక్రమంలో సి ఐ సోమశేఖర్, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.
👉 మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణమూర్తి తీరును నిరసిస్తూ ఉప కలెక్టర్ కు ఫిర్యాదు.. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో పనిచేస్తున్న, రెవెన్యూ సచివాలయ ఉద్యోగులపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న మార్కాపురం మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణమూర్తి తీరును నిరసిస్తూ ఉద్యోగులు గురువారం మార్కాపురం ఉప కలెక్టర్ కార్యాలయం నందు ఉప కలెక్టర్ సహదీద్ వెంకట్ త్రివినాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆ కారణం చేత తమ వేతనాలను కట్ చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈ ధోరణి రాష్ట్రంలో ఎక్కడా లేదని మేము పనులు చేయకపోతే మాపై ఉన్న సంబంధిత అధికారుల వద్ద నుండి మా పనులకు సంబంధించి డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని తదుపరి చర్యలకు పూనుకోవాలె తప్ప ఇలాంటి నోటీసు ఇవ్వకుండా కష్టపడి పనులు చేస్తున్న తమ వేతనాలను కట్ చేయడం దారుణమని వాపోయారు.ఒక్క మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సచివాలయ రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి 53 మందికి రావలసిన నెలసరి వేతనాల్లో లక్ష రూపాయల మేరకు అన్యాయంగా నగదును కట్ చేయడం దారుణమని ఉప కలెక్టర్ ఎదుట వాపోయారు. మున్సిపల్ కమిషనర్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు. ఒక మండల స్థాయి మెజిస్ట్రేట్ తన ఉద్యోగులకు సంబంధించి వేతనాలను ఎందుకు కట్ చేశారని మున్సిపల్ కమిషనర్ ను వాకాబు చేయగా నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్పడమే కాకుండా నో వర్క్ నో పే అంటూ నిర్లక్ష్య ధోరణితో చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తాలు సైతం సచివాలయ ఉద్యోగస్తుల అరియర్స్ బిల్లులపై సంతకాలు చేసేందుకు బిల్లును బట్టి తమకు పర్సంటేజ్ రూపంలో నగదు కేటాయించాలని బహిరంగంగా లంచంను డిమాండ్ చేస్తున్నారని సబ్ కలెక్టర్ ఎదుట ఉద్యోగస్తులు వాపోయారు వెంటనే మార్కాపురం ఉప కలెక్టర్, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మున్సిపల్ ఉద్యోగుల పట్ల నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్న మార్కాపురం కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.*స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
👉 ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మేజస్ట్రేట్ తమిమ్ అన్సారియా, ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొన్న సందర్బంగా ఎపి యన్ జి జి ఓ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె శరత్ బాబు మరియు కార్యదర్శి ఆర్ సి హెచ్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో కలసి అభినందనలు తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా కె శరత్ బాబు మాట్లాడుతూ జిల్లాను అభివృద్ది పథంలో నడిపిస్తూ ప్రజానీకానికి నిత్యం సేవ చేయాలని పరితపించే వ్యక్తి తమీమ్ అన్సరియా అని బంగారు బాల్యం కార్యక్రమానికి స్కొచ్ అవార్డ్ సాధించి జిల్లాను ప్రథమ స్థానం లో నిలిపారని భవిష్యత్ లో కూడా జిల్లాను అభివృద్ది పథంలో నడిపిస్తారు అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఆర్ సి హెచ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సరియ, మాట్లాడుతూ జిల్లా ను అభివృద్ధి పథం లో నడిపించడానికి క్రింది స్థాయి ఉద్యోగుల సహకారం ఎప్పుడూ తనకు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మంజేశ్, ఎపి యన్ జి జి ఓ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పి రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి షేక్ మోమిన్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలు కె కోటేశ్వరమ్మ ఒంగోలు పట్టణ ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా, వి హరిబాబు మరియు వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు పాల్గొని జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలియజేశారు
👉 విశాఖ: స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిలో మరో అడుగు
నేడు బ్లాస్ట్ ఫర్నేస్-3 పునఃప్రారంభం..బ్లాస్ట్ ఫర్నేస్-3ని ప్రారంభించనున్న..కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ..ఇప్పటికే అందుబాటులో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు.
👉 కర్నూలు: ఓర్వకల్‌లో రిలయన్స్ సంస్థకు భూకేటాయింపు..రూ.30 లక్షలకు రూపాయల చొప్పున 80 ఎకరాలు కేటాయింపు రూ.1,622 కోట్లతో ఏర్పాటుకానున్న రిలయన్స్ పరిశ్రమ
👉గిద్దలూరులో ఈనెల 30వ తారీఖున జాబ్ మేళా…*ప్రకాశం జిల్లా… గిద్దలూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30వ తారీఖున (సోమవారం రోజున) శ్రీ సాయి చైతన్య డిగ్రీ కాలేజ్ , గిద్దలూరు నందు 15 బహుళ జాతీయ కంపెనీలతో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జే రవితేజ యాదవ్ తెలియజేశారు.
ఈ జాబ్ మేళాకు ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్, ఎస్ ఇంగ్లీష్ అకాడమీ, మాస్టర్ మైండ్స్, హెడేరో డ్రగ్స్, ఎస్ ఎం ఎఫ్ జి ఇండియా క్రెడిట్ లిమిటెడ్ , Dixon టెక్నాలజీస్, మెడ్ వెస్ట్ గ్రానైట్స్,గూగుల్ పే,ఎస్బిఐ కార్డ్స్ మొదలగు బహుళ జాతీయ కంపెనీలు హాజరవుతున్నాయి.కావున గిద్దలూరు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లాలో 18 సంవత్సరముల నుంచి 30 సంవత్సరముల మధ్య గల పదవ తరగతి నుంచి పీ.జీ వరకు చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలియజేశారు.ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు జీతం 12,000 రూపాయల నుండి 25,000 వరకు ఇవ్వబడుతుందని తెలియజేశారు.మరిన్ని వివరములకు T.Nadan: 7997151082 నంబర్ను సంప్రదించాలని తెలియజేశారు..* నియోజకవర్గ రిపోర్టర్ ఎన్ వెంకటేశ్వర్లు..
** ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?*
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులకు నార్కో టెస్ట్ చేయించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచనల మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితులు రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పకు నార్కో టెస్ట్‌లు చేయనున్నారు.
***డ్రగ్స్ కేసులో నటుడు కృష్ణ అరెస్టు*
డ్రగ్స్ కేసులో నటుడు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఇదివరకే సమన్లు జారీ చేశారు. కేరళలో షూటింగ్‌లో ఉన్న ఆయన సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేయగా ఐదు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. 15 గంటలకు పైగా అధికారులు దర్యాప్తు చేశారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ తీసుకోలేదని తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన ప్రసాద్, నటుడు శ్రీకాంత్‌తో ఆయనకు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు.
👉ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం పేలి మహిళ మృతి*..కడప జిల్లా..యర్రగుంట్ల మండల పరిధిలో గల పోట్లదుర్తి గ్రామం నందు చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ వేకువ జామున ఒక్కసారిగా పేలడంతో పక్కనే నిద్రిస్తున్న మహిళ మృతి చెందింది.మృతి చెందిన మహిళ వెంకట లక్ష్మమ్మ (62) గా గుర్తింపు. స్కూటీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో పక్కనే సోఫాలో నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
***బోడాయిపల్లి లో ఘర్షణ*.. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది.ఇరు వర్గాలు వేటకోడవల తో దాడి చేసుకోగా పలువురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
👉అమెరికా ముఖంపై పిడిగుద్దు’.. సీజ్ ఫైర్ తర్వాత ఖమేనీ ఫస్ట్ రియాక్షన్!..👉ట్రంప్ విమర్శలతో హాట్ టాపిక్ అయిన భారత సంతతి జోహ్రాన్ మమ్దానీ..👉విశాఖలో భారీగా పట్టుబడిన పీడీఎస్ బియ్యం.. *కర్నూలు: ఓర్వకల్‌లో రిలయన్స్ సంస్థకు భూకేటాయింపు..👉 మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణమూర్తి తీరును నిరసిస్తూ ఉప కలెక్టర్ కు ఫిర్యాదు.. (ప్రకాశం జిల్లా మార్కాపురం)..*గిద్దలూరు లో 30 న జాబ్ మేళా..*హత్య కేసులోనీ ముద్దాయిల అరెస్ట్ : కనిగిరి డి ఎస్పీ యశ్వంత్ ..*ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం పేలి మహిళ మృతి(కడప జిల్లా)..*ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?* *బోడాయిపల్లి లో ఘర్షణ*అనంతపురం జిల్లా
Recent Posts

