👉ట్రంప్ కు కంటిమీద కునుకుపట్టని పని ఇరాన్ చేసేసిందా?..👉రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ అందించాలి :సీఎం చంద్రబాబు ..👉జగన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం, జన సమీకరణ కోసమే: వైయస్ షర్మిల..👉వైసీపీ లో చేరిన రాజంపేట టీడీపీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం*..👉మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం*..టెలికం రంగంలో రెండు కంపెనీల గుత్తాధిపత్యం మంచిది కాదు: కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా..👉కో లివింగ్ హాస్టళ్లపై VH సంచలన కామెంట్స్..👉విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులుసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి* *డి ఎస్ ఎఫ్ ఐ..👉అనంతపురం జిల్లాలో దారుణం…👉కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు👉ఏనుగు దంతాల స్మగ్లింగ్‌ గుట్టురట్టు..👉 సినీతారల ఫోన్ల ట్యాపింగ్ – సీక్రెట్‌గా స్టేట్‌మెంట్లు ?..మళ్లీ విస్తరిస్తున్న కాల్ మనీ విష సంస్కృతి..ఉరేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్య.. (మదనపల్లె) ..

👉ట్రంప్ కు కంటిమీద కునుకుపట్టని పని ఇరాన్ చేసేసిందా? పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు 12వ రోజు చల్లబడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు 12వ రోజు చల్లబడిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం మంగళవారం ముగిసింది! ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టినా, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా రంగంలోకి దిగినా.. అందుకు ప్రధాన కారణం ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనేదే!..
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. వాటివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని.. అందుకే ఆ దేశంలోని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అణు ఒప్పందాలపై చర్చలు సెట్ కావడం లేదంటూ అమెరికా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించేసిందనే విషయం తెరపైకి వచ్చింది! అవును… ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు అనే లక్ష్యంతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించగా, చివర్లో అమెరికా ఓ చెయ్యి వేసి పని పూర్తి చేసిందని చెబుతున్నారు. అయితే… ఇలా ఇజ్రాయెల్ ఒక పక్క, అమెరికా ఓ పక్క దాడులు చేసిన గ్యాప్ లో తాను అనుకున్న పనిని ఇరాన్ పూర్తి చేసిందనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీకి రెండు రోజుల ముందు, గత శుక్రవారం ఉత్తర ఇరాన్ లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే.. ఇది నిజంగానే భూకంపమా.. లేక, ఇరాన్ అణుపరీక్షలు నిర్వహించడం వల్ల భూమి లోపల ఏర్పడిన భారీ ప్రకంపనల ప్రభావమా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా నడిచింది. వినలేకపోతున్నాం..! అయితే ఆ ప్రచారం ఇప్పుడు అటు అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు వీరి మిత్ర దేశాల్ని సైతం కలవరపెడుతున్నాయని అంటున్నారు. తమ దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నామని, అణు స్ధావరాల్ని దెబ్బతీశామని, అందువల్ల ఇప్పట్లో ఇరాన్ అణుబాంబు గురించి ఆలోచించడమే కష్టమని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నాయి. సరిగ్గా ఈ సమయంలో… ఇరాన్ లోని సెమ్నెన్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో అణు పరీక్ష జరిగిందంటూ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఓ షాకింగ్ కథనాన్ని వెల్లడించింది. దీంతో… ఈ అణు పరీక్ష తర్వాతే ఉలిక్కిపడ్డ అమెరికా ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడులకు దిగిందన్న చర్చ మొదలైంది. దీంతో.. ఇప్పుడు ట్రంప్ & కో ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. దీనికితోడు… ఈ దాడుల్లో ఇరాన్‌ కు జరిగిన నష్టం గురించి పెంటగాన్‌ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఓ నివేదిక తయారుచేసింది. ఇందులో.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌ కు పరిమితమైన నష్టం మాత్రం వాటిల్లిందని తెలిపింది. ఇరాన్ కొన్ని నెలల్లోనే తన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేసుకోవచ్చని తెలిపింది! ఇలా ఓ పక్క తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ కథీనం, మరోపక్క పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక.. ట్రంప్ ను బిగ్ షాక్ కి గురిచేస్తున్నాయని అంటున్నారు! పైగా ఇప్పటికే సీజ్ ఫైర్ ప్రకటించేశారు! దీంతో… ట్రంప్ & కో నెక్స్ట్ ప్లాన్ ఏమిటనేది ఆసక్తిగా మారింది!
👉రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ఏఐని వినియోగించి రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉద్యోగావకాశాలు ఎక్కడున్నా గుర్తించి నైపుణ్యం వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. నైపుణ్యం పోర్టల్‌లో అందరినీ నమోదు చేయించాలన్నా రు. యువత పోర్టల్‌లో నమోదుచేసుకోగానే వెంటనే వారి రెజ్యూమ్‌ తయారయ్యేలా డిజైన్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.9.5 లక్షల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని, తద్వారా 8.5 లక్షల ఉద్యోగాలొస్తాయని తెలిపారు.ఐటీ కోర్సులు చేసిన యువత నైపుణ్యాలను అంచనా వేయాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన నైపుణ్య గణన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ప్రణాళికకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు కల్పించాలని సీఎం సూచించారు. 6వ తరగతి నుంచి పీజీ వరకూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పించాలన్నారు. విద్యా సంస్థల తో పరిశ్రమలను అనుసంధానం చేసి నైపుణ్య శిక్షణపై కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆధార్‌, అపార్‌ ఐడీలతో అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ను అనుసంధానం చేయాలన్నారు.
👉 న్యూఢిల్లీ: టెలికం రంగంలో రెండు కంపెనీల గుత్తాధిపత్యం ఏమాత్రం మంచిది కాదని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఏ రంగంలో అయినా పోటీ తప్పనిసరన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం (బీఐఎఫ్‌) నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ టెలికం రంగంలో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలదే పెత్తనం. ఈ రెండు కంపెనీలు 4జీ, 5జీ సేవలతో దూసుకు పోతుంటే, వొడా ఫోన్‌ ఐడియా కంపెనీ అప్పులు,నష్టాలతో కుదేలవుతోంది.ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌ అయితే ఇప్పటి వరకు కనీసం 4జీ సేవలు కూడా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
శాట్‌కామ్‌లకు త్వరలో స్పెక్టమ్‌: ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే కంపెనీలకు త్వరలోనే స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పూర్తి చేస్తామని సింధియా ప్రకటించారు. అయితే ఎప్పటిలోగా అనే విషయాన్ని మాత్రం వెల్లడించ లేదు. వేలం ద్వారా గాక, పాలనాపరమైన అనుమతుల ద్వారానే ఈ కేటాయింపులు ఉంటాయన్నారు. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌లింక్‌తో పాటు అనేక శాట్‌కాం కంపెనీలు ఇప్పటికే లైసెన్సులు పొంది తమ సేవల ప్రారంభానికి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కోసం ఎదురు చూస్తున్నాయి.
👉జగన్ మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం, జన సమీకరణ కోసమే చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు..గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
జగన్ మోహన్ రెడ్డి పై కేసు పెట్టింది పర్మిషన్ వైలేషన్ కోసమేనని అన్నారు. కారు సైడు బోర్డు పై జగన్ నిలబడటం వలన జనం షేక్ హ్యాండ్ ల కోసం ఎగబడబట్టే ప్రమాదం జరిగిందన్నారు.తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించారని మండిపడ్డారు.బల ప్రదర్శన యాత్రల వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.అందుకే జగన్ మోహన్ రెడ్డి పర్యటనలను ఈ ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు.దీనిలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని అన్నారు.బల ప్రదర్శన చేసే పర్యటనలను నిలుపుదల చేయాలని అన్నారు.
👉ఇల్లందు సిఐ సస్పెండ్*
ఉత్తర్వులను జారీ చేసిన మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి భార్య భర్తల మధ్య వివాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందులకు గాను మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ఇల్లందు సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసారు.పోలీసు అధికారులు గానీ,సిబ్బంది గానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖా పరమైన విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తప్పవని ఈ సందర్బంగా తెలియజేసారు.మరింత సమాచారం తెలియల్సి ఉంది..!!
👉అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం.. మళ్లీ విస్తరిస్తున్న కాల్ మనీ విష సంస్కృతి ..
వెలుగులోకి కాల్ మనీ వేధింపులు.. లక్ష రూపాయలు అప్పు ఇచ్చి రూ. 10 లక్షలు వసూళ్లు చేసిన వడ్డీ వ్యాపారులు..అప్పు తీర్చుకుంటే వ్యభిచారం చేయిస్తున్నారు అంటున్న బాధితులు.. 100 రూపాయలకు 45 రూపాయలు వడ్డీ తో బాధితుల నరకయాతన..20 మందికి పైగా బాధితులు
👉 ఉరేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్య..మదనపల్లె:
ఉరి వేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. ఎస్ఐ చంద్రమోహన్ వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా, ధర్మవరం కేతిరెడ్డి కాలనీలో ఉంటున్న చేనేత కార్మికుడు భోజనపు నాగరాజ మూడు రోజుల క్రితం మదనపల్లిలో ఉన్న కూతురు ఇంటికి వచ్చినట్లు తెలిసింది. మదనపల్లె – బెంగళూరు రోడ్డు, చిప్పిలి డైరీ వద్ద చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
👉చిలకలూరిపేట లో విజిలెన్స్ అధికారులు దాడి, పలు రికార్డులు తనిఖీ.* చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు.*
*మున్సిపల్ కార్యాలయంలో పలు రికార్డులు తనిఖీ.. ఏడుగురు విజిలెన్స్ అధికారులు బృందాలు గా ఏర్పడి రికార్డులు తనిఖీ చేసిన ఆఫీసర్స్.*
*ఆడుదాం ఆంధ్ర నిధులు అవకతవకలు పై విచారణ చేసిన విజిలెన్స్.. ఆడుదాం ఆంధ్ర నిధులకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక ఇస్తామన్నా చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు.*వార్డు సచివాలయల ద్వారా నివేదిక తీసుకుని విజిలెన్స్ అధికారులు కు ఇవ్వనున్నా మున్సిపాలిటీ అధికారులు.*స్టేట్ ఇంచార్జ్ ఫర్జానా**
👉వైసీపీ లో చేరిన రాజంపేట టీడీపీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం*మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షంలో వై ఎస్ ఆర్ సీ పీ పార్టీ లో చేరారు తమతో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లు గడికోట శ్రీకాంత్ రెడ్డి రమేష్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు
👉అనంతపురం జిల్లాలో దారుణం
భర్త సురేష్‌బాబును హత్య చేయించిన భార్య అనిత
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
భర్త హత్యకు ప్రియుడు ఫక్రుద్దీన్‌ను ఉసిగొల్పిన అనిత
స్క్రూడ్రైవర్‌తో పొడిచి హత్య చేసిన ఫక్రుద్దీన్‌
ఆరుగంటల్లోనే కేసు ఛేదించిన అనంతపురం రూరల్ పోలీసులు..ఫక్రుద్దీన్‌,అనిత అరెస్ట్‌
👉👉విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులుసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి*
*డి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర నాయకులు అజ్మీర వెంకట్*
హనుమకొండ : దేశవ్యాప్తంగా విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వవిద్యారంగ సమస్యల పరిష్కారం కై విద్యార్థులు ఉద్యమించాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో డిఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా డి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర నాయకులు అజ్మీర వెంకట్ మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ప్రభుత్వ విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటు కార్పొరేటు సంస్థలను ఒప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల తల్లితండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్ష లాగా మరిందని వారు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేయని ఎడల డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో అల్లెపు సాయి వర్ధన్ ఏ వంశీకృష్ణ బి భాస్కర్ రమేష్ చరణ్ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. స్టేట్ ఆర్డినేటర్ రెహ్మాన్
👉కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు*
సినిమాలకు దిట్టైనా సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా ఒకటి పోలీసుల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పదిమంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి, విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ల వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులను లక్ష్యంగా చేసుకుని, కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికే స్కామ్‌కు పాల్పడినట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు, రక్త నమూనాలు అన్నీ ఫోర్జరీ పత్రాలతో సిద్ధం చేసి, బాధితులను మరియు దాతలను ఏర్పాటుచేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఆపరేషన్ సమయం దగ్గరపడినప్పుడు, ముఠా సభ్యులు బాధితులను వదిలేసి పారిపోతూ, డబ్బులను పంచుకునే కుతంత్రం చేపట్టినట్లు చెప్పారు. గతేడాది డిసెంబరులో కోదాడ శ్రీరంగపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇదే విధంగా మోసానికి గురై, 22 లక్షలు కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఈ ముఠా ద్వారా దాదాపు పదిమందికి పైగా చట్టవిరుద్ధంగా కిడ్నీలు మార్పిడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ముఠాలోని ఆరుగురు.. కడుపూరి తాతారావు, కొండం రమాదేవి, బొందిలి పృద్వీరాజు, కొడాలి బాబూరావు, కందుకూరి విష్ణు వర్ధన్ బాబు, మహమ్మద్ సర్దార్ లు ఇప్పటికే అరెస్టుకాగా, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా విచారణ జరిపి నిందితులను పట్టుకున్న సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, సీసీఎస్ సీఐ శివకుమార్ మరియు వారి బృందాన్ని డి.ఎస్.పి అభినందించారు.
👉👉👉ఏనుగు దంతాల స్మగ్లింగ్‌ గుట్టురట్టు.
రాచకొండ పోలీసులు, అటవీ శాఖ జాయింట్‌ ఆపరేషన్‌.
స్మగ్లర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.
ప్రసాద్‌ నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం.
ఏనుగు దంతాల విలువ కోట్లలో ఉంటుందంటున్న పోలీసులు..తిరుపతి జిల్లా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి..ఏనుగు దంతాలు తీసుకొచ్చినట్టు అనుమానం.
👉👉👉కో లివింగ్ హాస్టళ్లపై VH సంచలన కామెంట్స్*
ఒకే హాస్టల్లో యువతీయువకులు కలిసి ఉండటం అనైతిక ప్రవర్తనకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించాలని సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబును ఆయన కోరారు. హైదరాబాద్ను నంబర్ వన్ సిటీగా ఉంచాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలని, లేకపోతే లవ్ మర్డర్లు పెరిగే అవకాశం ఉందని హనుమంతరావు హెచ్చరించారు.
👉👉👉తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది: హీరో విజయ్*
తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది: హీరో విజయ్
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్టుతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. దీనిపై హీరో విజయ్ ఆంటోనీ స్పందిస్తూ, ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం కొత్త కాదని, గతంలోనూ ఇది జరిగిందని అన్నారు. శ్రీరామ్ కేసులో నిజాలు త్వరలో బయటపడతాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తానన్న వార్తలు వాస్తవం కాదని, తాను అందుకు సిద్ధంగా లేనని విజయ్ ఆంటోనీ తెలిపారు.
👉👉మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం*

మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం
మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులు రిషబ్ ఓస్వాల్, కొత్తపేట తేజశ్వినిలకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాలలో అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించిన సందర్భంగా వారిని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈనెల 23వ తేదీన రాష్ట్రపతి అభినందించారు. Lడిసెంబర్ 2024 అటెంట్‌లో రిషబ్ ఓస్వాల్, అలాగే జూన్ 2024 అటెంట్‌లో కొత్తపేట తేజశ్విని ఈ ప్రతిష్టాత్మక అఖిల భారత ఫస్ట్ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన విజయంపై మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గ మాట్లాడుతూ.. వివిధ కామర్స్ కోర్సులలో తమ విద్యార్థులు ఇప్పటివరకు 55 సార్లు ఫస్ట్ ర్యాంకులు సాధించినప్పటికీ, ఫైనల్ లెవల్లో ఒకేసారి ఇద్దరు విద్యార్థులకు అఖిల భారత ఫస్ట్ ర్యాంకులు రావడం చాలా అరుదైన సంఘటన అని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, వారికి సహకరించిన తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం మాస్టర్ మైండ్స్ నాణ్యమైన విద్యకు, విద్యార్థుల అంకితభావానికి నిదర్శనమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
👉👉 సినీతారల ఫోన్ల ట్యాపింగ్ – సీక్రెట్‌గా స్టేట్‌మెంట్లు ?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో క్లారిటీకి తెచ్చుకున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వారికి తెలుసో లేదో కానీ.. ట్యాపింగ్ కు గురయినట్లుగా అనుమానం ఉన్న అందర్నీ పిలిచి స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు. అయితే రాజకీయ నేతలు ఓకే.. మరి సినీ తారలసంగతేమిటి అన్న ప్రశ్న వస్తోంది.
సినీతారల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోన్ ట్యాపింగ్ తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్ కు ఎవరిచ్చారని.. ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్ఱశ్నించారు. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే వారి వద్ద నుంచి కూడా స్టేట్‌మెంట్లు తీసుకోవాలి కదా అన్న సందేహం చాలా మందికి వస్తోంది..బీజేపీ నేతల నుంచి స్టేట్ మెంట్లు తీసుకున్నారు. కాంగ్రెస్ నేతల నుంచి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతల్ని కూడా బిలవబోతున్నారు. మీడియాలో.. వేమూరి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా గుర్తించారు. ఆయన స్టేట్ మెంట్ కూడా రికార్డు చేస్తున్నారు. సమరి సినీతారలది ఎందుకు చేయడం లేదు ?. ఈ విషయంలో పోలీసులు గుంభనంగా వ్యవహరిస్తున్నారని.. ట్యాపింగ్ కు నెంబర్లను బట్టి వారి వద్ద సైలెంట్ గా స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా బయటకు రావొద్దని వారు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.అయితే సాక్షుల వివరాలను కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడయినా బయటకు రావడం ఖాయమని అనుకోవచ్చు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..