👉ఏపీలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు: సీఎం చంద్రబాబు*

ఏపీ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి.అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడే నాయకులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. యూపీ, బీహార్లో జనాభా బాగా పెరుగుతోంది.యూపీ, బీహార్ మినహా మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరగడం లేదు. పిల్లలు భారం కాకూడదు.. వారిని ఆస్తిగా పరిగణించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు.
👉నాలుగు రాష్ట్రాలలో బిజెపికి షాక్..!!! దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐదు అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. గుజరాత్ లో రెండు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కటి చొప్పున అసెంబ్లీ స్థానాల్లో జూన్ 19న పోలింగ్ జరిగింది. ఈమేరకు తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి. తాజా ఫలితాల్లో గుజరాత్ లోని విసావదార్, కాదీ స్థానాల్లో ఒకటి ఆప్, మరొకటి బీజేపీ గెలుచుకున్నాయి. కాదీలో బీజేపీ గెలుపొందగా.. విసావదార్ స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఆప్ గెలుపొందడం ఓ రకంగా బీజేపీకి షాకింగ్ అని చెప్పొచ్చు.
ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే.. కేరళలోని నీలాంబూర్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే పంజాబ్ లోని లుధియాన వెస్ట్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవలం చేసుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్ లోని కాలీగంజ్ స్థానంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మొత్తం ఐదు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం ఒక్కచోట మాత్రమే విజయం సాధించడం గమనార్హం.ఆప్ రెండు చోట్ల విజయ దుందుభి మోగించింది.గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానంలో ప్రస్తుత శాసనసభ్యులు మరణించారు. ఇక కేరళ, గుజరాత్ లో ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలను నిర్వహించింది ఎన్నికల కమిషన్.
👉 కాల్పుల విరమణ ఫలించేనా… అమెరికా మాటలు నమ్మదగినవేనా..!!!… ఇదే పని అమెరికా ముందే చేసి ఉంటే వేలాదిమందికి ఆస్తి నష్టం,ప్రాణ నష్టం వాటిల్లి ఉండేది కాదు కదా.. మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి అంటూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరగనుందని తెలిపారు. ఇదే సమయంలో..24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు టెహ్రాన్ నుంచి భిన్నమైన ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగా.. తొలుత అలాంటి ఒప్పందమేదీ లేదని పేర్కొన్న ఇరాన్.. ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్లు సూచనప్రాయంగా చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రెండు విభిన్న పోస్టులు చేశారు. అయితే.. ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఇంకా ప్రకటన రాలేదు. మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా… మంగళవారం తెల్లవారుజామున టెల్ అవీవ్ లక్ష్యంగా టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించిందని.. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకొని దడులు చేసిందని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదే సమయంలో… ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ వాసులు చనిపోయినట్లు ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం ఉదయం 7:15 గంటల తర్వాత కూడా దాడులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఐడీఎఫ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది! ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి స్పందించారు.ఇందులో భాగంగా.. నేటి తెల్లవారుజామున ఇజ్రాయెల్ – ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పిన ట్రంప్… ఇప్పటినుంచి సుమారు ఆరు గంటల తర్వాత ఇరు దేశాలు పరస్పరం తుదివిడత దాడులు పూర్తి చేసుకొని గాయపడిన తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయని అన్నారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత 12వ గంట నుంచి ఇజ్రాయెల్ కాల్పుల విరమణను మొదలుపెడుతుంందని.. ఈ విధంగా 24 గంటల తర్వాత 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు లభిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం అమల్లో ఉన్న వేళ పరస్పరం శాంతియుతంగా, గౌరవ ప్రదంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ట్రంప్ మాటలు ఇలా ఉంటే ఇరాన్ వ్యవహారం మరోలా ఉందని అంటున్నారు. అమెరికా మాటలు విశ్వసించదగినవిగా లేవని ఇరాన్ నమ్మనట్లు సమాచారం.. ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కాల్పుల విరమణ పాటిస్తామని చెబుతోంది. ట్రంప్ ప్రకటించిన 6 గంటల గడువు ముగిసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ పై మరిన్ని క్షిపణులు ప్రయోగించినట్లు వార్తలొస్తున్నాయి.దీంతో… ఇరాన్ ఉద్దేశ్యం ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఇరాన్… ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలిపింది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చే ముందు చివరిసారిగా ఆ దేశంపై మిసైల్ అటాక్ చేసినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్.. తాజాగా (చివరిగా) ఇరాన్ తమపై ఆరు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. దీంతో… చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని ఇరాన్ భావించినట్లుందని అంటున్నారు నెటిజన్లు. ఆ సంగతి అలా ఉంటే… ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం టెహ్రాన్ ను ట్రంప్ ప్రాధేయపడ్డారని.. ఖతార్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విజయవంతంగా దాడి చేయగానే ఇజ్రాయెల్ తో బలవంతంగా కాల్పుల విరమణ అంగీకరింపజేశారని ఇరాన్ మీడియా చెప్పడం గమనార్హం. **కాగా శాంతి చర్చలు జరుపుతామని యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తామని నీతి వాక్యాలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా ఇరాన్ పై దాడులు చేయడం అమానవీయ చర్య అని మానవ హక్కుల సంఘాలు,పౌర హక్కుల సంఘాలు ఖండిస్తున్నాయి.. స్టేట్ ఇంచార్జ్ ఫర్జానా..
👉జీవో నెంబర్ 5 సవరణ చేయాలి..గ్రామ సచివాలయ ఉద్యోగుల డిమాండ్.. కురిచేడు మండల స్థాయి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 5 గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది కలిగిస్తుందని కురిచేడు మండల తహసిల్దార్ మరియు మండల అభివృద్ధి అధికారి వారిని కలిసి నిరసన తెలుపుతూ తమ డిమాండ్లను మరియు G O no 5 ను సవరణ చేయాలని, మరియు ఇతర డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని వినతులు అందజేశారు..
👉15.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్న కావలి రైల్వే పోలీసులు*.. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను అదుపులో కి తీసుకొని వారి వద్ద నుంచి 15.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డి. ఎస్.ఆర్.పి. జి.మురళీధర్ తెలిపారు. నెల్లూరు,కావలి,గూడూరు రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేయగా 23వ తేదీ కావలి రైల్వేస్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారి వద్ద ఉన్న 15.5 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరస్తామని తెలిపారు.
👉ఏపీలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు: సీఎం చంద్రబాబు..👉 కాల్పుల విరమణ ఫలించేనా… అమెరికా మాటలు నమ్మదగినవేనా..* నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలలో బిజెపికి షాక్.. 👉15.5 కిలోలు గంజాయి స్వాధీనం (కావలి)👉జీవో నెంబర్ 5 సవరణ చేయాలి..గ్రామ సచివాలయ ఉద్యోగుల డిమాండ్..
Recent Posts

