👉 ‘బ్రెడ్ బదులు ఇసుక తింటున్నాం’…గాజా బాలుడి వీడియో వైరల్! అవును… గాజాలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హమాస్ ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో ఉన్న ఇజ్రాయెల్… గాజాను గడగడ లాడించేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అద్భుతంగా కనిపించిన ఆ నగరం ఇప్పుడు శిథిలమైపోయిన భవనాల కాంక్రీట్ కుప్పలతో నిండిపోయింది. ఇక అక్కడి ప్రజల పరిస్థితి రోజు రోజుకీ మరింత దయనీయంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఓ బాలుడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అవును…గాజాలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 అక్టోబర్ లో తమ పౌరులను హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోసిన పనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్య.. గాజా భవిష్యత్తును మొత్తం మార్చేసింది. ఈ దాడులు సుమారు ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి పౌరుల జీవితాలు అత్యంత దయనీయంగా మారిపోయాయి. ప్రస్తుతం, ఇజ్రాయెల్ పరిమిత మొత్తంలో ఆహారం, మందులను మాత్రమే అనుమతిస్తుంది. ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. ఇటీవల ఆహార వాహనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ సైనిక దళాలు కాల్పులు జరిపిన పరిస్థితి. ఈ సందర్భంగా సుమారు 70 మంది వరకూ మరణించినట్లు చెబుతున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో… గాజాలో ప్రజలు ఆహారం లేకపోవడంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిలో.. గాజాలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ఒక చిన్నారి వీడియో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ బాలుడు ఆహారం కోసం ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో.. ఇది చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గాజాలో తమకు తినడానికి ఆహారం లేదని.. ప్రతిరోజూ ఆహారం, ఇతర సామాగ్రితో ట్రక్కులు గాజాలోకి వస్తాయని.. కానీ మాకు దాని నుండి ఏమీ లభించడం లేదని ఆ బాలుడు వీడియోలో అన్నాడు. ఇదే సమయంలో… ‘మేము తిండి లేక ఇసుక తింటున్నాము.. మాకు తిండి లేదు.. ఎక్కడా ఆహారం లేదు.. వంట చేయడానికి పిండి కావాలి.. మాపై దయ చూపండి.. దయచేసి కరుణించండి.. మాకు తిండి లేదు.. మేము రొట్టెకు బదులుగా ఇసుక తింటున్నాము.. దయచేసి కాస్త కరుణ చూపండి..’ అంటూ ఆ బాలుడు ప్రపంచాన్ని వేడుకోవడం అందరిని కలిచివేస్తుంది
👉యోగాంధ్రపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల..
విశాఖలో ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి పైత్యం పరాకాష్టకు చేరింది. యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసి బిడ్డలను అవస్థలు పెడతారా? తిండీ తిప్పలు లేకుండా కడుపులు మాడ్చుతారా? వేలమంది బిడ్డలను రూముల్లో వేసి కుక్కుతారా? గిరిజన బిడ్డలనే కదా ఈ ప్రభుత్వానికి చిన్నచూపు’ అని ‘X’లో పోస్ట్ చేశారు.

👉దళితులైన మాదిగల అనుభవంలో ఉన్న భూమిని కబ్జా చేసిన అగ్రవర్ణాలకు చెందిన భూ కబ్జాదారులు..
వీరబల్లి మండలం మట్లి గ్రామం కొత్తపల్లి దళితవాడలోని సర్వే నంబర్ 2225 /1 లోని మూడు ఎకరాల మాదిగల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని గాలివీటి వీర నాగిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వేనెంబర్ 1516 లో మా పేరులో ఉన్న 39 సెంట్లు భూమిని కూడా కబ్జా చేసి మాపై దౌర్జన్యం చేస్తున్నాడని, బ్రిటిష్ కాలం నుండి మా పెద్దల అనుభవంలో ఉన్న భూమిని అగ్రవర్ణాలకు చెందిన వీర నాగిరెడ్డి, చిన్నారెడ్డి, పెద్దరెడ్డి కబ్జా చేశారని గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా మాకు న్యాయం జరగలేదని గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లామని ఆయన స్పందించి మండల ఎమ్మార్వోకి చెప్పగా ఎమ్మార్వో మా సమస్యపై స్పందించకుండా ఈరోజు చూద్దాం రేపు చూద్దాం అంటూ ముఖం చాటేస్తూ మాకు అన్యాయఓ చేస్తున్నారు అని తెలిపారు.
👉 ప్రొద్దుటూరులో మహిళను బూటుకాలితో తన్నిన సీఐ..!!!అవమానంతో ఆత్మహత్యకు సిద్ధమైన మహిళ
ఓ కేసు విషయంలో స్టేషన్‌కు పిలిచి వేధించినట్లు పేర్కొన్న తల్లీకొడుకులు.మహిళ అని కూడా చూడకుండా వన్‌టౌన్ సీఐ గేట్ నుంచి లాక్కెళ్లి మరీ దారుణంగా కొట్టారని బాధితురాలు వాపోయింది. మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా సీఐ బూటు కాలుతో తన్నాడు.స్టూడెంట్ అని కూడా చూడకుండా స్టాఫ్ మొత్తం కలిసి కొట్టారు. మాకు ఈ అవమానంతో బతకాలని లేదు.
మా చావుకు కారణం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది
అంటూ వాపోయిన బాధితులు
👉*నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు అస్వస్థత…*
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు 9 మంది మొలకలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి కళాశాల సిబ్బంది. హుటాహుటిన తరలించారు. విద్యార్థినులకు చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందవద్దని చెప్పారు.
👉ఎమ్మార్వోకు లంచం ఇస్తూ వీడియో రికార్డ్ చేసిన రైతు!*
7 వేలే ఇస్తావా ? ఇంకొక వెయ్యి రూపాయలు ఇవ్వు అంటూ రైతును లంచం అడిగిన ఎమ్మార్వో రాజారావు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన రైతు తన పాస్ బుక్ లో భూ పట్టా పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో..రైతు వీడియో రికార్డ్ చేస్తున్నాడని తెలియక 7 వేలే ఇస్తారా, ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వండి అంటూ లంచం అడిగిన ఎమ్మార్వో..
👉ఆక్రమణలు తొలగింపు* *పాదచారులకు, వాహన చోదకులకు ఇక్కట్ల*. *దృష్టి సారించిన వన్ టౌన్ పోలీసులు* విజయవాడ వన్ టౌన్,
30 అడుగుల రోడ్డు… 20 అడుగులు ఆక్రమణలే… ఇక ఆపై మిగిలింది 10 అడుగులే…
వాహనాలు ఏ విధంగా ప్రయాణిస్తాయి… ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు…
విచ్చలవిడిగా ఆక్రమణలు ప్రోత్సహిస్తున్నది ఎవరు…. పాద చారులు, వాహన చోదకుల నుంచి విన్నపాల నేపథ్యంలో ఆక్రమణలు తొలగించే కార్యక్రమానికి వన్ టౌన్ పోలీసులు శ్రీకారం చుట్టారు.
వన్ టౌన్ ప్రాంతం అనగానే చిన్న రోడ్లు అనే భావనలోనే ఉన్నారు తప్ప నిజానికి ఆ రోడ్డు సైతం పెద్ద రహదారులే.. 30 అడుగుల నుంచి 40 అడుగుల వరకు పలుచోట్ల రోడ్లు వెడల్పు ఉన్నప్పటికీ రోడ్డుకి ఇరువైపులా
ఆక్రమణులు జరగడంతో ఆ రోడ్లన్నీ 10 అడుగుల రోడ్డుగా మారిపోయాయి.
*పశ్చిమ ఏసీపి దుర్గారావు*,
*వన్ టౌన్ సిఐ గురు ప్రకాష్* *ప్రత్యేక చొరవ*
వన్ టౌన్ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యపై ఆక్రమణల పరంపరపై విజయవాడ పశ్చిమ ఏసిపి దుర్గారావు ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ దుర్గారావు,
వన్ టౌన్ సిఐ గురు ప్రకాష్ ఆదేశాల మేరకు వన్ టౌన్ లోని వివిధ రహదారులు ఆక్రమణలు తొలగించే కార్యక్రమానికి వన్ టౌన్ పోలీసులు శ్రీకారం చుట్టి ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.
వన్ టౌన్ ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాత శివాలయం వీధి, ఐరన్ సెంటర్, మెయిన్ బజార్ లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు.
*ఆక్రమణ చేపడితే కఠిన చర్యలు*
ప్రయాణికులకు పాద చారులకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్డుకు అడ్డంగా ఆక్రమణలు చేపడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు వారు హెచ్చరించారు. ఆక్రమణలు తొలగించిన పోలీసువారికి ఏసీపి,దుర్గారావు,సి ఐ గురు ప్రకాష్, వన్ టౌన్ పోలీస్, ట్రాఫిక్ అధికారులకు, సిబ్బందికి ప్రయాణికులు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
👉క్రీడాకారిణులపై కోచ్ – కామ క్రీడలు*ఏలూరు జిల్లా : ఏలూరు *జరిగిన ఘటన వాస్తవమేనని నిర్ధారించిన బెంగళూరు నుండి వచ్చిన స్పోర్ట్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్.**వినాయక్ ప్రసాద్(59) – కోచ్.*
ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) హాస్టల్ ఇన్చార్జి & అథ్లెటిక్స్ కోచ్ వినాయక్ ప్రసాద్..
విజయవాడలో స్పోర్ట్స్ అకాడమీ హాస్టల్ నుండి మొదలు…20 సంవత్సరాల పైచిలుకు నుండి వినాయక్ ప్రసాద్ (కోచ్) లైంగిక వేధింపుల బారిన పడిన (వందల సంఖ్యలో)ఎంతోమంది క్రీడాకారిణిలు.
ఇప్పుడు వెలుగులోకి 10 మంది క్రీడాకారిణిలు.
*వివరాల్లోకివెళితే..*ఏలూరులో ఉన్న స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (సాయి) లో శిక్షణ పొందుతున్న బాలికలు లైంగిక వైదింపులకు గురవుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందటంతో బెంగుళూరు నుంచి వచ్చిన ఓ అధికారుల బృందం శాయ్ లో విచారణలో చేపట్టింది.శనివారం అక్కడ వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, తదితర విభాగాల్లో శిక్షణ పొందుతూ వసతి పొందుతున్న బాలికలను శనివారం ఆ అధికారులు విచారించి,పూర్తి వివరాలు వారివద్ద రాబట్టారు. లైంగిక వేదింపులు వాస్తవమేనని తెలుసుకుని ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు.
👉సైబర్ మోసగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ.వి.విద్యాసాగర్ నాయుడు
*అన్నమయ్య జిల్లా*రాయచోటి, జూన్ 22: జిల్లా ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి వలలో పడవద్దని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. ముఖ్యంగా, గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఏపీకె పైల్స్, జీమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. లాటరీ తగిలిందని, బహుమతులు వచ్చాయని చెప్పే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని కోరారు. అలాగే, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సురక్షితమైన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని ఎస్పీ నొక్కి చెప్పారు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు అనుమానం వస్తే, వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలను కోరారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సైబర్ మోసాలను నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
👉ఇజ్రాయెల్ – ఇరాన్ భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ..వార్నింగ్ కూడా ఇవ్వకుండా బాంబింగ్ ఇదేమి న్యాయం..

ఇజ్రాయెల్ – ఇరాన్ భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది.ఇందులో భాగంగా… ఇరాన్ లోని అత్యంత కీలక అణుకేంద్రాలైన ఫోర్డో, ఇస్ఫాహన్, నతాంజ్ లపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.దీనిపై ఇరాన్ స్పందించగా.. ఇజ్రాయెల్ లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రెట్టింపు అయ్యాయని అంటున్నారు.అవును… తమ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడంపై ఇరాన్ స్పందించింది. ఇందులో భాగంగా..అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని హెచ్చరించింది. ఇదే సమయంలో… అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలోని యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. వాస్తవానికి ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఎంట్రీపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ తెలిపారని వైట్ హౌస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే ట్రంప్ ఇరాన్ పై దాడులు చేశారు. ఈ సందర్భంగా… అమెరికా భారీ బంకర్ బ్లస్టర్ బాంబులు ఫోర్డోపై వేసిందని.. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ట్రంప్. దాడుల అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్… అమెరికాకు, తమ పౌరులకు నష్టం కలిగించేలా ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకున్నా అగ్రరాజ్యం తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. తన మాటలను పెడచెవిన పెట్టి.. టెహ్రాన్ ప్రతీకార చర్యలకు పాల్పడితే మాత్రం శనివారం రాత్రి టెహ్రాన్ పై చేసిన దాడుల కంటే తీవ్రంగా, గతంలో ఎన్నడూ చూడని విధంగా విరుచుకుపడతామని అన్నారు. ఇజ్రాయెల్ లో హైఅలర్ట్: ఇలా ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా… టెహ్రాన్ తమపై మరిన్ని దాడులు చేసే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది. అమెరికాలోనూ హైఅలర్ట్!: ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి.ఈ నేపథ్యంలో తమ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు అమెరికా ముందుగానే జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా… వాషింగ్టన్ తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా… ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. ఈ సందర్భంగా స్పందించిన న్యూయార్క్ పోలీసులు… ఇరాన్ లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి బెదిరింపులూ రాలేదని అన్నారు!
👉 400 మైళ్ల దూరం నుంచి… ఇరాన్ పై అమెరికా ఎలా దాడి చేసిందంటే..! ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఇరాన్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న కీలకమైన ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని అమెరికా నాశనం చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ వెల్లడించారు. దీంతో.. అసలు ఈ మిషన్ ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్..! అవును… ఎవరూ ఊహించని రీతిగా అన్నట్లుగా పశ్చిమాసియాలో భీకరంగా జరుగుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా… ఇరాన్ లోని మూడు అణుశుద్ధి కేంద్రాలపై భీకర దాడులు చేసింది. ఇరాన్ గగనతలం లోకి ప్రవేశించకుండానే ఈ దాడులు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఇది తమ సైనిక విజయమని అన్నారు.అయినా రూ.26 లక్షల జీతం..? వాస్తవానికి ఇరాన్ పై అమెరికా మరో రెండు వారాల వరకూ దాడులు చేయదన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది.ఈలోపే ట్రంప్ పని పూర్తి చేసేశారు. దీనికోసం ఆరు బీ-2 స్టెల్త్ బాంబర్లు 12 బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు అమెరికా మీడియా సంస్థ సీ.ఎన్.ఎన్. రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. వీరిలో రెండింటిని నంతాజ్ పై వాడినట్లు తెలిపింది.ఇదే సమయంలో… ఇస్ఫహాన్, నతాంజ్ పై అమెరికా సబ్ మెరైన్ సుమారు 400 మైళ్ల దూరం నుంచి 30 టోమహాక్ క్షిపణులను ప్రయోగించాయి.ఈ క్రమంలో ముందుగా… ఆరు బీ-2 బాంబర్స్ నాన్ స్టాప్ గా 37 గంటలు ప్రయాణించాయి. ఈ క్రమంలో మార్గమధ్యలో పలుమార్లు గాల్లోనే ఇంధనం నింపుకుంటూ వెళ్లాయి. ఇంటెలిజెన్స్ షాకింగ్ రిపోర్ట్! వాస్తవానికి తొలుత ఫోర్డోపై దాడికి ఒక్కోటి 13,600 కిలోల బరువుండే రెండు జీబీయూ-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే… ఈ ఆపరేషన్ లో ఏకంగా ఆరింటిని ప్రయోగించడం గమనార్హం. ఈ క్రమంలో 13,600 కిలోల బరువు, 20 అడుగుల పొడవు ఉండే ఈ బంకర్ బస్టర్ బాంబులలో.. తొలుత ఒక బాంబును ప్రయోగించి కొంత లోతు వరకూ ధ్వంసం చేసిన తర్వతా.. మరో బస్టర్ ను అక్కడే ప్రయోగించి మరింత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చేశారని అంటున్నారు. దీంతో.. ఫోర్డ్ అణుశుద్ధి కేంద్రం పూర్తిగా నాశనమైందని చెబుతున్నారు.
👉ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన సౌదీ అరేబియా
ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం సరికాదు..
రాజకీయ పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం కృషి చేయాలిఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి-సౌదీ

