👉 కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌..👉సొంత పార్టీ నేతలకు చురకలు.*👉 టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ స్వైర విహారం.. 👉సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని భావించలేం: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..సివిల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసుల పట్ల హైకోర్టు సీరియస్ ..👉 నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌.!!..👉 భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!..👉 టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ స్వైర విహారం..👉 ఆ వ్యక్తిని చంపేస్తే సమస్య పోతుంది…నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!..👉 ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు…*నూతన కమిషనర్ ను కలిసిన గిద్దలూరు పట్టణ టిడిపి నాయకులు*

👉సొంత పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు చురకలు.*
*ఎమ్మెల్యేల పనితీరుపై మొన్న సర్వే చేయించా.*
*ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్.. లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.* *కార్యకర్తలే అధినేత.. కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా.. వాళ్ల మద్దతు లేకపోతే పక్కన పెడతా :
👉 కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌
మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం
అప్పు తీర్చలేదని మహిళను..చెట్టుకు కట్టేసి దాడి చేసిన మునికన్నప్ప.ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు
నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామన్న ఎస్పీ
ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న సీఎం
బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్న చంద్రబాబు
నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం..

👉న్యాయస్థానం చేసే పని కూడా పోలీసులే చేస్తారా ?…
పోలీసులు శాంతి భద్రతల కంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..సివిల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసుల పట్ల హైకోర్టు సీరియస్ ..
హైదరాబాద్ – బార్కస్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి స్థలంపై హైకోర్టులో పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని బాధితుడిని బెదిరించిన పోలీసులు..
దీంతో పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు..బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, పోలీసులపై తీవ్రంగా మండిపడ్డ హైకోర్టు..
శాంతి భద్రతలకంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఎందుకు ? హైకోర్టులో ఉన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోమని చెప్పడానికి మీరెవరు ? అంటూ పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం ..
ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా ? ఎండలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి పోలీస్ స్టేషన్లో కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వరు, స్టేషనరీ కూడా ఫిర్యాదుదారుడే తెచ్చుకోవాలని చెప్తున్నారని పోలీసులపై మండిపడ్డ హైకోర్టు..
ఇకనైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని, బాధితుడిని బెదిరించిన పోలీసులపై విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టు ..
న్యాయస్థానాలు చేసే పని చేయడానికి ప్రయత్నించడం ఆపేయాలని, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హెచ్చరించిన హైకోర్టు..
👉 నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌.!!
ఏపీలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం..
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది.దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.
రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్‌ క్లియర్‌ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్‌ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్‌-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్‌-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి.
జన గణనతో ముడిపెట్టిన కేంద్రం
జమ్మూ కశ్మిర్‌లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు..జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్‌-26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్‌ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది.
ప్రజల సౌకర్యం.. పాలన సౌలభ్యమే ప్రాతిపదికగా:
జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం.
వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది.
👉 ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు…శాన్‌ఫ్రాన్సిస్కో-కోల్‌కతా-ముంబై..
ఎయిర్‌ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం
కోల్‌కతాలో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానం
అర్ధరాత్రి 12.45 గంటలకు కోల్‌కతా వచ్చిన విమానం
తెల్లవారుజామున 2 గంటలకు ముంబై బయలుదేరాల్సిన విమానం..విమానం ఎడమ ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తింపు…భద్రతా కారణాల దృష్ట్యా..కోల్‌కతాలోనే ప్రయాణికులను దించేసిన సిబ్బందినిన్న హాంకాంగ్-ఢిల్లీ ఎయిర్ ఇండియా..డ్రీమ్‌లైనర్ విమానంలోనూ సాంకేతిక సమస్య
👉 ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు..తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన ఇరాన్‌
అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసిన ఇజ్రాయెల్‌
లెబనాన్‌, జోర్డాన్‌, ఇరాక్‌లోనూ..విమానాల రాకపోకలు నిలిపివేత..విమానాల నిలిపివేతతో ప్రయాణికుల ఇక్కట్లు

👉సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని భావించలేం: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..యూనిఫాం లేకుండా, సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అధికారిక విధుల్లో ఉన్నట్లు భావించలేమని, వారి చర్యలు చట్టపరమైన అరెస్టు కిందకు రాదని స్పష్టం చేసింది.
2015 జూన్ 16న పంజాబ్‌లోని అమృత్‌సర్ వద్ద జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 9 మంది పోలీసులపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. డీసీపీ పరమ్‌పాల్ సింగ్ సహా పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి యత్నించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను కూడా విచారణకు లోబరచాలని ధర్మాసనం ఆదేశించింది.
ఘటన వివరాలు:
2015 జూన్ 16న సాయంత్రం 6.30 గంటల సమయంలో ముఖ్జీత్ సింగ్ అనే వ్యక్తి తన హ్యూండాయ్ i-20 కారులో వెళ్తుండగా, బొలేరో, ఇన్నోవా, వర్నా కార్లలో వచ్చిన 9 మంది పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. వారంతా సివిల్ దుస్తుల్లో ఉన్నారు. తుపాకులతో ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముఖ్జీత్ అక్కడికక్కడే మరణించాడు. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు వ్యక్తులు వెంటనే స్థానికులను అప్రమత్తం చేశారు. తరువాత భారీగా ప్రజలు అక్కడికి చేరుకోవడంతో, డీసీపీ పరమ్‌పాల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకొని కార్ల నంబర్ ప్లేట్లను తొలగించమని సిబ్బందికి ఆదేశించారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో, నకిలీ ఎన్‌కౌంటర్ కేసుగా నమోదు అయింది. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ కేసును రద్దు చేయడానికి 2019 మే 20న నిరాకరించింది. అనంతరం ఈ కేసులో ఉన్న 9 మంది పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీం కోర్టు స్పష్టత:
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ కేసును విచారించి, ఏప్రిల్ 29న కీలక తీర్పు ఇచ్చింది. దానిలో, డీసీపీతో పాటు ఇతర పోలీసులపై ప్రాసిక్యూషన్ జరిపేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. విధి నిర్వహణ పేరుతో న్యాయాన్ని భంగం చేసే చర్యలను సమర్థించలేమని ధర్మాసనం హితవు పలికింది.
👉 భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!..*రాయచోటి – నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం..
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. వీఆర్వోగా పనిచేసిన నాగరాజు గతంలో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, అడంగల్, డీకేటీ పట్టాలు తయారు చేసినట్లు గుర్తించారు.
ఆయన మరణించినా కుటుంబ సభ్యులు కూడా ఇదే పంథా కొనసాగిస్తున్నట్లు తేలడంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. నాగరాజు ఇంట్లో పెద్ద ఎత్తున నకిలీ రికార్డులు, డీకేటీ పట్టాలు బయటపడ్డాయి. రాయచోటి పట్టణంలోని డిప్యూటీ తహసీల్దార్, మరో రెవెన్యూ సిబ్బంది ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటిపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆరా తీస్తున్నారు. భూముల ఆక్రమణదారుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని రెవెన్యూ సిబ్బంది ఇలాంటి నకిలీ పట్టాలు సృష్టించినట్లు తెలుస్తోంది.
👉 బెంగళూరు ఎయిర్‌పోర్టులో చెవిరెడ్డిని ఆపిన పోలీసులు
బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి..లుకౌట్ నోటీసులకింద చెవిరెడ్డిని అడ్డుకున్నపోలీసులు..
ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగిన చెవిరెడ్డి
👉 ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి గన్‌మన్ మదన్
లిక్కర్ కేసులో విచారణ పేరుతో..సిట్ అధికారులు దాడి చేశారని మదన్‌రెడ్డి పిటిషన్..
స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారన్న మదన్
విచారణకు న్యాయవాదిని అనుమతించాలని కోరిన మదన్..
👉👉👉 టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ స్వైర విహారం.. 4వ రోజు జరిగిందిదే! ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం పీక్స్ కి చేరుతుండటంతో నాలుగో రోజైన సోమవారం పశ్చిమాసియాలో మరింత భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం పీక్స్ కి చేరుతుండటంతో నాలుగో రోజైన సోమవారం పశ్చిమాసియాలో మరింత భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీతో.. టెల్ అవీవ్ తోపాటు మరిన్ని నగరాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దీనికి తగినట్లుగానే ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అవును… నాలుగో రోజు ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పోటాపోటీగా యుద్ధం జరిగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన దాడుల్లో 8 మంది పౌరులు మృతిచెందగా, 300 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొంది. దీనికి తగ్గట్లుగానే ఇజ్రాయెల్ దీటుగానే స్పందించింది. ఇందులో భాగంగా.. టెహ్రాన్ పై విరుచుకుపడింది.టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి. అవిరామంగా బాంబుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ (ఐ.ఆర్.ఐ.బీ) భవనంపై మిస్సైల్ ను ప్రయోగించింది. స్టూడియోలో మహిళ న్యూస్ రీడర్ లైవ్ లో వార్తలు చదువుతున్న సమయంలోనే మిస్సైల్ దాడి జరగడం గమనార్హం. ఇలా ఇజ్రాయెల్ బాంబు దాడులు విపరీతంగా కొనసాగుతోన్న నేపథ్యంలో.. టెహ్రాన్ నివాసితులు పెద్ద సంఖ్యలో ఇరాన్ రాజధాని నుంచి వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో టెహ్రాన్ నుంచి ఉత్తరం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడినట్లు చూపించే పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)…టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించామని తెలిపింది.ఎప్పుడు అనుకుంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై అనుకున్న చోట దాడులు చేయగలవని పేర్కొంది.ఇరాన్ క్షిపణి వ్యవస్థలో మూడోవంతు భాగాన్ని తాము ఇప్పటికే నాశనం చేశామని తెలిపింది.ఈ విషయాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..ఐడీఎఫ్ చెప్పిన విషయాన్ని ధృవీకరించారు.టెహ్రాన్ గగన తలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించామని..యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలను,బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశామని..ఈ యుద్ధంలో ఇవి కీలక మలుపులని పేర్కొన్నారు.ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని స్పష్టం చేశారు.మరోవైపు టెల్‌ అవీవ్‌ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి సోమవారం తాకింది.ఈ దాడిలో దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది.ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హకబీ ధృవీకరించారు.ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని తెలిపారు
👉 ఆ వ్యక్తిని చంపేస్తే సమస్య పోతుంది…నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!

అవును… ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. తాము చేస్తున్న యుద్ధం ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుకోవడానికి మాత్రమే కాదు.. ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఇరాన్ నుంచి అందరినీ రక్షించడానికి అని ఇజ్రయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఇరాన్ ఫస్ట్ శత్రువు ట్రంప్ అని, అందుకే ఆయనను చంపాలని చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా యుద్ధం ఎప్పుడు ఆగుతుందో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా… ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని.. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ ప్లాన్ ను తిరస్కరించారని.. అలా చేయడం వల్ల ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని..అందుకే ట్రంప్ అంగీకరించనట్లు కథనాలు వెలువడ్డాయనే విషయంపై స్పందించిన ఆయన “అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదు, యుద్ధం ముగుస్తుంది” అని పేర్కొన్నారు.ఇదే సమయంలో… ఇరాన్‌ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని అభివర్ణించిన నెతన్యాహు.. తాము కేవలం తమ శత్రువుతో మాత్రమే యుద్ధం చేయడం లేదని.. వారు ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికాకు మరణం అని నినాదాలు చేస్తున్నారని తెలిపారు. దీంతో.. తాము సైతం వారి దారిలోనే నడుస్తున్నామని.. దురాక్రమణను అంతం చేయడం, దుష్ట శక్తులకు ఎదురించి పోరాడడం ద్వారా ఇజ్రాయెల్‌ అణు విపత్తును అడ్డుకుంటోందని నెతన్యాహు అన్నారు. అదేవిధంగా… ఇరాన్‌ దౌత్య చర్యలను నెతన్యాహు తొసిపుచ్చారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నారని అన్నారు.ఇరాన్‌ ఉద్దేశాలపై ఇజ్రాయెల్‌ కు కచ్చితమైన నిఘా సమాచారం ఉందని.. ఇరాన్‌ అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్‌ కు మాత్రమే ముప్పు కాదని, అరబ్‌ దేశాలు,యూరప్‌,అమెరికాకు సైతం ముప్పే అని నెతన్యాహు పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కథనాలొస్తున్నాయి. తాజాగా ఖమేనీ నివాసానికి, కార్యాలయానికి సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణులు దాడులు చేసిన నేపథ్యంలో.. ఈశాన్య టెహ్రాన్ లోని అండర్ గ్రౌండ్ బంకర్ లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచూకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
*నూతన కమిషనర్ ను కలిసిన పట్టణ టిడిపి నాయకులు*

గిద్దలూరు మున్సిపల్ నూతన కమిషనర్ రమణ బాబుని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశలమేరకు టిడిపి పట్టణ అధ్యక్షులు సయ్యద్ షానేశా వలి ఆధ్వర్యంలో పట్టణ టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కమిషనర్ కార్యాలయంలో ఆయనను కలిసి శాలువా,పూలమాలలతో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సహాయ,సహకారాలు అందించాలని కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు,టిడిపి నాయకులను కమిషనర్ ను కోరారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్,టెక్సమో నాగేశ్వర రావు,బిల్లా రమేష్,గర్రె సుబ్బారావు,షేక్షావలి మరియు టీడీపీ నాయకులు పందిటి రజిని,జిల్లెల్ల సంపత్ కుమార్ రెడ్డి,బోయల కిషోర్ కుమార్,యస్ సి సెల్ అధ్యక్షులు గుర్రం దానియలు,గిద్దలూరు మధులేటి,రాష్ట్ర టీడీపి కార్యదర్శి దూదేకుల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..