👉1200 కి.మీ. రేంజ్…ఇజ్రాయెల్ పై ఇరాన్ స్పెషల్ క్షిపణి స్పెషాలిటీస్ ఇవే!
ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య భీకర యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇది పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా అన్నట్లుగా ఇరు వైపులా దాడులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ అయిదు విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇవి ఐరన్ డోమ్ ను ఛేధించుకుని వెళ్లడం గమనార్హం.
టెల్ అవీవ్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇవి.. ప్రపంచ ప్రఖాతి గాంచిన ఇజ్రాయెల్ గగన తల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను ఛేధించుకుని వెళ్లాయి. ఈ క్రమంలో నేరుగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను తాకాయి.దీంతో టెల్ అవీవ్ వణికిపోతోందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్… ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించామని ప్రకటించింది. ఈ క్రమంలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదా ప్రస్తుతం ఇజ్రాయెల్ వీటిని కూడా వినియోగిస్తోందని అన్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లు అని ఇరాన్ పేర్కొంది. ఇది మధ్యలో తన గమనాన్ని మార్చుకోగలదని.. అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది.ఈ నేపథ్యంలో… దీనికి ఐ.ఆర్.జీ.సీ. ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు ఇరాన్ రక్షణ శాఖ వెల్లడించింది. కాగా… మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఇరాన్ రక్షణ మంత్రి అజిజ్ నసీర్ జాదా… తమ వద్ద సరికొత్త బాలిస్టిక్ మిసైల్ సిద్ధమైందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించుకొని వెళ్లగలదని పేర్కొన్నారు.
👉ఇజ్రాయెల్ కు బిగ్ షాకిచ్చిన ఇరాన్..ఎంతనష్టమంటే..? ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నప్పటికీ ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నప్పటికీ ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు బిగ్ షాకిచ్చింది ఇరాన్. ఇందులో భాగంగా.. టెల్ అవీవ్ పై క్షిపణుల వర్షం కురిపించింది. అవును… ఆదివారం రాత్రి టెల్ అవీవ్ లో ఇజ్రాయెల్ మల్టిపుల్ లేయర్స్ రక్షణ వ్యవస్థను ఛేధించుకుని ఇరానియన్ డ్రోన్లు, క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో.. ఇరాన్ క్షిపణులు నివాస ప్రాంతాలను తాకడంతో టెల్ అవీవ్ నుండి భారీ పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ లోని పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారని.. 60 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇదే క్రమంలో.. సెంట్రల్ ఇజ్రాయెల్ లోని పవర్ గ్రిడ్ పైనా ఇరాన్ స్ట్రైక్ చేసింది. అయితే.. పెను ప్రమాదం జరగకుండా ఆ దేశ ఎలక్ట్రిక్ ఇంజనీర్లు మరమ్మత్తులు చేస్తున్నారు. ఇదే సమయంలో.. ఉత్తర ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించినప్పటికీ రెండు హైపర్సోనిక్ క్షిపణులు మాత్రం హైఫాను ఢీకొన్నాయి. దీంతో అనేకమంది గాయపడ్డారు. ఈ విషయాలను ఇజ్రాయెల్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ కాన్, బ్రిటిష్ సముద్ర సెక్యూరిటీ సంస్థ అంబ్రే వెల్లడించింది. అయితే… తమకు యుద్ధాన్ని విస్తరించాలనే ఆలోచన లేదని ఇరాన్ చెబుతుండటం గమనార్హం. కేవలం ఆత్మ రక్షణ కోసమే ‘టెల్ అవీవ్’పై దాడి చేయాల్సి వచ్చిందని.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే, తామూ దాడులు ఆపేస్తామని తెలిపింది. యుద్ధాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని తాము భావించడం లేదని ఇరాన్ తాజాగా పేర్కొంది. మరోవైపు.. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇరాన్ కు పాక్ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతోందని పేర్కొంటూ.. ఆ దాడులను తీవ్రంగా ఖండించారు.
👉ఇరాన్ కోసం పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ చేస్తుందా…!!! 
ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు పాకిస్థాన్ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతోందని పేర్కొంటూ.. ఆ దాడులను తీవ్రంగా ఖండించారు. అయితే… మొహసిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఇజ్రాయెల్ తమపై అణుబాంబులను ప్రయోగిస్తే.. వెంటనే పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందని, తమపై దాడికి ప్రతీకారంపై ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్ కు చెందిన ఐ.ఆర్.జీ.సీ. జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యుడు కూడా. ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహసిన్ రెజాయి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారాయి. ఇరాన్ కోసం పాకిస్థాన్.. అమెరికా మద్దతుతో ఉన్న ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందా? అనే చర్చ ఒక్కసారిగా మొదలైంది. ఈ నేపథ్యంలో పాక్ స్పందించింది. ఈ సందర్భంగా స్పందించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి… మొహసిన్ రెజాయి చేసిన వ్యాఖ్యలు ఖండించారు. ఇస్లామాబాద్ కు అలాంటి నిబద్ధత ఏమీ లేదని అన్నారు. రెజాయి వాదనను తోసిపుచ్చారు. ఈ సమయంలో ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలని.. లేదంటే ఇరాన్, పాలస్తీనా మాదిరిగానే ప్రమాదాలకు అవకాశం ఉందని మాత్రం తెలిపారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.. ముస్లిం దేశాలు ఇప్పుడు ఏకం కాకపోతే.. ప్రతీ ఒక్కటీ ఫ్యూచర్ లో అలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పాక్ రక్షణ మంత్రి చెప్పినట్లు తుర్కియే టుడే పేర్కొంది. దానర్ధం… ఇరాన్ పై ఇజ్రాయెల్ అణు బాంబులను ప్రయోగిస్తే.. వెంటనే ఇజ్రాయెల్ పై పాకిస్థాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తుందని అర్ధం కాదని అంటున్నారు.
👉ప్రకాశం ఏసిబి వలలో ఇరిగేషన్ కార్యాలయం ఉద్యోగి..
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఇరిగేషన్ కార్యాలయం ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు 30వేల రూపాయలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పట్టుబడ్డాడు.పెండింగ్ బిల్లులు మంజూరుకు శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం??
👉సహాయం చేసే వారికి రివార్డు: ఎస్సై నాగరాజు*
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులకు సహాయం చేసే వారికి రివార్డు లభిస్తుందని ప్రకాశం జిల్లా కొమరోలు ఎస్ఐ నాగరాజు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడి సరైన సమయంలో సరైన సహాయం లభించక గాయపడ్డ వారు మృతి చెందుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీస్, 108 అంబులెన్స్ కు ఫోన్ చేయటం లేదా క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి సహాయం చేసే వారికి రివార్డు అందించడం జరుగుతుందని ఓ ప్రాణాన్ని కాపాడిన దానికన్నా గొప్ప విషయం ఏమి ఉంటుందని ఎస్ఐ నాగరాజు అన్నారు.
👉1200 కి.మీ. రేంజ్…ఇజ్రాయెల్ పై ఇరాన్ స్పెషల్ క్షిపణి స్పెషాలిటీస్ ఇవే!👉ఇజ్రాయెల్ కు బిగ్ షాకిచ్చిన ఇరాన్..ఎంతనష్టమంటే..?..👉ఇరాన్ కోసం పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ చేస్తుందా….*ఏసిబి వలలో ఇరిగేషన్ కార్యాలయం ఉద్యోగి (మార్కాపురం)….👉సహాయం చేసే వారికి రివార్డు: కొమరోలు ఎస్సై నాగరాజు*
Recent Posts

